సీనియర్ నటి వి.వసంత (82) శుక్రవారం సాయంత్రం చైన్నెలోని స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూశారు. చైన్నె వెస్ట్ కేకేనగర్‌లోని వి.డి.లోకనాథ్ వీధిలోని నివసిస్తున్న ఈమె రంగస్థల నటి. మొదట్లో ఎలిసై మన్నర్ ఎం.కె.త్యాగరాజ భాగవతార్ నాటక ట్రూప్‌లో పలు నాటకాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. అనంతరం సినీ రంగప్రవేశం చేసి ఇరవుమ్ పగలుమ్ అనే చిత్రంలో జయశంకర్‌కు జంటగా నటించారు. అదే విధంగా కార్తికై దీపం చిత్రంలో నటుడు అశోక్ సరసన నాయకిగా నటించారు.
ఆ తర్వాత మూండ్రామ్‌పిరై చిత్రంలో నటి శ్రీదేవికి తల్లిగాను, రాణువవీరన్ చిత్రంలో రజనీకాంత్‌కు అమ్మగా నటించి గుర్తింపు పొందారు. అలా మూండ్రుముగం చిత్రంలో పాటు పలు తమిళం, తెలుగు, మలయాళం వంటి భాషల్లో వివిధ రకాల పాత్రల్లో నటించారు. 100కు పైగా చిత్రాల్లో నటించారు. కొద్ది నెలలుగా అనారోగ్యానికి గురైన వి.వసంత శుక్రవారం సాయంత్రం 3.40 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఈమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతానం వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో వి.వసంత అంత్యక్రియలు రామాపురంలో శ్మశాన వాటికలో జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment