GN Saibaba
-
‘సాయిబాబా భౌతికకాయాన్ని మెడికల్ కాలేజీకి అప్పగిస్తాం’
హైదరాబాద్: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, పౌర హక్కుల ఉద్యమకారుడు జీఎన్ సాయిబాబా (54) శనివారం రాత్రి హైదరాబాద్ నిమ్స్‌లో కన్నుమూశారు. సాయిబాబా మృతదేహాన్ని ఆయన కోరుకున్న విధంగా మెడికల్ కాలేజీకి దానం చేయనున్నట్లు కుటుంబ సభ్యులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.మావోయిస్టు సంబంధాలు ఉన్నాయన్న అభియోగాల కేసులో హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో మార్చి నెలలో ఆయన విడుదలయ్యారు. సాయిబాబా భౌతికకాయాన్ని ఆయన బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల నివాళులర్పించేందుకు సోమవారం హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌లో ఉంచనున్నట్లు తెలిపారు. ఆయన కళ్లను ఇప్పటికే ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సాయిబాబా మృతిపట్ల ‘ఎక్స్’ వేదికగా ప్రముఖలు సంతాపం తెలిపారు. ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా మృతి పట్ల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంతాపం తెలిపారు. ‘‘ మానవ హక్కుల ఉద్యమకారుల సంఘానికి సాయిబాబా మరణం తీరని లోటు. అణగారిన ప్రజలకు జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా, స్వేచ్ఛకు ముప్పు ఏర్పడినప్పుడు ఆయన అవిశ్రాంతంగా పోరాడారు. అనేక సవాళ్లను ఎదుర్కొంటూ పౌర హక్కులను కాపాడటంలో ఆయన చూపిన ధైర్యం చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నా’’అని ఎక్స్‌లో తెలిపారు.Prof. G.N. Saibaba’s passing away is a profound loss for the human rights community. A tireless advocate for the oppressed, he fearlessly fought against injustice, even when his own freedom and health were at risk. His courage in defending civil liberties, despite many… pic.twitter.com/eLbXOmGGyK— M.K.Stalin (@mkstalin) October 13, 2024మాజీ ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం తెలిపారు. ‘‘ హక్కుల ఉద్యమకారుడు మాజీ ప్రొఫెసర్ జీ.ఎన్. సాయిబాబా అకాల మరణం బాధాకరం. వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. దేశంలోని ప్రజా ఉద్యమాలకు మాజీ ప్రొఫెసర్ సాయిబాబా మరణం తీరని లోటు’’ అని ‘ఎక్స్’ తెలిపారు.హక్కుల ఉద్యమకారుడు ప్రొఫెసర్ జీ. ఎన్. సాయిబాబా అకాల మరణం బాధాకరం. వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. దేశంలోని ప్రజా ఉద్యమాలకు ప్రొఫెసర్ సాయిబాబా మరణం తీరని లోటు. pic.twitter.com/48NO87H1cV— KTR (@KTRBRS) October 13, 2024చదవండి: డీయూ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత -
ప్రొఫెసర్ సాయిబాబా విడుదల సబబే: సుప్రీం
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను జైలు నుంచి విడుదల చేయడంపై స్టే ఇవ్వాలని కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సరైన ఆరోపణలను చూపలేకపోయినందున సాయిబాబాను విడుదల చేయాలంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రాథమికంగా సరైందిగానే భావిస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ అంశంపై జోక్యం చేసుకోలేమని తెలిపింది. అయితే, పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నట్లు సోమవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ దీపక్ మెహతా ధర్మాసనం తెలిపింది. -
ప్రొఫెసర్ సాయిబాబాకు సుప్రీంకోర్టులో ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మావోయిస్టులతో సంబంధాలున్న కేసులో అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బాంబే హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషిన్‌ను భారత అత్యున్నత తిరస్కరించింది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం.. హైకోర్టు తీర్పు చాలా హేతుబద్ధంగా ఉన్నట్లు తాము ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపింది. తీర్పును వెనక్కి తీసుకోవడంలో ఎటువంటి తొందరపాటు ఉండకూడదని, అది వేరేలా ఉంటే పరిగణనలోకి తీసుకునేవాళ్లమని పేర్కొంది. ఇది నిర్దోషిత్వం రుజువు చేసుకోవడానికి ఎంతో కష్టపడిన కేసు అని.. సాధారణంగా ఇటువంటి అప్పీల్‌ను ఈ న్యాయస్థానం గతంలోనే కొట్టివేసి ఉండాల్సిందని జస్టిస్‌లు మెహతా, గవాయిలు పేర్కొన్నారు. చదవండి: మిషన్ దివ్యాస్త్ర విజయవంతం.. అభినందించిన ప్రధాని మోదీ కాగా 90 శాతం వైకల్యంతో వీల్‌చైర్‌కే పరిమితమైన సాయిబాబా.. మావోయిస్టులతో సంబంధాలు పెట్టుకుని దేశద్రోహానికి పాల్పడ్డారన్న ఆరోపణపై ఆయనతో పాటు మరో ఐదుగురికి మహారాష్ట్ర, గడ్చిరోలి ట్రయిల్ కోర్టు జీవిత ఖైదు విధించడంతో 2017 నుంచి నాగ్‌పూర్ జైలులోనే ఉన్నారు. అంతకుముందు కూడా ఆయన 2014 నుంచి 2016 వరకు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలయ్యారు. సెషన్స్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపినబాంబే హైకోర్టు 2022 అక్టోబరులోనే సాయిబాబాతోపాటు అయిదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ.. వెంటనే జైలు నుంచి విడుదలకు ఆదేశించింది. ఈ తీర్పు వెలువడిన రోజే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో నిందితుల విడుదలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. హైకోర్టు తీర్పును 2023 ఏప్రిల్‌లో పక్కనపెట్టింది. నిందితుల అప్పీళ్లపై మళ్లీ మొదట్నుంచీ విచారణ జరపాలని ఆదేశించడంతో మళ్లీ విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు.. సాయిబాబా సహా మిగతా నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ మార్చి 5న తీర్పు వెలువరించింది. దీంతో ప్రొఫెసర్ సాయిబాబా విడుదలయ్యారు. -
ప్రాణాలతో బయటపడడం అద్భుతమే
నాగపూర్: జైలు నుంచి ప్రాణాలతో బయటపడతానని ఏనాడూ అనుకోలేదని ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా(54) చెప్పారు. సజీవంగా బయటకు రావడం నిజంగా అద్భుతమేనంటూ భావోద్వేగానికి గురయ్యారు. జైలులో శారీరకంగా, మానసికంగా ఎన్నో బాధలు అనుభవించానని చెప్పారు. అక్కడ జీవితం అత్యంత దుర్భరమని పేర్కొన్నారు. మావోలతో సంబంధాల కేసులో బాంబే హైకోర్టు సాయిబాబాను నిర్దోషిగా గుర్తిస్తూ మంగళవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఆయన గురువారం నాగపూర్ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి చక్రాల కురీ్చలో బయటకు వచ్చారు. ఈశాన్య భారతదేశంలో గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్నందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. తప్పుడు కేసులో ఇరికించి అరెస్టు చేశారని సాయిబాబా అన్నారు. జైలులోనే ప్రాణాలు పోతాయనుకున్నా.. ‘‘నా ఆరోగ్యం క్షీణించింది. ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను. మొదట చికిత్స తీసుకోవాలి. ఆ తర్వాతే మాట్లాడగలను. త్వరలో డాక్టర్లను కలిసి చికిత్స తీసుకుంటా. విలేకరు లు, లాయర్లు కోరడం వల్లే ఇప్పుడు స్పందిస్తున్నా. జైలులో నాకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. అత్యంత కఠినమైన, దుర్భర జీవితం అనువించా. చక్రాల కుర్చీ నుంచి పైకి లేవలేకపోయా. ఇతరుల సాయం లేకుండా సొంతంగా టాయిలెట్‌కు కూడా వెళ్లలేని పరిస్థితి. ఇతరుల సాయం లేనిదే స్నానం కూడా చేయలేపోయా. జైలులోనే నా ప్రాణాలు పోతాయని అనుకున్నా. ఈరోజు నేను ఇలా ప్రాణాలతో జైలు నుంచి బయటకు రావడం అద్భుతమే చెప్పాలి. నాపై నమోదైన కేసులో సాక్ష్యాధారాలు లేవని ఉన్నత న్యాయస్థానం తేలి్చచెప్పింది. చట్టప్రకారం ఈ కేసు చెల్లదని స్పష్టం చేసింది. నాకు న్యాయం చేకూర్చడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది? నాతోపాటు నా సహచర నిందితులు పదేళ్ల విలువైన జీవితాన్ని కోల్పోయారు. ఈ జీవితాన్ని ఎవరు తిరిగి తీసుకొచ్చి ఇస్తారు? జైలుకు వెళ్లినప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను. అప్పుడు పోలియో మినహా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. కానీ, ఇప్పుడు గుండె, కండరాలు, కాలేయ సంబంధిత వ్యాధుల బారినపడ్డాను. నా గుండె ప్రస్తుతం కేవలం 55 శాతం సామర్థ్యంతో పనిచేస్తోంది. డాక్టర్లే ఈ విషయం చెప్పారు. నాకు పలు ఆపరేషన్లు, సర్జరీలు చేయాలని అన్నారు. కానీ, ఒక్కటి కూడా జరగలేదు. జైలులో సరైన వైద్యం అందించలేదు. పదేళ్లపాటు నాకు అన్యా యం జరిగింది. ఆశ ఒక్కటే నన్ను బతికించింది. ఇకపై బోధనా వృత్తిని కొనసాగిస్తా. బోధించకుండా నేను ఉండలేను’’ అని ప్రొఫెసర్ సాయిబాబా స్పష్టం చేశారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తారా? అని మీడియా ప్రశ్నించగా, భారత రాజ్యాంగాన్ని 50 శాతం అమలు చేసినా సరే సమాజంలో అనుకున్న మార్పు వస్తుందని బదులిచ్చారు. సాయిబాబా సొంత ఊరు ఆంధ్రప్రదేశ్‌లోని బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణం సమీపంలోని జనుపల్లె. ఆయన పాఠశాల, కళాశాల విద్య ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కొనసాగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించిన ఆయన అక్కడే ప్రొఫెసర్ అయ్యారు. -
GN Saibaba Poems: ఒంటరి గానాలాపన
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ఐఏ) 2013 అక్టోబర్ నెలలో మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నాడనే నెపంతో ఢిల్లీ విశ్వవిద్యాలయ ఆచార్యుడు, కవి, రచయిత ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను అరెస్ట్ చేసింది. ఆయన జైలుశిక్షకు ఎనిమిదేళ్ళు నిండాయి. బాంబే హైకోర్టు ఈ కుట్రకేసును కొట్టివేసినా, సుప్రీంకోర్టు ఆ తీర్పును సస్పెండ్ చేసింది. ఇవ్వాళ ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ. సాయిబాబా ఈ కేసు నుండి బయట పడతారు, ఎనిమిదేళ్ళ సాయి జైలు జీవితం పరిసమాప్తి అవుతుందని ప్రజాస్వామిక వాదులు ఆశగా చూస్తున్నారు. ఇవాళ్టి కోనసీమ జిల్లాలోని అమలాపురం పక్కన చిన్న గ్రామంలో జన్మించారు సాయిబాబా. కొబ్బరి చెట్ల ఆకుల ఆవాసంలో, కిరోసిన్ దీపం వెలుగులో చదువుకొని, తన జ్ఞానపరిధిని ఢిల్లీ వరకు విస్తరించుకున్నారు. ఆదివాసులపై జరుగుతున్న దాడినీ, మధ్య భారతంలోని వనరుల దోపి డీనీ, బహుళజాతి సంస్థలు నిర్వహిస్తున్న మైనింగ్ అక్రమ దోపిడీనీ, ప్రపంచం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశాడు. 2013లో అరెస్టు అయిన నాటికే సాయిబాబా ప్రజల గొంతుగా ఉన్నాడు. వికలాంగుడైనా ఆయన దృఢచిత్తుడు. జైలు జీవితమంటే జ్ఞాపకాల మధ్య జీవించడమే. ఈ ఎనిమిదేళ్ళ నిర్బంధంలో సాయిబాబా కవిగా రూపొందిన క్రమం చాలా చిత్రమైనది. జైలు కవిగా ‘నేను చావును ధిక్కరిస్తున్నాను’, ‘కబీరు కవితలు’, ‘ఫైజ్ అహ్మద్ ఫైజ్ అనువాదం’... అనేవి ఆయన కవిగా వ్యక్తీకరించుకున్న రచనలు. ‘నేను చావును ధిక్కరిస్తున్నాను’ విరసం ప్రచురణగా వచ్చింది. దీని ఆంగ్ల పుస్తకాన్ని స్పీకింగ్ టైగర్ బుక్స్, న్యూఢిల్లీ వారు ప్రచురించారు. సుదీర్ఘ కాలం జైలు జీవితంలోని అనుభవాన్ని సాయి కవిత్వం ద్వారా వ్యక్తీకరించాడు. జైలు, జైలు అధికారులు, సిబ్బంది నాలుగు గోడల మధ్య ఒక స్వాప్నికుని నిర్బంధం. క్లాసులో పాఠాలు చెప్పిన ప్రొఫెసర్ జైలు వంటి తరగతి గదిలో తన వంటి ఖైదీలతో జీవితాన్ని పంచుకునే విధానం... తన సహచరి, తోబుట్టువులు, తను పాఠాలు చెప్పే పిల్లలు... ఇవన్నీ సాయిబాబా కవితా వస్తువులు. తన రాజకీయ విశ్వాసాల కారణంగా తను ఎంచుకున్న వస్తువు కవితాత్మకంగా మలిచిన తీరు, కవిత్వ పరిభాషలో పరిణతి. విప్లవం, ప్రేమ, దిగాలు పడిన రాత్రులు, నూతన ఉదయాలు, జైలు గది కిటికీపై వాలిన ఒంటరి పిచ్చుక. ఈ కవిత్వం నిర్బంధితుని ఒంటరి గానాలాపన! సాయిబాబా విడుదల కావాలని ఢిల్లీలో విద్యార్థులు ప్రదర్శన చేస్తే ఏబీవీపీ ఆ విద్యార్థులపై దాడిచేసింది. ఆయన చేసిన నేరం మనుషులందరికీ ఒకే విలువ ఉండాలని ఘోషించడం. – అరసవిల్లి కృష్ణ, విరసం అధ్యక్షులు -
వెనక్కి వెళుతున్న విమానంలా ఉంది
న్యూఢిల్లీ: మన దేశంలో ప్రస్తుత పరిస్థితి అపసవ్య దిశలో కదులుతున్న విమానంలా ఉందని.. అది ఎప్పుడైనా ప్రమాదానికి దారి తీయొచ్చని ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ పేర్కొన్నారు. జైలు శిక్ష అనుభవిస్తున్న మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా కవితలు, లేఖలతో సంకలనం చేసిన ‘వై డూ యూ ఫియర్ మై వే సో మచ్’ పుస్తకావిష్కరణ సభలో బుధవారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 1960వ దశకంలో సంపద, భూమి పునఃపంపిణీ కోసం నిజంగా విప్లవాత్మక ఉద్యమాలు జరిగాయని.. ప్రస్తుత నాయకులు ఉచిత పథకాలతో ఓట్లకు గాలం వేస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘ఇటీవల, నేను నా పైలట్ స్నేహితుడిని అడిగాను. 'మీరు ఒక విమానాన్ని వెనుకకు నడిపించగలరా?' అని. దానికి అతడు పెద్దగా నవ్వాడు. మన దేశంలో సరిగ్గా ఇప్పుడు ఇదే జరుగుతోందని నేను చెప్పా. మన నాయకులు విమానాన్ని రివర్స్‌లో ఎగురవేస్తున్నారు. ప్రతిదీ పడిపోతోంది. పతనం దిశగా పయనిస్తున్నామ’ని అరుంధతీ రాయ్ అన్నారు. ఎంత అవమానకరం? మన దేశంలో చట్టాలు ఉన్నప్పటికీ కులం, వర్గం, లింగం, జాతి ఆధారంగా వేర్వేరుగా వర్తించబడతాయని పేర్కొన్నారు. ‘ఈ రోజు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? 90 శాతం పక్షవాతం వచ్చి ఏడేళ్లుగా జైల్లో ఉన్న ఓ ప్రొఫెసర్ గురించి మాట్లాడేందుకు కలిశాం. ఇక మనం మాట్లాడాల్సిన పనిలేదు. మనం ఎలాంటి దేశంలో జీవిస్తున్నామో చెప్పడానికి ఇది చాలు.. ఇది ఎంత అవమానకరం’ అని అరుంధతీ రాయ్ అన్నారు. 90 శాతానికి పైగా శారీరక వైకల్యాలు కలిగి, వీల్‌చైర్‌ను ఉపయోగించే జిఎన్ సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని, దేశంపై యుద్ధం చేస్తున్నారనే ఆరోపణలపై మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని సెషన్స్ కోర్టు 2017లో జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం ఆయన నాగపూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. (చదవండి: జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తి) సాయిబాబాను విడుదల చేయాలి: రాజా పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా మాట్లాడుతూ.. జిఎన్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పిన వారిపై దేశద్రోహులు, అర్బన్ నక్సలైట్స్, అర్బన్ మావోయిస్టులుగా ముద్ర వేసి జైల్లో పెడుతున్నారని ఆరోపించారు. శారీరక వైకల్యానికి తోడు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న తన భర్త పట్ల జైలులో అవమానవీయంగా ప్రవరిస్తున్నారని జీఎన్ సాయిబాబా సతీమణి వసంత ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి అంత్యక్రియలకు వెళ్లేందుకు కూడా ఆయనను అనుమతించలేదని వాపోయారు. (చదవండి: పత్రికా స్వేచ్ఛ.. నానాటికీ తీసికట్టు) -
జాబ్ నుంచి సాయిబాబా తొలగింపు
సాక్షి, న్యూఢిల్లీ: మావోలతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని రాంలాల్ ఆనంద్ కళాశాల తొలగించింది. మార్చి 31 నుంచి సాయిబాబా సేవలను రద్దు చేస్తున్నట్లు, ప్రతిగా 3నెలల జీతాన్ని సాయిబాబా బ్యాంక్ ఖాతాలో జమచేసినట్లు సాయిబాబా భార్యకు ఇచ్చిన మెమొరాండంలో కాలేజీ ప్రిన్సిపల్ రాకేశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఇంగ్లిష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన సాయిబాబాను 2014లో పుప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతితో సహా చట్టవిరుద్ధమైన సీపీఐ(మావోయిస్ట్) అగ్ర నాయకులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కాలేజీ యాజమాన్యం సాయిబాబాను వెంటనే సస్పెండ్ చేసింది. 2017 మార్చిలో వామపక్ష ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు, చట్టవిరుద్ధ కార్యకలాపా లు (నివారణ) చట్టం ప్రకారం దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేసేలా ప్రోత్సహించి నందుకు గడ్చిరోలి సెషన్స్ కోర్టు సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని దోషులుగా తేల్చింది. వారందరికీ జీవిత ఖైదు విధించింది. సాయిబాబాను 1967 చట్టవిరుద్ధ కార్యకలాపాలు (నివారణ) చట్టం, భారతీయ శిక్షాస్మృతిలోని 120బీ(క్రిమినల్ కుట్ర)లోని 13, 18, 20, 38, 39 సెక్షన్ల ప్రకారం దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. గిలానీ సేవలను ఇలా రద్దుచేయలేదు అయితే సాయిబాబా అరెస్ట్ అయినప్పటి నుంచి సాయిబాబా కుటుంబం సగం జీతాన్ని పొందుతోంది. ఉద్యోగం నుంచి తొలగిస్తూ కాలేజీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని సాయిబాబా భార్య ఖండించారు. ఇది పూర్తిగా ఉద్యోగుల హక్కుల ఉల్లంఘన అని ఆరోపించారు. ఈ విషయాన్ని కోర్టు ముందుకు తీసుకెళ్తానని సాయిబాబా భార్య వసంత తెలిపారు. సాయిబాబాకు వేసిన శిక్షకు వ్యతిరేకంగా తమ అప్పీల్ బొంబాయి హైకోర్టులో పెండింగ్‌లో ఉందని, ఈ సమయంలో తొలగిస్తూ నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్‌పై దాడి కేసులో దోషిగా నిర్ధారించబడిన గిలాని, తరువాత అన్ని ఆరోపణల నుండి నిర్దోషిగా బయటికొచ్చారన్నారు. అప్పుడు అతని సేవలను ఈ విధంగా రద్దు చేయలేదని, ఇప్పుడు సాయిబాబా సేవలను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నిస్తున్నారు. -
సాయిబాబా అడిగినవి ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: భీమా–కోరెగావ్ ఘటనలో ప్రమే యముందన్న ఆరోపణలపై నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ అధ్యాపకుడు, 90 శాతం వైకల్యంతో బాధపడుతున్న డాక్టర్.జి.ఎన్. సాయిబాబాకు అవస రమైన మందులు, పుస్తకాలు, ఉత్తరాలు వెంటనే అందజేయాలని జైలు అధికారులకు పౌరహక్కుల నేత, ‘కమిటీ ఫర్ ద డిఫెన్స్, రిలీజ్ ఆఫ్ జీఎన్ సాయిబాబా’ కన్వీనర్ ప్రొ.జి. హరగోపాల్ విజ్ఞప్తి చేశారు. మందులు, లేఖలు, అధ్యయనానికి అవసరమైన మెటీరియల్ ఇవ్వడం వంటి ప్రతీ ఖైదీకి అందాల్సిన మౌలిక హక్కులను కల్పించాలనే డిమాండ్‌తో బుధవారం నుంచి నిరాహార దీక్షకు దిగనున్నట్లు సాయిబాబా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కోరుతున్న వాటిని అందజేయాలని మంగళవారం ఓ ప్రకటనలో ప్రొ.జి.హరగోపాల్ విన్నవించారు. సాయిబాబా ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని, కరోనా సోకే ప్రమాదమూ ఉన్నందున ఆయన్ను అనవసర ఆంక్షలతో వేధించవద్దని కోరారు. ఇప్పటికే కోవిడ్ కారణంగా సాయిబాబాను కుటుంబసభ్యులు, న్యాయవాదులు కలు సుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. అందువల్ల ఆప్తులు, మిత్రుల లేఖలు అందజేయడంతో పాటు, ఆయన కోరిన పుస్తకాలూ ఇవ్వాలని పేర్కొ న్నారు. న్యాయవాది ఇచ్చిన మందులు, పుస్తకాలు కూడా సాయిబాబాకు చేరనివ్వకపోవడం శోచనీయమన్నారు. గతంలో మాతృమూర్తి అంత్యక్రియలకూ అనుమతినివ్వకపోవడం, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ పెరోల్/మెడికల్ బెయిల్ ఇవ్వకపో వడంతో ప్రస్తుతం కరోనా కారణంగా ఆయన ప్రాణానికి ప్రమాదం ఏర్పడిం దన్నారు. ఈ విషయంపై ప్రజాస్వామ్య వాదులు, సంస్థలు స్పందించి నాగ్‌పూర్ జైలు అధికారులకు విజ్ఞప్తులు పంపడం ద్వారా సాయిబాబా హక్కులు కోల్పోకుండా చూడాలని కోరారు. దీనిపై ఇప్పటికే మహారాష్ట్ర అదనపు డైరెక్టర్ జనరల్ (జైళ్లు)కు ఈ నెల 15న సాయిబాబా భార్య వసంతకుమారి వినతిపత్రం పంపించారని హరగోపాల్ తెలిపారు. ఈ విషయంలో వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సాయిబాబా నిరాహార దీక్షకు దిగకుండా ఆయన అడిగినవి ఇవ్వాలని కోరారు. -
సాయిబాబకి వైద్య బెయిల్ ఇవ్వాలి
న్యాయస్థానం ఆదేశాలతో ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబని ఆయన సోదరుడు రామ్‌దేవ్‌తోపాటు 2018 డిసెంబర్ 26న కలిశాను. నాగ్‌పూర్ జైలులో ములాఖత్ కిటికీ గుండా కాకుండా, చాలా కాలం తర్వాత నాగ్‌పూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో తనను నేరుగా చూడగలిగాను. తన పరిస్థితి గతంలో నేను ఊహించినదానికంటే ఘోరంగా ఉంది. దాదాపు కదల్లేని స్థితిలో కనిపించారు. తన చేతులు విడుపులేకుండా వణుకుతున్నాయి. బరువు కూడా బాగా కోల్పోయారు. ఇప్పుడు తనను కుర్చీలోంచి పడకమీదికి మార్చాలంటే కనీసం ఇద్దరు మనుషుల సహాయం అవసరం. డిసెంబర్ 26న వైద్య పరీ క్షల సమయంలో కూడా సాయి సోదరుడు, ఒక పోలీసు కలిసి తనను అనేక సార్లు చేతుల మీద ఎత్తుకుని మార్చాల్సి వచ్చింది. ఆ దృశ్యాలను వీడియోగా కూడా తీసి ఉంచాను కాబట్టి గౌరవనీయ న్యాయమూర్తులు కూడా చూసి సాయి పరిస్థితిని అర్థం చేసుకోవాలి. సాయిబాబకు జైల్లో మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. తనను చుట్టుముట్టిన తీవ్ర అనారోగ్య పరిస్థితులను పట్టించుకోకుండా మూత్రాశయంలో రాళ్లను మాత్రమే శస్త్ర చికిత్సతో తీసేస్తామని మాత్రమే ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు. సాయి మొత్తంమీద 19 రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రాణాంతకంగా మారిన గుండె సమస్య, కిడ్నీల్లో రాళ్లు, యూరిన్ ఇన్ఫెక్షన్ వంటి పలు సమస్యలు తనను వెంటాడుతున్నాయి. వైద్యులు సిఫార్సు చేసిన పలు పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో లేవు. అందుకే తనను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చాలని కూడా వైద్యులు సూచించారు. సాయి ఉంటున్న సెల్ ఓపెన్‌గా ఉండటంతో తనకు తీవ్రంగా చలివేస్తోంది. దీంతో తన కాళ్లు స్తంభిం చిపోయాయి. అండా సెల్ లోపల ఉష్ణోగ్రత మరింత తక్కువగా కావడంతో తాను నరకం అనుభవిస్తున్నట్లే లెక్క. తన ఎడమ భుజం స్తంభించిపోయినందున వెంటనే ఆయనకు థెరపీ చికిత్స చేయించాలని న్యూరాలజీ విభాగాధిపతి రాశారు. తనకు నిత్యం ఫిజియోథెరపీ అవసరం. కుటుంబ సభ్యుల తోడు లేకుండా అది అసాధ్యం. తీవ్రమైన నొప్పిని అనుభవిస్తూ జీవిత చరమాంకంలో లాగా గడుపుతున్నారు. జనవరి 24న ఢిపెన్స్ కౌన్సిల్ వాదన ముగిసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 11న ఉంటుంది. సాయిని జైల్లో ఉంచి రెండేళ్లవుతోంది. తనకు మెడికల్ బెయిల్ కోసం అప్లై చేసి 11 నెలలు అవుతోంది. ఈలోగానే తన ఆరోగ్య స్థితి విషమంగా మారింది. ఘన ఆహారం స్వీకరించలేనంత బలహీనంగా ఉన్నారు. 90 శాతం వైకల్యంతో ఉన్న సాయి హక్కులకు తీవ్రంగా భంగం కలుగుతోంది. తరచుగా స్పృహ కోల్పోతున్న సాయిబాబది అక్షరాలా ఇçప్పుడు చావుబతుకుల సమస్య. తన ప్రాథమిక మానవ హక్కులను గౌరవ న్యాయస్థానం ఎత్తిపట్టి పూర్తిస్థాయి అంగవైకల్యంతో ఉంటున్న సాయి వైద్య బెయిల్‌ను తదుపరి విచారణలో అయినా మంజూరు చేయాలని కోరుతున్నాను.-వసంత,ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబ సహచరి -
సాయిబాబాకు జీవితఖైదు.. హైకోర్టులో సవాల్!
గడ్చిరోలి కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేస్తామని భార్య ప్రకటన హైదరాబాద్: ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు జీవితఖైదు విధిస్తూ గడ్చిరోలి కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని ఆయన భార్య వసంత తెలిపారు. విచారణ సందర్భంగా తమ వాదనలను కిందికోర్టు పరిగణనలోకి తీసుకోలేదని ఆమె అన్నారు. తీర్పును చూస్తే.. న్యాయవ్యవస్థపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చినట్టు కనిపిస్తున్నదని ఆమె వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా సహా ఆరుగురికి మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై విచారణ జరిపిన న్యాయస్థానం వారిని దోషులుగా తేల్చింది. ప్రొఫెసర్ సాయిబాబా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిర్థారణకు వచ్చిన కోర్టు శిక్ష ఖరారు చేసింది. సాయిబాబాతో పాటు మహేష్ తిక్రి, పాండు నరోటీ, విజయ్ టిక్రి, జేఎన్‌యూ విద్యార్థులు హేమ్ మిశ్రా, మాజీ జర్నలిస్ట్ ప్రశాంత్ రాహితోపాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై గడ్చిరోలి పోలీసులు 2014లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వికలాంగుడైన ఆయన తీవ్ర అనారోగ్యం పాలుకావటంతో తర్వాత ప్రభుత్వం విడుదల చేసింది. కాగా, సాయిబాబాపై ఆరోపణలపై గడ్చిరోలి న్యాయస్థానం ఇటీవల విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది. -
ప్రొఫెసర్ సాయిబాబాకు జీవిత ఖైదు
-
ప్రొఫెసర్ సాయిబాబాకు జీవిత ఖైదు
న్యూఢిల్లీ : ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా సహా ఆరుగురికి మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై విచారణ జరిపిన న్యాయస్థానం అవి నిర్థారణ కావడంతో దోషులుగా నిర్థారించింది. ప్రొఫెసర్ సాయిబాబా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిర్థారణకు వచ్చిన కోర్టు శిక్ష ఖరారు చేసింది. సాయిబాబాతో పాటు మహేష్ తిక్రి, పాండు నరోటీ, విజయ్ టిక్రి, జేఎన్‌యూ విద్యార్థులు హేమ్ మిశ్రా, మాజీ జర్నలిస్ట్ ప్రశాంత్ రాహితో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై గడ్చిరోలి పోలీసులు 2014లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వికలాంగుడైన ఆయన తీవ్ర అనారోగ్యం పాలుకావటంతో తర్వాత ప్రభుత్వం విడుదల చేసింది. కాగా, సాయిబాబాపై ఆరోపణలపై గడ్చిరోలి న్యాయస్థానం ఇటీవల విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది. -
ప్రొఫెసర్ సాయిబాబాకు బెయిల్ మంజూరు
ఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ నాగ్ పూర్ జైల్లో ఉన్న ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు సోమవారం బెయిల్ లభించింది. ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేసిన సాయిబాబా గ్రీన్ హంట్ ను తీవ్రంగా వ్యతిరేకించారు. మావోయిస్టులతో సంబంధాలున్నట్లు ఆరోపణలు రావడంతో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా నాగ్‌పూర్‌లోని సెంట్రల్ జైల్లో 2015 మేలో లొంగిపోయారు. వికలాంగుడైన సాయిబాబాకు కనీస వసతులను కూడా జైల్లో కల్పించలేదని అతని భార్య ఆరోపించారు. మావోయిస్టు నెపంతో సాయిబాబాను వేధించవద్దని కేంద్రానికి సుప్రీం కోర్టు సూచించింది. ఎట్టకేలకు రాజద్రోహం కేసులో అరెస్టైన సాయిబాబాకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆదివాసీల హక్కుల కోసం తన భర్త పోరాడుతుంటే మావోలతో సంబంధం అంటగట్టారని సాయిబాబా భార్య అరోపించారు. పెరాలిసిస్తో బాధపడుతున్న ఆయకు కనీస వసతులు కూడా కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
జైలులో వేధిస్తున్నారు!
