చిక్కిన మదపుటేనుగు.. | The forest department caught the elephant | Sakshi
Sakshi News home page

చిక్కిన మదపుటేనుగు..

Published Fri, Sep 1 2023 4:41 AM | Last Updated on Fri, Sep 1 2023 8:45 AM

The forest department caught the elephant  - Sakshi

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు జిల్లా గుడిపాలలో భయోత్పాతం సృష్టించిన ఒంటరి మదపుటేనుగు ఎట్టకేలకు అధికారులకు చిక్కింది. తమిళనాడు అటవీ ప్రాంతం నుంచి మంగళవారం రాత్రి వచ్చిన ఏనుగుల గుంపులో ఓ ఏనుగు తప్పిపోయి.. బుధవారం చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో వెంకటేశులు, సెల్వి అనే భార్యభర్తలను తొక్కి చంపిన ఏనుగు, కార్తిక్‌ అనే యువకుడిని తీవ్రంగా గాయపరిచింది. బుధవారం రాత్రి గుడిపాలలో అటవీప్రాంతాల్లోకి వెళ్లిపోయిన ఏనుగు తమిళనాడు రాష్ట్రంలోకి వెళ్లి­పోయింది. గురువారం తెల్లవా­రు­జా­మున తమిళనాడు రాష్ట్రం పెరియ బోడినత్తం గ్రామంలోకి వెళ్లిపోయి అక్కడ వసంత (54) అనే మహిళను తొండంతో ఎత్తి కిందకేసి కాలితో తొక్కి చంపేసింది.

 ఒంటరి ఏనుగు బీభత్సంలో ఓ మేక కూడా చనిపో­యింది. అక్కడి నుంచి మళ్లీ  ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించి చిత్తూరు జిల్లా గుడిపాల మండలానికి చేరు­కుంది. ఒంటరి ఏనుగు 197–రా­మా­పురం గ్రామంలోకి రావడంతో మళ్లీ ప్రజలు భయభ్రాంతులకు గురవు­తూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఏనుగు జాడ గుర్తించిన అటవీశాఖ అధికారులు అప్పటికే కుమ్కీ ఏను­గులతో సిద్ధంగా ఉంటూ మదపు­టేనుగును వెంబడించి డప్పులు కొడుతూ, టపాకాయలు పేల్చుతూ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. తిరుపతి జూ పార్కు నుంచి వచ్చిన వైద్యుల సాయంతో మదపుటేను­గు­కు మత్తు ఇంజెక్షన్‌ ఇవ్వడంతో అది కిందపడిపోయింది.

తాళ్ల సాయంతో ఏనుగును బంధించి తిరుపతి జూ పార్కుకు తరలించారు. ఈ మొ­త్తం ఆపరేషన్‌లో చిత్తూరు అటవీ­శాఖ అధికారి చైతన్యకుమార్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. మరో­వైపు ఏనుగు దాడిలో మృతిచెందిన దంపతులకు అంత్యక్రియలు నిర్వ­హించగా, ప్రభుత్వం అందించిన రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివా­సులు మృతుల కుటుంబ సభ్యులకు అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement