'మావోయిస్టులతో నాభర్తకు సంబంధాలు లేవు'
Published Fri, May 9 2014 9:11 PM | Last Updated on Sat, Sep 2 2017 7:08 AM
న్యూఢిల్లీ: మావోయిస్టులతో నా భర్తకు సంబంధాలు లేవు అని ఢిల్లీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా భార్య వసంత తెలిపారు. మావోయిస్టులతో సంబంధముందనే ఆరోపణలతో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆదివాసుల హక్కుల కోసం సాయిబాబా పోరాటం చేస్తున్నారని సాక్షి టెలివిజన్ కిచ్చిన ఇంటర్వ్యూలో వసంత తెలిపారు. గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా నా భర్త పోరాడారు. ప్రభుత్వం కక్ష కట్టి వేధిస్తోంది. మైనింగ్ కంపెనీలకు ప్రభుత్వం కొమ్ముకాస్తోంది అని వసంత అన్నారు.
నా భర్తకు ఆరోగ్యం సరిగా లేదని, వెంటనే నా భర్తను విడుదల చేయాలని ప్రభుత్వానికి వసంత విజ్ఞప్తి చేశారు. పోలీసులు అక్రమంగా ఆయన్ను తీసుకెళ్లారని వసంత అరోపించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం చెందిన జీఎన్ సాయిబాబాను విడుదల చేయాలని పౌరహక్కుల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది.
Advertisement
Advertisement