vasantha
-
చైత్ర మాసం విశిష్టత? వసంత నవరాత్రులు ఎందుకు చేస్తారు?
“ఋతూనాం కుసుమాకరాం” అని భగవానుడు స్వయంగా తానే వసంత ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం. సంవత్సరానికి తొలి మాసం కూడా. చైత్రమాసం అనగానే మనకి ఉగాది , శ్రీరామనవమి గుర్తుకొస్తాయి. అవే కాదు , దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం , యజ్ఞ వరాహమూర్తి జయంతి , సౌభాగ్యగౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి. అలా చైత్ర మాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక , అనేక ఆధ్యాత్మిక , పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా. అంతటి విశిష్టత గల చైత్ర మాసంలో దాగున్న విశిష్టతలేంటో సవివరంగా తెలుసుకుందామా!. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమినాడు చిత్త నక్షత్రంతో కూడి ఉంటాడు. సూర్యుడు కూడా మొదటిరాశియైన మేషరాశిలో సంచరిస్తున్నాడు. చైత్ర శుద్ధ పాడ్యమి – ఉగాది. ప్రకృతి చిగురించే వసంతకాలాన్ని ఉత్సాహంగా స్వాగతించే పండుగ ఉగాది. చెట్లు, చేమలే కాదు, పశుపక్ష్యాదులు కూడా వసంతాగమనాన్ని స్వాగతిస్తాయి. ఏడాదికి యుగము అనే పేరు కూడా ఉంది. అందుకే యుగాది, ఉగాది అయ్యింది. చాంద్రమానాన్ని అనుసరించేవారే కాక , సౌరమానాన్ని అనుసరించే కొంతమంది కూడా ఈ రోజు నుంచి సంవత్సరాదిని జరుపుకుంటారు. చైత్ర శుద్ధ పాడ్యమి – ఉగాది నుండి చైత్ర శుద్ధ నవమి వరకూ వసంత నవరాత్రులు. మనం సంవత్సరంలో మనం మూడు సార్లు నవరాత్రులు జరుపుకుంటాం. మొదటిది చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు , రెండవది భాద్రపదమాసంలో వచ్చే గణపతి నవరాత్రులు , మూడవది ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు. సంవత్సరంలో మొదటగా వచ్చే వసంత నవరాత్రులని ప్రజలంతా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఈ నవరాత్రులలో లలితాదేవిని కూడా ఆరాధించాలి. అంతేకాకుండా ఈ తొమ్మిది రోజులూ రామాయణాన్ని పారాయణ చేసి, నవరాత్రుల చివరి రోజున సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా చేసి, చూసి తరిస్తారు. రామాయణానికి ఈ వసంత నవరాత్రులకి ఎంతో అవినాభావ సంబంధం వుంది. రామాయణం లోని ఎన్నో ముఖ్య ఘట్టాలు ఈ తొమ్మిది రోజులలో జరిగాయి. రాముడు జన్మించినది మొదలు , వనవాసానికి వెళ్ళటం , దశరథుని మరణం , సీతాపహరణం , రావణుని సంహారానంతరం సీతారాములు అయోధ్యానగరానికి చేరటం , శ్రీరామపట్టాభిషేకము వంటివి ఎన్నో ముఖ్యమైన సంఘటనలు ఈ చైత్రమాసంలో జరిగాయి. చైత్రంలో జరపుకునే పండుగలు.. చైత్ర శుద్ధ విదియ నాడు బాలచంద్రుడిని బాలేందు వ్రతం అని పూజిస్తారు. చంద్రునికో నూలుపోగు అని విదియ నాటి బాలచంద్రునికి కొత్త నూలుపోగు అని సమర్పిస్తారు. చంద్రుడు జ్ఞానప్రదాత. ఆయనకీ నూలుపోగు సమర్పించి , మనకి జ్ఞానాన్నిమ్మని కోరుతారు. చైత్ర శుద్ధ తదియ – డోలాగౌరీ వ్రతం(సౌభాగ్య గౌరీ వ్రతం), సౌభాగ్య శయన వ్రతం, ఆ రోజున పార్వతీపరమేశ్వరులను దమనంతో పూజించి , డోలోత్సవం నిర్వహిస్తారు. చవితితో కూడిన తదియ రోజున ఈ ఉత్సవం చేస్తారు. పార్వతీ దేవి శివుడిని భర్తగా పొందటం కోసం తపస్సు చేసినప్పుడు , చైత్ర శుద్ధ తదియ నాడు ఆ తపస్సు ఫలించింది. సీతాదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లు తెలుస్తోంది. సౌభాగ్యాన్ని , పుత్రపౌత్రాదులను , భోగభాగ్యాలను ప్రసాదించే ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు. ఈ రోజు మత్స్య జయంతి కూడా. – శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమెత్తి సోమకుణ్ణి వధించి , వేదాలను రక్షించిన రోజు. చైత్ర శుద్ధ పంచమి – లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు మరియు నాగులను కూడా ఈ రోజు పూజించాలి. అనంత , వాసుకి , తక్షక , కర్కోటక , శంఖ , కుళిక , పద్మ , మహాపద్మ అనే మహానాగులను పూజించి , పాలు , నెయ్యి నివేదించాలి. అశ్వములను కూడా ఈ రోజు పూజించాలి. శ్రీ మహావిష్ణువు అవతారాలలో హయగ్రీవావతారం కూడా ఒకటి. ఈ రోజు శ్రీరామ రాజ్యోత్సవం అనగా రాముల వారికి పట్టాభిషేకము జరిగిన రోజు. శ్రీరామునిగా అవతరించిన రోజు.. శ్రీరామ పట్టాభిషేకము చేయించిన మంచిది. ఒకవేళ చేయలేకపోయినా , శ్రీరామాయణంలో రామపట్టాభిషేకము ఘట్టము పారాయణము చేయడం మంచిది. చైత్ర శుద్ధ అష్టమి –భవానిదేవి ఆవిర్భవించిన రోజు మరియు అశోకాష్టమి అంటారు. ఆరోజు భవాని మాతని పూజిస్తారు. స్త్రీలు అమ్మవారిని అశోక పుష్పాలతో పూజించి, అశోకవృక్షం చిగురుని సేవిస్తే గర్భ శోకం కలుగదు అని శాస్త్రము చెప్పింది. చైత్ర శుద్ధ నవమి – శ్రీరామనవమి . శ్రీమహావిష్ణువు తన పూర్ణావతారము అయిన శ్రీరామునిగా అవతరించిన రోజు. ఈ రోజు ఊరూరా, వాడవాడలా శ్రీసీతారాముల కళ్యాణం చేస్తారు. నూతన సంవత్సరంలో సీతారాముల కళ్యాణం జరిగిన తరువాతే ప్రజలు తమ ఇంట వివాహాది శుభకార్యాలు తలపెడతారు. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు జన్మించిన సంవత్సరం విళంబినామ సంవత్సరం. చైత్ర శుద్ధ ఏకాదశి – వరూధిన్యేకాదశి , కామద ఏకాదశి అని అంటారు. చైత్ర శుద్ధ పౌర్ణమి – స్త్రీలు చిత్రవర్ణాలు గల (రక రకాల రంగులు) వస్త్రాలను దానం చేయటం వల్ల సౌభాగ్యం కలుగుతుంది. ఈ రోజు చిత్రగుప్తుని వ్రతం చేసిన మంచిది. ఉత్తర భారతదేశంలోని వారు హనుమజ్జయంతిని జరుపుకుంటారు. చైత్ర బహుళ త్రయోదశి – యజ్ఞవరాహ జయంతి. సృష్ట్యాదిలో భూమిని సుప్రతిష్ఠితం చేయడానికి యజ్ఞవరాహమూర్తి అవతరించిన రోజు. ఇలా మాసమంతా ఎన్నో విశిష్టతలు , ప్రాధాన్యతలు కలిగిన మాసం చైత్ర మాసం. ఈ మాసంలో జ్ఞాన సముపార్జన చేయమని సూచించారు. మనమంతా కూడా ఉత్సాహంతో ఉగాదిని జరుపుకుని , రామాయణ సారాన్ని గ్రహించి ఆచరించే యత్నం చేద్దాం. సీతారాముల కళ్యాణం చూసి తరిద్దాం. ఈ ఏడాది కొత్తగా అయోధ్యలో ఏర్పాటైన రామాలయంలో సీతా రాముల కళ్యాణం వైభవోపతంగా జరగనుండటం విశేషం. (చదవండి: Ugadi 2024 : ఈ ఏడాది ఉగాది పేరేంటి? ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ ) -
టీడీపీలో ఆరని మంటలు
సాక్షి నెట్వర్క్: టీడీపీలో టికెట్ల లొల్లి చల్లారేలా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అసమ్మతి జ్వాలలు చెలరేగుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడినవారు ఒక్కొక్కరిగా రోడ్డెక్కుతున్నారు. పార్టీకి వ్యతిరేకంగా ర్యాలీలు, నిరసనలు చేస్తున్నారు. ఏళ్ల తరబడి పార్టీకోసం కష్టపడి పనిచేసిన వారిని కాదని డబ్బు మూటలతో వచ్చిన వారికి చంద్రబాబు ప్రాధాన్యమిస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదే జరిగితే ఇండిపెండెంట్‌గానైనా బరిలోకి దిగుతామని పార్టీకి హెచ్చరికలు పంపుతున్నారు. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా గారపాటి సీతారామాంజనేయ చౌదరికి టికెట్ కేటాయించాలని బీజేపీ జిల్లా నాయకులు కోరుతున్నారు.సంవత్సరాల తరబడి ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న గారపాటిని కాదని స్థానికేతరుడైన పుట్టాను ఖరారు చేయడం అన్యాయమని ఆ పార్టీ నేతలు ఏలూరు జిల్లా భీమడోలులో వాపోయారు. మరోవైపు ఇదే పార్లమెంట్ నుంచి టీడీపీ టికెట్ ఆశించిన గొర్రుముచ్చు గోపాల్ యాదవ్ చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. సింగపూర్‌లో ఉన్నతస్థితిలో ఉన్న తనను ఏలూరు టికెట్ ఆశ చూపి ఇక్కడికి తీసుకొచ్చారని నిలదీశారు. తనతో కోట్లు ఖర్చు చేయించారని, చివరికి మొండిచేయి చూపారని వీడియో విడుదల చేశారు.ఆదివారం కామవరపుకోటలో ఏర్పాటు చేయబోయే ఆత్మీయ సమావేశంలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అల్టిమేటం జారీచేశారు. శ్రీకాకుళం టీడీపీలో అసమ్మతి మంటలు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సీటు రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కార్యకర్తలతో శనివారం సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థి మామిడి గోవిందరావుపై దుమ్మెత్తిపోశారు. అవసరమైతనే ఇక్కడి నుంచి ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తామని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ స్పష్టం చేశారు. మరోవైపు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రచారం చేసుకున్న సానా సతీష్ కు చుక్కెదురైంది. జనసేన నుంచి టీటైమ్ అధినేత తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌కు ఈ సీటు ఖరారు చేయడంతో టిక్కెట్టు ఆశించిన సతీష్ వర్గీయులు మండిపడుతున్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో టీడీపీ టికెట్ మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుకు కేటాయించాలని ఆయన వర్గీయులు నిరసనలు కొనసాగిస్తున్నారు. పైలా ప్రసాదరావుకు టీడీపీ టికెట్ కేటాయించడంపై మాడుగుల మండలం కె.జె.పురంలో తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు కర్రి నాగమణి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. నాన్ లోకల్ వద్దు, లోకల్ ముద్దు అంటూ గవిరెడ్డి అనుచరులు దేవరాపల్లిలో ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ప్రతిసారీ మోసం: దేవినేని స్మిత టీడీపీ తమను ప్రతిసారీ మోసం చేస్తోందని ఆ పార్టీ పెనమలూరు నియోజకవర్గ నాయకురాలు దేవినేని స్మిత ఆరోపించారు. పెనమలూరు టికెట్ తమకెందుకు ఇవ్వలేదని, తమ కుటుంబానికి ఎందుకు అన్యాయం చేస్తున్నారని అధిష్టానాన్ని ఆమె నిలదీశారు. ఆడవాళ్లమైనా నియోజకవర్గం మొత్తం తిరిగి పార్టీ కోసం పనిచేస్తే లాబీయింగ్ చేసుకున్న బోడె ప్రసాద్‌కు టికెట్ ఇచ్చారన్నారు. ముందు బోడెకు ఇవ్వబోమని ప్రకటించిన చంద్రబాబు తర్వాత ఎందుకు మొత్తబడ్డారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ ప్రలోభాలకు తలొగ్గారో ఆయన చెప్పాలని నిలదీశారు. తమకు టికెట్ కేటాయిస్తేనే తన తండ్రి ఆత్మ శాంతిస్తుందన్నారు. త్వరలోనే కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. నమ్ముకున్న ప్రజలను, నమ్మి పదవి కట్టబెట్టిన పార్టీని వెన్నుపోటు పొడిచి, పార్టీ మారి టీడీపీ నుంచి మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీలో ఉన్న వసంత వెంకట కృష్ణప్రసాద్‌ను ఓడించడమే లక్ష్యంగా ఇండిపెండెంట్‌గా పోటీ చేయనున్నట్లు జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ నాయకులు పులిపాక ప్రకాష్ తెలిపారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశానన్నారు. తాను వసంతను ఓడించడానికే పని చేస్తానని స్పష్టం చేశారు. -
చిక్కిన మదపుటేనుగు..
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా గుడిపాలలో భయోత్పాతం సృష్టించిన ఒంటరి మదపుటేనుగు ఎట్టకేలకు అధికారులకు చిక్కింది. తమిళనాడు అటవీ ప్రాంతం నుంచి మంగళవారం రాత్రి వచ్చిన ఏనుగుల గుంపులో ఓ ఏనుగు తప్పిపోయి.. బుధవారం చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో వెంకటేశులు, సెల్వి అనే భార్యభర్తలను తొక్కి చంపిన ఏనుగు, కార్తిక్ అనే యువకుడిని తీవ్రంగా గాయపరిచింది. బుధవారం రాత్రి గుడిపాలలో అటవీప్రాంతాల్లోకి వెళ్లిపోయిన ఏనుగు తమిళనాడు రాష్ట్రంలోకి వెళ్లిపోయింది. గురువారం తెల్లవారుజామున తమిళనాడు రాష్ట్రం పెరియ బోడినత్తం గ్రామంలోకి వెళ్లిపోయి అక్కడ వసంత (54) అనే మహిళను తొండంతో ఎత్తి కిందకేసి కాలితో తొక్కి చంపేసింది. ఒంటరి ఏనుగు బీభత్సంలో ఓ మేక కూడా చనిపోయింది. అక్కడి నుంచి మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించి చిత్తూరు జిల్లా గుడిపాల మండలానికి చేరుకుంది. ఒంటరి ఏనుగు 197–రామాపురం గ్రామంలోకి రావడంతో మళ్లీ ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఏనుగు జాడ గుర్తించిన అటవీశాఖ అధికారులు అప్పటికే కుమ్కీ ఏనుగులతో సిద్ధంగా ఉంటూ మదపుటేనుగును వెంబడించి డప్పులు కొడుతూ, టపాకాయలు పేల్చుతూ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. తిరుపతి జూ పార్కు నుంచి వచ్చిన వైద్యుల సాయంతో మదపుటేనుగుకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో అది కిందపడిపోయింది. తాళ్ల సాయంతో ఏనుగును బంధించి తిరుపతి జూ పార్కుకు తరలించారు. ఈ మొత్తం ఆపరేషన్‌లో చిత్తూరు అటవీశాఖ అధికారి చైతన్యకుమార్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. మరోవైపు ఏనుగు దాడిలో మృతిచెందిన దంపతులకు అంత్యక్రియలు నిర్వహించగా, ప్రభుత్వం అందించిన రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మృతుల కుటుంబ సభ్యులకు అందజేశారు. -
ఆపద్బాంధవి 108
చౌడేపల్లె: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైద్య స్వరూపమే మారిపోయింది. పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగానే 108 వ్యవస్థను మరింతగా బలోపేతం చేసింది. ఫోన్ వస్తే చాలు నిమిషాల్లో ఘటనా స్థలానికి సిబ్బంది చేరిపోతున్నారు. రోగులకు కావాల్సిన సహాయం అందించి మన్ననలు అందుకుంటున్నారు. ఇలాంటిదే చిత్తూరు జిల్లాలో జరిగింది. చౌడేపల్లె మండలం, పందిళ్లపల్లె పంచాయతీ, ముదిరెడ్డిపల్లెకు చెందిన రాజశేఖర్, వసంత దంపతులు సోమల మండలం, పెద్ద ఉప్పరపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న మామిడితోటలో కాపలా ఉన్నారు. ఇక్కడకు ఎలాంటి దారి వసతి లేదు. సెల్‌ఫోన్ సిగ్నల్ కూడా అందదు. వసంత నిండు గర్భిణి కావడంతో ఆదివారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. రాజశేఖర్ సెల్ సిగ్నల్ ఉన్న ప్రాంతానికి వచ్చి 108కు ఫోన్ చేశారు. సమాచారం అందుకొన్న 108 సిబ్బంది గణేష్, ప్రసాద్ అతికష్టం మీద మామిడి తోటకు చేరారు. అక్కడి నుంచి రోడ్డు మార్గానికి కిలోమీటరు దూరం ఉండటంతో స్ట్రెచర్‌పైనే గర్భిణిని మోసుకువచ్చారు. మార్గమధ్యంలో పురిటి నొప్పులు అధికమవడంతో మామిడితోటలోనే సుఖ ప్రసవం చేశారు. వసంత మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను అటవీ ప్రాంతం నుంచి చౌడేపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సిబ్బంది సేవలను గ్రామస్తులు, అధికారులు అభినందించారు. -
అనారోగ్యంతో నటి కన్నుమూత
సీనియర్ నటి వి.వసంత (82) శుక్రవారం సాయంత్రం చైన్నెలోని స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూశారు. చైన్నె వెస్ట్ కేకేనగర్‌లోని వి.డి.లోకనాథ్ వీధిలోని నివసిస్తున్న ఈమె రంగస్థల నటి. మొదట్లో ఎలిసై మన్నర్ ఎం.కె.త్యాగరాజ భాగవతార్ నాటక ట్రూప్‌లో పలు నాటకాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. అనంతరం సినీ రంగప్రవేశం చేసి ఇరవుమ్ పగలుమ్ అనే చిత్రంలో జయశంకర్‌కు జంటగా నటించారు. అదే విధంగా కార్తికై దీపం చిత్రంలో నటుడు అశోక్ సరసన నాయకిగా నటించారు. ఆ తర్వాత మూండ్రామ్పిరై చిత్రంలో నటి శ్రీదేవికి తల్లిగాను, రాణువవీరన్ చిత్రంలో రజనీకాంత్‌కు అమ్మగా నటించి గుర్తింపు పొందారు. అలా మూండ్రుముగం చిత్రంలో పాటు పలు తమిళం, తెలుగు, మలయాళం వంటి భాషల్లో వివిధ రకాల పాత్రల్లో నటించారు. 100కు పైగా చిత్రాల్లో నటించారు. కొద్ది నెలలుగా అనారోగ్యానికి గురైన వి.వసంత శుక్రవారం సాయంత్రం 3.40 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఈమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతానం వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో వి.వసంత అంత్యక్రియలు రామాపురంలో శ్మశాన వాటికలో జరగనున్నాయి. చదవండి: పుష్ప 2లో రష్మిక చనిపోతుందా? క్లారిటీ ఇదే! -
వెనక్కి వెళుతున్న విమానంలా ఉంది
న్యూఢిల్లీ: మన దేశంలో ప్రస్తుత పరిస్థితి అపసవ్య దిశలో కదులుతున్న విమానంలా ఉందని.. అది ఎప్పుడైనా ప్రమాదానికి దారి తీయొచ్చని ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ పేర్కొన్నారు. జైలు శిక్ష అనుభవిస్తున్న మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా కవితలు, లేఖలతో సంకలనం చేసిన ‘వై డూ యూ ఫియర్ మై వే సో మచ్’ పుస్తకావిష్కరణ సభలో బుధవారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 1960వ దశకంలో సంపద, భూమి పునఃపంపిణీ కోసం నిజంగా విప్లవాత్మక ఉద్యమాలు జరిగాయని.. ప్రస్తుత నాయకులు ఉచిత పథకాలతో ఓట్లకు గాలం వేస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘ఇటీవల, నేను నా పైలట్ స్నేహితుడిని అడిగాను. 'మీరు ఒక విమానాన్ని వెనుకకు నడిపించగలరా?' అని. దానికి అతడు పెద్దగా నవ్వాడు. మన దేశంలో సరిగ్గా ఇప్పుడు ఇదే జరుగుతోందని నేను చెప్పా. మన నాయకులు విమానాన్ని రివర్స్‌లో ఎగురవేస్తున్నారు. ప్రతిదీ పడిపోతోంది. పతనం దిశగా పయనిస్తున్నామ’ని అరుంధతీ రాయ్ అన్నారు. ఎంత అవమానకరం? మన దేశంలో చట్టాలు ఉన్నప్పటికీ కులం, వర్గం, లింగం, జాతి ఆధారంగా వేర్వేరుగా వర్తించబడతాయని పేర్కొన్నారు. ‘ఈ రోజు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? 90 శాతం పక్షవాతం వచ్చి ఏడేళ్లుగా జైల్లో ఉన్న ఓ ప్రొఫెసర్ గురించి మాట్లాడేందుకు కలిశాం. ఇక మనం మాట్లాడాల్సిన పనిలేదు. మనం ఎలాంటి దేశంలో జీవిస్తున్నామో చెప్పడానికి ఇది చాలు.. ఇది ఎంత అవమానకరం’ అని అరుంధతీ రాయ్ అన్నారు. 90 శాతానికి పైగా శారీరక వైకల్యాలు కలిగి, వీల్‌చైర్‌ను ఉపయోగించే జిఎన్ సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని, దేశంపై యుద్ధం చేస్తున్నారనే ఆరోపణలపై మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని సెషన్స్ కోర్టు 2017లో జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం ఆయన నాగపూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. (చదవండి: జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తి) సాయిబాబాను విడుదల చేయాలి: రాజా పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా మాట్లాడుతూ.. జిఎన్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పిన వారిపై దేశద్రోహులు, అర్బన్ నక్సలైట్స్, అర్బన్ మావోయిస్టులుగా ముద్ర వేసి జైల్లో పెడుతున్నారని ఆరోపించారు. శారీరక వైకల్యానికి తోడు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న తన భర్త పట్ల జైలులో అవమానవీయంగా ప్రవరిస్తున్నారని జీఎన్ సాయిబాబా సతీమణి వసంత ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి అంత్యక్రియలకు వెళ్లేందుకు కూడా ఆయనను అనుమతించలేదని వాపోయారు. (చదవండి: పత్రికా స్వేచ్ఛ.. నానాటికీ తీసికట్టు) -
దివ్య హత్య అత్యంత క్రూరమైంది..
సాక్షి, విశాఖ : నగరంలో దారుణంగా హత్యకు గురైన దివ్య హత్య కేసులో రెండవ రోజు విచారణ కొనసాగుతుంది. ప్రధాన నిందితురాలు వసంత, ఆమెకు సహకరించిన గీత అలియాస్ కుమారి లను పోలీసులు కస్టడీ లో తీసుకుని విచారిస్తున్నారు. వసంత ఫోన్ కాల్ డేటా ను తీసుకున్నారు. అయితే దివ్యను చంపిన తర్వాత నిందితురాలు వసంత మొబైల్లో ఉన్న కాల్ డేటా మొత్తాన్ని ఓ మొబైల్ దుకాణానికి తీసుకు వెళ్లి డిలీట్ చేయించినట్లు ఇంటరాగేషన్‌లో తేలింది. దీంతో సదరు మొబైల్ దుకాణ యజమానిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. (దివ్య హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్) ఈ సందర్భంగా దివ్య హత్యకేసు విచారణపై నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా గురువారమిక్కడ మాట్లాడుతూ.. నిందితులు వసంత, గీతను కస్టడీకి తీసుకున్నాం. మిగిలిన నలుగురు నిందితులను కూడా పోలీస్ రిమాండ్‌కు అప్పగించమని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాం. న్యాయస్థానం అనుమతితో వారిని కస్టడీలోకి తీసుకుంటాం. దివ్య హత్య అత్యంత క్రూరమైంది. ఆమెకు ఆరురోజుల పాటు తిండి పెట్టకుండా చాలా హింసించారు. (కస్టడీకి దివ్య హత్య కేసు నిందితులు!) ఈ హత్య వెనుక ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందో ఆరా తీస్తున్నాం. దివ్య తల్లి, సోదరుడు, అమ్ముమ్మ ఓ రౌడీ షీటర్ చేతిలో హత్యకు గురైనట్లు నిందితులు చెబుతున్నారు. అయితే వాళ్లు హత్యకు గురయ్యారా? లేక అదృశ్యమయ్యారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం.’ అని తెలిపారు. సీపీ అంతకు ముందు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆకస్మికంగా పర్యటించారు. అక్కడ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. (దివ్య హత్య కేసు: సంచలన నిజాలు) -
హక్కుల కమిషన్ రిపోర్టు వెల్లడించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు సంబంధించిన నివేదికను వెల్లడించాలని ఆయన సహచరి వసంత జాతీయ మానవహక్కుల కమిషన్‌ను డిమాండ్ చేశారు. సాయిబాబా ఆరోగ్యం క్షీణిస్తోందనీ, ఆయన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్నందున తక్షణమే జోక్యం చేసుకో వాలని కమిషన్‌ను వసంత గతంలో ఆశ్రయించింది. దీంతో నాగపూర్ అండాసెల్‌లో ఉన్న సాయిబాబాను జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగస్టులో కలిసింది. అయితే, 3 నెలలు కావస్తున్నా మానవ హక్కుల కమిషన్ నివేదికను వెల్లడించలేదని వసంత ‘సాక్షి’తో మాట్లాడుతూ అన్నారు. సాయిబాబా ఆరోగ్యానికి సంబంధించిన నిజాలు, జైలు అధికారుల కక్షసాధింపు చర్యలు బయటపడతాయనే ఆ రిపోర్టును వెల్లడించలేదని అన్నారు. ‘సాయిబాబా కార్డియో మయోపతితో బాధపడుతున్నారు, గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నాయి, 15 ఏళ్లుగా హైబీపీ ఉంది, పోలియోతో 2 కాళ్లు పూర్తిగా పనిచేయవు. వేరొకరి సాయం లేకుండా కదల్లేని పరిస్థితి. రోజుకు 8 రకాల మందులు వాడాలి. కానీ ఒక్క మందు సకాలంలో అందించడం లేదు. శరీరం 90% చచ్చుబడిపోయిన ఆయన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతాడనే నెపంతో చీకటి గుహలాంటి అండాసెల్‌లో బంధించారు. ఏ నేరానికీ పాల్పడే అవకాశంలేని తను ప్రభుత్వాలను కూల్చే కుట్ర ఎలా చేస్తారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. యుద్ధ ఖైదీలకు సైతం ఇలాంటి ట్రీట్మెంట్ ఉండదు.’అని వసంత ఆవేదన వ్యక్తం చేశారు. ఖైదీల పట్ల అనుసరించాల్సిన విధానాలను, అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కి అక్రమంగా సాయిబాబాను జైల్లో పెట్టి హింసిస్తున్నారని ఆరోపించారు. సాయిబాబా విడుదల కోరుతూ నిరసన ‘సాయిబాబా విడుదల కోరుతూ జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ అనేక చోట్ల నిరసనోద్యమాలు జరుగుతున్నాయి. న్యూయార్క్‌లో నిరసన ప్రదర్శించారు. యూరోపియన్ కాన్సులేట్ నుంచి కొందరు ఫోన్ చేసి వివరాలు తీసుకుని సంఘీభావం ప్రకటించారు. పంజాబ్, చండీగఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి. మరోపక్క ఢిల్లీ యూనివర్సిటీలో సాయిబాబా సస్పెన్షన్‌పై వేసిన కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. సాయిబాబా రాసిన లేఖలను మూడు, నాలుగు రోజులు జైలు అధికారులు తమ దగ్గరే ఉంచుకొని ఆ తర్వాత పోస్ట్ చేస్తున్నారు. మా క్వార్టర్ ఖాళీ చేయించారు. మాకు ఇల్లు అద్దెకు ఇవ్వడంలేదు. మానవతా దృక్పథంతో సాయిబాబాను హైదరాబాద్‌కు మార్చాలి’ అని ఆమె అన్నారు. ప్రొఫెసర్ సాయిబాబా విడుదల కోరుతూ ఈ నెల 10న ఉస్మానియా యూనివర్సిటీలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్టు సాయిబాబా విడుదల కమిటీ నాయకులు బళ్లా రవీందర్, రవిచంద్ర, నారాయణరావు, విరసం సభ్యురాలు గీతాంజలి, ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలీ ఖాద్రి తెలిపారు. సాయిబాబా, అతని సహచరుల విడుదల ఉద్యమంలో ప్రజాస్వామికవాదులు భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించారు. -
సాయిబాబాకు ప్రాణాపాయం
ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా అడవిబిడ్డల హక్కుల గురించి మాట్లాడారు. దళితులపై అకృత్యాల గురించి గొంతెత్తి నినదించారు. రాజ్యం పౌరుల సర్వ హక్కులనూ హరించి వేస్తుంటే చూస్తూ ఊరుకోక పోవడమే ఆయన నేరం. ‘‘సాయిబాబాని మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లో కలిసాను. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు కనిపించింది. ఆయన ప్రాణానికే ప్రమాదం ఉందనిపించింది. జైలు అధికారులు ఎటువంటి వైద్య సౌకర్యాలను, అందిం చడం లేదు. పైగా తప్పుడు వైద్య నివేదికలనిచ్చి, ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్టు నమ్మబలుకుతు న్నారు. సాయిబాబా బీపీ కూడా నార్మల్‌గా లేదు. లాయర్ల ద్వారా పంపిన మందులను సైతం అత్య వసర పరిస్థితుల్లో మాత్రమే ఆయనకు అందిస్తు న్నారు. గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు కిడ్నీల్లో రాళ్ళు, ఛాతీ నొప్పి, శ్వాస సంబంధమైన సమస్యతో పాటు గాల్‌బ్లాడర్‌లో, పాంక్రియాటిక్ నొప్పులు, ఆయనను తీవ్రంగా బాధిస్తున్నాయి. ప్రాసై్టట్ సమస్య వల్ల మూత్ర విసర్జన కూడా కష్ట సాధ్యం అవుతోందని చెప్పారు. ఒకనెల జైలు జీవితంలో మూడుసార్లు తీవ్రమైన పాంక్రియాటిక్ నొప్పి వచ్చింది. వైద్యుల సలహా మేరకు ప్రతి రోజు ఆయన గుండె సంబంధమైన పాంక్రియా టిక్ నొప్పికి సంబంధించిన మందులు వాడాలని సూచిం చినప్పటికీ ఆ మందులను ఇంత వరకు ఆయనకు అందించలేదు. ఇంత అనారోగ్యం కారణంగా ఆయన జైల్లో ఇచ్చే ఆహారాన్ని తీసుకోలేక పోతున్నారు. బయట జరుగుతున్న ఘట నలకు సంబం«ధించిన వార్తలను చదివే, చూసే అవ కాశాన్ని ఇవ్వడం లేదు. అరుదుగా పత్రికలు ఇచ్చి నప్పటికీ ఉద్యమ వార్తలను కత్తిరించి ఇస్తున్నారు. నేను స్వయంగా రాసిన ఉత్తరాలను కూడా ఆయనకు అందించడం లేదు. రాజ్యం సాయిబాబా జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టింది. తక్షణమే ఆయనను ఢిల్లీ జైలుకి తరలించాలి. లేదా హైదరాబాద్‌కి తరలించి సరైన వైద్యం అందించాలి.’’ ‘‘చేతులకు చెప్పులేసుకొని సైకిల్ మీద వెళ్తుంటే ఆశ్చర్యంగా చూసేదాన్ని. 15 ఏళ్ళప్పుడేర్పడిన మా పరిచయం ప్రేమగా ఎదిగి సమానత్వం దిశగా ఎదు గుతున్న క్రమంలో ఈ సమాజంలో ఆదివాసీలపై, దళితులపై, స్త్రీలపై, మైనారిటీలపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ అవే చెప్పులు తొడిగిన చేతుల్తో ఎన్నో వేదికలెక్కారు సాయిబాబా. ఈ సమాజం మార్పుకోసం ఎంతో తపించారు. అడవి బిడ్డల హక్కుల గురించి మాట్లాడారు. దళితులపై అకృత్యాల గురించి గొంతెత్తి నినదించాడు. పౌరు లను రక్షించాల్సిన రాజ్యమే వారి సర్వహక్కులనూ హరించి వేస్తుంటే చూస్తూ ఊరుకోకుండా ఉండడమే ఆయన చేసిన నేరమయ్యింది. ‘‘90 శాతం వైక ల్యంతో ఉన్నా ఆయనపట్ల ఉదారంగా వ్యవహరిం చలేం. ఆయన మేధోపరంగా గొప్పవాడు. నిషేధిత మావోయిస్టు్ట పార్టీకి సలహాదారుడు. కాబట్టి ఆయన కీశిక్ష సరిపోదు అంటూ గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఆయనకి కఠిన శిక్షను విధించింది. ఇదెక్కడి న్యాయం?’’ అని ఈ నెల మూడవ తేదీన హైదరా బాద్‌లో జరిగిన సాయిబాబా, తదితరుల విడుదల సభలో మాట్లాడాను. ప్రొఫెసర్ సాయిబాబా, ప్రశాంత్ రాహి (జర్న లిస్ట్), హేమ్ మిశ్రా (జెఎన్‌యులో పరిశోధక విద్యార్థి), పాండు నరోత్, మహేశ్ టిర్కిలకు జీవిత శిక్ష వేసింది. వీరితో పాటు విజయ్ టిర్కికి 10 సంవ త్సరాల జైలు శిక్షను విధించింది, భారతదేశంపై యుద్ధం చేయడానికి కుట్ర పన్నారనీ, నిషేధిత మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయనీ, వీరి పైన మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోపణ. మరో మనిషి సాయం లేకుండా కదల్లేని మనిషి ఏ ప్రభుత్వాన్ని కూల్చడానికైనా చేసే కుట్ర ఏముంటుంది? సాయిబాబాని ఇంటినుంచి ఓ ఇసుకబస్తాని విసిరేసినట్టు పోలీసు వాహనంలో విసిరేస్తే వీల్ చైర్ విరిగిపోయింది. ఆ విరిగిపోయిన కుర్చీలో కదల్లేని స్థితిలో 72 గంటల పాటు పోలీసులు బంధించి తీసుకెళ్ళారు. మధ్యలో మూత్ర విసర్జన అత్యవసరమని చెప్పినా అనుమతించకుండా అత్యంత అమానవీయంగా పోలీసులు వ్యవహ రించారు. సాయిబాబాకి మందులివ్వ కుండా, కనీసం కదలనైనా లేని వ్యక్తిని అత్యంత వేడిగా ఉండే నరకప్రాయ మైన అండాసెల్‌లో ఉంచడం ద్వారా ఈ ప్రభుత్వం ఏం సాధించదల్చుకుందో అర్థం కాదని మేధావులు వాదిస్తున్నారు. ‘‘అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని కలిసే అవకాశాన్ని సైతం ఇవ్వకుండా నన్నూ, నా కుమార్తెను వే«ధిస్తున్న స్థితి తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోంది. ఉదయం ములాఖత్‌కి పెట్టు కుంటే సాయంత్రం 5గంటల 45 నిముషాలకు లోప లికి పిలుస్తారు. అది కూడా జాలీ ములాఖత్. మధ్యలో గ్లాస్, ఆ తర్వాత జాలీ. అంత దూరంలో ఆయన్ను కూర్చోబెడతారు. తను నించుంటే తప్ప నేను చూడలేను. కానీ తను నించోలేడు. మూడు చక్రాల బండిలో తను, అంత దూరంలో నేను. కనీసం మాట్లాడింది వినిపించదు. ఎలాగోలా ఆయన్ను దూరం నుంచి చూసే ప్రయత్నంలో ఉండగానే 6 గంటలకు టకటకమని కొట్టుకుంటూ వచ్చి టైం అయిపోయిందని తరిమేస్తారు’’. సాయి బాబా విడుదల కోసం ప్రపంచ దేశాల నుంచి 20,000 ఉత్తరాలొచ్చాయని ప్రభుత్వమే చెప్పింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌తో సహా ప్రపంచ మేధావు లంతా సాయిబాబా విడుదలను కోరుతున్నారు. ప్రభుత్వం సాయిబాబాపై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకొని, ఆయన్ను, అయనతో పాటు అరెస్టయిన వారందరినీ విడుదల చేయాలి. ఇది ప్రజాస్వామికవాదుల డిమాండ్ కూడా. -వసంత, ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా సహచరి -
పోలీసుల అదుపులో మహిళా మావోయిస్టు
జీ.కే వీధి: విశాఖ జిల్లా జీ.కే వీధి పోలీసులు శుక్రవారం రాత్రి ఓ మహిళా మావోయిస్టును అదుపులోకి తీసుకున్నారు. గత పదేళ్లుగా గాలికొండ ఏరియా కమిటీలో దళ సభ్యురాలిగా పని చేస్తున్న వసంత అలియాస్ చెంచును పోలీసులు అరెస్ట్ చేశారు. అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న వసంత మండలంలోని బొనంగిపల్లి గ్రామంలో చికిత్స పొందుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. -
తమిళ స్మగ్లర్ అరెస్ట్..
భాకరాపేట: చిత్తూరు జిల్లా భాకరాపేట మండలంలో అటవీశాఖ అధికారులు సోమవారం ఉదయం తమిళనాడుకు చెందిన ఓ ఎర్రచందనం స్మగ్లర్‌ను అరెస్టు చేశారు. పక్కా సమాచారం మేరకు దేవరకొండ - మేదరపల్లి రోడ్డులో ఎర్రచందనం దుంగలను వాహనాల్లో తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన వసంత అనే స్మగ్లర్‌ను అరెస్టు చేయడంతో పాటు, రెండు కార్లు, ఓ ద్విచక్ర వాహనం, 14 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. -
సాయిబాబాను విడుదల చేయాలి:వసంత
భార్య వసంత డిమాండ్ ఆయన ఆమరణ దీక్షకు సన్నద్ధమతున్నారని వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని ఆయన భార్య వసంత డిమాండ్ చేశారు. ఢి ల్లీ యూనివర్సిటీ అధ్యాపక బృందం నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 90 శాతం వికలాంగుడైన తన భర్తను కనీస సదుపాయాలు లేని నాగ్‌పూర్ జైలులో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ముందునుంచీ తమ కుటుంబంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వాపోయారు. ‘నాగ్‌పూర్ జైలులో ఉన్న నా భర్తను ఆయన సోదరుడు రాందేవుడు కలిశారు. వెలుతురు లేని చిన్నసైజు సెల్లో ఆయనను ఉంచారు. మిగిలిన ఖైదీలతో కలిసే అవకాశం లేకుండా ఒంటరిగా పెట్టారు. వీల్ చైర్లోఉండే ఆయన అక్కడి సంప్రదాయ మరుగుదొడ్లను ఉపయోగించడం చాలా కష్టం. ఆయన హార్ట్‌పేషెంట్, హైబీపీ ఉంది. వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఎక్కువ సేపు కుర్చీలోనూ కూర్చోలేరు. కనీసం మందులు కూడా ఇవ్వట్లేదు. పోలీసులు ఇలాగే తనను ఇబ్బందిపెడితే గురువారం నుంచి ఆమరణ దీక్షకు దిగుతానని ఆయన రాందేవుడికి చెప్పారు’ అని వసంత అన్నారు. ఢిల్లీ వర్సిటీలో అడ్మిషన్ల అవకతవకలపై నిలదీసినందుకు వర్సిటీ పరిపాలన విభాగం సైతం తమపై కక్ష కట్టిందన్నారు. సాయిబాబాను విచారించనున్న రాష్ట్ర ఎస్ఐబీ మహారాష్ట్ర పోలీసుల అదుపులోఉన్న రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ జాతీయ సహాయ కార్యదర్శి సాయిబాబాను విచారించడానికి రాష్ట్ర యాంటీ నక్సలైట్ నిఘా విభాగం ఎస్ఐబీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆయనను రాష్ట్రానికి తీసుకొచ్చి విచారించడమా, లేక మహారాష్ట్ర వెళ్లి విచారించాలా అనే అంశంపై తర్జనభర్జన పడుతున్నారు. ఆయనపై రాష్ట్రంలో కేసులు లేనందున అక్కడికే వెళ్లి విచారించడమే మేలని వారు భావిస్తున్నట్లు సమాచారం. -
'మావోయిస్టులతో నాభర్తకు సంబంధాలు లేవు'
న్యూఢిల్లీ: మావోయిస్టులతో నా భర్తకు సంబంధాలు లేవు అని ఢిల్లీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా భార్య వసంత తెలిపారు. మావోయిస్టులతో సంబంధముందనే ఆరోపణలతో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివాసుల హక్కుల కోసం సాయిబాబా పోరాటం చేస్తున్నారని సాక్షి టెలివిజన్ కిచ్చిన ఇంటర్వ్యూలో వసంత తెలిపారు. గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా నా భర్త పోరాడారు. ప్రభుత్వం కక్ష కట్టి వేధిస్తోంది. మైనింగ్ కంపెనీలకు ప్రభుత్వం కొమ్ముకాస్తోంది అని వసంత అన్నారు. నా భర్తకు ఆరోగ్యం సరిగా లేదని, వెంటనే నా భర్తను విడుదల చేయాలని ప్రభుత్వానికి వసంత విజ్ఞప్తి చేశారు. పోలీసులు అక్రమంగా ఆయన్ను తీసుకెళ్లారని వసంత అరోపించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం చెందిన జీఎన్ సాయిబాబాను విడుదల చేయాలని పౌరహక్కుల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. -
బొగ్గు కేటాయింపుల కుంభకోణంలో మరో ఎఫ్ఐఆర్!
న్యూఢిల్లీ: బొగ్గు కేటాయింపుల కుంభకోణంలో ముంబైకి చెందిన టాప్ వర్త్ ఉర్జా అండ్ మెటల్ లిమిటెడ్ కంపెనీపై తాజాగా ఎఫ్ఐఆర్ ను సీబీఐ దాఖలు చేసింది. ఈకేసులో ముంబైకి చెందిన కంపెనీ డైరెక్టర్, ఇంకా గుర్తు తెలియని వ్యక్తులను దోషులగా చేర్చింది. 1993-2005లో జరిగిన బొగ్గు కేటాయింపుల వ్యవహారంలో సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసులో ఆ కంపెనీ డైరెక్టర్ సురేంద్ర లోధా, మరో డైరెక్టర్ ఓంప్రకాశ్ నెవాతియాలపై ఇండియన్ పీనల్ కోడ్ 120, 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. గతంలో ఈ కంపెనీని విరంగణ స్టీల్ గా పిలువబడేది. ఇటీవల ఈ కంపెనీకి చెందిన నాగపూర్, యవత్మల్, ముంబైలోని కార్యాలయాలపై సీబీఐ దాడులు నిర్వహించింది.