
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను జైలు నుంచి విడుదల చేయడంపై స్టే ఇవ్వాలని కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
సరైన ఆరోపణలను చూపలేకపోయినందున సాయిబాబాను విడుదల చేయాలంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రాథమికంగా సరైందిగానే భావిస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ అంశంపై జోక్యం చేసుకోలేమని తెలిపింది. అయితే, పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నట్లు సోమవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ దీపక్ మెహతా ధర్మాసనం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment