'విశాఖ వాసుల్ని మోడీ మెచ్చుకున్నారు'
న్యూఢిల్లీ: హుదూద్ తుపాను విశాఖపట్నం నగరాన్ని పూర్తిగా దెబ్బతీసిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం న్యూఢిల్లీలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... హుదూద్ తుపాన్ విపత్తును ఎదుర్కొనేందుకు అందరూ ముందుకు రావాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. హుదూద్ తుపాన్పై ప్రధాని మోడీ తక్షణమే స్పందించి రూ. 1000 కోట్లు ప్రకటించారని గుర్తు చేశారు. విశాఖ వాసుల ధైర్యాన్ని ప్రధాని మెచ్చుకున్నారన్నారు.
తుపాను ఎదుర్కొనేందుకు వీలుగా భవన నిర్మాణంలో మార్పులు చేయాల్సి ఉందని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. హుదూద్ తుపాన్తో అతలాకుతలమైన ఉత్తరాంధ్ర జిల్లాలను ప్రధాని మోడీ మంగళవారం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం తక్షణ సాయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 1000 కోట్లు ప్రధాని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.