న్యూఢిల్లీ: విపరీతమైన ఒళ్లు నొప్పులు, హైబీపీతో బాధపడుతున్న తనకు జైల్లో కనీసం మందులు సైతం ఇవ్వకుండా పోలీసులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారంటూ ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కుటుంబ సభ్యులకు ఓ లేఖ రాశారు. సాయిబాబా నుంచి అందిన ఉత్తరంలోని వివరాలను ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ కరెన్ గ్రేబ్రియల్ మీడియాకు వెళ్లడించారు. 90 శాతం వికలాంగుడైన ఫ్రొఫెసర్ సాయిబాబాను పోలీసులు అక్రమంగా నిర్భంధించారని ఆరోపించారు. వీల్‌చైర్‌లోంచి కదలలేని తనను జైలులో ఉన్న తోటి ఖైదీలే మలమూత్ర విసర్జనకు తీసుకెళుతున్నారని లేఖలో పేర్కొన్నట్టు తెలిపారు. జైలు ఎస్పీ గతంలో హామీ ఇచ్చిన ప్రకారం జైలులో వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్ ఏర్పాటు చేయలేదని, జైలులో తనకు సంబంధంలేని ఏవో నొప్పుల మాత్రలు ఇస్తున్నారే తప్ప, ఎలాంటి వైద్య పరీక్షలు చేయించడంలేదని సాయిబాబా ఉత్తరంలో పేర్కొన్నట్లు వివరించారు. సాయిబాబాను విడిపించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కమిటీ సభ్యుల వివరాలను తర్వలోనే వెల్లడిస్తామన్నారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన సాయిబాబాకు బెయిల్ ఇవ్వడానికి గడ్చిరోలి సెషన్స్ కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. -
సాయిబాబాను విడిచిపెట్టండి
న్యూఢిల్లీ: మహారాష్ట్ర పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా ఆరోగ్యం బాగా లేనందున మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన విడుదల చేయాలని ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) అధ్యాపకులు కోరుతున్నారు. అసలు ఆయనను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తూ డీయూ అధ్యాపకుల సంఘం (డూటా) బుధవారం ఆందోళన నిర్వహించింది. సాయిబాబా కుటుంబ సభ్యులు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే తనకు సరైన సదుపాయాలు కల్పించకుంటే నాగపూర్ జైలులోనే నిరాహార దీక్షకు దిగుతానని సాయిబాబా హెచ్చరించారు. ‘కనీసం వెలుతురు కూడా లేని చీకటిగదిలో వికలాంగుడ్ని ఎలా ఉంచుతారో అర్థం కావడం లేదు. నా భర్తను సస్పెండ్ చేసి క్వార్టర్ నుంచి మమ్మల్ని వెళ్లగొట్టాలని డీయూ యాజమాన్యం భావిస్తోంది’ అని సాయిబాబా బార్య వసంత మీడియా సమావేశంలో అన్నారు. పోలీసులకు ఆయన అన్ని విధాలా సహకరిస్తున్నారని, మొబైల్ నంబర్ మార్చిన విషయాన్ని కూడా ఆయన తెలియజేశారని వివరించారు. ఒక అధ్యాపకుణ్ని చీకటిగదిలో నిర్బంధించి హింసించడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని డూటా అధ్యక్షురాలు నందితా నారాయణ్ విమర్శించారు. పోలీసుల అణచివేతపై పోరాడటానికి ‘డీయూ కమ్యూనిటీ’ పేరుతో ప్రత్యేక సంఘంగా ఏర్పడ్డామని, ఆయనకు బెయిల్ వచ్చేదాకా పోరాడుతామని ప్రకటించారు. పోలీసులు ప్రొఫెసర్ సాయిబాబాను అపహరించారని సినీ రూపకర్త సంజయ్ కక్ ఆరోపించారు. ఆపరేషన్ గ్రీన్ హంట్‌లో భాగంగానే పోలీసులు ఈ పనిచేశారని స్పష్టం చేశారు. సాయిబాబాకు జరుగుతున్న అన్యాయంపై డీయూ యాజమాన్యం కూడా స్పందించాలని మాజీ న్యాయమూర్తి జస్టిస్ సచార్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని నల్లమిల్లి గ్రామానికి చెందిన సాయిబాబాను ఈ నెల తొమ్మిదిన అరెస్టు చేశారు. పీయూసీఎల్ ఖండన మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో సాయిబాబాను అరెస్టు చేయడాన్ని పౌరహక్కుల ప్రజాసంఘం (పీయూసీఎల్) గురువారం ఖం డించింది. ఆయనను అరెస్టు చేసిన విధానం అత్యంత క్రూరంగా ఉందని పీయూసీఎల్ విడుదల చేసిన పత్రికా ప్రకటన పేర్కొంది. ఆయన పోలీసులకు అన్ని విధాలా సహకరించారని స్పష్టం చేసింది. జాతీయ మానవ హక్కుల సంఘం ఈ కేసులో జోక్యం చేసుకొని గడ్చిరోలీ పోలీసులపై విచారణ నిర్వహించాలని డిమాండ్ చేసింది. తీవ్రవైకల్యంతో వీల్‌చెయిర్‌కు పరిమితమైన ఈ ప్రొఫెసర్ రామ్‌లాల్ ఆనంద్ కాలేజీలో ఇంగ్లిష్ సబ్జెక్టు బోధిస్తున్నారు. -
ప్రొఫెసర్ సాయిబాబాపై సస్పెన్షన్ వేటు!
