ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో క్రికెటర్లు నిర్దోషలుగా తేలడం సంతోషకరమని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు.
కోల్కతా: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో క్రికెటర్లు నిర్దోషలుగా తేలడం సంతోషకరమని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో కేరళ పేసర్ శ్రీశాంత్ సహా 16 మంది క్రికెటర్లను ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
శ్రీశాంత్ మళ్లీ టీమిండియాలోకి వస్తాడా అన్న ప్రశ్నకు గంగూలీ.. అతనిపై అభియోగాలను కోర్టు కొట్టేసిందని, బీసీసీఐకి అభ్యంతరం ఉండకపోవచ్చని సమాధానమిచ్చారు. కాగా కోర్టు తీర్పుపై స్పందించేందుకు టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ శ్రీకాంత్ తిరస్కరించాడు.