11న ఆర్యవైశ్య ప్రాంతీయ సదస్సు | aryavysya reginal meeting on august 11 | Sakshi
Sakshi News home page

11న ఆర్యవైశ్య ప్రాంతీయ సదస్సు

Published Sun, Aug 7 2016 7:56 PM | Last Updated on Mon, Aug 20 2018 5:04 PM

11న ఆర్యవైశ్య ప్రాంతీయ సదస్సు - Sakshi

11న ఆర్యవైశ్య ప్రాంతీయ సదస్సు

  • తమిళనాడు గవర్నర్‌ రోశయ్య రాక
  • సదస్సు కన్వీనర్‌ కోలేటి దామోదర్‌
  •  కరీంనగర్‌ : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఈ నెల 11న గోదావరిఖనిలో ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ సదస్సు కన్వీనర్‌ కోలేటి మారుతి తెలిపారు. జిల్లా కేంద్రంలోని జిల్లా ఆర్యవైశ్య సంఘం పట్టణ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఆర్యవైశ్యులను రాజకీయ పార్టీలు విస్మరిస్తున్నాయన్నారు. పన్నుల రూపేణ రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే ఆర్యవైశ్యులను రాజకీయ పార్టీలు ఎన్నికల సమయాల్లో టికెట్లు కేటాయించేలా చొరవ చూపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డబుల్‌ బెడ్‌రూం పథకం, కల్యాణలక్ష్మి లాంటి పథకాలను పేద ఆర్యవైశ్యులకు అందజేయాలని డిమాండ్‌చేశారు.  తాము ఎదుర్కొంటున్న సమస్యలను సదస్సులో చర్చించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు. సదస్సుకు ముఖ్య అతిథిగా తమిళనాడు గవర్నర్‌ కె.రోశయ్య, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్, ఎంపీ బాల్క సుమన్, ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ, సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో కన్న కృష్ణ, యాద అంజయ్య, ఎలగందుల మునీందర్, పెద్ది విద్యాసాగర్, మాడిశెట్టి శ్రీనివాస్, చింతకింది శ్రీనివాస్, తోడుగునూరి కరుణాకర్, సుధాకర్, గుండ చంద్రమౌళి, చిట్టుమల్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement