ప్రొఫెసర్‌ సాయిబాబాకు సుప్రీంకోర్టులో ఊరట | Supreme Court refuses to pause ex professor GN Saibaba Acquittal | Sakshi
Sakshi News home page

ప్రొఫెసర్‌ సాయిబాబాకు సుప్రీంకోర్టులో ఊరట

Published Mon, Mar 11 2024 7:50 PM | Last Updated on Mon, Mar 11 2024 8:37 PM

Supreme Court refuses to pause ex professor GN Saibaba Acquittal - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మావోయిస్టులతో సంబంధాలున్న కేసులో అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బాంబే హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషిన్‌ను భారత అత్యున్నత తిరస్కరించింది.

ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం.. హైకోర్టు తీర్పు చాలా హేతుబద్ధంగా ఉన్నట్లు తాము ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపింది. తీర్పును వెనక్కి తీసుకోవడంలో ఎటువంటి తొందరపాటు ఉండకూడదని, అది వేరేలా ఉంటే పరిగణనలోకి తీసుకునేవాళ్లమని పేర్కొంది. ఇది నిర్దోషిత్వం రుజువు చేసుకోవడానికి ఎంతో కష్టపడిన కేసు అని.. సాధారణంగా ఇటువంటి అప్పీల్‌ను ఈ న్యాయస్థానం గతంలోనే కొట్టివేసి ఉండాల్సిందని జస్టిస్‌లు మెహతా,  గవాయిలు పేర్కొన్నారు. 
చదవండి: మిషన్‌ దివ్యాస్త్ర విజయవంతం.. అభినందించిన ప్రధాని మోదీ

కాగా 90 శాతం వైకల్యంతో వీల్‌చైర్‌కే పరిమితమైన సాయిబాబా.. మావోయిస్టులతో సంబంధాలు పెట్టుకుని దేశద్రోహానికి పాల్పడ్డారన్న ఆరోపణపై ఆయనతో పాటు మరో ఐదుగురికి మహారాష్ట్ర, గడ్చిరోలి ట్రయిల్‌ కోర్టు జీవిత ఖైదు విధించడంతో 2017 నుంచి నాగ్‌పూర్‌ జైలులోనే ఉన్నారు. అంతకుముందు కూడా ఆయన 2014 నుంచి 2016 వరకు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలయ్యారు.

సెషన్స్‌ కోర్టు తీర్పును సవాలు చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపినబాంబే హైకోర్టు 2022 అక్టోబరులోనే సాయిబాబాతోపాటు అయిదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ.. వెంటనే జైలు నుంచి విడుదలకు ఆదేశించింది. ఈ తీర్పు వెలువడిన రోజే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో నిందితుల విడుదలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. హైకోర్టు తీర్పును 2023 ఏప్రిల్‌లో పక్కనపెట్టింది. నిందితుల అప్పీళ్లపై మళ్లీ మొదట్నుంచీ విచారణ జరపాలని ఆదేశించడంతో మళ్లీ విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు.. సాయిబాబా సహా మిగతా నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ మార్చి 5న తీర్పు వెలువరించింది. దీంతో ప్రొఫెసర్‌ సాయిబాబా విడుదలయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement