న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాలున్నాయనే సాకుతో ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ)తోపాటు జవహర్‌లాల్‌నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థులు శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. కెజీ మార్గ్‌లోని మహారాష్ట్ర సదన్ ఎదుట జరిగిన ఈ కార్యక్రమంలో 50 నుంచి 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం మహారాష్ట్ర సదన్ రెసిడెంట్ కమిషనర్‌కు వారు ఓ వినతిపత్రం సమర్పించారు. సాయిబాబాను అనవసరంగా ఈ కేసులో ఇరికించారని, ఇది అక్రమ నిర్బంధమని వారు తమ వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు మాట్లాడుతూ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా అక్రమ నిర్బంధాన్ని ఖండిస్తున్నామన్నారు.
డీయూ విద్యార్థుల నిరసన ప్రదర్శన
Published Sat, May 10 2014 10:57 PM | Last Updated on Thu, Mar 28 2019 6:26 PM
Advertisement
Advertisement