ప్రొఫెసర్ సాయిబాబాపై సస్పెన్షన్ వేటు!
ప్రొఫెసర్ సాయిబాబాపై సస్పెన్షన్ వేటు!
Published Thu, May 15 2014 9:10 PM | Last Updated on Tue, Oct 9 2018 2:38 PM
న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలెదుర్కోంటున్న ఫ్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను సస్సెన్షన్ వేటు వేసినట్టు ఢిల్లీ యూనివర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సాయిబాబాపై సస్పెన్షన్ వేటు వేయాలని రామ్ లాల్ ఆనంద్ కాలేజి పాలన యంత్రాంగం సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఢిల్లీ యూనివర్సిటీ జాయింట్ డీన్ మలయ్ నీరవ్ తెలిపారు.
రామ్ లాల్ ఆనంద్ కళాశాలలో సాయిబాబా ప్రొఫెసర్ గా సేవలందిస్తున్నారు. మావోలతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై మహారాష్ట్ర పోలీసులు సాయిబాబాను మే 9 తేదిన అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన సాయిబాబాను సస్పెండ్ చేయాలంటూ విద్యార్ధులు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. విద్యార్ధుల ఒత్తిడి మేరకు కళాశాల యాజమాన్యం సాయిబాబాపై చర్య తీసుకుంది.
సామాన్య కుటుంబంలో జన్మించిన సాయిబాబా వికలాంగుడు. ఆయన అమలాపురం పట్టణానికి సమీపంలోని నల్లమిల్లి గ్రామానికి చెందిన వాడు.
Advertisement
Advertisement