వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టనున్న దీక్షకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోందని ఆ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు కొణతాల రామకృష్ణ చెప్పారు.
విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టనున్న దీక్షకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోందని ఆ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు కొణతాల రామకృష్ణ చెప్పారు. తెలంగాణపై రెండో ఎస్ఆర్సి(స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ)ని నియమించి ఉంటే అందరికీ సమన్యాయం జరిగేదని ఆయన అభిప్రాయపడ్డారు.
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పథకాలు పూర్తి చేసిన తరువాత విభజన జరిగినా ఏ ప్రాంతానికి అన్యాయం జరిగేది కాదని కొణతాల అన్నారు.