ఇక సెలవా మరి! | Governor Bhardwaj farewell | Sakshi
Sakshi News home page

ఇక సెలవా మరి!

Published Sun, Jun 29 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 9:31 AM

ఇక సెలవా మరి!

ఇక సెలవా మరి!

  • మాజీ గవర్నర్ భరద్వాజ్‌కు వీడ్కోలు
  •  తాత్కాలిక గవర్నర్‌గా నేడు రోశయ్య బాధ్యతల స్వీకరణ
  • సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర తాత్కాలిక గవర్నర్‌గా తమిళనాడు గవర్నర్ కే. రోశయ్య ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. రాజ్ భవన్‌లో ఉదయం తొమ్మిది గంటలకు జరిగే కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీహెచ్. వఘేలా ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం రోశయ్య చెన్నైకి తిరిగి వెళతారు. కాగా శనివారం పదవీ విరమణ చేసిన హెచ్‌ఆర్. భరద్వాజ్‌కు వీడ్కోలుగా రాజ్ భవన్‌లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆయనను కలుసుకుని సత్కరించారు.

    ఐదేళ్లుగా రాష్ట్రాభివృద్ధికి సహకరించినందుకు రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా భరద్వాజ్ మాట్లాడుతూ ఐదేళ్లు ప్రజలకు మంచి చేశాననే తృప్తితో తిరిగి వెళుతున్నానని చెప్పారు. గత ఏడాదిగా తనకు సహకరించనందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement