Acquittal
-
డేరా బాబా నిర్దోషి.. 2002 నాటి కేసులో సంచలన తీర్పు
చంఢీగఢ్: గుర్మీత్ రాం రహీం సింగ్(డేరా బాబా)ను భారీ ఊరట లభించింది. 2002లో జరిగిన డేరా సచ్చా సౌదా మాజీ అధికారి రంజిత్ సింగ్ హత్య కేసులో పంజాబ్, హర్యానా హైకోర్టు డేరా బాబాను మంగళవారం నిర్దోషిగా ప్రకంటించింది. ఈ హత్యకేసులో డేరా బాబాతో పాటు.. జస్బీర్ సింగ్, సబ్దిల్ సింగ్, క్రిషన్ లాల్, అవతార్ సింగ్‌లకు సీబీఐ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం విధించిన శిక్షను డేరా బాబా హైకోర్టులో సవాల్ చేశారు. ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా బాబా 21 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత నిర్దోషిగా తేలారు.హర్యానాలోని సిర్సాలో ఉన్న డేరా సచ్చా సౌదా ఆశ్రమం మాజీ అధికారి రంజిత్ సింగ్. ఆయన జూలై 10, 2002న హత్యకు గురయ్యారు. ఈ హత్యపై కురుక్షేత్రలోని తానేసర్ పోలీసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2003లో ఈ హత్యకేసును విచారణ దర్యాప్తు చేయాలని చంఢీగఢ్ హైకోర్టు సీబీఐ ఆదేశించింది. ఈ కేసులు డేరా బాబాతో పాటు మరో నలుగురిపై చార్జ్‌షీట్ దాఖలు చేసి విచారణ చేపట్టింది. అనంతరం డేరా బాబాతో మరో నలుగురికి సీబీఐ ప్రత్యేక కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. -
ప్రొఫెసర్ సాయిబాబాకు సుప్రీంకోర్టులో ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మావోయిస్టులతో సంబంధాలున్న కేసులో అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బాంబే హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషిన్‌ను భారత అత్యున్నత తిరస్కరించింది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం.. హైకోర్టు తీర్పు చాలా హేతుబద్ధంగా ఉన్నట్లు తాము ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపింది. తీర్పును వెనక్కి తీసుకోవడంలో ఎటువంటి తొందరపాటు ఉండకూడదని, అది వేరేలా ఉంటే పరిగణనలోకి తీసుకునేవాళ్లమని పేర్కొంది. ఇది నిర్దోషిత్వం రుజువు చేసుకోవడానికి ఎంతో కష్టపడిన కేసు అని.. సాధారణంగా ఇటువంటి అప్పీల్‌ను ఈ న్యాయస్థానం గతంలోనే కొట్టివేసి ఉండాల్సిందని జస్టిస్‌లు మెహతా, గవాయిలు పేర్కొన్నారు. చదవండి: మిషన్ దివ్యాస్త్ర విజయవంతం.. అభినందించిన ప్రధాని మోదీ కాగా 90 శాతం వైకల్యంతో వీల్‌చైర్‌కే పరిమితమైన సాయిబాబా.. మావోయిస్టులతో సంబంధాలు పెట్టుకుని దేశద్రోహానికి పాల్పడ్డారన్న ఆరోపణపై ఆయనతో పాటు మరో ఐదుగురికి మహారాష్ట్ర, గడ్చిరోలి ట్రయిల్ కోర్టు జీవిత ఖైదు విధించడంతో 2017 నుంచి నాగ్‌పూర్ జైలులోనే ఉన్నారు. అంతకుముందు కూడా ఆయన 2014 నుంచి 2016 వరకు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలయ్యారు. సెషన్స్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపినబాంబే హైకోర్టు 2022 అక్టోబరులోనే సాయిబాబాతోపాటు అయిదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ.. వెంటనే జైలు నుంచి విడుదలకు ఆదేశించింది. ఈ తీర్పు వెలువడిన రోజే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో నిందితుల విడుదలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. హైకోర్టు తీర్పును 2023 ఏప్రిల్‌లో పక్కనపెట్టింది. నిందితుల అప్పీళ్లపై మళ్లీ మొదట్నుంచీ విచారణ జరపాలని ఆదేశించడంతో మళ్లీ విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు.. సాయిబాబా సహా మిగతా నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ మార్చి 5న తీర్పు వెలువరించింది. దీంతో ప్రొఫెసర్ సాయిబాబా విడుదలయ్యారు. -
ప్రాణాలతో బయటపడడం అద్భుతమే
నాగపూర్: జైలు నుంచి ప్రాణాలతో బయటపడతానని ఏనాడూ అనుకోలేదని ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా(54) చెప్పారు. సజీవంగా బయటకు రావడం నిజంగా అద్భుతమేనంటూ భావోద్వేగానికి గురయ్యారు. జైలులో శారీరకంగా, మానసికంగా ఎన్నో బాధలు అనుభవించానని చెప్పారు. అక్కడ జీవితం అత్యంత దుర్భరమని పేర్కొన్నారు. మావోలతో సంబంధాల కేసులో బాంబే హైకోర్టు సాయిబాబాను నిర్దోషిగా గుర్తిస్తూ మంగళవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఆయన గురువారం నాగపూర్ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి చక్రాల కురీ్చలో బయటకు వచ్చారు. ఈశాన్య భారతదేశంలో గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్నందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. తప్పుడు కేసులో ఇరికించి అరెస్టు చేశారని సాయిబాబా అన్నారు. జైలులోనే ప్రాణాలు పోతాయనుకున్నా.. ‘‘నా ఆరోగ్యం క్షీణించింది. ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను. మొదట చికిత్స తీసుకోవాలి. ఆ తర్వాతే మాట్లాడగలను. త్వరలో డాక్టర్లను కలిసి చికిత్స తీసుకుంటా. విలేకరు లు, లాయర్లు కోరడం వల్లే ఇప్పుడు స్పందిస్తున్నా. జైలులో నాకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. అత్యంత కఠినమైన, దుర్భర జీవితం అనువించా. చక్రాల కుర్చీ నుంచి పైకి లేవలేకపోయా. ఇతరుల సాయం లేకుండా సొంతంగా టాయిలెట్‌కు కూడా వెళ్లలేని పరిస్థితి. ఇతరుల సాయం లేనిదే స్నానం కూడా చేయలేపోయా. జైలులోనే నా ప్రాణాలు పోతాయని అనుకున్నా. ఈరోజు నేను ఇలా ప్రాణాలతో జైలు నుంచి బయటకు రావడం అద్భుతమే చెప్పాలి. నాపై నమోదైన కేసులో సాక్ష్యాధారాలు లేవని ఉన్నత న్యాయస్థానం తేలి్చచెప్పింది. చట్టప్రకారం ఈ కేసు చెల్లదని స్పష్టం చేసింది. నాకు న్యాయం చేకూర్చడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది? నాతోపాటు నా సహచర నిందితులు పదేళ్ల విలువైన జీవితాన్ని కోల్పోయారు. ఈ జీవితాన్ని ఎవరు తిరిగి తీసుకొచ్చి ఇస్తారు? జైలుకు వెళ్లినప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను. అప్పుడు పోలియో మినహా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. కానీ, ఇప్పుడు గుండె, కండరాలు, కాలేయ సంబంధిత వ్యాధుల బారినపడ్డాను. నా గుండె ప్రస్తుతం కేవలం 55 శాతం సామర్థ్యంతో పనిచేస్తోంది. డాక్టర్లే ఈ విషయం చెప్పారు. నాకు పలు ఆపరేషన్లు, సర్జరీలు చేయాలని అన్నారు. కానీ, ఒక్కటి కూడా జరగలేదు. జైలులో సరైన వైద్యం అందించలేదు. పదేళ్లపాటు నాకు అన్యా యం జరిగింది. ఆశ ఒక్కటే నన్ను బతికించింది. ఇకపై బోధనా వృత్తిని కొనసాగిస్తా. బోధించకుండా నేను ఉండలేను’’ అని ప్రొఫెసర్ సాయిబాబా స్పష్టం చేశారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తారా? అని మీడియా ప్రశ్నించగా, భారత రాజ్యాంగాన్ని 50 శాతం అమలు చేసినా సరే సమాజంలో అనుకున్న మార్పు వస్తుందని బదులిచ్చారు. సాయిబాబా సొంత ఊరు ఆంధ్రప్రదేశ్‌లోని బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణం సమీపంలోని జనుపల్లె. ఆయన పాఠశాల, కళాశాల విద్య ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కొనసాగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించిన ఆయన అక్కడే ప్రొఫెసర్ అయ్యారు. -
సాయిబాబా నిర్దోషి
సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాతోపాటు మరో ఐదుగురు నిందితులను బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ నిర్దోషులుగా ప్రకటించింది. 2017లో సాయిబాబాతో పాటు ఇతరులను దోషులుగా నిర్ధారిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై నాగ్‌పూర్ బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ వినయ్ జోషీ, జస్టిస్ వాల్మికి మెనెజెస్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. నిందితులపై వచ్చిన ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని, అందుకే వారిపై అభియోగాలను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం తోసిపుచ్చింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని, దేశంపై యుద్ధంపై చేసే కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ 2017 మార్చిలో సాయిబాబా, ఇతరులను మహారాష్ట్రలోని గడ్చిరోలీ సెషన్స్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. దీనిపై సాయిబాబా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 2022 అక్టోబరు 14న జస్టిస్ రోహిత్ నేతృత్వంలోని ధర్మాసనం సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి రోజు శనివారమైనప్పటికీ ప్రత్యేకంగా విచారించింది. హైకోర్టు ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. అనంతరం జస్టిస్ షా, జస్టిస్ రవికుమార్ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపి 2023 ఏప్రిల్ 19న బాంబే హైకోర్టు తీర్పును పక్కనపెట్టింది. ఈ తీర్పును మళ్లీ పరిశీలించాలని బాంబే హైకోర్టుకు పంపించింది. ఈ నేపథ్యంలో జస్టిస్ జోషీ, జస్టిస్ వాల్మికిల హైకోర్టు ధర్మాసనం విచారించి, సాయిబాబా, ఇతరులను నిర్దోషులుగా ప్రకటించింది. ప్రొఫెసర్ సాయిబాబా 2014లో అరెస్టయ్యారు. ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. పదేళ్ల పోరాటం తర్వాత ఊరట దక్కింది బాంబే హైకోర్టు తీర్పు పట్ల సాయిబాబా భార్య వసంత ఆనందం వ్యక్తం చేశారు. పదేళ్ల తర్వాత ఊరట లభించిందన్నారు. సాయిబాబాకు అండగా నిలిచిన లాయర్లకు, సామాజిక కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. తన భర్త పది సంవత్సరాలు జైలులో ఉన్నారని, ఆర్థికంగా, మానసికంగా తాము ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని చెప్పారు. సాయిబాబా గురించి ప్రజలకు వాస్తవాలు తెలుసని, ఆయన పట్ల వారికి సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో మహారాష్ట్ర సర్కారు పిటిషన్ మావోయిస్టులతో సంబంధాల కేసులో మాజీ ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు మంగళవారం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. బాంబే హైకోర్టు తీర్పును కొట్టివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. సాయిబాబాతోపాటు ఇతరులను నిర్దోషులుగా నిర్ధారిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని మహారాష్ట్ర అడ్వొకేట్ జనరల్ బీరేంద్ర షరాఫ్ ఈ సందర్భంగా చెప్పారు. నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును కొంతకాలం నిలిపివేయాలని కోరుతూ హైకోర్టు ధర్మాసనం ముందు అప్లికేషన్ దాఖలు చేశారు. ధర్మాసనం స్పందిస్తూ.. న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని పునఃపరిశీలించే అధికారం ఉండదని, ఇది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన విషయమని స్పష్టం చేసింది. అడ్వొకేట్ జనరల్ దాఖలు చేసిన అప్లికేషన్‌ను కొట్టివేసింది. -
ప్రొఫెసర్ సాయిబాబా కేసు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు
నాగ్‌పూర్: మావోయిస్టులతో లింకు ఉందన్న కేసులో జీవిత ఖైదు పడిన ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట లభించింది. ఈ మేరకు బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని నిర్ధోషులుగా పేర్కొంటూ మంగళవారం తీర్పిచ్చింది. తమకు ఈ కేసులో జీవిత ఖైదు విధిస్తూ గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సాయిబాబాతో పాటు మరో ఐదుగురు హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ అప్పీల్‌ను విచారించిన హైకోర్టు కింది కోర్టు తీర్పును కొట్టివేసింది. దీంతో మావోయిస్టులతో సంబంధాల కేసులో సాయిబాబాతో పాటు శిక్షపడిన మరో ఐదుగురు జైలు నుంచి విడుదలవనున్నారు. కేసు వివరాలు ఇలా.. మావోయిస్టులతో లింకు ఉందన్న కారణంగా మహారాష్ట్ర పోలీసులు 2014లో ఢిల్లీ యూనివర్సిటీ రామ్‌లాల్‌ఆనంద్ కాలేజీ ప్రొఫెసర్ సాయిబాబాను అరెస్టు చేశారు. ఐపీసీతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)సెక్షన్ల కింద ఆయనపై ఛార్జ్‌షీట్ నమోదు చేశారు. 2017 వరకు ఈ కేసు విచారించిన గడ్చిరోలి జిల్లా సెషన్స్‌కోర్టు సాయిబాబాతో పాటు మరో ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. శిక్ష పడిన తర్వాత ఆయనను ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉద్యోగం నుంచి తొలగించింది. సెషన్స్‌కోర్టు ఇచ్చిన జీవితఖైదు తీర్పుపై సాయిబాబా అప్పీల్‌కు వెళ్లగా యూఏపీఏ కేసులో ప్రొసీజర్‌ను పోలీసులు సరిగా పాటించలేదన్నా కారణంగా బాంబే హైకోర్టు 2022లోనే సాయిబాబాపై కేసును కొట్టివేసింది. కానీ వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లగా అత్యున్నత కోర్టు సాయిబాబా విడుదలపై స్టే ఇచ్చింది. కేసును తిరిగి వినాలని బాంబే హైకోర్టుకే రిఫర్ చేసింది. దీంతో తాజాగా అప్పీల్ విచారించిన బాంబే హైకోర్టు సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని నిర్ధోషులుగా విడుదల చేస్తూ తీర్పునిచ్చింది. ఇదీ చదవండి.. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు -
1993 పేలుళ్ల కేసులో ‘డాక్టర్ బాంబ్’ తుండాకు ఊరట!
జైపూర్: 1993 వరుస బాంబు పేలుళ్ల కేసులో సీబీఐకి ఎదురుదెబ్బ తగిలింది. లష్కరే తోయిబా ప్రధాన సభ్యుడు అబ్దుల్ కరీమ్ తుండాను రాజస్థాన్ ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. పేలుళ్ల కేసులకు సంబంధించి.. తుండాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాల్లేవని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. .. అదే సమయంలో ఈ కేసులో అమీనుద్దీన్, ఇర్ఫాన్ అనే ఇద్దరికి జీవితఖైదు విధించింది. అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు కరీం తుండా బాగా దగ్గర. బాంబుల తయారీలో నైపుణ్యం ఉన్నందునే కరీం తుండాను ‘మిస్టర్ బాంబ్’గా పేర్కొంటారు. గతంలో.. లష్కరే తోయిబా, ఇండియన ముజాహిద్దీన్, జైషే మహమ్మద్, బబ్బర్ ఖాల్సా సంస్థలకు పని చేశాడు. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా పేర్కొంటూ పలు ఉగ్రసంస్థలు దేశంలో వరుస పేలుళ్లకు పాల్పడ్డాయి. 1993లో కోటా, కాన్పూర్, సూరత్, సికింద్రాబాద్ స్టేషన్ల పరిధిలో రైళ్లలో జరిగిన పేలుళ్లు యావత్ దేశాన్ని షాక్‌కి గురి చేశాయి. ఈ కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. అయితే వివిధ నగరాల్లో నమోదైన ఈ కేసులంటిని ఉగ్రవాద నిరోధక చట్టం ఆధారంగా రాజస్థాన్ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టింది. కరీం తుండాను నిర్దోషిగా రాజస్థాన్ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించడాన్ని.. సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని సీబీఐ భావిస్తోంది. సీబీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. కార్పెంటర్ పని చేసే తుండా.. ముంబై పేలుళ్ల తర్వాతే నిఘా సంస్థల పరిశీలనలోకి వచ్చాడు. ఉత్తరాఖండ్ నేపాల్‌సరిహద్దులో 2013లో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశాయి. 1996 పేలుడు కేసుకు సంబంధించి హర్యానా కోర్టు అతనికి జీవితఖైదు విధించింది. ఇక.. బాంబు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలి కరీం తన ఎడమ చేతిని కోల్పోయాడు. -
Glynn Simmons: 48 ఏళ్ల తర్వాత నిర్దోషిగా..
చేయని తప్పునకు శిక్ష అనుభవించడం, నిందలు మోయడం నిజంగా బాధాకరమే. అమెరికాలోని ఒక్లహోమాకు చెందిన 70 సంవత్సరాల గ్లిన్ సైమన్స్‌కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఏ నేరమూ చేయకపోయినా ఏకంగా 48 సంవత్సరాల ఒక నెల 18 రోజులు జైలు శిక్ష అనుభవించాల్సి వచి్చంది. జీవితంలో విలువైన సమయం జైలుపాలయ్యింది. న్యాయం అతడి పక్షాన ఉండడంతో ఎట్టకేలకు నిర్దోషిగా బయటపడ్డాడు. అమెరికాలో చేయని తప్పునకు అత్యధిక కాలం శిక్ష అనుభవించింది గ్లిన్ సైమన్స్ అని నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ ఎగ్జోజనరేషన్స్ అధికారులు చెప్పారు. 1974 డిసెంబర్లో ఒక్లహోమాలోని ఓ లిక్కర్ స్టోర్‌లో హత్య జరిగింది. ఇద్దరు దుండగులు లిక్కర్ స్టోర్ క్లర్క్‌ను కాల్చి చంపి, మద్యం సీసాలు ఎత్తుకెళ్లారు. అప్పుడు గ్లిన్ సైమన్స్ వయసు 22 ఏళ్లు. సైమన్స్తోపాటు డాన్ రాబర్ట్స్ అనే వ్యక్తి ఈ హత్య చేశారని పోలీసులు తేల్చారు. వారిద్దరికీ న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. తాము ఈ నేరం చేయలేదని మొత్తుకున్నా అప్పట్లో ఎవరూ వినిపించుకోలేదు. పోలీసులు వారిని జైలుకు పంపించారు. డాన్ రాబర్ట్స్ 2008లో పెరోల్‌పై విడుదలయ్యాడు. కేసును మళ్లీ విచారించాలని సైమన్స్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాడు. దాంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసును మళ్లీ విచారించారు. సైమన్స్ హత్య చేయలేదని గుర్తించారు. అతడిని జైలు నుంచి విడుదల చేస్తూ ఒక్లహోమా కంట్రీ జిల్లా కోర్టు రెండు రోజుల క్రితం తీర్పు ఇచ్చింది. అంతేకాదు అతడికి 1.75 లక్షల డాలర్ల (రూ.1.45 కోట్లు) నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సైమన్స్ మంగళవారం కారాగారం నుంచి బయటకు వచ్చాడు. తాను నేరం చేయలేదు కాబట్టి శిక్షను ధైర్యంగా ఎదుర్కొన్నానని, ఎప్పటికైనా నిర్దోషిగా విడుదలవుతానన్న నమ్మకంతో ఉన్నానని సైమన్స్ చెప్పాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నిఠారీ హత్యలు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: దేశ్యవ్యాప్తంగా చర్చనీయాశమైన నిఠారీ హత్యల కేసులో అలహాబాద్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిఠారీ హత్య కేసులో దోషులుగా తేలిన అన్ని కేసుల్లో నిర్దోషులుగా ప్రకటించింది.ముఖ్యంగా సురీందర్ కోలికి మరణశిక్షను కూడా అలహాబాద్ హైకోర్టు కోర్టు రద్దు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురీందర్ కోలీపై ఉన్న 12 కేసుల్లో నిర్దోషిగా తేల్చింది. అలాగే మరో నిందితుడు వ్యాపారవేత్త మోనీందర్ సింగ్ పంధేర్‌పై ఉన్న రెండు కేసుల్లోనూ నిర్దోషి అని కోర్టు సోమవారం నిర్ధారించింది. అత్యాచారం, హత్య ఆరోపణలపై దోషులుగా తేల్చిన ఘజియాబాద్‌లోని సీబీఐ కోర్టు విధించిన మరణశిక్షను సవాలు చేస్తూ కోలీ, పంధేర్‌లు దాఖలు చేసిన అప్పీళ్లను జస్టిస్ అశ్వనీ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్హెచ్ఏ రిజ్వీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అనుమతించింది. అయితే ఆరోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందంటూ డివిజన్ బెంచ్ ఈ మేరకు తీర్పు చెప్పింది. అలహాబాద్ హైకోర్టు మోనీందర్ సింగ్ పందేర్‌పై మొత్తం 6 కేసులు ఉండగా, అన్నింటిలోనూ నిర్దోషిగా కోర్టు తేల్చిందని మోనీందర్ సింగ్ పంధేర్ తరపు న్యాయవాది మనీషా భండారీ వెల్లడించారు. 2006లో నోయిడాలోని నిథారీ ప్రాంతంలో మధ్య మోనీందర్ సింగ్ పంధేర్ ఇంటిలో వరుస హత్యలు కలకలం రేపాయి. 2006, డిసెంబరు 29న నోయిడాలోని నిథారీలోని పంధేర్ ఇంటి వెనుక ఉన్న కాలువలో ఎనిమిది మంది చిన్నారుల అస్థిపంజర అవశేషాలు కనిపించడంతో ఈ సంచల హత్యలు వెలుగులోకి వచ్చాయి. సురీందర్, పంధేర్ ఇంట్లో పనిమనిషిగా ఉండేవాడు. ఈ సందర్భంగా పిల్లలను మిఠాయిలు, చాక్లెట్లతో మభ్య పెట్టి ఇంట్లోకి రప్పించేవాడు. ఆ తరువాత పంధేర్వారిపై అత్యాచారం చేసి హత్య చేశాడనేది ప్రధాన ఆరోపణ. బాధితుల్లో ఎక్కువ భాగం ఆ ప్రాంతం నుండి తప్పిపోయిన పేద పిల్లలు, యువతులవిగా గుర్తించారు. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు పిల్లల మృతదేహాలను నరికి, ఆ భాగాలను కాలువల్లో పడవేసేవారనీ సీబీఐ అభియోగాలు మోపింది. అంతేకాకుండా నరమాంస భక్షక ఆరోపణలు కూడా చేసింది. 2007లో పంధేర్, కోలీలపై సీబీఐ 19 కేసులు నమోదు చేసింది. అయితే 19 కేసుల్లో మూడింటిని తొలగించిన సీబీఐ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. కాగా సురేంద్ర కోలీపై బాలికలపై అనేక అత్యాచారాలు , హత్యలకు పాల్పడి దాదాపు 10 కంటే ఎక్కువ కేసులలో మరణశిక్ష విధించాయి కోర్టులు. జూలై 2017లో, 20 ఏళ్ల మహిళ పింకీ సర్కార్ హత్య కేసులో స్పెషల్ CBI కోర్టు పంధేర్, కోలీలను దోషులుగా నిర్ధారించి, మరణశిక్ష విధించింది. దీన్ని అలహాబాద్ హైకోర్టుకూడా సమర్ధించింది. అయితే, కోలీ క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయంలో జాప్యంకారణంగా దీన్ని జీవిత ఖైదుగా మార్చింది. ఈ నిఠారీ హత్యల్లో మరో బాధితురాలు 14 ఏళ్ల రింపా హల్దార్ హత్య, అత్యాచారానికి సంబంధించి 2009లో సాక్ష్యాలు లేకపోవడంతో పంధేర్‌ను నిర్దోషిగా ప్రకటించింది. #WATCH | Manisha Bhandari, lawyer of Nithari case convict Moninder Singh Pandher, in Prayagraj, Uttar Pradesh "Allahabad High Court has acquitted Moninder Singh Pandher in the two appeals against him. There were a total of 6 cases against him. Koli has been acquitted in all… pic.twitter.com/BYQHeu3xvz — ANI UP/Uttarakhand (@ANINewsUP) October 16, 2023 -
గీతికా శర్మ కేసులో సంచలన తీర్పు
ఢిల్లీ: హర్యానాలో సంచలనం సృష్టించిన ఎయిర్‌హోస్టెస్ గీతికా శర్మ ఆత్మహత్య కేసులో ఆ రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే గోపాల్ గోయల్ కందాకు భారీ ఊరట లభించింది. 11 ఏళ్ల కిందటి నాటి ఈ కేసులో.. కందాని నిర్దోషిగా ప్రకటిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించింది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు. ప్రముఖ వ్యాపారవేత్త అయినా కందాకు చెందిన ఎండీఎల్ఆర్ ఎయిర్‌లైన్స్‌లో గీతికా శర్మ ఎయిర్‌హోస్టెస్‌గా పని చేసేది. అదే సమయంలో కందాకు చెందిన ఓ కంపెనీకి ఆమె డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు చేపట్టింది. అయితే.. 2012, ఆగష్టు 5వ తేదీన ఢిల్లీ అశోక్ విహార్‌లోని తన ఇంట్లో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సమయంలో సిస్రా ఎమ్మెల్యే అయిన కందా.. కాంగ్రెస్ భూపిందర్ సింగ్ హూడా నేతృత్వంలోని ప్రభుత్వంలో హోంశాఖ మంత్రి హోదాలో ఉన్నారు. ► అయితే తన సూసైడ్ నోట్లో కందాతో పాటు ఆయన దగ్గర పని చేసే ఉద్యోగి అరుణ్ చందా తనను వేధించారంటూ గీతిక పేర్కొంది. అంతేకాదు ఆయనకు అంకిత అనే మరో మహిళతో సంబంధం ఉందని, వాళ్లకు ఓ బిడ్డ పుట్టిందని ఆరోపించింది. తన ఆత్మహత్యకు కందా వేధింపులే కారణమని పేర్కొందామె. ► దీంతో భారత్ నగర్ పోలీస్ స్టేషన్లో గోపాల్‌తో పాటు అరుణ్‌పైనా ‘ఆత్మహత్యకు ఉసిగొల్పారనే’ నేరం కింద అభియోగాలు నమోదు అయ్యాయి. అంతేకాదు అత్యాచారం, అసహజ శృంగారం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ► ఆ సమయంలో.. కేసు, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కందా తన పదవికి రాజీనామా చేసి.. పోలీసులకు లొంగిపోవాల్సి వచ్చింది. అంతకు ముందు అరుణ్ చందాను పోలీసులు గాలించి మరీ అరెస్ట్ చేశారు. అదే ఏడాది పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ► అయితే కందా మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తూ వచ్చారు. గీతిక ఎంబీఏ చదవడానికే తానే సాయం చేశానని, సిస్రాలోని తన ఇంటర్నేషనల్ స్కూల్‌కు చైర్మన్‌ను సైతం చేశానని చెప్పుకొచ్చాడు. ► ఇదిలా ఉంటే.. న్యాయం దక్కదనే ఆవేదనతో 2013 ఫిబ్రవరి 15వ తేదీన గీతిక తల్లి అనురాధా శర్మ సైతం ఆత్మహత్యకు పాల్పడింది. కూతురిలాగే ఆమె సైతం సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడింది. ► 2014 మార్చి 4వ తేదీన కందాకు బెయిల్ లభించింది. అలాగే.. ఆయనపై దాఖలైన అత్యాచారం, అసహజ శృంగారం ఆరోపణలను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ► ఈలోపే హర్యానా లోక్‌హిత్ పార్టీని స్థాపించిన కందా.. తిరిగి రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాడు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. తిరిగి 2019 ఎన్నికల్లో పోటీ చేసి సిస్రా ఎమ్మెల్యేగా నెగ్గాడు. ► అయితే.. ఇన్నేళ్లు గడిచినా అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌వాళ్లు విఫలమయ్యారంటూ స్పెషల్ జడ్జి వికాస్ ధూల్ గోపాల్‌ను, అరుణ్‌ను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇవాళ సంచలన తీర్పు వెల్లడించారు. ► గోపాల్ కుమార్ గోయల్ అలియాస్ గోపాల్ గోయల్ కందా అస్సలు చదువుకోలేదు. వ్యాపారాలతో ఎదిగి.. భారీగా ఆస్తులు సంపాదించాడు. ఆపై రాజకీయాల్లోకి ప్రవేశించాడు. గోపాల్‌పై గీతికా శర్మ కేసు ఒక్కటే కాదు.. ఇంకా చాలానే కేసులు నమోదు అయ్యాయి. ► గీతిక శర్మ సూసైడ్ కేసులో ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు తాజా తీర్పుపై న్యాయపోరాటానికి సిద్ధమని ఆమె సోదరుడు చెబుతున్నారు. #WATCH | After Delhi's Rouse Avenue Court acquitted former Haryana Minister Gopal Goyal Kanda in air hostess Geetika Sharma suicide case, he says, "There was no evidence against me, this case was made against me and today the court has given its verdict." pic.twitter.com/rG9gE6EZ86 — ANI (@ANI) July 25, 2023 -
రాజస్థాన్ హైకోర్టు కీలక తీర్పు.. పేలుళ్ల కేసు నిందితుల ఉరిశిక్ష రద్దు..
జైపూర్: రాజస్థాన్ హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. 71 మంది మరణించి, 180 మంది గాయపడిన 2008 జైపూర్ వరుస పేలుళ్ల కేసులో నిందితుల్లో నలుగురికి ఉరిశిక్షను రద్దు చేసి నిర్దోషులుగా విడుదల చేసింది. 2019 డిసెంబర్లోనే వీరికి ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించడం గమనార్హం. నలుగురు నిందుతుల పేర్లు.. మహమ్మద్ సల్మాన్, మహమ్మద్ సైఫ్, సర్వార్ ఆజ్మీ, సైఫురెహ్మాన్ అన్సారీ. జస్టిస్ పంకజ్ భండారీ, జస్టిస్ సమీర్ జైన్‌తో కూడిన డివిజన్ బెంచ్ 28 అప్పీళ్లను ఆమోదించి ఈమేరకు తీర్పు వెలువరించింది. ఈ కేసు నిందితుల్లో ఒకరిని నిర్దోషిగా ప్రకటించిన దిగువ కోర్టు తీర్పును సమర్థించింది. వరుస పేలుళ్లతో జైపూర్ షేక్.. 2008 మే 13న జైపూర్ వరుస పేలుళ్లతో ఉలిక్కిపడింది. ఈ ఘటనల్లో మొత్తం 71 మంది చనిపోయారు. 180మందికిపైగా గాయపడ్డారు. ఓ సైకిల్‌పై ఉన్న స్కూల్ బ్యాగ్‌లో లైవ్ బాంబు కూడా లభ్యమైంది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 13 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 8 ఎఫ్ఐర్లు నమోదయ్యాయి. 1,293 మంది సాక్షులను విచారించారు. నిందితుల్లో ముగ్గురు హైదరాబాద్, ఢిల్లీ జైలులో ఉన్నారు. మరో ముగ్గురు ఇప్పటికీ పరారీలో ఉన్నారు. ఇద్దరు బత్లా హౌస్ ఎన్కౌంటర్లో హతమయ్యారు. నలుగురు జైపుర్ జైల్లో ఉన్నారు. చదవండి: 2025 కాదు 2050లో కూడా బీజేపీ గెలవదు.. కేజ్రీవాల్ జోస్యం.. -
ఢిల్లీ అల్లర్ల కేసులో నిర్దోషిగా ఉమర్ ఖలిద్!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 2020లో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించిన రాళ్ల దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ మాజీ లీడర్ ఉమర్ ఖలిద్‌ను నిర్దోషిగా తేల్చింది ఢిల్లీ కోర్టు. అతడితో పాటు మరో విద్యార్థి నాయకుడు ఖలిద్ సైఫీపై ఉన్న అభియోగాలను కొట్టివేసింది కర్కార్దూమా కోర్టు. అయితే, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కేసులో బెయిల్ రానందున వారు జుడీషియల్ కస్టడీలోనే కొనసాగనున్నారు. ఈశాన్య ఢిల్లీలో 2020లో జరిగిన అల్లర్లపై ఉమర్ ఖలిద్పై ఖాజురి ఖాస్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఛాంద్బాగ్ ప్రాంతంలో అల్లరి మూకలు చేరిన సమయంలో అక్కడే ఉన్న కానిస్టేబుల్ వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ సమయంలో తనను తాను రక్షించుకునేందుకు ఓ షెల్టర్‌లో తలదాచుకున్నట్లు తెలిపాడు కానిస్టేబుల్. స్థానికులపై దాడి చేయటం, వాహనాలకు నిప్పుపెట్టడం వంటి హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని పేర్కొన్నాడు. ఈ క్రమంలో 2020, సెప్టెంబర్‌లో ఉమర్ ఖలిద్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన అదనపు సెషన్స్ కోర్టు జడ్జీ పులస్త్యా ప్రమాచల్.. ఈ మేరకు నిర్దోషిగా తేలుస్తూ తీర్పు చెప్పారు. అల్లర్లు జరిగినప్పుడు వారు అందులో పాల్గొన్నట్లు సరైన ఆధారాలు లేనందున వారిపై కేసును కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ వివరాలను ఖలిద్ సైఫీ తరఫు న్యాయవాది రెబ్బెకా జాన్ వెల్లడించారు. కోర్టు తీర్పు పూర్తి స్థాయి ఆదేశాలు అందాల్సి ఉందన్నారు. ఇదీ చదవండి: బెంగాల్లో ముందస్తు ఎన్నికలు.. హింట్ ఇచ్చిన బీజేపీ! -
సంచలన తీర్పు.. గ్యాంగ్ రేప్లో మరణ శిక్ష ఖైదీలకు విముక్తి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన చావ్లా రేప్ కేసులో.. ఇవాళ సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మరణ శిక్ష పడ్డ ముగ్గురు ఖైదీలను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెల్లడించింది. పదేళ్ల కింద జరిగిన ఈ దారుణ ఘటనలో.. తీర్పు సమయంలో బాధితురాలి తండ్రి చేతులు జోడించి ధర్మాసనం ముందు నిల్చున్నారు. అయితే.. సెంటిమెంట్లకు ఇక్కడ తావు ఉండదంటూ సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ముగ్గురు దోషులను సుప్రీం కోర్టు ఇవాళ నిర్దోషులుగా ప్రకటించింది. తీర్పు సమయంలో కోర్టు హాల్లో ఉద్వేగపూరిత వాతావరణం నెలకొంది. చీఫ్ జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. అంతకు ముందు శిక్షను తగ్గించాలంటూ దోషుల తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. వాళ్ల వయసు, కుటుంబ నేపథ్యాలు, గత చరిత్రలను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. ఇక.. ఢిల్లీ పోలీసుల తరపున వాదనలు వినిపించిన అదనపు సోలిసిటర్ జనరల్ ఐశ్వర్య భటి.. ఈ గాయం బాధితురాలిది మాత్రమే కాదని.. సమాజానిదని వాదించారు. కేవలం హత్యాచారమే చేయకుండా.. ఆమె శరీరాన్ని ఛిద్రం చేసి వాళ్లు పెద్ద తప్పు చేశారని ఆమె వాదనల్లో పేర్కొన్నారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం.. కీలక తీర్పు ఇచ్చింది. ఆ సమయంలో బాధితురాలి తండ్రి చేతులు జోడించి నిల్చోగా.. బాధితురాలి తండ్రి బాధను తాను అర్థం చేసుకోగలనని తెలిపారు సీజేఐ లలిత్. అయితే.. వాస్తవాలు, సాక్ష్యాలు-ఆధారాల ఆధారంగా తీర్పు ఉంటుందని, సెంటిమెంట్లను పరిగణనలోకి తీసుకుంటే కేసు తప్పదారి పట్టే అవకాశం ఉందని స్పష్టం చేస్తూ.. ఆ ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించారు. 2012 Chhawla rape case: Supreme Court acquits three men who were awarded the death penalty by a Delhi court after being held guilty of raping and killing a 19-year-old woman in Delhi's Chhawla area in 2012 pic.twitter.com/CsbjUhROn3 — ANI (@ANI) November 7, 2022 2012 ఫిబ్రవరిలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఫిబ్రవరి 9వ తేదీన ఢిల్లీ కుతుబ్ విహార్ వద్ద గురుగావ్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో కారులో వచ్చిన దుండగులు ఆమెను ఎత్తుకెళ్లారు. మూడు రోజుల తర్వాత.. హర్యానా రేవారి జిల్లా రోధాయి గ్రామ శివారులో సదరు యువతి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభ్యం కావడం కలకలం రేపింది. కారులోని పనిముట్లు, కుండపెంకులతో ఆమె జననాంగాలను ఛిద్రం చేసి ఘోరంగా హింసించి చంపారు దుండగులు. ఈ కిరాతకం దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందని గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. ఢిల్లీ కోర్టు 2014 ఫిబ్రవరిలో ఈ ముగ్గురికి పేర్కొంటూ మరణ శిక్షను ఖరారు చేసింది. అదే ఏడాది ఆగష్టు 26న ఢిల్లీ హైకోర్టు మరణ శిక్షను సమర్థిస్తూ తీర్పు వెల్లడించింది. మానవ మృగాలుగా దోషులను పేర్కొంటూ సమాజంలో తిరిగే హక్కును వీళ్లు కోల్పోయారంటూ ఆ సమయంలో హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు చేశారు. -
ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట
సాక్షి, ముంబై: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట లభించింది. మావోయిస్టులతో సంబంధాల కేసు నుంచి ఆయనకు విముక్తి లభించింది. ఈ మేరకు కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసిన బాంబే హైకోర్టు.. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలని మహారాష్ట్ర జైళ్ల శాఖను శుక్రవారం ఆదేశించింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో 2017లో సాయిబాబాను దోషిగా తేల్చింది ట్రయల్ కోర్టు. ఆ కేసులో జీవిత ఖైదు విధించింది. అయితే ఆ కోర్టు తీర్పును బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ఇప్పుడు కొట్టేసింది. ట్రయల్ కోర్టు తనను దోషిగా నిర్ధారిస్తూ యావజ్జీవ కారాగార శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ సాయిబాబా దాఖలు చేసిన అప్పీల్‌ను న్యాయమూర్తులు రోహిత్ దియో, అనిల్ పన్సారేలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణకు స్వీకరించారు. ఈ మేరకు వాదనలు విన్న అనంతరం ట్రయల్‌కోర్టు తీర్పును కొట్టేస్తూ.. తక్షణమే ప్రొఫెసర్ సాయిబాబాను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. శారీరక వైకల్యం కారణంగా వీల్‌చైర్‌కి పరిమితమైన సాయిబాబా ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ కేసులో మరో ఐదుగురు దోషుల అప్పీల్‌ను కూడా ధర్మాసనం అనుమతించి వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఐదుగురిలో ఒకరు అప్పీలు విచారణలో ఉండగానే మరణించారు. ఇక కోర్టు తీర్పుపై సాయిబాబా భార్య వసంత కుమారి స్పందించారు. మేధావి అయిన తన భర్తను కావాలనే కేసులో ఇరికించారని, జైల్లో ఏడేళ్లు గడిపారని, ఆయన ఆరోగ్యం బాగా దెబ్బ తిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: కన్నడ భాషపై దాడి చేస్తే ప్రతిఘటిస్తాం -
43 ఏళ్లు జైలులో మగ్గి ‘నిర్దోషి’గా విడుదల
పాట్నా: హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఓ వ్యక్తి 43 ఏళ్ల జైలు జీవితం గడిపిన తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. 10 ఏళ్ల వయసులో జైలుకు వెళ్లి 53 ఏళ్ల వయసులో నిర్దోషిగా బయటకు వచ్చాడు. ఈ సంఘటన బిహార్‌లోని బక్సర్ జిల్లాలో జరిగింది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసును కొట్టివేస్తూ బాక్సర్ జిల్లా జువైనల్ జస్టిస్ బోర్డు కొట్టి వేస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. ఇంతకి ఏం జరిగిందంటే? జిల్లాలోని మురార్ పోలీస్ స్టేషన్ పరిధి చౌగాయి గ్రామంలో ఓ దుకాణదారుడిపై 1979, సెప్టెంబర్‌లో హత్యాయత్నం జరిగింది. పలువురు దుండగులు తనను హత్య చేసేందుకు దాడి చేశారని పోలీసుకు ఫిర్యాదు చేశాడు. అందులో మున్నా సింగ్ అనే 10 ఏళ్ల బాలుడిపైనా ఆరోపణలు చేశాడు. ఆ తర్వాత బాలుడిని సెక్షన్ 148, 307ల కింద అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణ పెండింగ్‌లో పడిపోయింది. 2012 నుంచి ఈ కేసును బక్సర్ జిల్లా జువైనల్ జస్టిస్ బోర్డు విచారిస్తోంది. జువైనల్ జస్టిస్ బోర్డు ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా ఉన్న డాక్టర్ రాజేశ్ సింగ్ ఈ కేసులో సాక్షులను ప్రవేశపెట్టాలని పలుమార్లు ఫిర్యాదుదారుకు నోటిసులు పంపించారు. అయితే, ఏ ఒక్కరూ సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో మున్నా సింగ్‌ను నిర్దోషిగా తేలుస్తూ తీర్పు చెప్పింది జిల్లా కోర్టు. ప్రస్తుతం మున్నా సింగ్ వయసు 53 ఏళ్లు. తనను నిర్దోషిగా వదిలిపెట్టినందుకు సంతోషం వ్యక్తం చేసిన సింగ్.. దశాబ్దాల పాటు కేసును పెండింగ్‌లో పెట్టటంపై అసహనం వ్యక్తం చేశాడు. ఇదీ చదవండి: గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్.. వీడియో వైరల్ -
నన్ అత్యాచార నిందితుడు బిషప్ ఫ్రాంకోని నిర్దోషిగా ప్రకటించిన కేరళ కోర్టు
Bishop Franco Mulakkal: కేరళలో నన్‌పై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న బిషప్ ఫ్రాంకో ములక్కల్ నిర్దోషిగా కొట్టాయం కోర్టు ప్రకటించింది. ఈ మేరు 2018లో జలంధర్ డియోసెస్ పరిధిలోని ఒక నన్ 2014 నుంచి 2016 మధ్యకాలంలో బిషప్ ఫ్రాంకో తన పై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ లైంగిక ఆరోపణలు చేసింది. దీంతో పోలీసులు బిషప్ ఫ్రాంకోని అరెస్టు చేశారు. అంతేకాదు మరోవైపు పోలీసులు, ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నన్‌లు వీధుల్లో కొవ్వొత్తులు పట్టుకుని ర్యాలీ చేశారు. అయితే ఒక నన్ ఫిర్యాదు ఆధారంగా అత్యాచారం కేసులో అరెస్టయిన భారతదేశంలోని తొలి క్యాథలిక్ బిషప్ ఫ్రాంకో ములక్కల్. ఆ తర్వాత సుమారు 100 రోజులకు పైగా సాగిన విచారణ తర్వాత కోర్టు అతనిని అన్ని అభియోగాల నుండి విముక్తి చేసింది. ఈ మేరకు ఫ్రాంకో ములక్కల్ పోలీసులకు, కోర్టుకు సహకరించారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. (చదవండి: ప్రైవేట్ ఆస్పత్రిలో 11 పుర్రెలు, 54 పిండాల ఎముకలు) -
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సిసోడియాకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు భారీ ఊరట లభించింది. ఢిల్లీ ప్రభుత్వ అప్పటి ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్‌పై దాడిచేసిన కేసులో ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర 9 మంది ఇతర ఎమ్మెల్యేలను ఢిల్లీ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 2018 నాటి ఈ కేసులో కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. అయితే, ఈ కేసులో ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు అమాంతుల్లా ఖాన్, ప్రకాష్ జర్వాల్‌పై అభియోగాలు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. తాజా తీర్పుపై ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్పందించారు.ఇది తప్పుడు కేసు అని మొదటినుంచీ చెబుతూనే ఉన్నామనీ, ఈ కేసులో అన్ని ఆరోపణలు అబద్ధమని కోర్టు తేల్చి చెప్పిందన్నారు. సత్యానికి, న్యాయానికి లభించిన గొప్ప విజయమని ఆయన పేర్కొన్నారు. తమ సీఎంకు వ్యతిరేకంగా పన్నిన కుట్ర అని సిసోడియా వ్యాఖ్యానించారు. కాగా 2018 ఫిబ్రవరి 19వ తేదీ రాత్రి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో జరిగిన సమావేశంలో అప్పటి సీఎస్ ప్రకాష్‌పై ఎమ్మెల్యేలు దాడి చేశారనే ప్రధాన ఆరోపణతో కేసునమోదైంది. కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు మరో 11 మంది ఆప్ ఎమ్మెల్యేలపై పోలీసులు ఛార్జిషీటు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
గుల్షన్ కుమార్ హత్య కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు
ముంబై: కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఓ హత్య హిందీ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. 1997 గుల్షన్ కుమార్ హత్య కేసులో నిర్మాత రమేష్ తౌరానిని నిర్దోషిగా ప్రకటించడాన్ని బొంబాయి హైకోర్టు ఏకీభవించింది. అలాగే అబ్దుల్ రషీద్ మర్చంట్ శిక్షను కోర్టు ధృవీకరించింది. జస్టిస్ ఎస్ ఎస్ జాదవ్, ఎన్ ఆర్ బోర్కర్ డివిజన్ బెంచ్ కూడా రౌఫ్ సోదరుడు, ఈ కేసులో మరొక నిందితుడు అబ్దుల్ రషీద్ మర్చంట్‌ను దోషులగా తేల్చింది. కుమార్ పై కాల్పులు జరిపిన వ్యక్తులలో రషీద్ ఒకరు అని పేర్కొంటూ అతనికి జీవిత ఖైదు విధించారు. గుల్షన్ కుమార్ హత్య కేసులో అనేక మందిని విచారించిన తర్వాత రావుఫ్ మర్చంట్, చంచ్యా పిన్నమ్, రాకేశ్ కావోకర్లను ప్రధాన నిందితులుగా కోర్టు నిర్ధారించింది. ఈ కేసుకు సంబంధించిన తీర్పును జూలై 1న బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. ‘క్యాసెట్ కింగ్’ అని పిలిచే గుల్షన్ కుమార్‌ను 1997 ఆగస్టు 12న సబర్బన్ అంధేరిలోని ఓ ఆలయం వెలుపల దుండగులు కాల్చి చంపారు. ఈ హత్య కేసులో చాలా మందిని అరెస్ట్ చేసి విచారించారు. గుల్హన్ కుమార్ హత్య కేసులో ప్రముఖ సంగీత దర్శకుడు నదీంను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. గుల్హన్ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై ఆయనను విచారించారు. అయితే ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. కాగా, ఈ కేసులోని నిందితులు నదీమ్ సైఫీ, గ్యాంగ్ స్టర్ అబూ సలేం పరారీ ఉన్నారు. ఇక కుమార్‌ను హత్య చేయడానికి నదీమ్ సైఫీ, తౌరాని అబూ సలేంకు డబ్బు చెల్లించినట్లు ప్రాసిక్యూషన్ పేర్కొంది. అబ్దుల్ వ్యాపారి సెషన్స్ కోర్టు ముందు లేదా డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు వెంటనే లొంగిపోవాలనీ.. అతను తన పాస్ పోర్ట్‌ను పోలీసులకు అప్పగించాలని తెలిపింది. ఒకవేళ అతను లొంగిపోకపోతే సెషన్స్ కోర్టు బెయిల్ నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ, చేసి అతన్ని అదుపులోకి తీసుకుంటుంది, ’’ అని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా బాంబే హైకోర్టు పేర్కొంది. ఇక ఏప్రిల్ 2002, 29న, 19 మంది నిందితుల్లో 18 మందిని సెషన్స్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ట్రయల్ కోర్టు రౌఫ్‌ను భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 302 (హత్య), 307 (హత్యాయత్నం), 120 (బి) (క్రిమినల్ కుట్ర), 392 (దోపిడీ), 397 (దోపిడీలో తీవ్ర గాయాలు కలిగించేది), సెక్షన్ 27 (స్వాధీనం) భారత ఆయుధ చట్టం) కింద శిక్ష విధించింది. అయితే ఈ శిక్షకు వ్యతిరేకంగా రౌఫ్ అప్పీల్ చేయగా.. రౌఫ్ శిక్షను, అతనిపై విధించిన జీవిత ఖైదును కూడా ధర్మాసనం ఏకీభవించింది. చదవండి: వైరల్: కిక్ ఇచ్చాడు.. కుప్పకూలి పడ్డాడు! -
గట్టెక్కిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి కూడా అభిశంసన నుంచి గట్టెక్కారు. జనవరి 6న క్యాపిటల్ భవనంపై దాడికి ప్రేరేపించారని అభియోగాలు ఎదుర్కొన్న ట్రంప్ సెనేట్‌లో శనివారం జరిగిన ఓటింగ్‌లో 57–43 ఓట్ల తేడాతో బయటపడ్డారు. అమెరికా చరిత్రలో మాయని మచ్చగా నిలిచిపోయి, అయిదుగురు ప్రాణాలను బలితీసుకున్న క్యాపిటల్ భవనం ముట్టడి హింసాత్మకంగా మారిన ఘటనలో ట్రంప్‌ని దోషిగా నిలబెట్టడంలో డెమొక్రాట్లు విఫలమయ్యారు. గద్దె దిగిపోయిన తర్వాత కూడా అభిశంసన ఎదుర్కొన్న మొదటి వ్యక్తి ట్రంప్, అంతే కాకుండా రెండు సార్లు అభిశంసన ఎదుర్కొన్న అధ్యక్షుడు కూడా ట్రంప్ ఒక్కరే. అధ్యక్షుడిగా ఆయన తన అధికారాలన్నీ దుర్వినియోగం చేస్తున్నారన్న అభియోగాలపై గత ఏడాది ప్రవేశపెట్టిన అభిశంసన నుంచి కూడా ట్రంప్ బయటపడ్డారు. ఒకవేళ ట్రంప్ అభిశంసనకు గురైతే ఆ తర్వాత ఆయనను భవిష్యత్ ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయడానికి వీల్లేకుండా తీర్మానం ఆమోదించాలని సెనేట్‌లో డెమొక్రాట్లు భావించారు. కానీ రిపబ్లికన్ పార్టీ వారికి సహకరించలేదు. అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ దిగిపోయాక ఆయనపై అభిశంసన మోపడమే సరికాదని వాదించింది. మొత్తం 100 మంది సభ్యులున్న సెనేట్‌లో రెండింట మూడో వంతు మెజారిటీ అంటే 67 ఓట్లు వస్తే ట్రంప్ అభిశంసనకు గురవుతారు. ఈ సారి సెనేట్‌లో రెండు పార్టీలకు చెరి సమానంగా 50 సీట్లు ఉన్నాయి. మరో ఏడుగురు రిపబ్లికన్ పార్టీ సభ్యులు అభిశంసనకి మద్దతునిచ్చారు. దీంతో అభిశంసనకు అనుకూలంగా 57 మంది, వ్యతిరేకంగా 43 మంది ఓటు వేశారు. 10 ఓట్లు తక్కువ రావడంతో ట్రంప్‌పై అభియోగాలన్నీ వీగిపోయాయి. సెనేట్‌లో విచారణ కేవలం అయిదు రోజుల్లోనే ముగిసిపోయింది. అభిశంసన విచారణకే రిపబ్లికన్ పార్టీ పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదు. క్యాపిటల్ భవనంపై దాడిని ఖండించినప్పటికీ, అధికారాన్ని వీడిన తర్వాత ట్రంప్‌పై విచారణ అక్కర్లేదని మొదట్నుంచి చెప్పిన ఆ పార్టీ వాదనలకి పెద్దగా ఆస్కారం లేకుండానే విచారణని ముగించింది. ఇప్పుడే రాజకీయ ఉద్యమం మొదలైంది సెనేట్‌లో అభిశంసన నుంచి బయటపడిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో తనపై నిందలు మోపినట్టుగా మరే ఇతర అధ్యక్షుడిపైన జరగలేదని పేర్కొన్నారు. ఒక మంత్రగాడిని వేటాడినట్టుగా తన వెంట బడ్డారని దుయ్యబట్టారు. నిజం వైపు నిలబడి, న్యాయాన్ని కాపాడిన తన లాయర్లకు ధన్యవాదాలు తెలిపారు. తనను రాజకీయంగా కూడా సమాధి చెయ్యాలని డెమొక్రాట్లు భావించినప్పటికీ కుదరలేదని, అసలు ఇప్పుడే తన రాజకీయ ఉద్యమం ప్రారంభమైందని ట్రంప్ అన్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్‌గా నిలబెట్టడమే తన ముందున్న కర్తవ్యమని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని ధిక్కరించారు ట్రంప్‌పై అభిశంసన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసిన రిపబ్లికన్ సభ్యులపై డెమొక్రాట్లు మండిపడ్డారు. అమెరికా ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీసిన వ్యక్తిని కాపాడడం వల్ల ఇప్పుడు సెనేట్ కూడా అపఖ్యాతి పాలైందని అన్నారు. ట్రంప్‌ని ద్రోహిగా నిలబెట్టలేకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి పారిపోవడమేనని స్పీకర్ నాన్సీ పెలోసి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యానికే బీటలు అమెరికాలో ప్రజాస్వామ్యం బీటలు వారిందని మరోసారి రుజువైందని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ప్రతీ అమెరికా పౌరుడికి నిజం వైపు నిలబడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అభిశంసన నుంచి ట్రంప్‌కి విముక్తి లభించిన వెంటనే బైడెన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘అమెరికా చరిత్రలో ఇలాంటి విషాదకరమైన పరిస్థితి ఎప్పుడూ రాలేదు. మన దేశంలో హింసకి, తీవ్రవాదానికి స్థానం లేదు. అమెరికా పౌరులు, ముఖ్యంగా నాయకులందరూ నిజంవైపు నిలబడి అబద్ధాన్ని ఓడించాలి. అలా జరగకపోవడం వల్ల ప్రజాస్వామ్యం చెదిరిపోయిందని అర్థం అవుతోంది’’ అని బైడెన్ పేర్కొన్నారు. -
20 ఏళ్ల కేసులో.. సుప్రీం కీలక తీర్పు
న్యూఢిల్లీ: 20 ఏళ్ల క్రితం నాటి అత్యాచార కేసులో నిందితుడిని సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు, బాధితురాలు గతంలో ప్రేమలో ఉన్నారనే ఆధారాలతో కీలక తీర్పునిచ్చింది. తనను కాదని మరో మహిళను వివాహం చేసుకుంటున్నాడనే కోపంతో బాధితురాలు అత్యాచార ఆరోపణలు చేసిందని కోర్టు వెల్లడించింది. కొంత కాలం ప్రేమలో ఉన్న వ్యక్తుల మధ్య అభిప్రాభేదాలు తలెత్తడంతో ఇంతదాకా వచ్చిందని వ్యాఖ్యానించింది. అందుకనే కేసుపై పునరాలోచన చేసి తాజా తీర్పునిచ్చినట్లు పేర్కొంది. కాగా, అంతకుముందు ఇదే కేసులో ట్రయల్ కోర్టు, జార్ఖండ్ హైకోర్టు నిందితుడిని దోషిగా తీర్పు నివ్వడంతో.. అతను సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. కింది కోర్టుల తీర్పులను ఉంటకిస్తూ సుప్రీం కోర్టు.. 1999లో కేసు నమోదు చేసేటప్పుడు బాధిత మహిళకు 20 ఏళ్లు కాదని 25 సంవత్సరాలు అని తేల్చి చెప్పింది. అంటే 1995లో మహిళపై దాడి జరిగిన సమయంలో ఆమె మేజర్ అని పేర్కొంది. ఇరువురు రాసుకున్న లేఖలతోపాటు వారు దిగిన ఫోటోలను చూడటం ద్వారా ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు అర్థం అవుతోందని వ్యాఖ్యానించింది. అంతేగాని లైంగిక వేధింపులకు గురైన అనంతరం ఏ స్త్రీ కూడా నిందితుడికి ప్రేమ లేఖలు రాయదని, అతనితో నాలుగేళ్లపాటు సహజీవనం చేయదని కోర్టు పేర్కొంది. అయితే, అఘాయిత్యానికి పాల్పడిన అనంతరం నిందితుడు తనను వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాడని అందుకే తను చాలా కాలం అతనితో ఉండిపోయానని బాధితురాలు పేర్కొంది. (ముఫ్తీని ఎంతకాలం నిర్భంధంలో ఉంచుతారు?) పెళ్లికి సిద్ధంగా ఉన్నాడు సాక్ష్యాధారాల్ని పరిశీలించగా.. బాధితురాల్ని ప్రేమించిన నిందితుడు ఆమెను పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగానే ఉన్నాడని, వారి పెళ్లికి ఇరువురు కుటుంబాలు కూడా అంగీకరించినట్లు సుప్రీం కోర్టు తెలిపింది. కానీ బాధితురాలు క్రిస్టియన్ కాగా నిందితుడు షెడ్యూల్డ్ తెగకు చెందినవాడని వెల్లడించింది. వేర్వేరు మతాలకు చెందినవారు కాబట్టి వివాహానికి తమ కుటుంబ సభ్యులు ఒప్పుకోరని పెళ్లికి అడ్డుపడతారని మహిళ అడ్డు చెప్పినట్టు ఆధాలున్నాయని తెలిపింది. దీంతో ఆ వ్యక్తి వారం రోజుల్లో మరో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు తయరవుతుండగా అతనిపై అత్యాచారం, మోసం కేసు దాఖలు చేసిందని కోర్టు వివరించింది. (యజమాని వేధింపులు: బాలిక ఆత్మహత్య ) -
ఆ రేప్ కేసులో తండ్రీకొడుకులు నిర్దోషులు
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో నాలుగేళ్ల క్రితం జరిగిన ఒక అత్యాచారం కేసులో ఓ తండ్రి, కొడుకులను నిర్దోషులుగా ప్రకటించిన సంఘటన ఆసక్తిని రేకెత్తిస్తోంది. బాధితురాలు నిందితుల కూతురు, సోదరి కావడం గమనార్హం. వివరాలు.. ఇలా ఉన్నాయి. సుమారు 10 మంది కుటుంబ సభ్యులతో ఒకే గది ఉన్న ఇంట్లో బాధితురాలు నివాసం ఉంటోంది. ఇందులోనే ఓ చిన్న కిరాణా కొట్టు కూడా నడుపుతున్నారు. 2015 ప్రాంతంలో తనకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన తండ్రి, సోదరుడు కొన్ని నెలలపాటు అత్యాచారం చేశారని, విషయం ఇతరులకు చెబితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ అంశంపై పోలీసులు ఎఫ్ఐఆర్ ఆలస్యంగా దాఖలు చేయడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఈ కేసులో విచారణ చేపట్టిన ఢిల్లీ అదనపు సెషన్స్ కోర్టు మూడు కారణాలను చూపి ఫిర్యాదు చేసిన యువతి తండ్రి, సోదరుడిని నిర్దోషులుగా విడిచిపెట్టింది. ఎఫ్ఐఆర్ ఆలస్యంగా దాఖలు కావడం ఒక కారణమైతే, కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యాచారం జరగడం అసంభవమని కోర్టు అంచనాకు రెండో కారణం. విచారణ సమయంలో బాధితురాలు వేర్వేరు తేదీలు, నెలల పేర్లు చెప్పిందని, పైగా ఇతర కుటుంబ సభ్యులెవరూ బాధితురాలి పక్షాన విచారణలో పాల్గొనకపోవడాన్ని బట్టి కూడా ఆ యువతి చెప్పేది నిజం కాకపోవచ్చునని కోర్టు భావించింది. ఆ యువతి అప్పుడప్పుడూ కిరాణా కొట్లో వ్యాపారం చేసేదని, తనను బయట ఎక్కడకూ పంపేవారు కాదన్న బాధితురాలి వాంగ్మూలానికి ఇది భిన్నమని కోర్టు చెప్పింది. కొనుగోళ్ల కోసం వచ్చిన వాళ్ల (ఎక్కువగా ఇరుగుపొరుగు కావచ్చు)కు చెప్పుకున్నా ఎవరో ఒకరు సాయపడి ఉండేవారని కోర్టు పేర్కొంది. -
21 ఏళ్ల జైలు జీవితం.. తర్వాత నిర్దోషిగా తీర్పు
కటక్: సాక్ష్యాధారాలను క్షుణ్నంగా పరిశీలించడంలో జిల్లా కోర్టు పొరపాటు చేయడంతో ఓ వ్యక్తి 21 ఏళ్ల 9 నెలల జైలు శిక్ష అనుభవించి... ఆ తరవాత నిర్దోషిగా విడుదలైన ఘటన ఒడిశాలో జరిగింది. గంజామ్ జిల్లాలోని కంటపాడ గ్రామానికి చెందిన సాధు ప్రధాన్ 1997 నవంబర్‌లో హత్య కేసులో అరెస్టయ్యారు. మహిళను హత్య చేయడంతో పాటు ఆమె ఆభరణాలను కూడా దొంగిలించాడని జిల్లా కోర్టు అతన్ని దోషిగా తేలుస్తూ 1999 ఆగస్టులో జీవిత ఖైదు విధించింది. అనంతరం అతడు హైకోర్టులో తీర్పును సవాల్ చేశారు. ఈ వ్యాజ్యం జూలైలో జస్టిస్ ఎస్కే మిశ్రా, ఏకే మిశ్రాల ధర్మాసనం ఎదుటకు వచ్చింది. సాక్ష్యాధారాలను సరైన కోణంలో పరిశీలించని కింది కోర్టు పొరపాటు చేసిందని పేర్కొంటూ... తీర్పును సవరించి హైకోర్టు సోమవారం ఆయన్ను విడుదల చేసింది. హత్య వెనుక కారణాలను నిరూపించడంలో ప్రాసెక్యూషన్ విఫలమైందని తీర్పు సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. -
న్యాయం.. 23 ఏళ్లు వాయిదా!
శ్రీనగర్: వారి జీవితంలోని విలువైన కాలమంతా జైలు నాలుగు గోడలమధ్యే గడిచిపోయింది. దాదాపు 23 ఏళ్ల పాటు జైళ్లో నిర్బంధించి, ఇప్పుడు తీరిగ్గా నిర్దోషులేనంటూ వారిని విడుదల చేశారు. కశ్మీర్‌కు చెందిన మొహమ్మద్ అలీ భట్, లతీఫ్ అహ్మద్ వాజా, మీర్జా నాసర్ హుస్సేన్‌ల విషాదమిది. లజపతినగర్ మార్కెట్ పేలుళ్లలో హస్తం ఉందంటూ వీరిని మొదట 1996లో ఢిల్లీ పోలీసులు నేపాల్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం ఓ బస్సును పేల్చారనే ఆరోపణలపై రాజస్తాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లజపత్ నగర్ కేసుకు సంబంధించి వీరిని 2012లో ఢిల్లీ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. రాజస్తాన్ బస్సు కేసు నుంచి బయటపడకపోవడంతో ఆ తరువాతా వారు జైల్లోనే మగ్గాల్సి వచ్చింది. తాజాగా రాజస్తాన్ హైకోర్టు సైతం వారిని నిర్దోషులంటూ తీర్పు ఇవ్వడంతో.. ఎట్టకేలకు 23 ఏళ్ల విలువైన జీవితాన్ని కోల్పోయిన అనంతరం స్వేచ్ఛాప్రపంచంలోకి రాగలిగారు. కశ్మీరీ ఉపకరణాలను అమ్మి జీవనం గడిపేందుకు నేపాల్ వెళ్లిన వారిని 1996లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ’నేపాల్‌లో ఉన్న సామాన్యులమైన మేం ఢిల్లీలో, రాజస్తాన్‌లో బాంబు పేలుళ్లకెలా బాధ్యులమవుతాం? మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు. తెల్లకాగితాలపై సంతకాలు పెట్టించుకుని మమ్మల్ని బలిపశువులను చేశారు’ అని శ్రీనగర్‌కు చెందిన వాజా ఆవేదన వ్యక్తం చేశారు. భట్ జైళ్లో ఉన్న సమయంలోనే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయాడు. ఇంటికి వెళ్లగానే మొదట భట్ స్మశానవాటికకు వెళ్లి తన తల్లిదండ్రుల సమాధుల వద్ద చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. ‘నా సగం జీవితాన్ని కోల్పోయాను. నాకు జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యులు?’ అనే భట్ ప్రశ్నకు ఎవరి వద్దా సమాధానం లేదు. మాలాంటి అమాయకులు ఇంకా జైళ్లలో చాలామంది ఉన్నారని ఈ ముగ్గురు చెబుతున్నారు. -
‘సంఝౌతా’లో అసిమానంద్ నిర్దోషి
పంచకుల: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2007 నాటి సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్ల కేసులో హరియాణాలోని పంచకులలో ఉన్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న స్వామి అసిమానంద్, లోకేశ్ శర్మ, కమల్ చౌహాన్, రాజిందర్ చౌదరిలను నిర్దోషులుగా ప్రకటించింది. విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలను సమర్పించలేకపోయిందని ఎన్ఐఏ ప్రత్యేక జడ్జి జగ్దీప్ సింగ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఈ కేసులో పాకిస్తాన్‌కు చెందిన ప్రత్యక్ష సాక్షులను విచారించాలని రహీలా వకీల్ అనే పాక్ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. విచారణ కోసం ఎన్ఐఏ అధికారులు పంపిన నోటీసులు తమకు అందలేదని ఆమె న్యాయవాది కోర్టుకు తెలిపారు. తాము భారత్‌కు రాకుండా అధికారులు వీసాలు నిరాకరించారని వెల్లడించారు. అయితే ఈ వాదనల్ని ఎన్ఐఏ న్యాయవాది రాజన్ మల్హోత్రా ఖండించారు.ఈ కేసులో అసిమానంద్ ఇప్పటికే బెయిల్‌పై బయట ఉండగా, మిగతా ముగ్గురు నిందితులు జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. అసలేం జరిగింది? ఢిల్లీ నుంచి లాహోర్‌కు వెళుతున్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్ 2007, ఫిబ్రవరి 18న రాత్రి 11.53 గంటలకు హరియాణాలోని పానిపట్ నగరానికి సమీపంలో ఉన్న దివానా రైల్వే స్టేషన్‌ను దాటగానే శక్తిమంతమైన బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ దుర్ఘటనలో 68 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో అత్యధికులు పాకిస్తాన్ పౌరులే. అక్షర్ధామ్(గుజరాత్), సంకట్మోచన్ మందిర్(వారణాసి), రఘునాథ్ మందిర్(జమ్మూ) సహా దేశవ్యాప్తంగా ఆలయాలపై దాడులకు ప్రతీకారంగానే నిందితులు సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పేలుళ్లు జరిపారని ఎన్ఐఏ చార్జిషీట్లో తెలిపింది. భారత హైకమిషనర్‌కు పాక్ సమన్లు ఈ ఉగ్రదాడిలో చాలామంది పాకిస్తానీలు ప్రాణాలు కోల్పోయారనీ, దోషులను శిక్షించేందుకు భారత విచారణ సంస్థలు సరైనరీతిలో పనిచేయలేదని పాకిస్తాన్ పేర్కొంది. నిందితులను ఎన్ఐఏ కోర్టు నిర్దోషులుగా విడుదల చేయడంపై ఇస్లామాబాద్‌లో భారత హైకమిషనర్ అజయ్ బిసారియాకు సమన్లు జారీచేసి నిరసన తెలిపింది. మతవిద్వేషానికి కేరాఫ్ అసిమానంద్ పశ్చిమబెంగాల్లోని హుగ్లీ జిల్లా కమర్పకూర్‌లో స్వామి అసిమానంద్ జన్మించాడు. పాఠశాల స్థాయిలోనే హిందుత్వ సంస్థ పట్ల ఆకర్షితులయ్యాడు. 1971 సైన్స్ విభాగంలో డిగ్రీ చేశాక వన్‌వాసీ కల్యాణ్ ఆశ్రమంలో సేవకుడిగా చేరాడు. క్రైస్తవ మిషనరీలకు, ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలివ్వడలో దిట్ట. 1990ల్లో గుజరాత్‌లోని దంగ్ జిల్లాలో శబరి ధామ్ ఆశ్రమాన్ని ప్రారంభించాడు. హైదరాబాద్‌లోని మక్కా మసీదు, మహారాష్ట్రలోని మాలేగావ్, రాజస్తాన్‌లోని అజ్మీర్ దర్గా పేలుళ్ల కేసులో అసిమానంద్ నిందితుడిగా ఉన్నాడు. అయితే ఈ మూడు కేసుల్లోనూ అసిమానంద్ నిర్దోషిగా తేలారు. -
సంఝౌతా కేసులో స్వామి అసీమానందకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్ల కేసులో స్వామి అసీమానందతో పాటు నలుగురిని ఎన్ఐఏ కోర్ట్ నిర్దోషులుగా ప్రకటించింది. 12 ఏళ్ళ తరువాత సంఝౌతా ఎక్స్‌ప్రెస్ బాంబు పేలుళ్ళ కేసులో హర్యానా లోని పంచకుల ఎన్ఐఏ కోర్టు బుధవారం తీర్పును వెలువరించింది. బాంబు పేలుళ్లలో నిందితుల హస్తం ఉందని నిరూపించే సాక్షాలు సమర్పించడంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ బృందం విఫలమవడంతో స్వామి అసీమానంద సహా నలుగురు నిందితులకు పంచకుల నేషనల్ ఇన్వెస్టిగేషన్ కోర్ట్ ఊరట కల్పించింది. 2007 ఫిబ్రవరి 18న సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో ఐఈడీ పేలుడులో 63 మంది ప్రయాణికులు మరణించారు. బాధితులు పాకిస్తాన్‌కు చెందిన వారు కావడం గమనార్హం. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ నుంచి పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం అఠారీకి వెళుతుండగా హర్యానాలోని పానిపట్ జిల్లా దీవానా రైల్వేస్టేషన్ సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. పేలుడు కేసుపై దర్యాప్తునకు ఫిబ్రవరి 20, 2007న సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం 2010లో కేసును ఎన్ఐఏకు బదలాయించింది. కాగా దర్యాప్తులో భాగంగా 290 మంది సాక్షులను ఎన్ఐఏ విచారించింది. ఈ కేసులో స్వామి అసీమానంద, సునీల్ జోషి, లోకేష్ శర్మ, సందీప్ డాంగే, రామచంద్ర కలసాంగ్ర, రాజేంద్ర చౌదరి, కమల్ చౌహాన్లను దోషులుగా ఎన్ఐఏ తన చార్జిషీట్లో ఆరోపించింది. ఇక కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొన్న సునీల్ జోషి 2007 లో మధ్యప్రదేశ్ దీవాస్ లో మరణించగా, ఇతర నిందితులు రామచంద్ర కలసాంగ్ర, సందీప్ డాంగేల ఆచూకీ ఇప్పటికీ తెలియకపోవడం గమనార్హం -
నిందితులంతా నిర్దోషులే
ముంబై: పదమూడేళ్లనాటి సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో 21మంది పోలీసు అధికారులు సహా మొత్తం 22 మందీ నిర్దోషులేనని స్పెషల్ సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సొహ్రాబుద్దీన్, అతని భార్య కౌసర్ బీ, అనుచరుడు తులసీ ప్రజాపతిల మృతిలో కుట్ర కోణం, ఆ ముగ్గురి మృతితో నిందితులకు ప్రమేయం ఉందన్న ఆరోపణలపై ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాధారాలను చూపలేకపోయిందంటూ స్పెషల్ సీబీఐ కోర్టు జడ్జి ఎస్జే శర్మ తీర్పుచెప్పారు. ‘22 మంది నిందితులపై కుట్ర ఆరోపణలను సమర్ధనగా సీబీఐ ఎలాంటి ఆధారాలను చూపలేకపోయింది. దీంతో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తున్నాం’ అని తీర్పుచెప్పారు. సొహ్రాబుద్దీన్ షేక్‌కు లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని మోదీని హత్య చేసేందుకు కుట్ర పన్నాడనేది పోలీసుల ఆరోపణ. అప్పటి డీజీపీ వంజారా ఆదేశాల మేరకే మరో అధికారి పీసీ పాండే ఎన్కౌంటర్లో ప్రజాపతిని చంపారని సీబీఐ ఆరోపించింది. అయితే, ఇందుకు ఫోన్‌కాల్స్ వంటి ఎలాంటి ఆధారాలను చూపకపోవడంతో న్యాయస్థానం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. సీబీఐ కోర్టు తీర్పుపై సొహ్రాబుద్దీన్ సోదరుడు రుబాబుద్దీన్ స్పందించారు. ఈ తీర్పు విచారకరమనీ, దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. గ్యాంగ్‌స్టర్ సొహ్రాబుద్దీన్, అతని భార్య కౌసర్ బీ, అనుచరుడు తులసీ ప్రజాపతితో కలిసి హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని సాంగ్లీకి బస్సులో వస్తుండగా 2005 నవంబర్ 22వ తేదీ రాత్రి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అదే ఏడాది నవంబర్ 26వ తేదీన సొహ్రాబుద్దీన్, మరో మూడు రోజుల తర్వాత కౌసర్ బీ హత్యకు గురయ్యారు. వీరిని గుజరాత్, రాజస్తాన్ పోలీసు బృందమే హత్య చేసిందని సీబీఐ ఆరోపించింది. ప్రజాపతిని ఉదయ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉంచిన పోలీసులు 2006 డిసెంబర్ 27వ తేదీన గుజరాత్–రాజస్తాన్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో చంపేశారని సీబీఐ పేర్కొంది. ఈ కేసులోని 22 మంది నిందితుల్లో 21 మంది గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాలకు చెందిన దిగువ స్థాయి పోలీసు అధికారులు కాగా 22వ వ్యక్తి గుజరాత్లో సొహ్రాబుద్దీన్ దంపతులు హత్యకు ముందు బస చేసిన ఫాంహౌస్ యజమాని. గుజరాత్ సీఐడీ నుంచి కేసు దర్యాప్తు బాధ్యతలను చేపట్టిన సీబీఐ.. అప్పటి గుజరాత్ హోం మంత్రి, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, అప్పటి రాజస్తాన్ హోం మంత్రి గులాబ్‌చంద్ కటారియా, ఐపీసీ అధికారులు వంజారా, పీసీ పాండే సహా 38మందిపై ఆరోపణలు మోపింది. మొత్తం 210 మంది సాక్షులను విచారించగా అందులో 92 మంది వ్యతిరేకంగా మాట్లాడారు. విచారణ నిష్పాక్షికంగా సాగేందుకు ఈ కేసును గుజరాత్ నుంచి మహారాష్ట్రకు బదిలీ చేయాలన్న సీబీఐ పిటిషన్‌కు అనుకూలంగా 2013లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ కోర్టు జడ్జి బీహెచ్ లోయా మూడేళ్ల క్రితం మృతి చెందడం కూడా వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కేసు విచారణ సాగిందిలా.. నవంబర్ 22, 2005: గ్యాంగ్‌స్టర్ సొహ్రాబుద్దీన్ షేక్, ఆయన భార్య కౌసర్ బీ, అనుచరుడు తులసి ప్రజాపతి హైదరాబాద్ నుంచి సాంగ్లికి బస్సులో వస్తుండగా పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. షేక్ దంపతులను ఒక వాహనంలో, ప్రజాపతిని మరో వాహనంలో తీసుకెళ్లారు. నవంబర్ 22 నుంచి 25 2005: అహ్మదాబాద్ సమీపంలోని ఒక ఫాం హౌస్‌లో సొహ్రాబుద్దీన్, కౌసర్ బీలను ఉంచారు. ప్రజాపతిని ఉదయ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు నవంబర్ 26, 2005: గుజరాత్, రాజస్థాన్ పోలీసులు కలిసి జరిపిన ఎన్కౌంటర్లో సొహ్రాబుద్దీన్ మరణించాడు. అది నకిలీ ఎన్కౌంటర్ అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి నవంబర్ 29, 2005: కౌసర్ శరీరమంతా కాలిన గాయాలతో శవమై కనిపించింది. డిసెంబర్ 27, 2006: రాజస్థాన్, గుజరాత్ పోలీసు బృందం ఉదయ్‌పూర్ సెంట్రల్ జైలు నుంచి ప్రజాపతిని తీసుకువెళుతూ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని సర్హాద్ చప్రిలో జరిగిన ఎన్కౌంటర్లో చంపేశారు. మే 22, 2006: ఈ ఎన్కౌంటర్ కేసును విచారించాలని, కౌసర్ ఆచూకీ తెలపాలంటూ సొహ్రాబుద్దీన్ కుటుంబసభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా గుజరాత్ రాష్ట్ర సీఐడీని ఈ కేసును విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జనవరి 2010: సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. జులై 23, 2010: అప్పటి గుజరాత్ హోంమంత్రి అమిత్ షా, అప్పటి రాజస్థాన్ హోంమంత్రి గులాబ్‌చంద్ కటారియా, ఇతర ఐపీఎస్ అధికారులతో పాటు 38 మందిపై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. జులై 25: అమిత్ షాను సీబీఐ అరెస్ట్ చేసింది. డిసెంబర్ 30, 2014: ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టు అమిత్‌ను కేసు నుంచి విముక్తుడ్ని చేసింది. ఇతర ఐపీఎస్ అధికారులు బయటపడ్డారు. నవంబర్ 2017: సీబీఐ ప్రత్యేక జడ్జి ఎస్జే శర్మ కేసు విచారణను ప్రారంభించారు డిసెంబర్ 21, 2018: సరైన సాక్ష్యాలు లేవంటూ 22 మందికి విముక్తి కల్పిస్తూ తీర్పు నిర్దోషులుగా బయటపడిన పోలీసులు -
సోహ్రబుద్దీన్ కేసు: నిందితులకు విముక్తి
సాక్షి, ముంబై : 2005లో సోహ్రబుద్దీన్ షేక్, తులసీరాం ప్రజాపతి ఎన్కౌంటర్ కేసులో మొత్తం 22 మంది నిందితులకు విముక్తి కల్పిస్తూ శుక్రవారం ముంబై కోర్టు తీర్పు వెలువరించింది. నిందితులపై నేరాన్ని రుజువు చేసేందుకు తగిన ఆధారాలు లేనందున వారిని కేసు నుంచి తప్పిస్తున్నట్టు సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి స్పష్టం చేశారు. గుజరాత్, రాజస్ధాన్‌లకు చెందిన పోలీస్ అధికారులే నిందితుల్లో అధికంగా ఉన్నారు. రాజకీయ, ఆర్థిక లబ్ధి కోసమే ఈ హత్యలకు కుట్ర జరిగిందని కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఆరోపించింది. ఇదే కేసులో సీబీఐ నిందితుడిగా చేర్చిన బీజేపీ చీఫ్ అమిత్ షాకు గతంలో కేసు నుంచి ఊరట లభించింది. ఆయన పాత్రపై ఆధారాలు లేనందున అమిత్ షాతో గుజరాత్ మాజీ డీజీపీ వంజరాలకు కేసు నుంచి కోర్టు విముక్తి కల్పించింది. ఈ కేసులో మొత్తం 210 మంది సాక్షులను కోర్టు విచారించగా వీరిలో 92 మంది అప్రూవర్లుగా మారారు. సోహ్రబుద్దీన్ అపహరణ, ఎన్కౌంటర్ బూటకమని నిరూపించేందుకు ప్రాసిక్యూషన్ గట్టిగా కృషి చేసినా సాక్షులు అప్రూవర్లుగా మారడంతో వారు నోరుమెదపలేదని, ఇందులో ప్రాసిక్యూషన్ తప్పేమీ లేదని కోర్టు పేర్కొంది. సోహ్రబుద్దీన్, తులసీరామ్ ప్రజాపతి కుటుంబాలకు న్యాయస్ధానం విచారం వెలిబుచ్చుతోందని, కోర్టులు కేవలం సాక్ష్యాల ఆధారంగానే పనిచేయాలని వ్యవస్థ, చట్టం నిర్దేశిస్తాయని తీర్పును చదువుతూ న్యాయమూర్తి జస్టిస్ ఎస్జే శర్మ వ్యాఖ్యానించారు. కాగా, ఈ కేసును తొలుత గుజరాత్ సీఐడీ విచారించగా తదుపరి 2010లో దర్యాప్తును సీబీఐకి బదలాయించారు. సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ సహా ఈ ఘటనలు జరిగిన సమయంలో గుజరాత్ హోంమంత్రిగా వ్యవహరించిన అమిత్ షాను నిందితుల్లో ఒకరిగా చేర్చగా ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు లేవంటూ 2014లో కేసు నుంచి విముక్తి కల్పించారు. అసలేం జరిగింది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన హత్యకు కుట్రపన్నిన సోహ్రబుద్దీన్ షేక్ 2005 నవంబర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడని గుజరాత్ పోలీసులు వెల్లడించారు. అదే ఏడాది నవంబర్ 22న సోహ్రబుద్దీన్, ఆయన భార్య కౌసర్ బి, సహచరుడు తులసీరాం ప్రజాపతిలు హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని సంగ్లీకి బస్సులో వెళుతుండగా గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సీబీఐ తెలిపింది. నాలుగు రోజుల తర్వాత సోహ్రబుద్దీన్‌ను అహ్మదాబాద్ వద్ద హతమార్చారని, అదృశ్యమైన కౌసర్ బీని నవంబర్ 29న బనస్కంత జిల్లాలోని ఓ గ్రామానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడి అనంతరం హతమార్చారని సీబీఐ ఆరోపించింది. ఇక 2006 డిసెంబర్ 27న గుజరాత్-రాజస్ధాన్ సరిహద్దుల్లో ఇరు రాష్ట్రాల పోలీసులు చాప్రి ప్రాంతం వద్ద కాల్చిచంపారని పేర్కొంది. అయితే ప్రజాపతిని ఓ కేసు విచారణ నిమిత్తం అహ్మదాబాద్ నుంచి రాజస్ధాన్‌కు తీసుకువెళుతుండగా పారిపోయేందుకు ప్రయత్నించగా అతడిని ఆపే క్రమంలో జరిపిన కాల్పుల్లో మరణించాడని పోలీసులు చెబుతున్నారు. నిర్ధోషులుగా బయటపడిన ప్రముఖులు సోహ్రబుద్దీన్ కేసులో బీజేపీ చీఫ్ అమిత్ షాతో పాటు గుజరాత్ పోలీసు అధికారి అభయ్ చుడాసమ, రాజస్ధాన్ మాజీ హోంమంత్రి గులాబ్‌చంద్ కటారియా, మాజీ గుజరాత్ డీజీపీ పీసీ పాండే, సీనియర్ పోలీస్ అధికారి గీతా జోహ్రి తదితరులున్నారు. ఇక తాజా తీర్పులో కేసు నుంచి విముక్తి పొందిన వారిలో అత్యధికులు గుజరాత్, రాజస్ధాన్‌లకు చెందిన దిగువస్ధాయి పోలీసు అధికారులే ఉండటం గమనార్హం. -
పరువునష్టం కేసులో కేజ్రీవాల్‌కు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ సహచరుడు దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ రాజకీయ కార్యదర్శి పవన్ ఖేరా దాఖలు చేసిన పరువు నష్టం కేసు నుంచి కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సోమవారం విముక్తి కల్పించింది. షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో 2012 అక్టోబర్‌లో విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని ఖేరా పరువునష్టం దావా వేశారు. షీలా దీక్షిత్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు తాను ఆమె రాజకీయ సహాయకుడిగా ఉన్నందున తన గౌరవాన్ని మంటగలిపేలా ఉన్నాయని ఖేరా ఈ కేసులో పేర్కొన్నారు. అయితే కేజ్రీవాల్ వ్యాఖ్యలు నేరుగా ఖేరాను ఉద్దేశించి లేనందున ఆయన ప్రతిష్టకు నిర్ధిష్టంగా ఎలాంటి భంగం వాటిల్లలేదని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో ఫిర్యాదుదారుపై నిందితుడు ఎలాంటి వ్యాఖ్యలు చేసినట్టు ప్రాధమిక ఆధారాలు లేవని, ఫిర్యాదుదారు దాఖలు చేసిన పరువునష్టం దావాను కొనసాగించలేమని స్పష్టం చేసింది. -
వీరప్పన్ సహా అందరూ నిర్దోషులే
సాక్షి ప్రతినిధి, చెన్నై: కన్నడ సూపర్‌స్టార్ దివంగత రాజ్‌కుమార్‌ను ఎర్రచందన స్మగ్లర్ వీరప్పన్ కిడ్నాప్ చేసిన కేసులో నిందితులందరినీ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. దాదాపు 18 ఏళ్లుగా ఈ కేసును కోర్టు విచారిస్తోంది. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా గోపిచెట్టిపాళయం కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. నేరం నిరూపితం కాకపోవడం, నేరాన్ని రుజువు చేసే సరైన సాక్ష్యాలు లేకపోవడంతో వారందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. 2000 జూలై 30న ఈరోడ్ జిల్లా తొట్టకాజనూరులోని రిసార్టుకు భార్య పార్వతమ్మాళ్తో కలసివచ్చిన రాజ్‌కుమార్‌ను ఆరోజు రాత్రి వీరప్పన్ తన సహచరులతో కలసి కిడ్నాప్ చేశాడు. దీంతో వీరప్పన్, అతని అనుచరులు 14 మందిపై కేసు నమోదైంది. తమిళనాడు జర్నలిస్టు నక్కీరన్ గోపాల్‌సహా పలువురు సాగించిన రాయబారాల ఫలితంగా 107 రోజుల తర్వాత రాజ్‌కుమార్ విడుదలయ్యాడు. అయితే, 2004 అక్టోబర్‌లో పోలీస్ ఎన్కౌంటర్లో వీరప్పన్, అతని అనుచరులు గోవిందన్, చంద్రగౌడ తదితరులు హతమయ్యా రు. 2006లో రాజ్‌కుమార్, గత ఏడాది ఆయన భార్య కన్నుమూశారు. -
ఆ కేసులో పంజాబ్ సీఎంకు ఊరట..
చండీగఢ్ : పదేళ్ల కిందట ప్రైవేట్ డెవలపర్‌కు భూమి బదలాయింపు కేసులో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ సహా 17 మందికి విముక్తి లభించింది. నిందితుల్లో పంజాబ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, సహా ఇద్దరు మాజీ మంత్రులు మరణించారు. అమృత్సర్ ట్రస్ట్‌కు సంబంధించిన 32 ఎకరాల భూమిని ప్రైవేట్ డెవలపర్‌కు అభివృద్ధి పరిచే నిమిత్తం బదలాయించడంలో 18 మంది నిందితులు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని విజిలెన్స్ బ్యూరో (వీబీ) నివేదిక ఆధారంగా కేసును మూసివేస్తున్నట్టు మొహాలీ ప్రత్యేక న్యాయమూర్తి జస్వీందర్ సింగ్ స్పష్టం చేశారు. పంజాబ్ అసెంబ్లీ సూచనతో 2008లో విజిలెన్స్ బ్యూరో వీరిపై కేసు నమోదు చేసింది. న్యాయస్ధానానికి హాజరైన అమరీందర్ సింగ్ ఇతర నిందితులు తీర్పును స్వాగతించారు. చివరికి న్యాయం గెలిచిందని వ్యాఖ్యానించారు. రాజకీయ కక్షసాధింపుతోనే తమపై విజిలెన్స్ బ్యూరోను ప్రేరేపించి కేసులో ఇరికించారని అప్పటి అకాలీదళ్-బీజేపీ ప్రభుత్వాన్ని ఉటంకిస్తూ అమరీందర్ సింగ్ అన్నారు. ఒత్తిళ్లకు తలొగ్గిన విజిలెన్స్ బ్యూరో అధికారులపై ఎలాంటి చర్యలూ చేపట్టబోమని ఆయన స్పష్టం చేశారు. -
‘మక్కా’ పేలుడు కేసు కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మక్కా మసీదు బాంబు పేలుడు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. నిందితులు నేరం చేసినట్టుగా నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని, ఏ ఒక్క అభియోగానికీ ఆధారాలు చూపలేకపోయిందని పేర్కొంది. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న స్వామి అసీమానంద వాంగ్మూలానికి చట్టబద్ధత లేదని, చాలా మంది సాక్షులు తొలుత ఇచ్చిన సాక్ష్యానికి వ్యతిరేకంగా మళ్లీ సాక్ష్యం చెప్పారని స్పష్టం చేసింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసు కుని కేసును కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ.. నాలుగో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి రవీందర్‌రెడ్డి తీర్పునిచ్చారు. పదకొండేళ్ల తర్వాత.. హైదరాబాద్‌లోని చరిత్రాత్మక మక్కా మసీదులో 2007 మే 18న బాంబు పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. మసీదులో మధ్యాహ్నం ప్రార్థనలు ముగిసిన తర్వాత 1:25 గంటల సమయంలో సెల్‌ఫోన్ సహాయంతో బాంబును పేల్చారు. ఆ ఘటనలో తొమ్మిది మంది మరణించగా.. 58 మంది గాయపడ్డారు. దీనిపై తొలుత స్థానిక పోలీసులు, అనంతరం సీబీఐ, ఎన్ఐఏలు దర్యాప్తు చేసి.. చార్జిషీట్లు దాఖలు చేశాయి. మొత్తంగా పది మందిని నిందితులుగా చేర్చాయి. సుదీర్ఘంగా 11 ఏళ్లపాటు దర్యాప్తు, విచారణలు కొనసాగాయి. తాజాగా సోమవారం తీర్పు వెలువడింది. అభియోగాలకు ఆధారాలేవీ? ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న వారు బాంబు పేలుళ్లకు పాల్పడినట్టు నిరూపించడంలో ఎన్ఐఏ విఫలమైందని న్యాయ మూర్తి రవీందర్‌రెడ్డి తన తీర్పులో పేర్కొన్నారు. నిందితులపై ఎన్ఐఏ మోపిన ఏ ఒక్క అభియోగానికి కూడా ఆధారాలు చూపలేకపోయిందని తెలిపారు. పేలుడుకు వాడిన సిమ్ కార్డులను నిందితులు ఉపయోగించారనేందుకు ఎటువంటి ఆధారాలు లేవన్నారు. అజ్మీర్ దర్గా పేలుడుకు, మక్కా మసీదు పేలుడుకు అవే సిమ్ కార్డులను ఉపయోగించారని ఎన్ఐఏ అభియోగం మోపిందని.. కానీ దీనిపై ఆధారాలను చూపలేకపోయిందని స్పష్టం చేశారు. బాబూలాల్ యాదవ్ పేరుతో దేవేందర్ గుప్తా సిమ్ కార్డులను కొనుగోలు చేశారనేందుకూ ఆధారాల్లేవన్నారు. ఆ వాంగ్మూలాలు చెల్లవు.. కేసులో కీలకంగా పేర్కొన్న స్వామి అసీమానంద నేరాంగీకార వాంగ్మూలానికి ఎటువంటి చట్టబద్ధత లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. పోలీసు కస్టడీలో ఉండగా ఢిల్లీలోని పంచకుల కోర్టులో అసీమానంద వాంగ్మూలాన్ని నమోదు చేశారని.. కస్టడీలో ఉన్న వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం చట్ట ప్రకారం చెల్లదని వెల్లడించారు. దర్యాప్తు అధికారులు అసీమానంద వాంగ్మూలం ఆధారంగానే కొందరిని నిందితులుగా చేర్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఇక పేలుళ్లకు జరిపిన కుట్రలో భరత్ మోహన్‌లాల్‌కు సంబంధం ఉందని ఎన్ఐఏ నిరూపించలేక పోయిందని,. మిగతా కుట్రదారులకు డబ్బు ఇచ్చారనేందుకూ ఆధారాలు లేవని తెలిపారు. పేలుడుకు ముందురోజు రాజేంద్ర చౌదరి స్వయంగా మసీదుకు వెళ్లి బాంబు పెట్టారనేందుకు సైతం ఆధారాలు చూపలేకపోయిందన్నారు. ప్రధాన దర్యాప్తు అధికారి రాజా బాలాజీ ఇచ్చిన సాక్ష్యం కూడా పరస్పర విరుద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 226 మంది సాక్షుల్లో 64 మంది తాము మొదట ఇచ్చిన సాక్ష్యానికి వ్యతిరేకంగా మళ్లీ సాక్ష్యం చెప్పారని వివరించారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ.. ఈ కేసును కొట్టివేస్తున్నట్టు న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. పది మంది నిందితులు.. 226 మంది సాక్షులు ఈ కేసులో మొత్తం 10 మందిని నిందితులుగా చేర్చారు. తొలుత దర్యాప్తు చేసిన సీబీఐ.. హిందూ అతివాద గ్రూపు పేలుళ్లకు పాల్పడినట్టు ప్రాథమికంగా గుర్తించింది. 2010లో దేవేందర్ గుప్తా, లోకేశ్ శర్మలను అరెస్టు చేసింది. దేవేందర్ గుప్తా మొదటి నిందితుడిగా, లోకేశ్ శర్మను రెండో నిందితుడిగా చార్జిషీటు దాఖలు చేసింది. అనంతరం ఈ కేసు దర్యాప్తు ఎన్ఐఏ పరిధిలోకి వెళ్లింది. విస్తృతంగా దర్యాప్తు చేసిన ఎన్ఐఏ.. దేశవ్యాప్తంగా ఇదే తరహాలో జరిగిన దాడుల నుంచి సేకరించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకుని.. మరికొందరు నిందితులను అరెస్టు చేసి, చార్జిషీట్లు దాఖలు చేసింది. సందీప్ దంగే, రామచంద్ర కల్సాంగ్ర, సునీల్ జోషి, స్వామి అసీమానంద అలియాస్ నంబకుమార్ సర్కార్ అలియాస్ ఓంకారానంద్ అలియాస్ రాందాస్, భరత్ మోహన్‌లాల్ రాఠేశ్వర్ అలియాస్ భరత్ భాయ్, రాజేంద్ర చౌదరి, తేజ్‌రామ్ పర్మార్, అమిత్ చౌహాన్లను తదుపరి నిందితులుగా చేర్చింది. ఇందులో ఐదుగురిపైనే అభియోగాలను నమోదు చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్ఎస్ఎస్ ప్రచారక్ సునీల్ జోషి.. కేసు దర్యాప్తు సమయంలోనే హత్యకు గురికాగా.. సందీప్ దంగే, రామచంద్ర కల్సంగ్రల ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. మరో ఇద్దరు నిందితులు తేజ్‌రామ్ పర్మార్, అమిత్ చౌహాన్‌లపై దర్యాప్తు కొనసాగుతోంది. మొత్తంగా నిందితుల నేరాన్ని నిరూపించేందుకు ప్రాసిక్యూషన్ మొత్తం 226 మంది సాక్షుల నుంచి వాంగ్మూలం సేకరించింది. 396 ఎగ్జిబిట్లు, 28 మెటీరియల్ ఆబ్జెక్ట్స్‌ను కోర్టు ముందుంచింది. పేలని బాంబు ఇచ్చిన ఆధారంతో.. మక్కా మసీదులో బాంబు పేలుడు అనంతరం క్లూస్ టీం తనిఖీలు చేస్తుండగా.. పేలకుండా ఉన్న మరో బాంబు లభించింది. దానిని నిర్వీర్యం చేసిన క్లూస్ టీం బృందం.. అందులో టైమర్‌గా సిమ్‌కార్డులను వినియోగించినట్టు గుర్తించింది. అంటే తొలి బాంబును కూడా అలా సిమ్ ఆధారంగానే పేల్చినట్టు నిర్ధారించారు. అటు రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గా పేలుళ్లలోనూ అచ్చు ఇదే తరహాలో సిమ్ ఆధారంగా బాంబులు అమర్చినట్టు గుర్తించారు. దాంతో దర్యాప్తు అధికారులు ఆ దిశగా దర్యాప్తు చేసి.. నిందితులను అరెస్టు చేశారు. భారీగా బందోబస్తు.. మక్కా పేలుడు కేసు తీర్పు సందర్భంగా నాంపల్లి కోర్టు పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. తీర్పునిచ్చిన జడ్జి రవీందర్‌రెడ్డి చాంబర్ వద్ద కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆయన ఇంటికి తిరిగి వెళ్లేంత వరకు కూడా బందోబస్తు కొనసాగింది. నిందితులపై అభియోగాలివే.. దేవేందర్ గుప్తా: బాంబు పేలుళ్లకు మిగతా నిందితులతో కలసి కుట్ర పన్నాడు. మనోజ్‌కుమార్ పేరుతో తప్పుడు స్కూల్ సర్టిఫికెట్, బాబూలాల్ యాదవ్ పేరుతో తప్పుడు రేషన్‌కార్డు తయారు చేశాడు. ఈ తప్పుడు రేషన్‌కార్డుతో డ్రైవింగ్ లైసెన్స్ పొందాడు. దీని ఆధారంగా సిమ్ కార్డు తీసుకున్నాడు. ఈ ఫోన్ నంబర్ ద్వారానే మిగతా నిందితులతో మాట్లాడాడు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు ఇవ్వడంలో దిట్ట. మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి అజ్మీర్ దర్గా వద్ద ఎలా పేలుడు జరిపారో.. అదే తరహాలో మక్కా మసీదు వద్ద పేలుళ్లు జరిపారు. లోకేశ్ శర్మ: మొబైల్ ఫోన్లు సంపాదించి పెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. మక్కా మసీదు పేలుళ్లు ఎలా జరపాలన్న స్కెచ్ రూపొందించింది ఇతనే. స్వామి అసీమానంద: హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు ప్రతీకారంగా.. మక్కా మసీదు, అజ్మీర్ దర్గాలలో పేలుళ్లు జరపాలని ప్రతిపాదించాడు. తన పథకాన్ని వివరించి రామచంద్ర కల్సాంగ్ర, భరత్ మోహన్‌లాల్ రాఠేశ్వర్ల ద్వారా సిమ్ కార్డులు సంపాదించాడు. పేలుళ్ల తరువాత స్వామి ఓంకారానంద్గా మారుపేరుతో హరిద్వార్ సమీపంలోని ఆత్మాల్పూర్ బొంగ్లా గ్రామంలో దాక్కున్నాడు. పోలీసులు అసీమానందను అరెస్ట్ చేసి.. హరిద్వార్ చిరునామాతో ఉన్న ఓటర్, రేషన్ కార్డులను, నాబాకుమార్ సర్కార్ పేరుతో ఉన్న పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. భరత్ మోహన్‌లాల్ రాఠేశ్వర్: పేలుడు కుట్రకు సంబంధించి కీలక పాత్ర పోషించాడు. గుజరాత్‌లోని మహదేవ్నగర్లో ఉన్న భరత్ ఇంట్లోనే అందరూ భేటీ అయి పేలుడుకు ప్రణాళిక రూపొందించారు. అక్కడే పేలుళ్ల కోసం రామచంద్ర కల్సాంగ్రకు రూ.40 వేలు ఇచ్చారు. సునీల్ జోషికి రూ.25 వేలు ఇచ్చి పిస్టళ్లు, సిమ్ కార్డులు పొందారు. రాజేంద్ర చౌదరి: మక్కా మసీదులో బాంబు పెట్టిన ప్రధాన వ్యక్తి. 2007 ఏప్రిల్‌లో మరో వ్యక్తితో కలసి మక్కా మసీదు వద్ద రెక్కీ నిర్వహించాడు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ బాంబు పేలుడు, మాలేగావ్ పేలుళ్ల కేసుల్లోనూ రాజేంద్ర నిందితుడు. జడ్జి రవీందర్‌రెడ్డి రాజీనామా! ఉదయం తీర్పు.. మధ్యాహ్నం రాజీనామా బెదిరింపుల వల్లేనంటున్న నాంపల్లి కోర్టు వర్గాలు రాజీనామాను ధ్రువీకరించని హైకోర్టు వర్గాలు సాక్షి, హైదరాబాద్: మక్కా మసీదు బాంబు పేలుడు కేసును కొట్టేస్తూ ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం జడ్జి రవీందర్‌రెడ్డి.. న్యాయాధికారి పోస్టుకు రాజీనామా చేసినట్లు తెలిసింది. ఉదయం 11.50 గంటలకు తీర్పునిచ్చిన ఆయన, మధ్యాహ్నం కల్లా రాజీనామా సమర్పించారు. తన రాజీనామా లేఖను హైకోర్టుకు పంపినట్లు నాంపల్లి కోర్టు వర్గాలు తెలిపాయి. అయితే రాజీనామా లేఖ విషయాన్ని హైకోర్టు వర్గాలు ధ్రువీకరించడం లేదు. ప్రస్తుతం రవీందర్‌రెడ్డి తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన రాజీనామాకు దారి తీసిన కారణాలు ఏంటన్నది నిర్దిష్టంగా తెలియడం లేదు. ఆయన వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు. ఆయన్ను సంప్రదించేందుకు ‘సాక్షి’ యత్నించగా.. మాట్లాడేందుకు నిరాకరించారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో రవీందర్‌రెడ్డి రాజీనామా వార్త బయటకు రావడంతో సర్వత్రా దీనిపైనే చర్చ జరిగింది. రాజీనామాపై ఎవరికి తోచిన కారణాలను వారు చెబుతున్నారు. తీర్పు అనంతరం బెదిరింపు కాల్స్ వచ్చాయని, అందువల్లే రాజీనామా చేశారని నాంపల్లి కోర్టు వర్గాలు చెబుతున్నాయి. న్యాయాధికారుల డిమాండ్ల పరిష్కారం, హైకోర్టు అనుసరిస్తున్న కంపల్సరీ రిటైర్మెంట్ విషయాల్లో ఇతర న్యాయాధికారుల నుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంతోనే ఆయన రాజీనామా చేశారని మరికొందరు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
మక్కా మసీదు పేలుళ్ల కేసు కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: మక్కా మసీద్ బాంబు పేలుళ్ల కేసును కొట్టివేస్తూ నాంపల్లి కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. నిందితులపై నేరారోపణలు నిరూపించటంలో ప్రాసిక్యూషన్ విఫలమైందన్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు.. వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో 11 ఏళ్ల సుదీర్ఘ దర్యాప్తు చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) 226 మంది సాక్ష్యులను విచారణ చేపట్టింది. ఛార్జీషీట్లో 10 మంది పేర్లను చేర్చగా.. వారిలో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ కేవలం రెండే నిమిషాల్లో కోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఐదుగురు నిందితులు స్వామి అసిమానంద, భరత్, దేవెందర్ గుప్తా, రాజేందర్, లోకేశ్ శర్మలలో ఏ ఒక్కరిపైనా ఆరోపణలను ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోయింది. దీంతో వారిని నిర్దోషులుగా ప్రకటించింది. అయితే మిగతా వారిపై మాత్రం ఛార్జీ షీట్ కొనసాగుతుందని కోర్టు(A-5.సునీల్ జోషి మృతి చెందారు) తెలిపింది. 2007 మే 18 తేదీన మధ్యాహ్నం మక్కా మసీద్‌లో ప్రార్ధన సమయంలో టిఫిన్ బాంబు ద్వారా పేలుడు సంభవించింది. పేలుడు దాటికి 9 మంది చనిపోయారు. తర్వాత చెలరేగిన అల్లర్లను నియంత్రించే క్రమంలో పోలీసులు కాల్పులు జరపగా.. ఐదుగురు మృతి చెందారు. అల్లర్లలో 58 మందికి గాయాలయ్యాయి. ఇక మక్కా బ్లాస్ట్ కేసులో 10 మంది నిందితులను గుర్తించిన ఎన్ఐఏ.. ఐదుగురి పేర్లను మాత్రం చార్జీషీట్లో చేర్చింది. హిందూ దేవాలయాల్లో బాంబులు పేలుస్తున్నారన్న ఆరోపణలకు ప్రతీకారంగానే నిందితులు ఈ దాడులకు పాల్పడినట్లు ఎన్ఐఏ కోర్టుకి తెలిపింది. తీర్పు నేపథ్యంలో హైదరాబాద్‌లో అలర్ట్ ప్రకటించిన పోలీస్ శాఖ.. పాతబస్తీ, నాంపల్లి కోర్టు దగ్గర ప్రత్యేక బలగాలతో భారీ భద్రత కట్టుదిట్టం చేసింది. మే 18, 2007 : మక్కా మసీదులో పేలుడు.. 9 మంది మృతి, 58 మందికి గాయాలు. 29 డిసెంబర్ 2007: గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో సునీల్ చనిపోయాడు. జూన్ 2010: ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జీషీట్లో సునీల్ జోషి పేరు నిందితుడిగా ఉంది నవంబర్ 19, 2010: హిందూ గ్రూప్ అభినవ్ భారత్ సభ్యుడు జతిన్ ఛటర్జీను (స్వామి అసిమానాంద) సీబీఐ అరెస్ట్ చేసింది. కొద్దిరోజులకే దేవేందర్ గుప్తా, లోకేష్ శర్మ అనే మరో ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేసింది. డిసెంబర్ 18, 2010: మక్కా మసీదు పేలుడు ఘటనలో తన పాత్రను అసీమానంద అంగీకరించాడు. 2011 డిసెంబర్ 3: గుజరాత్ వల్సాద్కు చెందిన భారత్ మోహన్‌లాల్ రతేశ్వర్ అలియాస్ భారత్‌భాయి అరెస్ట్. ఏప్రిల్ 2011: కేసు విచారణ సీబీఐ నుంచి జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ)కి బదిలీ అయ్యింది. 2013 మార్చి 2: మధ్యప్రదేశ్‌కు చెందిన రాజేందర్ చౌదరి అలియాస్ సముందర్ అరెస్ట్ మార్చి 23, 2017: హైదరాబాద్ కోర్టు అసిమానందకు బెయిల్ మార్చి 31, 2017: ఏడేళ్ల తర్వాత అసిమానంద చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యాడు ఏప్రిల్ 16, 2018: ఈ కేసులో ఐదుగురు నిందితులను ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది ఎన్ఐఏ సమర్పించిన జాబితాలో నిందితులు పేర్లు... A-1. దేవేందర్ గుప్తా A-2.లోకేష్ శర్మ, A-6.స్వామి ఆసిమానందా A-7.భరత్ భాయ్ A-8.రాజేందర్ చౌదరి పరారీలో ఉన్న వారు. A-3.సందీప్ డాంగే A-4.రామచంద్ర కళా సంగ్రా A-10.అమిత్ చౌహన్. ఈ కేసులో చనిపోయిన వ్యక్తి. A-5.సునీల్ జోషి. ఈ కేసులో బెయిల్ పై ఉన్న వాళ్లు A-6 .స్వామి ఆసిమానందా A-7.భరత్ భాయ్. A-9.తేజ్ పరమార్ -
మరి మగవారి గౌరవం మాటేంటి?
న్యూఢిల్లీ : ఓ అత్యాచార కేసులో వాదనల తీర్పు సందర్భంగా ఢిల్లీ న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మహిళల గౌరవ, హక్కులు, ప్రతిష్ట కోసం పోరాటాలు చేసే వాళ్లు.. మరి మగవాళ్ల విషయంలో ఆ పని ఎందుకు చెయ్యరంటూ ప్రశ్నించింది. ‘‘ఇక ఇప్పుడు మగవాళ్ల కోసం పోరాడాల్సిన తరుణం వచ్చేసింది’’ అని పోస్కో యాక్ట్ కోర్టు న్యాయమూర్తి నివేదిత అనిల్ శర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. 20 ఏళ్ల క్రితం నమోదైన ఓ అత్యాచార కేసులో నిందితుడి నిర్దోషిగా రుజువు కావటంతో కోర్టు అతన్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి తీర్పునిస్తూ... అత్యాచార కేసుల్లో చేసే తప్పుడు ఆరోపణలు మగవారికి చాలా నష్టం చేకూరుస్తున్నాయన్నారు. కొందరు మహిళలు తమకు రక్షణగా ఉన్న చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆమె చెప్పారు. వాటిని (ఆరోపణలు) ఎదుర్కుని.. తమ నిర్దోషిత్వం నిరూపించుకుని బయటకు వచ్చినప్పటికీ.. సమాజం దృష్టిలో మాత్రం అతనిపై అత్యాచార ఆరోపితుడిగానే ముద్ర పడిపోతుందని.. ఆ అవమానం అతను జీవితాంతం మోస్తున్నాడని ఆమె అన్నారు. మహిళ అత్యాచారానికి గురైన సమయంలో ఆమెకు అండగా ప్రజలు, మహిళా సంఘాలు పోరాటాలు చేస్తుంటాయి. నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తుంటాయి. అలాంటి కేసుల్లో బాధిత వ్యక్తి అమాయకుడని ఆధారాలు ఉన్నప్పుడు వారు మౌనంగా ఎందుకు ఉంటున్నారు? మద్దతుగా ఎందుకు నిలవటం లేదు? అని ప్రశ్నించారు. మగవారి గౌరవ, మర్యాదలు కాపాడాల్సిన బాధ్యత ఉంటుందని, మహిళా సంఘాలు కూడా అందుకు ముందుకు రావాలని.. అవసరమైతే న్యాయస్థానాలు జోక్యం కల్పించుకుని బాధిత వ్యక్తులకు పరిహారం ఇప్పించేలా చూడాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 18, 1997న పట్టపగలే ఇంట్లో ఒంటరిగా ఉన్న తనను అపహరించి మరీ అత్యాచారం చేశాడంటూ ఓ మైనర్ ఫిర్యాదుతో యువకుడిని అరెస్ట్ చేశారు. అయితే ఆమె ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని, పైగా మెడికల్ నివేదికలు కూడా ఆమెపై లైంగిక దాడి జరగలేదనే తేల్చాయి. దీంతో అతన్ని నిరపరాధిగా తేలుస్తూ న్యాయస్థానం విడుదల లభించింది. -
దేశాన్ని వణికించిన కేసు.. తేలిపోయింది
మోగా: ఆ యువతికి 14 ఏళ్లు. బస్సు ఎక్కిన ఆమెపై బస్సు డ్రైవర్ అందులోని అతడి సహయకులు లైంగిక వేధింపులకు పాల్పడి బస్సు నడుస్తుండగా అందులో నుంచి తోసేయడంతో తీవ్ర గాయాలై చనిపోయింది. 2015లో జరిగిన ఈ ఘటనపట్ల దేశ వ్యాప్తంగా పెద్ద చర్చనే జరిగింది. బాధితురాలు దళిత బాలిక కావడంతో రాజకీయ నాయకులు తామేం తక్కువ కాదని విస్తృతంగా ప్రకటనలు చేస్తూ అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. కానీ, చివరకు ఈ సంచలన కేసు తేలిపోయింది. ఆధారాల్లేవని కోర్టు నిందితులను నిర్దోషులుగా వదిలేసింది. దీంతో తన కూతురును చంపేశారంటూ ఫిర్యాదు చేసుకున్న ఆ కన్నతల్లే విరోధిగా మిగిలిపోయింది. మోగాలో ఏప్రిల్ 29, 2015న ఓ దళిత బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి అనంతరం ఆ బాలికను ఆమెతోపాటు తల్లిని కూడా బస్సులో నుంచి తోసేసిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమె సోదరుడు కూడా బస్సులోనే ఉన్నాడు. అయితే, బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోస్కో చట్టం కింద బస్సు డ్రైవర్ రంజీత్ సింగ్, కండక్టర్ సుఖ్విందర్సింగ్, మరో ఇద్దరు సహాయకులు అమర్‌రామ్, గుర్దీప్ సింగ్ అనే వ్యక్తులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, తప్పు చేసిన వారిని గుర్తించలేకపోవడం, ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడం వంటి కారణంగా వారందరిని కూడా జిల్లా కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. కాగా, ఈ ఘటన సమయంలో బాధితురాలి తండ్రికి కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని నాటి శిరోమణి అకాళీదల్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, అతడు చెప్పులు అరిగేలా తిరిగినా అతడికి ఇప్పటి వరకు ఉద్యోగం కాదు కదా చిన్న సహాయం కూడా అందలేదు. -
జాధవ్ ఎప్పటికీ విడుదల కాలేడు
ఇస్లామాబాద్ : గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌ను నిర్దోషిగా విడుదల చేసే ప్రసక్తే లేదని పాకిస్తాన్ న్యాయవాది ఖావర్ ఖురేషీ స్పష్టం చేశారు. కుల్‌భూషణ్ జాధవ్ కేసుకు సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో పాకిస్తాన్ తరఫున ఖావర్ ఖురేషీ వాదనలు వినిపించారు. అయితే అక్కడ పాక్‌కు చుక్కెదురు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖావర్ ఖురేషీ మాట్లాడుతూ... జాధవ్ కేసు చాలా స్పష్టమైందని, అతడిని ఎన్నటికీ నిర్దోషిగా విడుదల చేయడం జరగదని నేషన్ వార్త పత్రికిను ఉటంకిస్తూ అన్నారు. అలాగే అంతర్జాతీయ న్యాయస్థానం అటు జాదవ్‌ను నిర్దోషిగా తేల్చలేదనీ, ఇటు విడుదల చేయలేదనీ వివరించారు. ఆయన సోమవారమిక్కడ పాకిస్తాన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. బాధ్యతాయుతంగా ప్రవర్తించిన పాకిస్తానీ అధికారులకు పాక్ మీడియా గౌరవించాలని అన్నారు. గూఢచర్యం ఆరోపణలపై పాకిస్తానీ మిలటరీ కోర్టు జాదవ్‌కు ఉరిశిక్ష విధించగా..అంతర్జాతీయ న్యాయస్థానం ఈ తీర్పుపై స్టే ఇచ్చిన విషయం తెల్సిందే. కాగా జాధవ్ కేసులో ఐసీజేలో ఎదురైన పరాభవంతో పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రతిపక్షాలు, మీడియాతో పాటు న్యాయ నిపుణులు సైతం ఈ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరించిన తీరును తప్పుపడుతున్నారు. దీంతో ఐసీజేలో జాధవ్ కేసు కోసం కొత్త న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేయాలని పాక్ సర్కారు నిర్ణయించింది. మరోవైపు జాధవ్‌కు పాక్ సైనిక కోర్టు విధించిన ఉరిశిక్షను అమలు చేయడంలో కింది కోర్టు విఫలమైందని ఇకనైనా ఆలస్యం చేయకుండా జాదవ్‌ను తక్షణమే ఉరితీయాంటూ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత, సెనేట్ మాజీ చైర్మన్ ఫరూక్ నయీక్ తరఫున న్యాయవాది ముజామిల్ అలీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
ఇది దేవుడిచ్చిన తీర్పు: సత్యంబాబు
రాజమహేంద్రవరం క్రైం/విజయవాడ: ‘‘ఇది దేవుడిచ్చిన తీర్పు. తొమ్మిదేళ్ల నిరీక్షణ ఫలితంగా న్యాయమే గెలిచిం ది’’ అని పిడతల సత్యంబాబు అన్నాడు. ఆయేషామీరా హత్యకేసులో నిర్దోషిగా తేలిన సత్యంబాబు రాజమ హేంద్రవరం సెంట్రల్ జైలునుంచి ఉద్విగ్న పరిస్థితుల మధ్య ఆదివారం ఉదయం విడుదల య్యాడు. సత్యంబాబును నిర్దోషిగా పేర్కొంటూ హైకోర్టు శుక్రవారమే తీర్పు ఇచ్చినప్పటికీ, సంబంధిత ఉత్తర్వులు జైలు అధికారులకు అందడంలో తీవ్రజాప్యం చోటు చేసుకుంది. మాల సంక్షేమ సంఘం ఉద్యోగుల విభాగం నాయకుడు చెట్లపల్లి అరుణ్‌కుమార్ కోర్టు ఉత్తర్వులను హైదరాబాద్ నుంచి ఓ ప్రైవేటు బస్సులో ఆదివారం ఉదయం 8.05 గంటలకు రాజమహేంద్రవరం తీసుకొచ్చారు. ఉత్తర్వులను జైళ్లశాఖ డీఐజీ చంద్రశేఖర్ పరిశీలించి, ఉదయం 8.15 గంటలకు జైలు అధికారులకు అందజేశారు. అన్ని లాంఛ నాలూ పూర్తయ్యాక సత్యంబాబును జైలు నుంచి విడుదల చేశారు. అనంతరం సత్యం బాబు మాట్లాడుతూ తల్లి రుణం తీర్చుకుంటానని, చెల్లెలికి వివాహం చేయాల్సి ఉందని తెలిపాడు. తాను జైలుపాలవడంతో తన కుటుంబం దుర్భర పరిస్థితులను ఎదుర్కొందని ఆవేదన చెందాడు. కుమార్తెను పోగొట్టుకున్న ఆయేషా మీరా తల్లిదండ్రులకు కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని కోరాడు. -
నర్గీస్ కే నిర్దోషి
♦ బాలుని మృతి కేసు నుంచి ♦ ఇరానీ మహిళకు విముక్తి రాయగడ: ఓ బాలుని మృతి కేసులో ఇరాన్ దేశానికి చెందిన మహిళకు విముక్తి కలిగింది. ఈ కేసుకు సంబంధించి శనివారం ఏడీజే కోర్టు తీర్పు వెలువరించడంతో నర్గీస్ కే ఆస్తారి నిర్దోషిగా విడుదలయ్యారు. వివరాలు ఇలావున్నాయి. రాయగడ జిల్లా ముకుందపూర్‌లో ఓ స్వచ్ఛంద సేవా సంస్థలో ఇరాన్ దేశానికి చెందిన నర్గీస్ కే ఆస్తారి పనిచేస్తున్నారు. బ్రిటీష్ చార్టిబుల్ ట్రెస్టులో ఉంటున్న ఓ బాలుని మృతి కేసులో ఈమె నిందితురాలిగా ఆపాదించబడి దోషిగా నిర్ణయించడంతో జైలు కెళ్లారు. ఈ కేసు మొదట సబ్ జడ్జికోర్టులో విచారణ కాగా అప్పట్లో అధికారుల విచారణ ఆధారంగా సబ్ జడ్జి నర్గీస్‌ను దోషిగా గుర్తించి రూ. 3 లక్షల జరిమానా,సంవత్సరం జైలు శిక్షను విధించారు. దీనిని సవాల్ చేస్తూ నర్గీస్ కే ఆస్తారి ఏడీజే కోర్టులో పిటీషన్ వేయగా తుది తీర్పులో నిర్దోషిగా విడుదలయ్యారు. కాగా ఆమె గత రెండు సంవత్సరాలుగా పడిన ఇబ్బందుల దృష్ట్యా నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం వద్ద కోరవచ్చునని తీర్పు ఇచ్చారు. ఆస్తారి(28)పై 2014లో కేసు నమోదు అయింది. ముకుందపూర్‌లోని ప్రిషాన్ ఫౌండేషన్‌కు చెందిన స్వచ్ఛంద సేవా సంస్థలో పనిచేశారు. 2014లో నాగావళి నదికి ప్రిషాన్ ఫౌండేషన్ పిల్లలు పిక్నిక్కు వెళ్లారు. అందులో ఆరుగు పిల్లలు నదిలో స్నానం చేస్తుండగా ఆసీంజిలకర్ర అనే బాలుడు నదిలో కొట్టుకుపోగా మిగిలిన ఐదుగురు రక్షించబడ్డారు. 3.11.2014న ఈ ఘటన జరిగింది. దీనిపై బాలుని తల్లిదండ్రులు కలెక్టర్, ఎస్పీ, ఒడిశా మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కేసును కోర్టులో విచారణ జరుపగా నర్గీస్కే ఆస్తారి నిర్లక్ష్యం కారణంగా బాలుడు మృతి చెందినట్లు అప్పట్లో సబ్ జడ్జి తీర్పుఇచ్చారు. ఈ మేరకు ఆమె జైలు శిక్ష అనుభవించారు. అయితే తుది తీర్పు ఆమెకు అనుకూలంగా వచ్చి నిర్దోషిగా విడుదలయ్యారు. -
జోద్పూర్ కోర్టు తీర్పు : సల్మాన్ ఖాన్ నిర్దోషి
జోద్పూర్ : లైసెన్స్ గడువు ముగిసిన తరువాత ఆయుధాలు కలిగి ఉండటం, వినియోగించడంపై ఆరోపణలను ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్‌కు ఊరట లభించింది. దాదాపు 18 సంవత్సరాలుగా సల్మాన్ వెంటాడుతున్న ఆయుధాల కేసు నుంచి విముక్తి లభించింది. 1998 అక్టోబర్‌లో జోద్‌పూర్‌లో అనుమతి లేకుండా ఆయుధాలను వినియోగించటంతో పాటు వన్యప్రాణులను వేటాడినందుకు సల్మాన్‌పై నాలుగు కేసులు నమోదయ్యాయి. వీటిలో ఇప్పటికే రెండు కేసుల్లో సల్మాన్ నిర్దోషిగా నిరూపణ కాగా తాజాగా ఆయుధాల కేసు నుంచి కూడా సల్మాన్‌కు విముక్తి లభించింది. బుధవారం ఈ కేసులో తుది తీర్పు వెల్లడించిన జోద్పూర్ జిల్లా కోర్టు సల్మాన్‌ను నిర్దోషి అంటూ తీర్పు వెల్లడించింది. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా సల్మాన్ పై నమోదైన అభియోగాలను తోసిపుచ్చిన కోర్టు. -
ఏసీఆర్ రహస్యాల రద్దు..!
విశ్లేషణ మిలిటరీ సర్వీసులో తప్ప మరే ఇతర సర్వీసులోనైనా ఏసీఆర్ వ్యాఖ్యలను ఆ ఉద్యోగికి తెలపాల్సిందే. అలాంటి అభిప్రాయాలు రాయడంలో ఉద్దేశం ఉద్యోగికి తన పనితీరు గురించి తెలియజేసి మార్చుకునే అవకాశం కలిగించడమే. బ్రిటిష్ పాలనలో కింది ఉద్యోగులపైన ఆధిపత్యం కోసం అధికారుల చేతికి ఇచ్చిన అంకుశమే ఏసీఆర్. ఇవి రహస్య నివేది కలు. ప్రతి ఏడాది ఈ నివేదిక ఆధారంగా ఉద్యోగులకు పదోన్నతి ఇస్తారు లేదా ఇవ్వరు. ఉద్యోగి ప్రగతిని ఈ నివేదికలే నిర్దేశిస్తాయి. పై అధికారి తన ఇష్టం వచ్చిన విధంగా వ్యాఖ్యానాలు రాయవచ్చు. అది రహస్యం. ఎవరి గురించి రాసారో వారికి చెప్పరు. 1940 లలో ఆరంభించిన ఈ అక్రమ విధానాన్ని స్వతంత్ర భారతంలో 2008 దాకా కొనసాగించారు. దీన్ని కూకటి వేళ్లతో తొలగించిన శక్తి ఎవరిదంటే ఆర్టీఐది. సమాచార హక్కు చట్టం వచ్చిన తరువాత వందలాది మంది ఏసీఆర్లు వెల్లడి చేయాలని కోరారు. కాని అది రహస్యమనీ, ఇవ్వబోమని తిరస్కరించారు. దురదృష్టవశాత్తూ చాలా సమాచార కమిషనర్లు కూడా ఇవ్వరాదని తీర్మానించారు. ఇదివరకు ఉన్నతాధికారులే కమిషనర్లు కావడం, ఏసీఆర్లే ఉద్యోగులను బాధ్యతాయుతంగా పనిచేసేట్టు చేసే సాధనాలని నమ్మడం ముఖ్య కారణం. 1988 (సప్లిమెంట్) ఎస్సీసీ 674 విజయ్ కుమార్ వర్సెస్ మహారాష్ట్ర కేసులో సుప్రీం కోర్టు.. ఉద్యోగికి తెలియజేయని ఏసీఆర్ ద్వారా అతని ప్రయోజనాలను దెబ్బతీయకూడదని తీర్పు చెప్పింది. గుజరాత్ వర్సెస్ సూర్యకాంత్ చునిలాల్ షా 1999(1) ఎస్సీసీ 529 కేసులో వ్యతిరేక వ్యాఖ్యలు తెలియజేయకపోతే ఉద్యోగి తనను ఏ విధంగా సవరించుకుంటాడు? కనుక వ్యతిరేక వాఖ్యలు ఏమిటో చెప్పాలి, వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించాలని వివరించింది. దేవదత్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2008(8) ఎస్సీసీ 725 కేసులోనూ సుప్రీంకోర్టు ఏసీఆర్‌లో ఈ న్యాయాన్ని పునరుద్ఘాటించింది. జస్టిస్ మార్కండేయ కట్జూ ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం పక్షాన తీర్పు ప్రకటిస్తూ ఒక ఆఫీసు మెమొరాండం ద్వారా ఆర్టికల్ 14ను భంగపరచడం చెల్లదని స్పష్టం చేశారు. ఏసీఆర్‌లో అభిప్రాయాలు రాయడం ఏకపక్షంగా పై అధికారి నిర్ణయించడమే అవుతుంది. మిలిటరీ సర్వీసులో తప్ప మరే ఇతర సర్వీసులోనైనా ఏసీఆర్ వ్యాఖ్యలను ఆ ఉద్యోగికి తెలియజేయాల్సిందే. అసలు ఆ విధంగా అభిప్రాయాలు రాయడంలో ఉద్దేశం ఉద్యోగికి తన పనితీరు గురించి తెలియజేసి మార్చుకునే అవకాశం కలిగించడమే అయితే అతనికి తెలియజేయనపుడు ఆ లక్ష్యం ఏ విధంగా నెరవేరుతుంది? ఏసీఆర్ను ఉద్యోగికి ఇవ్వకపోవడం ఏకపక్షనిర్ణయం అవుతుందని, అది ఆర్టికల్ 14కు విరుద్ధమని సుప్రీంకోర్టు వివరించింది. అనుకూలమో ప్రతి కూలమో ప్రతి ఏసీఆర్నూ వివరించాల్సిందే. గుడ్, ఫెయిర్, యావరేజ్ అనే వ్యాఖ్యలు వెరీగుడ్, అవుట్ స్టాండింగ్లతో పోల్చితే తక్కువ కనుక ప్రతికూలమే. తనకు గుడ్ ఎందుకిచ్చారు వెరీగుడ్ ఎందుకు ఇవ్వలేదు అని తెలుసుకునే అవకాశం ఉద్యోగికి ఉండాలి. ముఖ్యంగా ఏసీఆర్ వల్ల ప్రయోజనాలు ఉన్నపుడు మంచి చెడుతో సంబంధం లేకుండా ఏసీఆర్‌ల గురించి తెలియజేయవలసిందే అని సుప్రీంకోర్టు నిర్ధారించింది. తెలియజేయడం, ప్రతికూల వ్యాఖ్యలను వ్యతి రేకంగా వాదించే అవకాశం కల్పించడం సహజ న్యాయసూత్రాలు కనుక అందుకు అవకాశం ఇవ్వని ఏ రూల్ అయినా ఆఫీసు మెమొరాండం ఓఎం అయినా ఆర్టికల్ 14 ప్రకారం చెల్లబోవని న్యాయమూర్తి వివరించారు. కొందరు సమాచార కమిషనర్లు, ఏసీఆర్లు రహస్యం కాదని, ఇచ్చి తీరాలని తీర్పులు చెప్పారు. రహస్యాన్ని సమర్థించే రూల్స్ ఆఫీసు మెమొరాండంలు ఆర్టీఐ వచ్చిన తరువాత సెక్షన్ 22 ప్రకారం చెల్లబోవని, సమాచార హక్కుతో విభేదించే రహస్య చట్టం నియమాలు కూడా చెల్లవని కమిషన్ తీర్పులను సుప్రీంకోర్టు తీర్పు బలపరిచింది. కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అని పిలుస్తున్న ఈ రహస్య నివేదికలు రద్దయినాయి. వాటి స్థానంలో వార్షిక పని తీరు పరిశీలనా నివేదికలు యాన్యువల్ పర్ఫార్మెన్స అప్రయిజల్ రిపోర్ట్స (ఏపీఏఆర్)లను ప్రవేశ పెట్టారు. వాటిని ఉద్యోగికి ఇవ్వాలని, వారు నివేదికలో మార్పులను కోరుతూ వాదించే అవకాశం, నివేదికలను అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఇవ్వాలని ఉద్యోగులు, శిక్షణ పింఛన్ల మంత్రిత్వ శాఖ నిబంధనలను తయారుచేసింది. వారి వెబ్సైట్:http://persmin.gov.inలో వివరాలు ఉంచింది. ఇప్పుడు ఆర్టీఐ దరఖాస్తులు, పిల్లు వేయనవసరం లేకుండానే సహజంగా ఏపీఏఆర్ను సంబంధిత ఉద్యోగికి ఇవ్వవలసిందే. బ్రిటిష్ కాలంనుంచి మొదలై స్వతంత్ర భారతంలో కూడా కొనసాగిన ఈ దుర్మార్గం ఆర్టీఐ దాడితో, సుప్రీంకోర్టు తీర్పుతో అంతమైంది. ఇది పరిష్కారం లేని అన్యాయం. పై అధికారులకు కింది ఉద్యోగులను బానిసలుగా మార్చే దుర్మార్గం. అధికార రహస్యం. రహస్యాల వల్ల కలిగే అన్యాయాలను గురించి ప్రశ్నించే అవకాశమే లేకపోవడం అసలైన అన్యాయం. బ్రిటిష్ చట్టాలు నియమాల అన్యాయాల గురించి మాట్లాడడమేగాని వాటిని తొలగించే ప్రయత్నాలు చేయకపోవడం, అధికారులు బ్రిటిష్ చట్టాల నుంచి ప్రయోజనాలు ఆశించి వాటిని వాడుకోవడం ఒక దౌర్భాగ్యం. ఆర్టీఐ సాధించిన ఒక ఘన విజయం ఎసిఆర్ల రద్దు అనవచ్చు. పాత ఏసీఆర్లలో ప్రతికూల వ్యాఖ్యలను ప్రశ్నించే అవకాశం ఇప్పటికీ లేదు. ఈ అన్యాయాన్ని కూడా పరిశీలించే అవసరం ఉంది. వెకై మల్ వర్సెస్ కెవిఎస్ CIC/C-C-/A-/2015/002083 SA కేసులో కమిషన్ 1.1.2016లో ఇచ్చిన తీర్పు ఆధారంగా) మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
ఇరోం షర్మిల నిర్దోషి
ఇంపాల్: మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం షర్మిల(44)ను నిర్దోషిగా పరిగణిస్తూ మణిపూర్ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. ఆమె మణిపూర్‌లో సైనిక చట్టాలకు వ్యతిరేకంగా 16 ఏళ్లు నిరశన దీక్షను కొనసాగించారు. ఆమెపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 309 ప్రకారం ఆత్మహత్మాయత్నం కేసును నమోదు చేశారు. దీంతో రాజకీయ పార్టీ స్థాపనకు తనకు మార్గం సుగమం అయిందని బుధవారం కోర్టుకు హాజరైన షర్మిల పేర్కొన్నారు. ఈనెలలో రాజకీయపార్టీ ఏర్పాటు చేస్తానని ఆమె ప్రకటించారు. రానున్న ఏడాది మణిపూర్ ఎన్నికల్లో పోటీ చేస్తానని, సీఎం కావాలనే తన మనసులోని మాటను గతంలోనే షర్మిల బయటపెట్టారు. మణిపూర్‌లో సైనిక చట్టాలకు వ్యతిరేకంగా 2000 సంవత్సరంలో షర్మిల ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈ యేడాది అగష్టు 9 దీక్షను విరమించారు. -
