తుఫాన్ సహాయంపై ప్రధాని స్పందన భేష్: వైవీ సుబ్బారెడ్డి
ప్రకాశం: హుదూద్ తుఫాన్ బాధితులకు సహాయంపై ప్రధాని నరేంద్రమోడీపై స్పందన భేష్ అని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. తక్షణ సహాయంగా 1000 కోట్ల రూపాయలు ప్రకటించడం హర్షనీయం అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల విఫలమైందని ఆయన విమర్శించారు. పునరావాస ఏర్పాట్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపించిందని ఆయన అన్నారు. ఆలేరు, అరకు ప్రాంతాల్లో ఇప్పటికి జనజీవనం అస్థవ్యస్తంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాన్ తాకిడికి గురైన ప్రాంతాల ప్రజలను ఆదుకోవాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.