రోశయ్య అల్లుడికిచ్చిన స్థలం వెనక్కి
- విలువైన మల్లెపల్లి ఐటీఐ స్థలాన్ని రూ.కోటికే కట్టబెట్టారు
- తెలంగాణ హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని
- కేంద్ర మంత్రి దత్తాత్రేయతో కలసి ఐటీఐలో తనిఖీ
సాక్షి, హైదరాబాద్: కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తన అల్లుడికి చెందిన నియోనాటల్ ఇన్‌టెన్సివ్ కేర్ అండ్ ఎమర్జెన్సీస్(నైస్) ఆస్పత్రికి అప్పనంగా కట్టబెట్టిన ఎకరా స్థలాన్ని వెనక్కి తీసుకుంటామని రాష్ట్ర హోం, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రకటిం చారు.
హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న మల్లెపల్లి పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)కు చెందిన 22 ఎకరాలపై కన్నేసిన నాటి సీఎం రోశయ్య.. అందులో నుంచి ఎకరా స్థలాన్ని తన అల్లుడికి చెం దిన నైస్ ఆస్పత్రికి కేవలం కోటి రూపాయలకే కారుచౌకగా కట్టబెట్టారని నాయిని ఆరోపించారు. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయతో కలసి బుధవారం మల్లెపల్లి ఐటీఐలో తనఖీలు నిర్వహించారు.
అనంతరం మంత్రి నాయిని విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ శిక్షణ సంస్థకు చెందిన స్థలాన్ని ప్రైవేటు ఆస్పత్రికి కేటాయించడం చట్టవిరుద్ధమని అభ్యం తరం తెలుపుతూ నాటి కార్మిక, ఉపాధి కల్పన శాఖ సంచాలకులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా.. పట్టించుకోకుండా బంధుప్రీతికి పాల్పడ్డారన్నా రు. స్థలానికి చెల్లించాల్సిన రూ. కోటి కూడా ఇప్పటికీ ఉపాధికల్పన శాఖకు ఇప్పటికీ జమ చేయలేదని, కానీ.. నైస్ ఆస్పత్రి యాజమాన్యం దర్జాగా భవనాన్ని నిర్మించుకుం దని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐటీఐల ఆధునికీకరణ : దత్తాత్రేయ
దేశంలోని ఐటీఐల స్థాయిని పెంచుతున్నట్టు కేంద్ర కార్మికశాఖ మంత్రి బం డారు దత్తాత్రేయ తెలిపారు. శిక్షణ పొం దిన వారిలో 85 శాతం విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. రూ.41 కోట్ల వ్యయంతో తెలంగాణలో ని ఎనిమిది ప్రభుత్వ ఐటీఐల ను ఆధునికరిస్తామని చెప్పారు. ఎంప్లాయీమెం ట్ ఎక్స్ఛేంజ్‌ల ద్వారా ఉద్యోగావకాశాల సమాచారాన్ని నిరుద్యోగులకు ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్‌ల రూపంలో పం పే సేవలను ప్రారంభిస్తున్నామన్నారు.