
డిజప్పాయింట్‌మెంట్ అనేది అసలెక్కడా లేదు... రాజమౌళిలో! సో, అభిమానులూ డోంట్ వర్రీ! ఆస్కార్‌కు ‘బాహుబలి’కి నామినేషన్ దక్కలేదనే అంశాన్ని దర్శకధీరుని దగ్గర ప్రస్తావించగా... లైట్ తీసుకున్నారు! ఈ ఏడాది ఆస్కార్స్‌కు ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో హిందీ సినిమా ‘న్యూటన్’ను అఫిషియల్ ఎంట్రీగా సెలెక్ట్ చేశారు. పలువురు ప్రేక్షకులు ‘బాహుబలి’కే ఆ ఛాన్స్ వస్తుందనుకున్నారు. మీరేమనుకున్నారు? అని రాజమౌళిని అడిగితే.. ‘‘సినిమా తీసేటప్పుడు అవార్డుల గురించి ఆలోచించను. నా లక్ష్యం అవార్డులు కాదు. ముందు కథ నన్ను శాటిస్‌ఫై చేయాలి. తర్వాత మ్యాగ్జిమమ్ నంబర్ ఆఫ్ ఆడియన్స్‌కి రీచ్ అవ్వాలి. సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేసినోళ్లకు డబ్బులు రావాలి’’ అన్నారు. అవార్డుల కంటే ప్రేక్షకుల ప్రశంసలే గొప్ప అని రాజమౌళి భావిస్తున్నట్టున్నారు!
రాజమౌళి దర్శకత్వంలో ధనుష్?
రజనీకాంత్ అల్లుడు, తమిళ హీరో ధనుష్‌తో రాజమౌళి సినిమా చేయాలనుకుంటున్నారట. తమిళ్‌తో పాటు హిందీలోనూ ధనుష్‌కి మంచి మార్కెట్ ఉంది. హిందీలో ‘రాంఝనా, షమితాబ్’ సినిమాలు చేశారాయన. తెలుగులో రాజమౌళి బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? వీళ్లు సినిమా చేస్తే... మూడు (తెలుగు, తమిళ్, హిందీ) లాంగ్వేజెస్ కవర్ అవుతాయి. రాజమౌళి దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించే సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తారట! త్వరలోనే ఈ సినిమా గురించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందని ఫిల్మ్ నగర్ టాక్.