సాక్షి, గుంటూరు: రాజధాని ప్రాంతంలో మహిళలను ముందుపెట్టి తేదేపా గుండాలు బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌పై దాడి చేయడాన్ని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే కిలారి రోశయ్య తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఉనికిని కాపాడుకోవటానికే ఇటువంటి ఘటనలకు పాల్పడుతోంది. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున దాడులు జరుగుతాయనడానికి దీనిని నిదర్శనంగా భావిస్తున్నాం. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం, భూముల విలువలు తగ్గిపోతాయన్న బాధతోనే.. వివిధ ప్రాంతాల నుంచి డబ్బులు వసూళ్లు చేసి మరీ రాజధాని పేరుతో దీక్షలు చేస్తున్నారు.
మీరు చేస్తున్న ఉద్యమం ఒక కృత్రిమ ఉద్యమం. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి టీడీపీ నాయకులు, ఎల్లో మీడియా రోజుకోరకంగా తప్పుడు ప్రచారం చేస్తూ కుయుక్తులు పన్నుతున్నారు. మీరెన్ని కుయుక్తులు పన్నినా మీ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, విడుదల రజిని, నందిగం సురేష్‌లపై దాడులకు పాల్పడటం హేయమైన చర్యగా భావిస్తున్నామంటూ ఎల్లో గ్యాంగ్‌పై నిప్పులు చెరిగారు. (చదవండి: వాళ్లకు కారం ప్యాకెట్లు ఎందుకు?: ఎంపీ సురేష్)
Comments
Please login to add a commentAdd a comment