న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలెదుర్కోంటున్న ఫ్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను సస్సెన్షన్ వేటు వేసినట్టు ఢిల్లీ యూనివర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సాయిబాబాపై సస్పెన్షన్ వేటు వేయాలని రామ్ లాల్ ఆనంద్ కాలేజి పాలన యంత్రాంగం సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఢిల్లీ యూనివర్సిటీ జాయింట్ డీన్ మలయ్ నీరవ్ తెలిపారు. రామ్ లాల్ ఆనంద్ కళాశాలలో సాయిబాబా ప్రొఫెసర్ గా సేవలందిస్తున్నారు. మావోలతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై మహారాష్ట్ర పోలీసులు సాయిబాబాను మే 9 తేదిన అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన సాయిబాబాను సస్పెండ్ చేయాలంటూ విద్యార్ధులు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. విద్యార్ధుల ఒత్తిడి మేరకు కళాశాల యాజమాన్యం సాయిబాబాపై చర్య తీసుకుంది. సామాన్య కుటుంబంలో జన్మించిన సాయిబాబా వికలాంగుడు. ఆయన అమలాపురం పట్టణానికి సమీపంలోని నల్లమిల్లి గ్రామానికి చెందిన వాడు. -
సాయిబాబాను విడుదల చేయాలి:వసంత
భార్య వసంత డిమాండ్ ఆయన ఆమరణ దీక్షకు సన్నద్ధమతున్నారని వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని ఆయన భార్య వసంత డిమాండ్ చేశారు. ఢి ల్లీ యూనివర్సిటీ అధ్యాపక బృందం నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 90 శాతం వికలాంగుడైన తన భర్తను కనీస సదుపాయాలు లేని నాగ్‌పూర్ జైలులో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ముందునుంచీ తమ కుటుంబంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వాపోయారు. ‘నాగ్‌పూర్ జైలులో ఉన్న నా భర్తను ఆయన సోదరుడు రాందేవుడు కలిశారు. వెలుతురు లేని చిన్నసైజు సెల్లో ఆయనను ఉంచారు. మిగిలిన ఖైదీలతో కలిసే అవకాశం లేకుండా ఒంటరిగా పెట్టారు. వీల్ చైర్లోఉండే ఆయన అక్కడి సంప్రదాయ మరుగుదొడ్లను ఉపయోగించడం చాలా కష్టం. ఆయన హార్ట్‌పేషెంట్, హైబీపీ ఉంది. వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఎక్కువ సేపు కుర్చీలోనూ కూర్చోలేరు. కనీసం మందులు కూడా ఇవ్వట్లేదు. పోలీసులు ఇలాగే తనను ఇబ్బందిపెడితే గురువారం నుంచి ఆమరణ దీక్షకు దిగుతానని ఆయన రాందేవుడికి చెప్పారు’ అని వసంత అన్నారు. ఢిల్లీ వర్సిటీలో అడ్మిషన్ల అవకతవకలపై నిలదీసినందుకు వర్సిటీ పరిపాలన విభాగం సైతం తమపై కక్ష కట్టిందన్నారు. సాయిబాబాను విచారించనున్న రాష్ట్ర ఎస్ఐబీ మహారాష్ట్ర పోలీసుల అదుపులోఉన్న రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ జాతీయ సహాయ కార్యదర్శి సాయిబాబాను విచారించడానికి రాష్ట్ర యాంటీ నక్సలైట్ నిఘా విభాగం ఎస్ఐబీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆయనను రాష్ట్రానికి తీసుకొచ్చి విచారించడమా, లేక మహారాష్ట్ర వెళ్లి విచారించాలా అనే అంశంపై తర్జనభర్జన పడుతున్నారు. ఆయనపై రాష్ట్రంలో కేసులు లేనందున అక్కడికే వెళ్లి విచారించడమే మేలని వారు భావిస్తున్నట్లు సమాచారం. -
డీయూ విద్యార్థుల నిరసన ప్రదర్శన
న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాలున్నాయనే సాకుతో ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ)తోపాటు జవహర్‌లాల్‌నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థులు శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. కెజీ మార్గ్‌లోని మహారాష్ట్ర సదన్ ఎదుట జరిగిన ఈ కార్యక్రమంలో 50 నుంచి 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం మహారాష్ట్ర సదన్ రెసిడెంట్ కమిషనర్‌కు వారు ఓ వినతిపత్రం సమర్పించారు. సాయిబాబాను అనవసరంగా ఈ కేసులో ఇరికించారని, ఇది అక్రమ నిర్బంధమని వారు తమ వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు మాట్లాడుతూ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా అక్రమ నిర్బంధాన్ని ఖండిస్తున్నామన్నారు. -
'మావోయిస్టులతో నాభర్తకు సంబంధాలు లేవు'
న్యూఢిల్లీ: మావోయిస్టులతో నా భర్తకు సంబంధాలు లేవు అని ఢిల్లీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా భార్య వసంత తెలిపారు. మావోయిస్టులతో సంబంధముందనే ఆరోపణలతో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివాసుల హక్కుల కోసం సాయిబాబా పోరాటం చేస్తున్నారని సాక్షి టెలివిజన్ కిచ్చిన ఇంటర్వ్యూలో వసంత తెలిపారు. గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా నా భర్త పోరాడారు. ప్రభుత్వం కక్ష కట్టి వేధిస్తోంది. మైనింగ్ కంపెనీలకు ప్రభుత్వం కొమ్ముకాస్తోంది అని వసంత అన్నారు. నా భర్తకు ఆరోగ్యం సరిగా లేదని, వెంటనే నా భర్తను విడుదల చేయాలని ప్రభుత్వానికి వసంత విజ్ఞప్తి చేశారు. పోలీసులు అక్రమంగా ఆయన్ను తీసుకెళ్లారని వసంత అరోపించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం చెందిన జీఎన్ సాయిబాబాను విడుదల చేయాలని పౌరహక్కుల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. -
బొగ్గు కేటాయింపుల కుంభకోణంలో మరో ఎఫ్ఐఆర్!
న్యూఢిల్లీ: బొగ్గు కేటాయింపుల కుంభకోణంలో ముంబైకి చెందిన టాప్ వర్త్ ఉర్జా అండ్ మెటల్ లిమిటెడ్ కంపెనీపై తాజాగా ఎఫ్ఐఆర్ ను సీబీఐ దాఖలు చేసింది. ఈకేసులో ముంబైకి చెందిన కంపెనీ డైరెక్టర్, ఇంకా గుర్తు తెలియని వ్యక్తులను దోషులగా చేర్చింది. 1993-2005లో జరిగిన బొగ్గు కేటాయింపుల వ్యవహారంలో సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసులో ఆ కంపెనీ డైరెక్టర్ సురేంద్ర లోధా, మరో డైరెక్టర్ ఓంప్రకాశ్ నెవాతియాలపై ఇండియన్ పీనల్ కోడ్ 120, 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. గతంలో ఈ కంపెనీని విరంగణ స్టీల్ గా పిలువబడేది. ఇటీవల ఈ కంపెనీకి చెందిన నాగపూర్, యవత్మల్, ముంబైలోని కార్యాలయాలపై సీబీఐ దాడులు నిర్వహించింది.