'నిర్దోషులుగా తేలడం సంతోషకరం'
కోల్‌కతా: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో క్రికెటర్లు నిర్దోషలుగా తేలడం సంతోషకరమని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో కేరళ పేసర్ శ్రీశాంత్ సహా 16 మంది క్రికెటర్లను ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. శ్రీశాంత్ మళ్లీ టీమిండియాలోకి వస్తాడా అన్న ప్రశ్నకు గంగూలీ.. అతనిపై అభియోగాలను కోర్టు కొట్టేసిందని, బీసీసీఐకి అభ్యంతరం ఉండకపోవచ్చని సమాధానమిచ్చారు. కాగా కోర్టు తీర్పుపై స్పందించేందుకు టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ శ్రీకాంత్ తిరస్కరించాడు. -
ప్రతిభ, వివాదాలకు కేరాఫ్ శ్రీ
ప్రతిభ, సంచలనాలు, వివాదాలు, విమర్శలు.. వీటన్నింటికీ కేరాఫ్ అడ్రెస్ కేరళ పేసర్ శ్రీశాంత్. భారత క్రికెట్లోకి ఓ మెరుపులా వచ్చాడు. అనతికాలంలోనే టాప్ బౌలర్ల సరసన చేరాడు. టీమిండియాకు ఓ ప్రతిభావంతుడైన పేసర్ దొరికాడంటూ క్రీడాపండితులతో ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత ఫిట్నెస్ సమస్యలు, బౌలింగ్‌లో వాడి తగ్గడం, వివాదాలు, చివరకు స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీశాంత్ కెరీర్‌ను అర్ధంతరంగా ముగించాల్సి వచ్చింది. కష్టకాలంలో స్నేహితురాలు భువనేశ్వరి అండగా నిలిచి శ్రీని పెళ్లి చేసుకుంది. ఈ మధ్యకాలంలో అతనికి సినిమా అవకాశాలు వచ్చాయి. తాజాగా ఢిల్లీ కోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో 32 ఏళ్ల శ్రీశాంత్ మళ్లీ క్రికెట్ ఆడుతానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. 1983లో కేరళలో శ్రీశాంత్ జన్మించాడు. శ్రీ కుటుంబ సభ్యులకు సినీ రంగంతో సంబంధమున్నా.. అతను మాత్రం క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. పదేళ్ల క్రితం 2005 అక్టోబర్‌లో అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ మరుసటి సంవత్సరం టెస్టు క్రికెట్లోనూ అరంగేట్రం చేశాడు. 53 వన్డేలాడిన శ్రీ 75 వికెట్లు పడగొట్టాడు. ఇక 27 టెస్టులాడి 87 వికెట్లు తీశాడు. కేరళ రంజీ జట్టుకు, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కెరీర్ ఆరంభంలో శ్రీశాంత్ బౌలింగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ఫిట్నెస్ సమస్యలు రావడంతో బౌలింగ్‌లో పస తగ్గింది. ఇక ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్‌తో గొడవ పడటం వివాదాస్పదంగా మారింది. భజ్జీ చెంపదెబ్బ కొట్టడంతో శ్రీ స్టేడియంలోనే భోరున ఏడ్చేశాడు. 2013లో శ్రీశాంత్ ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్ట్ కావడంతో కెరీర్‌ను అర్ధంతరంగా ఆపేయాల్సివచ్చింది. ఆ ఏడాది మే 13న ఢిల్లీ పోలీసులు ముంబైలో అతడ్ని అరెస్ట్ చేశారు. ఐపీఎల్‌ను కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్‌తో సహా 16 మంది క్రికెటర్లపై అభియోగాలు వచ్చాయి. బీసీసీఐ శ్రీశాంత్‌పై జీవితకాలం నిషేధం విధించింది. దీంతో అప్పటి నుంచి క్రికెట్‌కు పూర్తిగా దూరమయ్యాడు. స్నేహితురాలు భువనేశ్వరిని పెళ్లి చేసుకన్న శ్రీశాంత్‌కు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ఇప్పుడు నిర్దోషిగా బయటపడటంతో మళ్లీ క్రికెట్లో వస్తానని శ్రీశాంత్ అన్నాడు. బీసీసీఐ కూడా అతనిపై నిషేధం తొలగించే అవకాశముంది కాబట్టి లైన్ క్లియర్ కావచ్చు. రెండేళ్లు క్రికెట్‌కు దూరంగా ఉన్న 32 ఏళ్ల శ్రీశాంత్ ఫిట్నెస్ సాధించి, మునుపటి ఫామ్ చాటుతానని చెబుతున్నాడు. -
దేవుడి దయతో మళ్లీ క్రికెట్ ఆడుతా: శ్రీశాంత్
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిర్దోషిగా బయటపడినందుకు కేరళ పేసర్ శ్రీశాంత్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ కేసుకు సంబంధించి ఎవరిపైనా విమర్శలు, ఫిర్యాదు చేయదలచుకోలేదని, దేవుడి దయ వల్ల మళ్లీ క్రికెట్ ఆడుతానని శ్రీశాంత్ అన్నాడు. కోర్టు నిర్దోషిగా ప్రకటించగానే శ్రీశాంత్ సంతోషం పట్టలేక ఏడ్చేశాడు. ఈ విషయం విని తన కూతురు సంతోషిస్తుందని శ్రీశాంత్ అన్నాడు. బీసీసీఐ సౌకర్యాలను ఉపయోగించుకునేందుకు బోర్డు అనుమతిస్తుందని ఆశిస్తున్నానని, మళ్లీ ఫిట్నెస్ సాధిస్తానని చెప్పాడు. 'నాకు సినిమా చాన్స్‌లు వచ్చినా.. మొదటి ప్రాధాన్యం క్రికెట్‌కే. రేపు నేషనల్ స్టేడియానికి వెళును. నేను మళ్లీ పూర్తిగా ఫిట్నెస్ సాధించి, మునుపటి మాదిరి వాడిగా బౌలింగ్ చేస్తా. కష్టకాలంలో నాకు అండగా నిలిచిన భార్య, కూతురు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు' అని శ్రీశాంత్ అన్నాడు. -
స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్ సహా 16 మంది క్రికెటర్లకు విముక్తి
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో కేరళ పేసర్ శ్రీశాంత్‌తో పాటు అజిత్ చండీలా, అంకత్ చవాన్లకు విముక్తి లభించింది. శనివారం ఢిల్లీ కోర్టు ఈ ముగ్గురు ఆటగాళ్లతో సహా నిందితులుగా ఉన్న మొత్తం 16 మంది క్రికెటర్లను నిర్దోషులుగా ప్రకటించింది. ఆటగాళ్లపై నమోదు చేసిన అభియోగాలన్నింటినీ కొట్టేస్తూ జడ్జి నానా బన్సల్ తీర్పు వెలువరించారు. రెండేళ్ల క్రితం ఐపీఎల్‌ను కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు శ్రీశాంత్, చండీలా, చవాన్‌లను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ ఆటగాళ్లకు బుకీలతో సంబంధాలున్నాయని, లంచాలు తీసుకుని ఫిక్సింగ్‌కు పాల్పడ్డారంటూ అభియోగాలు నమోదు చేశారు. వీరితో పాటు రాజస్థాన్ క్రికెటర్లు అమిత్ సింగ్, సిద్ధార్థ్ త్రివేది, హర్మీత్ సింగ్ తదితరులను నిందితులుగా చేర్చారు. క్రికెటర్లతో పాటు మొత్తం 42 మందిపై అభియోగాలు నమోదు చేశారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్, ఇబ్రహీం, చోటా షకీల్ పేర్లను కూడా ఢిల్లీ పోలీసులు చేర్చారు. బుకీలతో ఫోన్లలో మాట్లాడిన సంభాషణలను ఢిల్లీ పోలీసులు రికార్డు చేశారు. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం బయటకురాగానే బీసీసీఐ నిందితులైన క్రికెటర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీరిని నిషేధించింది. కాగా క్రికెటర్లపై వచ్చిన ఆరోపణలను ఢిల్లీ పోలీసులు కోర్టులో రుజువు చేయలేకపోయారు. దీంతో క్రికెటర్లను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఇదిలావుండగా, స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసు విచారణకు సుప్రీం కోర్టు నియమించిన మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోధా సారథ్యంలోని కమిటీ చెన్నై, రాజస్థాన్ జట్లపై రెండేళ్ల కాలం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ సహ భాగస్వామి రాజ్ కుంద్రా, చెన్నై యజమాని శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్లు క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా జీవితకాలం వేటు వేసింది. రాజ్ కుంద్రా, మేయప్పన్ బెట్టింగ్‌కు పాల్పడినట్టు లోధా కమిటీ నిర్ధారించింది. -
అప్పీలు కలకలం
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితను నిర్దోషిగా పేర్కొంటూ వెలువడిన తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో కలకలం సృష్టించింది. ఆర్కేనగర్ ఉప ఎన్నిక ప్రచారంలో తలమునకలై ఉన్న అన్నాడీఎంకే శ్రేణులు పిడుగుపాటులాంటి ఈ సమాచారంతో ఆందోళనలో మునిగిపోయాయి. ఆస్తుల కేసులో కర్ణాటక ప్రత్యేక కోర్టు జయకు నాలుగేళ్ల జైలుశిక్ష, 100 కోట్ల జరిమానా విధించింది. ఈ తీర్పు కారణంగా జయ జైలు పాలుకావడమేగాక ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి పదవులను సైతం కోల్పోయారు. బెయిల్‌పై విడుదలైన జయ తనకు పడిన శిక్షపై అప్పీలు చేయగా కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా తీర్పు చెప్పింది. తాజా తీర్పుతో జయలలిత మళ్లీ ముఖ్యమంత్రి పదవిని సైతం చేపట్టారు. ముఖ్యమంత్రిగా జయ కొనసాగాలంటే ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉన్నందున ఆర్కేనగర్ సిద్ధమైంది. ఈనెల 5వ తేదీన జయలలిత నామినేషన్ దాఖలు చేస్తుండగా, 27వ తేదీన ఉప ఎన్నికపై పోలింగ్ జరగనుంది. అప్పీలుపై ఆందోళన: ఆస్తుల కేసులో ముద్దాయి నుంచి నిర్దోషిత్వంతో ముఖ్యమంత్రిగా మారిన జయలలితకు అప్పీలుతో కొత్త చిక్కువచ్చి పడింది. గత నెల 11వ తేదీన జయను నిర్దోషిగా పేర్కొంటూ తాజా తీర్పు వెలువడగానే అన్నాడీఎంకే సంబరాలు చేసుకుంది. అమ్మ వెంటనే సీఎం కాబోతున్నారని ఆనందపడిపోయింది. రాష్ట్రంలోని విపక్షాలు సైతం తీర్పును నిరసిస్తూ అదే స్థాయిలో విరుచుకుపడ్డాయి. అప్పీలుపై కర్నాటక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. జయ, కేంద్రప్రభుత్వాల మధ్య లోపాయికారి ఒప్పందం కారణంగానే ఇలాంటి తీర్పు వెలువడిందని విపక్షాలు విమర్శించాయి. జయ ఆస్తుల లెక్కలను తారుమారు చేసి నిర్దోషిగా చూపారని కోర్టు తీర్పునే దుయ్యబట్టాయి. కర్నాటక ప్రభుత్వ న్యాయవాది ఆచారి సైతం అప్పీలుకు వెళ్లాలని తమ ప్రభుత్వాన్ని కోరారు. తీర్పు అనంతరం ఉత్పన్నమైన పరిణామాలపై జయలలిత 12 రోజుల పాటూ న్యాయనిపుణులతో చర్చలు జరిపారు. న్యాయకోవిదుల నుండి ఎటువంటి హామీ వచ్చిందో ఏమో గత నెల 23 వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఇదిలా ఉండగా, అప్పీలుపై తర్జనభర్జనలు చేసిన కర్నాటక ప్రభుత్వం సోమవారం మంత్రి మండలి సమావేశాన్ని నిర్వహించి అప్పీలుకు వెళ్లాలని నిర్ణయించింది. జయ కేసులో కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలు వెళ్లాలని మంత్రి మండలి సమావేశాల్లో తీర్మానించినట్లు కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారం ప్రకటించారు. మరో రెండురోజుల్లో సుప్రీం కోర్టులో అప్పీలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్నాటక ప్రభుత్వం అప్పీలు చేయబోయే తరుణంలో జయ నామినేషన్‌కు సిద్ధం అవుతున్నారు. అప్పీలులో ఏఏ అంశాలు ప్రతిపాదిస్తారోనని రాష్ట్రంలో రసవత్తరమైన చర్చ సాగుతోంది. తాజాతీర్పు అమలుపై తక్షణం నిషేధం విధించాలని, మలి తీర్పు వెలువడే వరకు జయ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగకుండా ఉత్తర్వులు జారీచేయాలని కర్నాటక ప్రభుత్వం కోరిన పక్షంలో అన్నాడీఎంకే ప్రభుత్వం ఇరుకున పడుతుందని అంటున్నారు. కర్నాటక ప్రభుత్వం కోరిన రీతిలోనే సుప్రీం కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడిన పరిస్థితిలో అమ్మ మరోసారి పదవీచ్యుతులు అవుతారా అనే అంశం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. మరి అదే జరిగితే అమ్మ కోసమే సిద్ధం చేసుకున్న ఆర్కేనగర్లో ఉప ఎన్నిక మాటేమిటనే ప్రశ్న ఉత్పన్నమైంది. కర్నాటక ప్రభుత్వం అప్పీలును చట్టపరంగానే ఎదుర్కొంటామని అన్నాడీఎంకే నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నిక ప్రచారంలో ఉత్సాహంగా ఉన్న అన్నాడీఎంకే నేతలను అప్పీలు వ్యవహారం నిరుత్సాహానికి గురిచేసింది. సుప్రీం కోర్టు నుండి ఏక్షణాన ఎటువంటి సమాచారం వినాల్సి వస్తుందోననే ఆందోళన నెలకొని ఉంది. -
రేప్ కేసులో బంగ్లా క్రికెటర్‌కు విముక్తి
ఢాకా: అత్యాచార కేసులో బంగ్లాదేశ్ క్రికెటర్ రూబెల్ హొసేన్‌కు విముక్తి లభించింది. నటి నజ్నీన్ అక్తర్ దాఖలు చేసిన ఈ కేసును విచారించిన ఢాకా కోర్టు బుధవారం రూబెన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. రూబెల్‌పై నమోదైన అభియోగాలను కొట్టివేసింది. పెళ్లి పేరుతో నమ్మించి తనను అత్యాచారం చేశాడంటూ నజ్నీన్ రూబెల్‌పై కేసు పెట్టింది. ఇటీవల జరిగిన ప్రపంచ కప్ ముందు రూబెల్‌ను అరెస్ట్ చేశారు.తాజాగా కోర్టులో ఈ కేసు కొట్టివేయడంతో రూబెల్కు విముక్తి లభించినట్టయ్యింది. రూబెల్కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలూ లేవని పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు. -
‘అమ్మ’య్య
కోర్టు తీర్పుతో సంబరాలు ఆనంద డోలికల్లో అన్నాడీఎంకే రాష్ట్రమంతా పండుగ వాతావరణం 17వ తేదీలోగా సీఎంగా జయ చెన్నై, సాక్షి ప్రతినిధి : మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష, ఎమ్మెల్యే పదవి, తద్వారా సీఎంగా పదవీచ్యుతురాలు కావడం, ఎన్నికల్లో పోటీచేసే అర్హతను కోల్పోవడం అన్నాడీఎంకే శ్రేణులను తీవ్రంగా కలచివేసింది. కర్ణాటక ప్రత్యేక కోర్టు తీర్పు వెలువడిన గత ఏడాది అక్టోబరు నాటి నుంచి అన్నాడీఎంకే సంక్షోభంలో పడిపోయింది. జయ స్థానంలో ముఖ్యమంత్రిగా పన్నీర్‌సెల్వం పదవీ బాధ్యతలు చేపట్టినా డమ్మీ సీఎం అంటూ పార్టీ విమర్శల పాలైంది. కర్ణాటక హైకోర్టులో జయ అప్పీలు కేసు తీర్పు వెలువడే వరకు భరించలేని ఉత్కంఠను ఎదుర్కొన్న అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు, అభిమానులు సోమవారం ఉదయం 6 గంటలకల్లా రోడ్లపైకి చేరుకున్నారు. రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం, పోయస్ గార్డెన్‌లోని జయ నివాసం పరిసర ప్రాంతాలన్నీ జనసంద్రమైపోయాయి. జయను నిర్దోషిగా నిర్ధారిస్తూ కేసును కొట్టివేస్తున్నట్లు తీర్పు వెలవడగానే పార్టీలో ఆనందం మిన్నంటింది. పార్టీ కార్యాలయం, జయ నివాసం వద్ద అభిమానులు, పార్టీ నేతలు నృత్యాలు చేసి ఆనందించారు. వాహనాలను ఆపి మిఠాయిలు పంచిపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా కూడళ్లలో బాణ సంచా కాల్చి దీపావళిని తలపించారు. మహిళాభిమానులు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పోయస్ గార్డన్ ప్రవేశం వద్ద పోలీసులు బారీకేడ్లు వేసినా ప్రజలను అదుపుచేయలేకపోయారు. ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, కొందరు మంత్రులు జయను కలిశారు. మదురై ఆదీనం స్వామిసహా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అభిమానులు జయ ఇంటి వద్ద గుమికూడారు. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం బొకేలతో జయ నివాసం వద్ద బారులుతీరారు. జయ తీర్పు వెలువడే రోజైన సోమవారం సైతం రాష్ట్రంలో అనేక చోట్ల ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి వలర్మతి సోమవారం తీర్పు వెలువడక ముందే కలశపూజ నిర్వహించారు. తిరుపోరూరులోని దర్గాలో ప్రార్థనలు జరిపారు. జయ నివాసం పోయస్‌గార్డెన్‌కు సమీపంలోని గోపాలపురంలోని డీఎంకే అధినేతి కరుణానిధి ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తీర్పు తమ పార్టీకి ప్రతికూలం కావడంతో కరుణ, స్టాలిన్‌తో సీనియర్ నేతలు సమావేశమయ్యారు. అలాగే ఆళ్వార్‌పేటలోని స్టాలిన్ ఇంటి వద్ద, డీఎంకే కేంద్ర కార్యాలయం అన్నా అరివాలయం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు ఏర్పడకుండా 144 సెక్షన్ విధించాలని డీఎండీకే అధినేత విజయకాంత్ డీజీపీకి విజ్ఞప్తి చేశారు. సమత్తువ మక్కల్ కట్చి అధినేత శరత్‌కుమార్ జయకు శుభాకాంక్షలు చెప్పారు. -
17లోగా సీఎంగా పగ్గాలు!
జయలలితను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టేందుకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఈనెల 13న సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ భేటీ తర్వాత రెండు రోజుల్లో లేదా ఈనెల 17వ తేదీన జయలలిత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతకు ముందు పార్టీ శాసనసభా నేతగా ఎన్నుకునేందుకు అనుమతి కోరుతూ గవర్నర్ కె.రోశయ్యకు వినతిపత్రం సమర్పించనున్నారు. ఈనెల 16, 17 తేదీల్లో శుభఘడియలు ఉన్నందున జయ ప్రమాణ స్వీకారం అప్పుడే ఉంటుందని తెలుస్తోంది. -
జయకు మోదీ అభినందనలు
చెన్నై : అన్నాడీఎంకే అధ్యక్షురాలు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అభినందనలు వెల్లువెత్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు. అక్రమాస్తుల కేసులో జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోదీ ఫోన్ ద్వారా జయలలితను అభినందించినట్లు అన్నాడీఎంకే సోమవారం ఓ ప్రకటన చేసింది. జయను అభినందనలు తెలిపినవారిలో తమిళనాడు గవర్నర్ రోశయ్య కూడా ఉన్నారు. అలాగే కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, నజ్మా హెప్తుల్లా కూడా పురచ్చితలైవికి అభినందనలు తెలిపారు. ఇక ఎన్సీపీ నేత శరద్ పవార్, టీఎంసీ నేత జీ.కె.వాసన్, పలువురు పారిశ్రామికవేత్తలతో పాటు తమిళ చలనచిత్ర ప్రముఖులు కూడా జయను గ్రీట్ చేశారు. -
నేను మేలిమి బంగారాన్ని...
చెన్నై: న్యాయం గెలిచింది... నిజాలు నిగ్గు దేలి..మేలిమి బంగారంలా బైటపడ్డానని అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సంతోషం వ్యక్తం చేశారు. అక్రమాస్తుల కేసులో జయలలితతోపాటు మరో ముగ్గురిపై నమోదైన అభియోగాలన్నింటినీ కర్ణాటక హైకోర్టు రద్దు చేస్తూ తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యర్తలు సంబరాలు చేసుకున్నారు. కర్టాటక హైకోర్టు తీర్పు వెలువడిన అనంతరం కిక్కిరిసిన అభిమానులనుద్దేశించి ఆమె తొలిసారి మాట్లాడారు. న్యాయస్థానాన్ని పొగడ్తలతో ముంచెత్తిన ఆమె ...కోర్టు తీర్పు తనకు చాలా పూర్తి సంతృప్తి నిచ్చిందని వ్యాఖ్యానించారు. రాజకీయ శత్రువలు తనపై తప్పుడు కేసులు పెట్టారని, తాజా తీర్పుతో రాజకీయ ప్రత్యర్థుల కుట్ర భగ్నమైందన్నారు. ఇది తన వ్యక్తిగత విజయం కాదని, ధర్మమే గెలిచిందన్నారు. తాను ఏ తప్పు చేయలేదని రుజువైందన్నారు. ఇది తుది తీర్పు కాదని, కోర్టులపైన కోర్టులు ఉంటాయని, అది మనస్సాక్షిగా జయలలిత అభివర్ణించారు. తనకోసం ప్రార్థనలు చేసి ప్రతీ ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ట్రయిల్ కోర్టు తీర్పు తరువాత ఆత్మహత్య చేసుకున్న 237 మంది అభిమానులకు సంతాపం తెలిపారు. వాళ్లు కొంచెం సంయమనం పాటించి ఉంటే ఈనాటి సంబరాల్లో పాలు పంచుకునేవారన్నారు. కాగా అక్రమాస్తుల కేసులో ట్రయల్ కోర్టు తీర్పును కొట్టివేస్తూ కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఆర్ కుమారస్వామి జయలలితతో పాటు మరోముగ్గురిని నిర్దోషిగా ప్రకటించారు. దీంతో ఆమె మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యేందుకు కూడా మార్గం సుగమమైంది. సుదీర్ఘ కాలం పాటు జరిగిన జయలలిత అక్రమ ఆస్తుల కేసుపై హైకోర్టు తీర్పుతో దేశ వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. -
జయలలిత నిర్దోషి: హైకోర్టు
అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. అక్రమాస్తుల కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఆర్ కుమారస్వామి కొట్టేశారు. జయలలితపై నమోదైన అభియోగాలను కోర్టు కొట్టేసింది. దీంతో ఆమె మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యేందుకు కూడా మార్గం సుగమమైంది. 18 ఏళ్లుగా సాగిన అక్రమాస్తుల కేసులో జయలలితను దోషిగా తేలుస్తూ, నాలుగేళ్ల జైలుశిక్ష, వంద కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ గతంలో ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. దాంతో ఆమె పరప్పన అగ్రహార జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తర్వాత ఆమెకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు చేసింది. తర్వాత కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఇప్పుడు మొత్తం అక్రమాస్తుల కేసునే హైకోర్టు కొట్టేసింది. దాంతో అసలు ఈ కేసులో ఆమె నిర్దోషిగా బయటకు వచ్చినట్లయింది. ఫలితంగా.. ఆమె మరోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కేసులో ఆమెతో పాటు ఉన్న మరో ముగ్గురిని కూడా కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. శశికళ, సుధాకరన్, ఇళవరసిలకు కూడా ఈ కేసులో పెద్ద ఊరట లభించినట్లయింది. దీంతో తమిళనాడులో పండుగ వాతావరణం నెలకొంది. అన్నాడీఎంకే కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. -
నిరపరాధే.. కానీ పదకొండేళ్లు జైల్లో టార్చర్
అహ్మదాబాద్: పదకొండేళ్లపాటు తనను నానాయాతనలు పెట్టిన తీరును గాంధీనగర్ ఓ ఆలయంపై దాడి కేసులో అదుపులోకి తీసుకున్న వ్యక్తి మఫ్తీ అబ్దుల్ ఖయ్యూం వివరించాడు. ఆ విషయాలన్నింటిని 200 పేజీల పుస్తకంలో వివరించాడు. హిందీలో రాసిన ఈ పుస్తకానికి గ్యారా సాల్ సాలఖోన్ కే పిచే(పదకొండేళ్లు జైలు లోపల) అని పేరు పెట్టాడు. 2002లో గాంధీ నగర్లో అక్షర్‌థామ్ ఆలయం వద్ద పేలుళ్లు చోటుచేసుకున్నాయి. అదే సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోగా వారి వద్ద ఓ సూసైడ్ నోట్ కనిపించింది. దీని ఆధారంగా అక్కడే ఉంటున్న మఫ్తీ అబ్దుల్ ఖయ్యూంను గుజరాత్ పోలీసులు అరెస్టు చేసి జైలులో వేశారు. దాదాపు పదకొండు సంవత్సరాలపాటు అతడిని పరివిధాల ప్రశ్నించడం, భయాందోళనలు కలిగేలా టార్చర్ పెట్టడంలాంటివి చేశారు. ఈ కేసు పలు కోణాల్లో విచారణ పూర్తవుతూ వాయిదాలు పడుతూ సుప్రీంకోర్టు వరకు రాగా.. ఈ దాడికి మఫ్తీకి సంబంధం లేదని నిరపరాధి అని గత ఏడాది మే 17న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం తన ఇంటివద్దే ఉంటున్న ఆయన తనకు నష్ట పరిహారం ఇప్పించాలని, తనపై తప్పుడు కేసులు బనాయించి ఇన్నాళ్లపాటు ఇబ్బందిపెట్టిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ వాదనల సందర్భంగా ఢిల్లీ వెళ్తున్న ఆయన ఓ మీడియాతో మాట్లాడారు. 'నాకు అన్నీ గుర్తున్నాయి. ఏ కారణం లేకుండా పదకొండేళ్లపాటు ఒళ్లుగగుర్పొడిచేలా పోలీసులు వ్యవహరించిన తీరు దారుణం. నా పరువు, నా కుటుంబ ప్రతిష్ఠ అంతాపోయింది. ఈ విషయాలన్నీ నేను నా పుస్తకంలో రాశాను. విచారణ సమయంలో వాళ్లు ఎన్ని రకాల టార్చర్లు పెట్టారో వాటన్నింటిని అందులో పేర్కొన్నాను' అని చెప్పారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని చెప్పారు. -
దాణాకేసులో 23 మందికి జైలుశిక్ష
రాంచీ: కోట్లాది రూపాయల దాణా కుంభకోణంలో నిందితులైన 23 మందిని సీబీఐ ప్రత్యేకకోర్టు శనివారం దోషులుగా నిర్ధారించింది. సంశయలాభం కింద మరో పదిమందిని నిర్దోషులుగా పేర్కొంది. 1981-1990 సంవత్సరాల మధ్య బీహార్‌లో పశుదాణా కుంభకోణం జరిగిన సంగతి తెలిసిందే.7.6 కోట్ల రూపాయలను స్వాహా చేసిన ఆర్సీ54 ఏ96 కేసులో విచారణ పూర్తి చేసిన సీబీఐకోర్టు న్యాయమూర్తి బీకే గౌతం శనివారం తీర్పు వెలువరించారు. నలుగురు అధికారులు, 19 మంది దాణా సరఫరాదారులు ఈ కేసులో దోషులని ఆయన పేర్కొన్నారు.వారిలో కొందరికి మూడేళ్లు, మరికొందరికి ఐదేళ్ల జైలుశిక్ష విధించారు. -
చుండూరు కేసులో సుప్రీంకోర్టు స్టే
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చుండూరు కేసులో హైకోర్టు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసులో నిందితులకు ఉన్నత న్యాయస్థానం బుధవారం నోటీసులు జారీ చేసింది. గుంటూరు జిల్లా చుండూరులో 1991 ఆగస్టు 6న జరిగిన దళితులను అగ్రవర్ణాలకు చెందిన కొందరు ఊచకోత తోసిన విషయం తెల్సిందే. దీనిపై చుండూరు కేసులో యావ జ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఇరవై మందిని, ఇతర శిక్షలు అనుభవించిన మరో 36 మందిపై మొత్తం శిక్షలు రద్దు చేస్తూ 2014 ఏప్రిల్ 22వ తేదీన హైకోర్టు తీర్చునిచ్చింది. కాగా ఆ తీర్పును పలువురు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. దీంతో హత్య కేసు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం, మృతుల బంధువులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణను జరిపిన సుప్రీంకోర్టు ...దిగువ కోర్టు ఇచ్చిన విచారణపై స్టే విధించటంతో పాటు నిందితులకు నోటీసులు ఇచ్చింది. కాగా దళితుల ఊచకోత ఘటనపై సుదీర్ఘ విచారణ తరువాత ప్రత్యేక న్యాయమూర్తి అనీస్ 2007, ఆగస్టు 1న తీర్పు వెలువరించారు. నిందితులకు ఉరిశిక్ష విధించే అరుదైన కేసు కాదని పేర్కొంటూ మొత్తం 179 నిందితుల్లో 123 మందిని నిర్దోషులుగా ప్రకటించారు. 21 మందికి యావజ్జీవం, 35 మందికి ఏడాది జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ తీర్పులోని కొన్ని అంశాలపై సందేహాలు లేవనెత్తుతూ బాధిత కుటుంబాలు హైకోర్టును ఆశ్రయించాయి. శిక్ష పడినవారు తమ శిక్షను రద్దు చేయాలంటూ పిటిషన్ వేశారు. మరోవైపు నిర్దోషులుగా విడుదలైన వారికి వ్యతిరేకంగా ప్రభుత్వం పిటిషన్లు దాఖలు చేసింది. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
వైఎస్ఆర్ సీపీతోనే సమన్యాయం
ఖమ్మం హవేలి, న్యూస్‌లైన్: వైఎస్ఆర్ సీపీతోనే అన్ని వర్గాలకు సమ న్యాయం జరుగుతుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వైఎస్ఆర్ సీపీ-సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్లో సుమారు 4000 మోటార్ సైకిళ్లతో ర్యాలీ ప్రారంభమైంది. ప్రారంభ సభలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సీపీఎం-వైఎస్ఆర్ సీపీ కూటమి విజయం ఖాయమని; అనైతిక..అవకాశవాద పొత్తులు పెట్టుకున్న టీడీపీ-బీజేపీ, కాంగ్రెస్-సీపీఐ కూటమిల ఓటమి తథ్యమని అన్నారు. ఈ ర్యాలీని పెవిలియన్ గ్రౌండ్లో సీపీఎం జిల్లా నాయకురాలు అఫ్రోజ్ సమీనా ప్రారంభించారు. ర్యాలీలో ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల నుంచి సీపీఎం-వైఎస్ఆర్ సీపీ శ్రేణులతోపాటు సీపీఎం నేత తమ్మినేని, ఆ పార్టీ పాలేరు అభ్యర్థి పోతినేని సుదర్శన్, వైఎస్ఆర్ సీపీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ ర్యాలీ పెవిలియన్ గ్రౌండ్ నుంచి కాల్వొడ్డుకు చేరేందుకు సుమారు గంటకు పైగా సమయం పట్టింది. ర్యాలీలో పొంగులేటి, తమ్మినేనితోపాటు ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి కూరాకుల నాగభూష ణం, పాలేరు అభ్యర్థి పోతినేని సుదర్శన్, మధిర అభ్యర్థి లింగాల కమల్‌రాజ్, పాలేరు వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త సాధు రమేష్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు తోట రామారావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ముస్తఫా, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు అక్రం అలీ, నాయకులు ఆకుల మూర్తి, జిల్లేపల్లి సైదులు, భీమనాధుల అశోక్‌రెడ్డి, ఆరెంపుల వీరభద్రం; సీపీఎం నాయకులు బుగ్గవీటి సరళ, నున్నా నాగేశ్వరరావు, బత్తుల లెనిన్, బండారు రవికుమార్, యర్రా శ్రీకాంత్, గుగులోత్ ధర్మానాయక్, కల్యాణం వెంకటేశ్వర్లు, నర్సయ్య, విక్రమ్, చంద్రశేఖర్, జబ్బార్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. -
అన్నివర్గాలకు సమన్యాయం
ఎమ్మిగనూరు, న్యూస్‌లైన్: వైఎస్ఆర్సీపీలో అన్ని వర్గాలకు సమన్యాయం లభిస్తోందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక సోమప్ప మెమోరియల్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీకి చెందిన మాచాని రఘునాథ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాచాని వెంకటేషప్ప, మాజీ కౌన్సిలర్ యు.ఎం.శ్రీనివాసులుబాబు, కేఎస్పీ శివన్న, వీజీఆర్ కొండయ్యతో పాటు దాదాపు 1000 మంది అనుచరులు వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. వీరికి గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిలు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గౌరు మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాలకు తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. అందులో భాగంగానే కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా బీసీ కులానికి చెందిన బుట్టా రేణుకను ప్రకటించారన్నారు. జిల్లాలోని దశాబ్దాలుగా ఆధిపత్యం కొనసాగిస్తూ అభివృద్ధిని విస్మరించిన కోట్ల, కేఈ కుటుంబాలకు వచ్చే ఎన్నికల్లో బుట్టా రేణుకను గెలిపించడం ద్వారా బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. రెండుసార్లు అధికారం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మూడోసారి జగన్ ప్రభంజనంలో అధికారం దక్కదనే ఉద్దేశంతోనే విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారన్నారు. విభజనతో సీమాంధ్ర తీవ్రంగా నష్టపోతుందని తెలిసీ అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్, టీడీపీలు డ్రామా ఆడుతున్నాయని విమర్శించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం రాష్ర్టం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటోందని, ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బుట్టా రేణుక మాట్లాడుతూ సామాజిక, వ్యాపార, బంధుత్వ పరంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో తమ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందన్నారు. జిల్లాలో ఎంజీ కుటుంబానికి ఉన్న పేరు, ప్రతిష్టలు రానున్న ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల అభ్యర్థిగా తనకు దోహదపడతాయన్నారు. అన్ని వర్గాల ప్రజల మద్దతుతో తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నమ్మకాన్ని నిలబెడతానన్నారు. ఆదోని, మంత్రాలయం మాజీ ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డిలు మాట్లాడుతూ జిల్లాలో బలమైన సామాజికవర్గానికి దీటుగా బీసీ మహిళ రేణుకను బరిలో నిలుపుతున్నందున.. ఆ వర్గాలు ఈమె గెలుపును ఛాలెంజ్‌గా తీసుకోవాలన్నారు. ఒక్క ఆదోని రెవెన్యూ డివిజన్ నుంచే రేణుకమ్మకు లక్షకు పైగా మెజార్టీ తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ అధిష్టానం డెరైక్షన్‌లో ముఖ్యమంత్రి కిరణ్, టీడీపీ అధినేత చంద్రబాబులు సీమాంధ్ర ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఎంజీ కుటుంబ వారసుడు మాచాని రఘునాథ్ బృందం వైఎస్ఆర్సీపీలో చేరడం శుభ పరిణామమన్నారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ ఎమ్మిగనూరు అభివృద్ధిలో మాచాని కుటుంబం సేవలు చిరస్మరణీయమన్నారు. తాను మొదటి నుండి ఎంజీ కుటుంబానికి అండగా నిలుస్తూ ఆ వర్గీయులను రాజకీయంగా ప్రోత్సహించానన్నారు. పార్టీలో చేరిన మాచాని రఘునాథ్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేనేతలతో పాటు బీసీలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఆయన బాటలోనే బీసీలకు పెద్దపీట వేస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా చేనేత మహిళకు అవకాశం కల్పించడం హర్షించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, మంత్రాలయం మాజీ ఎంపీపీ సీతారామిరెడ్డి, వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ మధుసూధన్, పారిశ్రామికవేత్త బుట్టా నీలకంఠ, మున్సిపల్ మాజీ చైర్మన్ బుట్టా రంగయ్య, నాయకులు రమాకాంత్‌రెడ్డి, బసిరెడ్డి, సంపత్‌కుమార్‌గౌడ్, మాచాని ఆదిశేషులు, మాచాని శివకుమార్, హాజీ నద్దిముల్లా, రాజన్న, గోవిందు, నసిరుద్దీన్, తదితరులు పాల్గొన్నారు. -
‘తెలంగాణ’లో అందరికీ సమన్యాయం
కరీంనగర్‌కల్చరల్, న్యూస్‌లైన్ : ఆత్మగౌరవం, సమానత్వం, సమన్యాయం అజెం డాతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని టీఆర్ఎస్ శాసనసభపక్ష ఉపనేత టి.హరీష్‌రావు అన్నారు. నగరంలోని ప్రభుత్వ పురాతన పాఠశాల మైదానంలో తె లంగాణ క్రిస్టియన్ ఫోరం ఆవిర్భావసభ, క్రిస్మస్ వేడుకలు ఆదివారం జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి కులం, మతం లేదని, నాలుగు కోట్ల ప్రజల ఆరాటం, గుండె చప్పుడని అన్నారు. తెలంగాణ విషయంలో కేంద్రం అసెంబ్లీ తీర్మానం అడగడం లేదని, కేవలం అభిప్రాయం మాత్రమే అడుగుతుందని అన్నారు. అయినా అసెంబ్లీలో తీర్మానాన్ని అడ్డుకుంటామని సీఎం అనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. క్రైస్తవులంతా ఐకమత్యంగా ఉండాలని, అప్పుడే హక్కులు సాధించగలరని సూచించారు. గత ప్రభుత్వాలు క్రైస్తవులకు కనీసం సమాధుల కోసం కూడా స్థలాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో క్రిస్టియన్ల కమ్యూనిటీ హాల్స్, మ్యారేజి హాల్స్, చర్చిలకు విద్యుత్ సబ్సిడీ అందిస్తామన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ క్రైస్తవులకు సంపూర్ణ రక్షణగా టీఆర్ఎస్ ఉంటుందన్నారు. రెవ.డాక్టర్ పాల్సన్రాజ్, రెవ.డాక్టర్ జయప్రకాశ్ మాట్లాడుతూ క్రీస్తు చూపిన మార్గంలో పయనిస్తూ ప్రపంచ శాంతికి కృషిచేయాలని సూచించారు. ఫోరం ఏర్పాటు సందర్భంగా ప్రార్థనలు చేశారు. క్రిస్టియన్ ఫోరం ఫౌండర్, ప్రధాన కార్యదర్శి కె.జోరం, జిల్లా అధ్యక్షుడు బి. సురేశ్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు ఓరుగంటి ఆనంద్, సర్దార్ రవీందర్‌సింగ్, ఆర్టీసీ టీఎంయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్‌రెడ్డి, కె.వినయ్‌కుమార్, జి.కృపాదానం, బందెల సత్యం, వినయసాగర్, సూర్యప్రకాశ్ శాతల్ల సాగర్, ఆనంద్, వినోదమ్మ, ఎలివే, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఫోరం గౌరవాధ్యక్షుడిగా హరీష్‌రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
పిలుపే ప్రభం‘జనం’
సాక్షి ప్రతినిధి, విజయవాడ : కోట్ల మందికి సమన్యాయం కోసం ఒకే ఒక్కడు గొంతువిప్పితే సింహనాదమై మార్మోగుతోంది. అతని పిలుపే జన ప్రభంజనమైంది. అతని మాట, బాటే శ్రీరామరక్ష అంటూ లక్షలమంది అనుసరిస్తున్నారు. జనం కోసమే అతను.. అతని బాటలోనే జనం అని మరోమారు స్పష్టమైంది. సమన్యాయం చేస్తారా.. లేదా రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచుతారా అంటూ తేల్చాలంటూ చంచల్‌గూడ జైలు నుంచే జననేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండురోజులుగా చేస్తున్న ఆమరణ నిరశనదీక్షకు సంఘీభావంగా ఆ పార్టీ శ్రేణులు నిరాహార దీక్షలు, ఆందోళనలు, నిరసనలు చేపట్టడం ప్రజల పట్ల వైఎస్సార్సీపీకి ఉన్న నిబద్ధతను మారోమారు చాటిచెబుతోంది. ఆయనను అనుసరిస్తూ జిల్లాలో సోమవారానికి ఐదుగురు ఆమరణ దీక్షలు చేపట్టగా, పలుచోట్ల నిరసన దీక్షలు, ఆందోళనలు, ర్యాలీలు జరిగాయి. మంగళ, బుధవారాల్లో ఈ దీక్షలు మరిన్ని చోట్లకు విస్తరించే అవకాశం ఉంది. కొనసాగుతున్న జోగి, జ్యేష్ఠ దీక్షలు.. మైలవరంలో తాజా మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్‌బాబు తనయుడు శ్రీనాథ్‌లు చేపట్టిన ఆమరణ దీక్షలు సోమవారం రెండో కొనసాగాయి. జోగి రమేష్‌బాబు దీక్షాశిబిరం వద్దకు తరలివచ్చిన యువత ఆ ప్రాంగణంలోనే కబడ్డీ ఆడారు. ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు, మైలవరం బార్ అసోషియేషన్ సభ్యులు, ఉపాధ్యాయ జేఏసీ, సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు దీక్షాశిబిరాలకు వచ్చి జోగి రమేష్, జ్యేష్ఠ శ్రీనాథ్‌లకు సంఘీభావం తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలు చేపట్టిన ఈ దీక్షలకు పోటీగా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు ఆ పార్టీకి చెందిన ఇద్దరు యువకులతో ఆమరణదీక్ష చేయించడం గమనార్హం. పెడ నలో ఉప్పాల రాము.. పార్టీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాము సోమవారం స్థానిక బంటుమిల్లి రోడ్డులోని వైఎస్ విగ్రహం వద్ద ఆమరణ దీక్ష చేపట్టారు. దీక్షకు ఎస్పీ అనుమతిలేదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ నాయకుడు జగన్మోహన్రెడ్డి బాటలోనే అవసరమైతే జైలుకు వెళతానేగానీ దీక్ష ఆపేదిలేదని రాము స్పష్టంచేశారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆయన అనుకున్న సమయానికి దీక్షను ప్రారంభించారు. దీక్షకు అభ్యంతరం పెట్టవద్దని, ఎస్పీతో తాను మాట్లాడతానని వైఎస్సార్సీపీ నాయకుడు, జెడ్పీ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు పోలీసులకు స్పష్టంచేశారు. నగరంలో జవ్వాది రుద్రయ్య.. కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్లో కార్పొరేషన్ స్టాడింగ్ కమిటీ మాజీ చైర్మన్ జవ్వాది సూర్యనారాయణ(రుద్రయ్య) ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. పశ్చిమ నియోజకవర్గంలో పలువురు డివిజన్ కన్వీనర్లు రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు. కుమ్మరపాలెం సెంటర్లో జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ పాల్గొన్నారు. పార్టీ కృష్ణాజిల్లా, విజయవాడ నగర డాక్టర్స్ విభాగం ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయం వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు గోసుల శివభరత్‌రెడ్డి, గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు, సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త పి.గౌతంరెడ్డి, డాక్టర్స్ సెల్ జిల్లా కన్వీనర్ మహబూబ్ షేక్, సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జయంతిలో గుంజి సుందర్రావు.. నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం జయంతి గ్రామంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిమాని గుంజి సుందర్రావు సోమవారం ఆమరణదీక్షను చేపట్టారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. పెనుగంచిప్రోలులో జగన్మోహన్రెడ్డి మాస్క్‌లు ధరించి ర్యాలీ నిర్వహించారు. పార్టీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్తలు పడమటి సురేష్‌బాబు గంగూరులోను, తాతినేని పద్మావతి పెనమలూరులోను ర్యాలీలు నిర్వహించారు. పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ కన్వీనర్ సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. పార్టీ కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కైకలూరులో రెండో రోజు కూడా 20మంది రిలే నిరహారదీక్షలో పాల్గొన్నారు. రాత్రి కాగడాల ప్రదర్శన నిర్వహించారు. గుడివాడ నియోజకవర్గంలోని నందివాడలో పార్టీ మండల కన్వీనర్ పెయ్యల ఆదాము ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పార్టీ గుడివాడ పట్టణ కన్వీనర్ ఎం.కృష్ణమూర్తి, నూజివీడులో లాకా వెంగళరావు యాదవ్, పెనుగంచిప్రోలులో వూట్ల నాగేశ్వరరావు, తిరువూరులో పిడపర్తి లక్ష్మీకుమారి మంగళవారం నుంచి ఆమరణదీక్షలు చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఇలా జిల్లాలో వైఎస్సార్సీపీ శ్రేణులు ఎక్కడికక్కడ దీక్షలు, ధర్నాలు, ర్యాలీలతో తమ నాయకుడికి మద్దతుగా సమైక్య సమరసేనానులై కదులుతున్నారు. -
రెండో ఎస్ఆర్సితో సమన్యాయం: కొణతాల
విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టనున్న దీక్షకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోందని ఆ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు కొణతాల రామకృష్ణ చెప్పారు. తెలంగాణపై రెండో ఎస్ఆర్సి(స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ)ని నియమించి ఉంటే అందరికీ సమన్యాయం జరిగేదని ఆయన అభిప్రాయపడ్డారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పథకాలు పూర్తి చేసిన తరువాత విభజన జరిగినా ఏ ప్రాంతానికి అన్యాయం జరిగేది కాదని కొణతాల అన్నారు.