దేవుడి దయతో మళ్లీ క్రికెట్ ఆడుతా: శ్రీశాంత్
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిర్దోషిగా బయటపడినందుకు కేరళ పేసర్ శ్రీశాంత్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ కేసుకు సంబంధించి ఎవరిపైనా విమర్శలు, ఫిర్యాదు చేయదలచుకోలేదని, దేవుడి దయ వల్ల మళ్లీ క్రికెట్ ఆడుతానని శ్రీశాంత్ అన్నాడు. కోర్టు నిర్దోషిగా ప్రకటించగానే శ్రీశాంత్ సంతోషం పట్టలేక ఏడ్చేశాడు.
ఈ విషయం విని తన కూతురు సంతోషిస్తుందని శ్రీశాంత్ అన్నాడు. బీసీసీఐ సౌకర్యాలను ఉపయోగించుకునేందుకు బోర్డు అనుమతిస్తుందని ఆశిస్తున్నానని, మళ్లీ ఫిట్నెస్ సాధిస్తానని చెప్పాడు. 'నాకు సినిమా చాన్స్లు వచ్చినా.. మొదటి ప్రాధాన్యం క్రికెట్కే. రేపు నేషనల్ స్టేడియానికి వెళును. నేను మళ్లీ పూర్తిగా ఫిట్నెస్ సాధించి, మునుపటి మాదిరి వాడిగా బౌలింగ్ చేస్తా. కష్టకాలంలో నాకు అండగా నిలిచిన భార్య, కూతురు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు' అని శ్రీశాంత్ అన్నాడు.