శ్రీశైలంలో తమిళనాడు గవర్నర్ రోశయ్య
శ్రీశైలం: శ్రావణమాసం సందర్భంగా శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల దర్శనార్థమై తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కొణిజెటి రోశయ్య సోమవారం రాత్రి శ్రీశైలం చేరుకున్నారు. స్థానిక వీవీఐపీ అతిథి గహం వద్ద ఈవో భరత్‌గుప్త, డీఐజీ రమణకుమార్, ఎస్పీ రవికృష్ణ, వాసవీ సత్రసముదాయం అధ్యక్షుడు, దేవస్థానం మాజీ ట్రస్ట్‌బోర్డు చైర్మెన్ ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు తదితరులు ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికారు. మంగళవారం ఉదయం స్వామిఅమ్మవార్లను దర్శించుకుంటారని, అనంతరం వాసవీసత్ర ఫేజ్ 2 వసతిగృహ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొంటారని అధికారవర్గాల ద్వారా తెలిసింది.