బంగ్లాదేశ్ ను కష్టాలు వీడటం లేదు.
ఢాకా: బంగ్లాదేశ్ ను కష్టాలు వీడటం లేదు. భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం.. భారీ వర్షాలు ఇలా గత రెండు, మూడు నెలలుగా ఏదో విధంగా అక్కడి ప్రజలు సమస్యలతో సతమతమవుతూనే ఉన్నారు. తాజాగా బంగ్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో లామా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారని, మరికొంతమంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. అయితే మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా అధికారులు గుర్తించారు. దీంతో స్థానికంగా అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.