తమిళనాడు ఇంఛార్జ్ గవర్నర్గా విద్యాసాగర్ రావు | governor vidya sagar rao to take on additional responsibilities | Sakshi
Sakshi News home page

తమిళనాడు ఇంఛార్జ్ గవర్నర్గా విద్యాసాగర్ రావు

Published Wed, Aug 31 2016 4:44 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM

తమిళనాడు ఇంఛార్జ్ గవర్నర్గా విద్యాసాగర్ రావు

తమిళనాడు ఇంఛార్జ్ గవర్నర్గా విద్యాసాగర్ రావు

న్యూఢిల్లీ : తమిళనాడు ఇంఛార్జ్ గవర్నర్గా సీహెచ్ విద్యాసాగర్ రావు నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. తమిళనాడు గవర్నర్​ రోశయ్య పదవీకాలం నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో కేంద్రం తమిళనాడు ఇంఛార్జ్ గవర్నర్గా విద్యాసాగర్రావుకు అదనపు బాధ్యతలు అప్పగించింది.  యూపీఏ హయాంలో తమిళనాడు గవర్నర్‌గా 2011 ఆగస్టు 31న కొణిజేటి రోశయ్య బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తన సేవల్ని తమిళనాడుకు అందిస్తున్నారు.

కేంద్రంలో అధికారం మారినా, ఆయనే గవర్నర్‌గా కొనసాగుతూ వచ్చారు. తమిళనాడు ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటూ తన పదవీ కాలాన్ని లాగించారు. కాగా ఇవాళ్టితో రోశయ్య అయిదేళ్ల పదవీ కాలం ముగిసింది.  అయితే కర్ణాటకకు చెందిన శంకరమూర్తిని తమిళనాడు గవర్నర్‌గా నియమించాలన్న ప్రతిపాదనను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచినట్టు సమాచారం.

అయితే, ప్రస్తుతం కర్ణాటకతో కావేరి వివాదం సాగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని తమిళులు గవర్నర్‌గా స్వీకరించేనా అన్న ప్రశ్న కేంద్రాన్ని వెంటాడుతూ వచ్చినట్టు ప్రచారం సాగింది.  ఓ దశలో రోశయ్యనే మరలా గవర్నర్గా కొనసాగిస్తారనే ప్రచారం జరిగినా చివరకూ తమిళనాడు గవర్నర్గా సీహెచ్. విద్యాసాగర్రావుకు కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించింది.

మరోవైపు గుజరాత్ గవర్నర్ ఓంప్రకాశ్ కోహ్లీ మధ్యప్రదేశ్ గవర్నర్గా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ గవర్నర్గా రాంనరేష్  యాదవ్ ఉన్నారు. అయితే ఆయన పదవీ కాలం సెప్టెంబర్ 7తో ముగియనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement