రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజల కూ సమాన అభివృద్ధిని అందించి తెలంగాణ ప్రజల్లో సైతం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను తొలగించిన
చీపురుపల్లి, న్యూస్‌లైన్: రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజల కూ సమాన అభివృద్ధిని అందించి తెలంగాణ ప్రజల్లో సైతం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను తొలగించిన ఒకే ఒక నేత దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి, బొబ్బిలి మున్సిపల్ మాజీ చైర్మన్ బేబీనాయన అన్నారు. శుక్రవారం చీపురుపల్లి వచ్చిన ఆయన.. స్థానిక విలేకరులతో మాట్లాడారు. 2004 వరకు ఎంతో వెనుకబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత వైఎస్‌దేనని, మహానేత హయాంలో తెలంగాణలోని ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందాయని చెప్పారు.
అందువల్లే మహానేత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ అంశం ఎక్కడా వినపడలేదని అన్నారు. అటువంటి బలమైన నాయకుడిని కోల్పోయిన రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారిందన్నారు. రోశ య్య హయాంలో రాష్ట్ర పరిపాలన మరీ అస్తవ్యస్తంగా తయారైందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి, రాష్ట్రాభివృద్ధిని 42 మంది ఎంపీలతో సాధించుకోగలమా? లేక విడిపోయి పది, పదిహేను మంది ఎంపీలతో సాధించుకోగలమా? అని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్రలో రానున్న తరాలకు భవిష్య త్తు లేకుండా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు.
రాష్ట్రాన్ని విభజించవద్దంటూ ఎంతో చిత్తశుద్ధితో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యం లో ఉద్యమాన్ని చేపడుతున్నట్లు తెలిపా రు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కొన్ని పార్టీ లు మాదిరిగానే రాజకీయం చేయాలని తమకు లేదన్నారు. ఉద్యమానికి వచ్చే ప్రతివారినీ గౌరవిస్తూ.. ఉద్యోగులు, జేఏసీ నేతలకు అండగా ఉండాలని తమ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుని చ్చారని బేబీనాయన చెప్పారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి వైఎస్‌ఆర్ కాంగ్రె స్ పార్టీ ఏక నిర్ణయంతో, ముక్తకంఠంతో ఉద్యమాన్ని చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త శనపతి శిమ్మినాయుడు, జిల్లా స్టీరింగు కమిటీ సభ్యుడు తుమ్మగంటి సూరినాయుడు, వాకాడ గోపి, వాకాడ శ్రీను, మెరకముడిదాం కన్వీనరు పల్లేడ బంగార్రాజు పాల్గొన్నారు.