మోడీ ఆర్ధిక సహాయం అందిస్తారు: రోశయ్య
చెన్నై: హుదూద్ తుఫాన్ తాకిడితో ధ్వంసమైన ప్రాంతాలకు ప్రధాని నరేంద్రమోడీ సానుకూలంగా ఆర్దికంగా సహాయం అందిస్తారని తమిళనాడు గవర్నర్ రోశయ్య తెలిపారు.
తుఫాన్ లో మృతి చెందిన కుటుంబాలకు రోశయ్య ప్రగాఢ సానుభూతి తెలిపారు. తుఫాన్ బాధితులకు సహాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు.