srisanth
-
తొమ్మిదేళ్ల తర్వాత తొలి వికెట్ పడగొట్టాడు
-
తొమ్మిదేళ్ల తర్వాత తొలి వికెట్ పడగొట్టాడు.. ఒక్కసారిగా ఏం చేశాడంటే..!
టీమిండియా వెటరన్ పేసర్ శ్రీశాంత్ తొమ్మిదేళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో తన తొలి వికెట్‌ను సాధించాడు. రంజీట్రోఫీలో కేరళ జట్టుకు శ్రీశాంత్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. రంజీట్రోఫీలో భాగంగా కేరళ తమ తొలి మ్యాచ్‌లో మేఘాలయతో తలపడింది. ఈ మ్యాచ్‌లో మేఘాలయ ఇన్నింగ్స్ 40వ వేసిన శ్రీశాంత్ బౌలింగ్‌లో.. ఆర్యన్ బోరా వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆర్యన్ బోరా ఔట్ చేసిన శ్రీశాంత్ తన తొలి వికెట్ సాధించాడు. ఈ నేపథ్యంలో ఉద్వేగానికి లోనైనా శ్రీశాంత్.. పిచ్‌పై ఒక్క సారిగా సాష్టాంగ ప్రణామం చేశాడు. ఈ వీడియోను శ్రీశాంత్ ట్విటర్లో షేర్ చేశాడు. "తొమ్మిదేళ్ల తర్వాత నా తొలి వికెట్ సాధించాను. దేవుడు దయ వల్ల నేను ఇది సాధించగలిగాను" అని ట్విటర్లో శ్రీశాంత్ పేర్కొన్నాడు. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో తన 12 ఓవర్ల స్పెల్‌లో 40 పరుగులు ఇచ్చి 2 వికెట్లు సాధించాడు.రెండవ ఇన్నింగ్స్‌లో వికెట్లు ఏమీ పడగొట్టలేదు. ఇక 2013లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన శ్రీశాంత్‌పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. దీంతో బీసీసీఐ అతడిపై జీవిత కాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ శ్రీశాంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు స్పందిస్తూ.. శిక్ష కాలాన్ని తగ్గించమని బీసీసీఐను ఆదేశించింది. దీంతో బీసీసీఐ అతడిపై నిషేధాన్ని ఏడు ఏళ్లకు కుదించింది. దీంతో 13 సెప్టెంబర్ 2020 నుంచి అతడిపై నిషేధం ఎత్తివేయబడింది. అయితే ఐపీఎల్-2022 మెగా వేలంలో తన పేరును రిజిస్టర్ చేసుకున్న శ్రీశాంత్‌ను ఏ ఫ్రాంచైజీ కూడాకొనుగొలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. చదవండి: 'ప్రపంచకప్ టైటిల్‌తో నా కెరీర్‌ను ముగించాలి అనుకుంటున్నా' Now that’s my 1st wicket after 9 long years..gods grace I was just over joyed and giving my Pranaam to the wicket ..❤️❤️❤️❤️❤️❤️❤️ #grateful #cricket #ketalacricket #bcci #india #Priceless pic.twitter.com/53JkZVUhoG — Sreesanth (@sreesanth36) March 2, 2022 -
బిగ్‌బాస్ : బయటికి వచ్చేస్తానంటున్న మాజీ క్రికెటర్
హిందీ బిగ్‌బాస్ సీజన్ 12 మొదలైన రెండో రోజుల్లోనే ఎన్నో కొట్లాటలు, మరెన్నో వివాదాలతో రచ్చ రచ్చ అవుతోంది. అప్పుడే హౌజ్‌మేట్స్ కోపతాపాలు ప్రదర్శిస్తున్నారు.. తాజాగా మాజీ క్రికెటర్ శ్రీశాంత్, మైక్ విసిరి కొట్టి మరీ, తాను హౌజ్ నుంచి బయటికి వెళ్లిపోతానంటూ బెదిరించాడు. ఇదంతా ఎందుకు జరిగింది? అసలు ఎక్కడ గొడవ మొదలైంది అంటే.. శ్రీశాంత్‌కు ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేయకపోవడం, అక్కాచెల్లెళ్లుగా బిగ్‌బాస్ 12లోకి ప్రవేశించిన సోమి, సబా ఖాన్‌లతో శ్రీశాంత్ వాడివేడి వివాదానికి దిగడం బిగ్‌బాస్ 12 హౌజ్‌ను హీటెక్కేలా చేసింది. అంతేకాక షిండే, కరణ్ పటేల్ కూడా శ్రీశాంత్ అసంతృప్తికర వైఖరికి కోపం ప్రదర్శించారు. శ్రీశాంత్ వ్యవహారంతో, బిగ్‌బాస్ అందరి టాస్క్‌లను రద్దు చేసేశారు. తమ తొలి టాస్కే ఇలా గందరగోళంగా మధ్యలో ఆగిపోవడంతో, హౌజ్‌మేట్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేసి, కోపంతో ఊగిపోయారు. దీపిక కకార్, కరణ్వీర్ బోహ్రాలు శ్రీశాంత్‌కు బిగ్‌బాస్ హౌజ్‌లో ఇచ్చే టాస్క్‌లు పూర్తి చేయడం ఎంతో ముఖ్యమో నచ్చచెప్పడానికి ప్రయత్నించినప్పటికీ, అవి ఫలించలేదు. అప్పటికే పరిస్థితి అంతా చేదాటిపోయింది. తీవ్ర కోపోద్రిక్తుడైన శ్రీశాంత్ వెంటనే మైక్ తీసేసి, గేట్ ఓపెన్ చేయండి, నేను షో నుంచి బయటికి వెళ్లిపోతా అంటూ బిగ్గరగా అరిచాడు. అయితే శ్రీశాంత్ హౌజ్‌లోనే ఉంటాడా? లేదా బయటికి వెళ్లిపోతాడా? అనేది బిగ్‌బాస్ నిర్ణయించనున్నారు. ఈ రోజు రాత్రి జరగబోయే బిగ్ బాస్ 12 ఎపిసోడ్లో ఈ విషయం రివీల్ అవనుంది. హౌజ్‌లో ఉన్నంత కాలం బిగ్‌బాస్ ఇచ్చే అన్ని పనులను ప్రతి కంటెస్టెంట్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ హౌజ్ నుంచి శ్రీశాంత్ బయటికి వస్తే, మధ్యలో షో వదిలివేస్తుండటంతో అతను 50 లక్షల రూపాయలను కోల్పోనున్నారు. శ్రీశాంత్ అంతకముందు కూడా డ్యాన్స్ రియాల్టీ షో ఝలక్ దిక్లా జా నుంచి మధ్యలోనే బయటికి వచ్చేశారు. అతని పర్ఫార్మెన్స్లో తప్పులను ఎత్తి చూపినందుకు గాను జడ్జీలు మాధురి దీక్షిత్, రెమో డీ సౌజా, కరణ్ జోహార్లతో గొడవపడి, ఆ రియాల్టీ షో నుంచి వాకౌట్ అయ్యారు. కాగా, తెలుగులో రన్ అవుతున్న బిగ్‌బాస్ 1 రియాల్టీ షోలో కూడా ఇదే రకమైన పరిస్థితి కనిపించింది. నటుడు సంపూర్ణేశ్ బాబు కూడా ‘నాది పల్లెటూరి నేపథ్యం. ఇక్కడ నన్ను బంధించేసినట్టుగా ఉంది. నన్ను ఇంటికి పంపించేయండి’ అని బిగ్‌బాస్ షోలో ప్రాధేయ పడ్డాడు. అలా సంపూ ఆరోగ్య స్థితిని గమనించి, హౌజ్‌మేట్స్ అందరూ కలిసి, ఎలిమినేట్ చేయడానికి అతిని పేరును నామినేట్ చేశారు. -
'నిర్దోషులుగా తేలడం సంతోషకరం'
కోల్‌కతా: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో క్రికెటర్లు నిర్దోషలుగా తేలడం సంతోషకరమని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో కేరళ పేసర్ శ్రీశాంత్ సహా 16 మంది క్రికెటర్లను ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. శ్రీశాంత్ మళ్లీ టీమిండియాలోకి వస్తాడా అన్న ప్రశ్నకు గంగూలీ.. అతనిపై అభియోగాలను కోర్టు కొట్టేసిందని, బీసీసీఐకి అభ్యంతరం ఉండకపోవచ్చని సమాధానమిచ్చారు. కాగా కోర్టు తీర్పుపై స్పందించేందుకు టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ శ్రీకాంత్ తిరస్కరించాడు. -
ప్రతిభ, వివాదాలకు కేరాఫ్ శ్రీ
ప్రతిభ, సంచలనాలు, వివాదాలు, విమర్శలు.. వీటన్నింటికీ కేరాఫ్ అడ్రెస్ కేరళ పేసర్ శ్రీశాంత్. భారత క్రికెట్లోకి ఓ మెరుపులా వచ్చాడు. అనతికాలంలోనే టాప్ బౌలర్ల సరసన చేరాడు. టీమిండియాకు ఓ ప్రతిభావంతుడైన పేసర్ దొరికాడంటూ క్రీడాపండితులతో ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత ఫిట్నెస్ సమస్యలు, బౌలింగ్‌లో వాడి తగ్గడం, వివాదాలు, చివరకు స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీశాంత్ కెరీర్‌ను అర్ధంతరంగా ముగించాల్సి వచ్చింది. కష్టకాలంలో స్నేహితురాలు భువనేశ్వరి అండగా నిలిచి శ్రీని పెళ్లి చేసుకుంది. ఈ మధ్యకాలంలో అతనికి సినిమా అవకాశాలు వచ్చాయి. తాజాగా ఢిల్లీ కోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో 32 ఏళ్ల శ్రీశాంత్ మళ్లీ క్రికెట్ ఆడుతానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. 1983లో కేరళలో శ్రీశాంత్ జన్మించాడు. శ్రీ కుటుంబ సభ్యులకు సినీ రంగంతో సంబంధమున్నా.. అతను మాత్రం క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. పదేళ్ల క్రితం 2005 అక్టోబర్‌లో అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ మరుసటి సంవత్సరం టెస్టు క్రికెట్లోనూ అరంగేట్రం చేశాడు. 53 వన్డేలాడిన శ్రీ 75 వికెట్లు పడగొట్టాడు. ఇక 27 టెస్టులాడి 87 వికెట్లు తీశాడు. కేరళ రంజీ జట్టుకు, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కెరీర్ ఆరంభంలో శ్రీశాంత్ బౌలింగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ఫిట్నెస్ సమస్యలు రావడంతో బౌలింగ్‌లో పస తగ్గింది. ఇక ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్‌తో గొడవ పడటం వివాదాస్పదంగా మారింది. భజ్జీ చెంపదెబ్బ కొట్టడంతో శ్రీ స్టేడియంలోనే భోరున ఏడ్చేశాడు. 2013లో శ్రీశాంత్ ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్ట్ కావడంతో కెరీర్‌ను అర్ధంతరంగా ఆపేయాల్సివచ్చింది. ఆ ఏడాది మే 13న ఢిల్లీ పోలీసులు ముంబైలో అతడ్ని అరెస్ట్ చేశారు. ఐపీఎల్‌ను కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్‌తో సహా 16 మంది క్రికెటర్లపై అభియోగాలు వచ్చాయి. బీసీసీఐ శ్రీశాంత్‌పై జీవితకాలం నిషేధం విధించింది. దీంతో అప్పటి నుంచి క్రికెట్‌కు పూర్తిగా దూరమయ్యాడు. స్నేహితురాలు భువనేశ్వరిని పెళ్లి చేసుకన్న శ్రీశాంత్‌కు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ఇప్పుడు నిర్దోషిగా బయటపడటంతో మళ్లీ క్రికెట్లో వస్తానని శ్రీశాంత్ అన్నాడు. బీసీసీఐ కూడా అతనిపై నిషేధం తొలగించే అవకాశముంది కాబట్టి లైన్ క్లియర్ కావచ్చు. రెండేళ్లు క్రికెట్‌కు దూరంగా ఉన్న 32 ఏళ్ల శ్రీశాంత్ ఫిట్నెస్ సాధించి, మునుపటి ఫామ్ చాటుతానని చెబుతున్నాడు. -
దేవుడి దయతో మళ్లీ క్రికెట్ ఆడుతా: శ్రీశాంత్
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిర్దోషిగా బయటపడినందుకు కేరళ పేసర్ శ్రీశాంత్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ కేసుకు సంబంధించి ఎవరిపైనా విమర్శలు, ఫిర్యాదు చేయదలచుకోలేదని, దేవుడి దయ వల్ల మళ్లీ క్రికెట్ ఆడుతానని శ్రీశాంత్ అన్నాడు. కోర్టు నిర్దోషిగా ప్రకటించగానే శ్రీశాంత్ సంతోషం పట్టలేక ఏడ్చేశాడు. ఈ విషయం విని తన కూతురు సంతోషిస్తుందని శ్రీశాంత్ అన్నాడు. బీసీసీఐ సౌకర్యాలను ఉపయోగించుకునేందుకు బోర్డు అనుమతిస్తుందని ఆశిస్తున్నానని, మళ్లీ ఫిట్నెస్ సాధిస్తానని చెప్పాడు. 'నాకు సినిమా చాన్స్‌లు వచ్చినా.. మొదటి ప్రాధాన్యం క్రికెట్‌కే. రేపు నేషనల్ స్టేడియానికి వెళును. నేను మళ్లీ పూర్తిగా ఫిట్నెస్ సాధించి, మునుపటి మాదిరి వాడిగా బౌలింగ్ చేస్తా. కష్టకాలంలో నాకు అండగా నిలిచిన భార్య, కూతురు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు' అని శ్రీశాంత్ అన్నాడు. -
స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్ సహా 16 మంది క్రికెటర్లకు విముక్తి
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో కేరళ పేసర్ శ్రీశాంత్‌తో పాటు అజిత్ చండీలా, అంకత్ చవాన్లకు విముక్తి లభించింది. శనివారం ఢిల్లీ కోర్టు ఈ ముగ్గురు ఆటగాళ్లతో సహా నిందితులుగా ఉన్న మొత్తం 16 మంది క్రికెటర్లను నిర్దోషులుగా ప్రకటించింది. ఆటగాళ్లపై నమోదు చేసిన అభియోగాలన్నింటినీ కొట్టేస్తూ జడ్జి నానా బన్సల్ తీర్పు వెలువరించారు. రెండేళ్ల క్రితం ఐపీఎల్‌ను కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు శ్రీశాంత్, చండీలా, చవాన్‌లను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ ఆటగాళ్లకు బుకీలతో సంబంధాలున్నాయని, లంచాలు తీసుకుని ఫిక్సింగ్‌కు పాల్పడ్డారంటూ అభియోగాలు నమోదు చేశారు. వీరితో పాటు రాజస్థాన్ క్రికెటర్లు అమిత్ సింగ్, సిద్ధార్థ్ త్రివేది, హర్మీత్ సింగ్ తదితరులను నిందితులుగా చేర్చారు. క్రికెటర్లతో పాటు మొత్తం 42 మందిపై అభియోగాలు నమోదు చేశారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్, ఇబ్రహీం, చోటా షకీల్ పేర్లను కూడా ఢిల్లీ పోలీసులు చేర్చారు. బుకీలతో ఫోన్లలో మాట్లాడిన సంభాషణలను ఢిల్లీ పోలీసులు రికార్డు చేశారు. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం బయటకురాగానే బీసీసీఐ నిందితులైన క్రికెటర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీరిని నిషేధించింది. కాగా క్రికెటర్లపై వచ్చిన ఆరోపణలను ఢిల్లీ పోలీసులు కోర్టులో రుజువు చేయలేకపోయారు. దీంతో క్రికెటర్లను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఇదిలావుండగా, స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసు విచారణకు సుప్రీం కోర్టు నియమించిన మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోధా సారథ్యంలోని కమిటీ చెన్నై, రాజస్థాన్ జట్లపై రెండేళ్ల కాలం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ సహ భాగస్వామి రాజ్ కుంద్రా, చెన్నై యజమాని శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్లు క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా జీవితకాలం వేటు వేసింది. రాజ్ కుంద్రా, మేయప్పన్ బెట్టింగ్‌కు పాల్పడినట్టు లోధా కమిటీ నిర్ధారించింది. -
ఫిక్సింగ్ : బాధ్యులెవరో ? బాధితులెవరో ?