
ఇది కనివినీ ఎరుగని విపత్తు: రోశయ్య
చెన్నై: తమిళనాడులో కురిసిన భారీ వర్షాల కారణంగా అక్కడి పరిస్థితి చాలా దారుణంగా ఉందని తమిళనాడు గవర్నర్ రోశయ్య చెప్పారు. ఇది కనివినీ ఎరుగని విపత్తు అంటూ ఆయన అభివర్ణించారు. ఈ విపత్తు కారణంగా సామాన్యుల నుంచి అందరికి నష్టం జరిగిందని రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, సేవాతత్పరులు ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకోవాలని కోరారు. కేంద్రం నుంచి మరిన్ని నిధుల కోసం తాము ప్రయత్నిస్తామని రోశయ్య పేర్కొన్నారు.