
సాక్షి, హైదరాబాద్: రాజకీయ భీష్ముడిగా పేరుగాంచిన మాజీ సీఎం రోశయ్యను విమర్శించే స్థాయి, వయసు మంత్రి కేటీఆర్‌కు లేదని, తక్షణమే ఆయన క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిరంజన్ డిమాండ్ చేశారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. రోశయ్యను అవమానించడం ముమ్మాటికీ ఆర్యవైశ్య సమాజాన్ని అవమానించినట్లేనని పేర్కొన్నారు. రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర సందర్భంగా రోశయ్యకు అవార్డు ఇవ్వడాన్ని కేటీఆర్ అవమానించడం విచారకరమన్నారు. రోశయ్య సీఎంగా ఉన్న సమయంలో 2 సార్లు మత కల్లోలాలు జరిగాయన్న కేటీఆర్ వ్యాఖ్యలను నిరంజన్ ఖండించారు.