Huge rains
-
ఖమ్మం జిల్లా రైతులను నిండా ముంచిన అకాల వర్షాలు
-
వరద బాధితులకు అండగా నిలవండి
సాక్షి, అమరావతి: రాయలసీమ జిల్లాలో గతంలో ఎప్పుడూ లేనంతగా వర్షాలు కురుస్తున్నందున ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు ఆయా ప్రాంతాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కోరారు. వరద ప్రభావిత జిల్లాలోని పార్టీ నాయకులతో శనివారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారని పార్టీ మీడియా విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు అధికంగా ఉన్న చోట వాగులు పొంగి, గ్రామాలు నీళ్లలో ఉన్నాయని.. ఈ ఆపద సమయంలో ఇబ్బందిలో ఉన్న వారికి అందరం చేయూతనిద్దామని నాయకులకు సూచించారు. ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు చేయడానికి వేగంగా స్పందించాలని డిమాండ్ చేశారు. వర్షాలకు కూలిపోయే అవకాశం ఉన్న ఇళ్లను అధికారులు ముందుగా గుర్తించి, అలాంటి ఇళ్లలో ఉండేవారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని కోరారు. -
మహారాష్ట్రలో జల ప్రళయం
-
శ్రీశైలానికి భారీగా వరద
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/హొసపేటె: నదీ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తోండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు నిండటంతో భారీ ఎత్తున వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శుక్రవారం రాత్రి ఏడు గంటలకు శ్రీశైలం జలాశయంలోకి 1.76 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుతోంది.. గురువారం సాయంత్రం 800.30 అడుగులుగా ఉన్న నీటి మట్టం శుక్రవారం సాయంత్రానికి 804.70 అడుగులకు చేరుకుంది. ఒక్క రోజులోనే 4.40 అడుగులు పెరగగా.. జలాశయంలోకి 2.2663 టీఎంసీల నీరు వచ్చి చేరగా 31.3963 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ఇది నిండాలంటే 185 టీఎంసీలు అవసరం. మహారాష్ట్ర, కర్ణాటకల సరిహద్దులో పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎగువన జలాశయాలు నిండిపోయాయి. వరద ఇదే రీతిలో కనీసం 10 రోజులు కొనసాగే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అంచనాల నేపథ్యంలో మరో పది పదిహేను రోజుల్లో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు.. కృష్ణా ప్రధాన ఉపనది అయిన తుంగభద్రలో కూడా వరద రోజు రోజుకూ పెరుగుతోంది. తుంగభద్ర జలాశయంలోకి 70,416 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 94.09 టీఎంసీలకు చేరింది. దీంతో 22 గేట్లు రెండు అడుగుల మేర తెరిచి 63,000 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. శనివారానికి ఈ వరద జలాలు సుంకేసుల బ్యారేజీకి చేరనున్నాయి. సుంకేసుల బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 1.2 టీఎంసీలే. 24 గంటల్లో బ్యారేజీ నిండుతుంది. దాంతో ఆదివారం సుంకేసుల నుంచి తుంగభద్ర వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తారు. ఈ జలాలు కృష్ణా ప్రవాహంతో కలిసి శ్రీశైలాన్ని చేరనున్నాయి. కృష్ణా మరో ప్రధాన ఉప నది బీమా. గతేడాది బీమా నది నుంచి తెలుగు రాష్ట్రాలకు భారీఎత్తున జలాలు వచ్చాయి. బీమా నదిపై ఉన్న ఉజ్జయిని ప్రాజెక్టులో ప్రస్తుతం 72.78 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇంకా 16,197 క్యూసెక్కులు ఆ ప్రాజెక్టులోకి చేరుతున్నాయి. ఇది నిండాలంటే మరో 44 టీఎంసీలు అవసరం. ఉజ్జయిని నిండితే బీమా ప్రవాహం కూడా కృష్ణా నదిలో కలిసి శ్రీశైలాన్ని చేరుతాయి. ఈ ఏడాది పుష్కలంగా నీటి లభ్యత? శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 875 అడుగులకు చేరుకుంటే ఎగువ నుంచి వచ్చే వరదను బట్టి.. దిగువకు అంటే నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తారు. సాగర్‌లో ప్రస్తుతం 133.37 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగార్ నిండాలంటే.. 178.67 టీఎంసీలు అవసరం. పులిచింతల ప్రాజెక్టు నిండాలంటే 43 టీఎంసీలు కావాలి. తెలుగు గంగ ప్రాజెక్టు కింద వెలిగోడు, సోమశిల, కండలేరు, బ్రహ్మంసాగర్.. గాలేరు–నగరి పథకం కింద గండికోట, పైడిపలెం, వామికొండ, హంద్రీ–నీవా పథకం కింద కృష్ణగిరి, జీడిపల్లి, గొల్లపల్లి రిజర్వాయర్లు నిండాలంటే 215 టీఎంసీలు అవసరం. తెలంగాణలోని బీమా, నెట్టంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, ఏలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులతో కలిపి మొత్తం 675 టీఎంసీల నీటి కొరత ఉంది. కేసీ కెనాల్ ఆయకట్టుకు 40 టీఎంసీలు అవసరం. మొత్తం మీద 715 టీఎంసీలు అవసరం. గత నాలుగేళ్లలో ఎన్నడూ లేని రీతిలో జూలై మూడో వారానికే కృష్ణమ్మ శ్రీశైలాన్ని చేరడం, తుంగభద్ర జలాశయం గేట్లు ఎత్తేసిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల నీటి లభ్యత ఈ ఏడాది ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. గోదావరి జలాలు సముద్రంపాలు గోదావరిలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీకి శుక్రవారం 3,85,922 క్యూసెక్కుల ప్రవాహం రాగా 8,400 క్యూసెక్కులను డెల్టాకు విడుదల చేసి మిగతా 3,78,922 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. దాంతో 24 గంటల్లోనే 32.73 టీఎంసీలు కడలి పాలైనట్లు అయ్యింది. ఈ సీజన్లో ఇప్పటివరకూ 302.597 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిశాయి. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా ప్రకాశం బ్యారేజీకి గోదావరి జలాలు మొత్తం 10,301 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా కాలువలకు విడుదల చేస్తున్నారు. అలాగే, వంశధార నదిలో వరద తగ్గుముఖం పట్టింది. గొట్టా బ్యారేజీకి 4325 క్యూసెక్కులు రాగా.. 1220 క్యూసెక్కులను కాలువలకు విడుదల చేసి 3,105 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. నాగావళిలో వరద తగ్గడంతో తోటపల్లి బ్యారేజీ గేట్లును మూసివేశారు. నీటి నిల్వ గరిష్ఠ స్థాయికి చేరడంతో తోటపల్లి బ్యారేజీ నిండుకుండను తలపిస్తోంది. రాష్ట్రంలో అన్నీ నదులు జలకళతో కళకళలాడుతుంటే వర్షాభావం వల్ల పెన్నా నది మాత్రం వెలవెలబోతోంది. -
ముంబైలో రైల్వేట్రాక్‌పై భారీగా వరద నీరు
-
కోస్తాంధ్ర, తెలంగాణలో అతిభారీ వర్షాలు
హైదరాబాద్: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమలో మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో ఖమ్మం జిల్లా పలుప్రాంతాలు.. ములకలపల్లిలో 17 సెం.మీ, టేకులపల్లిలో 14, చంద్రగొండలో 11.8, బయ్యారంలో 10.9 సెం.మీ నమోదైన వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లాలో మొగుళ్లపల్లిలో 13 సెం.మీ, గోవిందరావుపేట 13 సెం.మీ, వెంకటాపూర్ 12.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో 3.6 సెం.మీ, విజయనగరంలో 3.3 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, తూర్పుగోదావరి జిల్లాలో 2.3 సెం.మీ, కృష్ణా జిల్లాలో 2.1 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. -
ఇది కనివినీ ఎరుగని విపత్తు: రోశయ్య
-
ఇది కనివినీ ఎరుగని విపత్తు: రోశయ్య
చెన్నై: తమిళనాడులో కురిసిన భారీ వర్షాల కారణంగా అక్కడి పరిస్థితి చాలా దారుణంగా ఉందని తమిళనాడు గవర్నర్ రోశయ్య చెప్పారు. ఇది కనివినీ ఎరుగని విపత్తు అంటూ ఆయన అభివర్ణించారు. ఈ విపత్తు కారణంగా సామాన్యుల నుంచి అందరికి నష్టం జరిగిందని రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, సేవాతత్పరులు ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకోవాలని కోరారు. కేంద్రం నుంచి మరిన్ని నిధుల కోసం తాము ప్రయత్నిస్తామని రోశయ్య పేర్కొన్నారు. -
ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం
విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి బుధవారం ఉదయానికి గా మారింది. తొలుత అంచనా వేసినట్టుగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో కాకుండా, ఏర్పడడంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్న ఆశలపై నీళ్లు చల్లినట్టయింది.మరోవైపు తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కూడా బలపడి వచ్చే 24 గంటల్లో ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం నాటి నివేదికలో పేర్కొంది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలమైన అల్పపీడనంగా మారవచ్చని దీని ప్రభావం.. ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలపై అధికంగాను, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో కొంతవరకు ప్రభావం చూపవచ్చని వాతావరణం నిపుణులు చెబుతున్నారు. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు గాని, ఉరుములతో కూడిన జల్లులు గాని కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. గడచిన 24 గంటల్లో తిరుపతిలో 6, పాలసముద్రంలో 5, తనకల్లో 4, రుద్రవరం, చిన్నమాడెం, జమ్మలమడుగు, ఆలూరుల్లో 3, పెనుకొండ, రాజంపేట, పుత్తూరు, పుల్లంపేట, కంబదూరు, పలమనేరు, కల్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, పాడేరుల్లో రెండేసి సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. -
కొండచరియలు విరిగిపడి ఆరుగురి మృతి
ఢాకా: బంగ్లాదేశ్ ను కష్టాలు వీడటం లేదు. భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం.. భారీ వర్షాలు ఇలా గత రెండు, మూడు నెలలుగా ఏదో విధంగా అక్కడి ప్రజలు సమస్యలతో సతమతమవుతూనే ఉన్నారు. తాజాగా బంగ్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో లామా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారని, మరికొంతమంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. అయితే మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా అధికారులు గుర్తించారు. దీంతో స్థానికంగా అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. -
‘పెన్నా’ కబ్జా
విడవలూరు : మండల పరిధిలోని పెన్నాతీరం ఆక్రమణలకు గురవుతోంది. వందలాది ఎకరాలు ఆక్రమించి ఆక్వా సాగుకు గుంతలు సిద్ధం చేసున్నా.. రెవెన్యూ అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. మండలంలోని ఊటుకూరు పల్లెపాళెం వద్ద పెన్నానది నీటి ప్రవాహం కలుస్తుంది. ఈ ప్రాంతం ఆక్వా సాగుకు అనుకూలంగా ఉండటంతో కబ్జాదారుల కన్ను పెన్నా తీరంపై పడింది. యథేచ్ఛగా పెన్నానది, పెన్నాపోర్లుకట్టలను దర్జాగా దున్నేసి ఆక్వా సాగుకు గుంతలను మార్చేసుకుంటున్నారు. ఇప్పటికే వందల ఎకరాలను కబ్జా చేసేశారు. దీంతో పెన్నానది పూర్తిగా కుంచించుకుపోయి రూపురేఖలు మారిపోయింది. ఈ పరిస్థితితో భారీ వర్షాలు పడే సమయంలో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు సముద్రంలోకి కాకుండా సమీపంలోని కాలనీని ముంచెత్తే ప్రమాదం ఉంది. దీంతో ఆక్వా గుంతల్లోని వ్యర్థాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. స్థానికులు, స్థానికేతరులు కొందరు దర్జాగా యంత్రాలను వినియోగించి కబ్జా పర్వాన్ని కొనసాగిస్తున్నారు. నిద్రలో రెవెన్యూ, ఇరిగేషన్‌శాఖలు : పెన్నానదిలో యథేచ్ఛగా ఆక్రమణలు జరుగుతున్నా రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు మాత్రం ఏం మాత్రం పట్టించుకోవడంలేదు. మూడేళ్లుగా ఈ తంతు జరుగుతున్నా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వందల ఎకరాలను కబ్జాలు చేసి అనుమతులు లేకుండా ఆక్వా సాగు చేయడం పట్ల సంబంధిత శాఖ చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మా దృష్టికి రాలేదు : పెన్నా తీరం వెంబడి కబ్జా జరిగిన విషయం మా దృష్టికి రాలేదు. పెన్నా తీరాన్ని కబ్జా చేసి ఆక్వాసాగు చేస్తోంటే పరిశీలించి, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటాం. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. - బషీర్, తహశీల్దార్ అనుమతులు లేవు: పెన్నానది సమీపంలో సాగు చేస్తున్న ఆక్వా గుంతలకు తమ శాఖ నుంచి ఎటువంటి అనుమతుల లేవు. ఇలా అనుమతులు లేకుండా వందల ఎకరాల్లో సాగు చేస్తున్న ఆక్వా గుంతలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. ఇందులో భాగంగా త్వరలోనే నోటీస్‌లను జారీ చేస్తాం. -చాన్‌బాషా, మత్స్యశాఖ అధికారి -
యూఎస్ లో భారీ వర్షాలు
-
గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు
-
ప్రత్యామ్నాయమేనా?
గజ్వేల్: కార్తెలు కరిగిపోతున్నా... వర్షాలు సక్రమంగా లేక జిల్లాలో సాగు సాగడం లేదు. దీంతో ఈ సారి ప్రత్యామ్నాయ పంటల సాగు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. మరో వారంరోజుల్లో భారీ వర్షాలు రావొచ్చని, ఈలోగా విత్తనాలు వేసినా ప్రయోజనం ఉంటుందని చెబుతూనే... వ్యవసాయశాఖ ఎందుకైనా మంచిదని ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేయడానికి సన్నద్ధమవుతోంది. కాలం కలిసోస్తుందనుకుంటే పరిస్థితి అందుకు భిన్నంగా మారటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 4.40 లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గానూ ఈసారి 5.2 లక్షల హెక్టార్లలో పంటల సాగువుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. కానీ వర్షాలు లేక పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. జూన్, జూలై నెలల్లో మొత్తం 281 మి.మీల సాధారణ వర్షపాతానికి గానూ ఇప్పటి వరకు 122 మి.మీల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఫలితంగా పంటల పరిస్థితి దయనీయంగా మారింది. మొత్తంగా 2.57లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగులోకి వచ్చాయి. పత్తికి సంబంధించి ఒక్కొక్క రైతు రెండు నుంచి మూడుసార్లు పంటను చెడగొట్టారు. పత్తి పంటల విత్తనాలు, పెట్టుబడుల రూపంలో జిల్లావ్యాప్తంగా రూ.40 కోట్ల నష్టం వాటిల్లింది. మొక్కజొన్న విషయంలోనూ ఇదే రకమైన పరిస్థితి నెలకొనగా రూ. కోట్లల్లో పంట నష్టం జరిగింది. ఇక జిల్లాలో గరిష్టంగా సాగయ్యే వరి ఈ సారి ఇంకా మడుల్లోనే ఉండిపోయింది. ప్రతి ఏటా సమారు లక్ష హెక్టార్లలో సాగయ్యే ఈ పంట ప్రస్తుతం 22 వేల పైచిలుకు హెక్టార్లకే పరిమితమైంది. భారీ వర్షాలకు అవకాశం ఉంది: హుక్యానాయక్ వారం రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని, ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు చెబుతున్నారని వ్యవసాయశాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్ హుక్యా నాయక్ తెలిపారు. బుధవారం గజ్వేల్ వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలోని గజ్వేల్, జగదేవ్‌పూర్ మండలాల్లో పంటల పరిస్థితిపై క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వారంలోపు వర్షాలు కురిసిన పత్తి, మొక్కజొన్న లాంటి పంటలు వేసుకోవచ్చని చెప్పారు. ఆగస్టు మొదటి వారం కూడా వర్షాలు రాకపోతే పొద్దుతిరుగుడు, ఆముదం, కూరగాయలు వంటి ఆరుతడి పంటల సాగు కోసం కార్యాచరణ సిద్ధం చేస్తామని చెప్పారు. వాతావరణ ప్రతికూల పరిస్థితులపై రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. -
కన్నీటి వాన
పాలమూరు, న్యూస్‌లైన్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల జిల్లాలో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు రైతన్నకు కన్నీళ్లను మిగిల్చాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలు పంటలను ముంచెత్తడంతో అన్నదాత అవస్థలు ఎదుర్కొంటున్నాడు. పలు ప్రాంతాల్లో ఇళ్లు దెబ్బతిని జనం నిరాశ్రయులయ్యారు. జిల్లావ్యాప్తంగా రూ. 750 కోట్ల మేర నష్టం వాటి ల్లినట్లు అంచనా. షాద్‌నగర్ పరిధిలోని సోలీపూర్‌లో ఇంటి గోడకూలి సింగపాగ చెన్నయ్య (60) అనే వృద్ధుడు మృతి చెందాడు. అమ్రాబాద్ మండల పరిధిలోని లక్ష్మపూర్(బీకే)కి చెందిన మూడావత్ లక్ష్మణ్(55)అనే వ్యక్తి వర్షానికి తడిసి మృతి చెందాడు. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి డివిజన్ల పరిధిలోని దాదాపు 2.8 లక్షల ఎకరాల్లో పంటలు నీటి పాలయ్యాయి. పత్తి, మొక్కజొన్న, వరి, జొన్న, ఆముదం పంటలకు రూ. 550 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా. జిల్లా వ్యాప్తంగా 2200 వరకు ఇళ్లు నేలమట్టమయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతినగా, చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయి, 30 వరకు పశువులు మృతి చెందాయి, ఈ కారణంగా మరో రూ. 200 కోట్ల మేర నష్టం కలిగినట్లు సమాచారం. పెద్దవాగులో వ్యక్తి గల్లంతు అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లి సమీపంలో ప్రవహిస్తున్న పెద్దవాగులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. రోడ్డుపై ఉధృతంగా పారుతున్న పెద్దవాగును తాడు సహాయంతో ముగ్గురు వ్యక్తులు దాటుతుండగా, తాడు తెగిపోవడంతో వారు వాగులో కొట్టుకుపోతుండగా స్థానికులు ఇద్దరిని వెంటనే రక్షించగలిగారు. వాగు మధ్యలో ఉన్న వెంకటయ్య వరద ఉధృతికి కొట్టుకుపోయి, గల్లంతయ్యాడు. -
ఎడతెరపిలేని వాన
సాక్షి, నెల్లూరు : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వాన పడింది. సర్వేపల్లి నియోజక వర్గంలో అత్యధికంగా 16 సెంటిమీటర్లు వర్షపాతం నమోదు కాగా కావలి నియోజకవర్గంలో 15 సెంటీ మీటర్లు, కోవూరు నియోజక వర్గంలో 14 సెంటీ మీటర్ల వర్షం పాతం నమోదైంది. నెల్లూరులో 8 సెంటీ మీటర్లు, సూళ్లూరుపేట, ఆత్మకూరులలో 7 సెంటీమీటర్లు, వెంకటగిరి, గూడూరులలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉదయగిరి నియోజకవర్గంలో అత్యల్పంగా 2 సెంటీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక వ ర్షం. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షం వల్ల పెద్దగా నష్టం లేక పోగా జిల్లాలో వరిసాగుకు మరింత అనుకూలంగా ఉంటుందని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నారుమళ్ల ఏర్పాటుతోపాటు ఇప్పటికే నారుమళ్లు పోసి ఉంచిన బోరుబావుల కింద నాట్లు వేసేందుకు మరింత అనువుగా మారింది. మరో రెండుమూడు రోజు లు వర్షం కురిస్తే చెరువులు,కుంటలలోకి నీళ్లు చేరే అవకాశముంది. వెంకటగిరి, ఉదయగిరి, ఆత్మకూరు లాంటి మెట్ట ప్రాంతాల్లో చీనీ, నిమ్మ, మామిడి తదితర ఉద్యాన వన పంటలకు వర్షం ఉపయోగకరంగా మారింది. సోమశిల నుంచి పది రోజుల్లో నీటిని విడుదల చేస్తున్న సమయంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షం మరింత ఉపయోగకరంగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. కావలిలో అధిక వర్షం కురిసింది. పెద్దపట్టపుపాళెం, చెన్నాయపాళెం, నందిమాపురం, తుమ్మలపెంట, తాళ్లపాళెం తదితర ప్రాంతాల్లో పలుచోట్ల విద్యుత్ లేన్లు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. గూడూరులో భారీవర్షం కురవడంతో రైతులు నారుమళ్లకు సిద్ధమవుతున్నారు. మెట్ట ప్రాంతాల్లో పైర్లకు, ముఖ్యంగా 25 వేల హెక్టార్లలో సాగులో ఉన్న నిమ్మకు వర్షం మరింత ఉపయోగకరం. సర్వేపల్లి నియోజక వర్గంలో టీపీగూడూరు, ముత్తుకూరు, మండలాల్లో మధ్యాహ్నం నుంచి కుంభవృష్టి కురింది. ఈ వర్షాల వల్ల నార్లు పోసుకోనేందుకు అవకాశం కలిగింది. ఉదయగిరి నియోజక వర్గంలో 25 వేల ఎకరాల మినుము పంటకు, మెట్టపైర్లకు ఉపయోగం. 12వేల ఎకరాలలో సాగైన పసుపు, కంది తదితర పంటలకు లాభదాయకంగా మారింది. సూళ్లూరుపేటలో భారీవర్షం కురిసింది. వరిపంటకు 900 ఎకరాల్లో ఎలిది పైర్లకు లాభం. 120 హెక్టార్లలో నారుమళ్లు పోసుకోగా, 6 వేల ఎకరాల్లో వరినాట్లకు సిద్ధమవుతున్నారు. 700 హెక్టార్లలో నారుమళ్లు పోసుకునేందుకు సిద్ధమవుతన్నారు. వర్షం మరో రెండురోజులు కురిస్తే అన్ని చెరువుల్లోకి నీరు చేరుతుంది. వరిసాగుకు మరింత అనుకూలం. కోవూరు నియోజక వర్గంలో భారీవర్షం కురిసిం ది. బుచ్చిలో ప్రభుత్వ పాఠశాలల, హాస్టళ్ల భవనాలు ఉరిశాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.