టీమిండియా వెటరన్ పేసర్ శ్రీశాంత్ తొమ్మిదేళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో తన తొలి వికెట్‌ను సాధించాడు. రంజీట్రోఫీలో కేరళ జట్టుకు శ్రీశాంత్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. రంజీట్రోఫీలో భాగంగా కేరళ తమ తొలి మ్యాచ్‌లో మేఘాలయతో తలపడింది. ఈ మ్యాచ్‌లో మేఘాలయ ఇన్నింగ్స్ 40వ వేసిన శ్రీశాంత్ బౌలింగ్‌లో.. ఆర్యన్ బోరా వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆర్యన్ బోరా ఔట్ చేసిన శ్రీశాంత్ తన తొలి వికెట్ సాధించాడు. ఈ నేపథ్యంలో ఉద్వేగానికి లోనైనా శ్రీశాంత్.. పిచ్‌పై ఒక్క సారిగా సాష్టాంగ ప్రణామం చేశాడు. ఈ వీడియోను శ్రీశాంత్ ట్విటర్‌లో షేర్ చేశాడు. "తొమ్మిదేళ్ల తర్వాత నా తొలి వికెట్ సాధించాను. దేవుడు దయ వల్ల నేను ఇది సాధించగలిగాను" అని ట్విటర్‌లో శ్రీశాంత్ పేర్కొన్నాడు. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో తన 12 ఓవర్ల స్పెల్‌లో 40 పరుగులు ఇచ్చి 2 వికెట్లు సాధించాడు.రెండవ ఇన్నింగ్స్‌లో వికెట్లు ఏమీ పడగొట్టలేదు.
ఇక 2013లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన శ్రీశాంత్‌పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. దీంతో బీసీసీఐ అతడిపై జీవిత కాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ శ్రీశాంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు స్పందిస్తూ.. శిక్ష కాలాన్ని తగ్గించమని బీసీసీఐను ఆదేశించింది. దీంతో బీసీసీఐ అతడిపై నిషేధాన్ని ఏడు ఏళ్లకు కుదించింది. దీంతో 13 సెప్టెంబర్ 2020 నుంచి అతడిపై నిషేధం ఎత్తివేయబడింది. అయితే ఐపీఎల్-2022 మెగా వేలంలో తన పేరును రిజిస్టర్ చేసుకున్న శ్రీశాంత్‌ను ఏ ఫ్రాంచైజీ కూడాకొనుగొలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.
చదవండి: 'ప్రపంచకప్ టైటిల్‌తో నా కెరీర్‌ను ముగించాలి అనుకుంటున్నా'
Now that’s my 1st wicket after 9 long years..gods grace I was just over joyed and giving my Pranaam to the wicket ..❤️❤️❤️❤️❤️❤️❤️ #grateful #cricket #ketalacricket #bcci #india #Priceless pic.twitter.com/53JkZVUhoG
— Sreesanth (@sreesanth36) March 2, 2022
Comments
Please login to add a commentAdd a comment