
ప్రభుత్వ ఏర్పాటుకు జయకు ఆహ్వానం
చెన్నై: తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా అన్నా డీఎంకే అధినేత్రి జయలలితను ఆ రాష్ట్ర గవర్నర్ కే రోశయ్య ఆహ్వానించారు. రాజ్భవన్ ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపింది. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం రాజీనామాను రోశయ్య ఆమోదించినట్టు వెల్లడించింది.
ఈ రోజు మధ్యాహ్నం జయలలిత గవర్నర్తో సమావేశంకానున్నారు. రేపు తమిళనాడు సీఎంగా జయ ప్రమాణం చేస్తారు. ఈ రోజు ఉదయం అన్నా డీఎంకే శాసనసభ పక్ష నాయకురాలిగా జయలలిత ఎన్నికయ్యారు. అనంతరం పన్నీరు సెల్వం రాజ్భవన్కు వెళ్లి రాజీనామా లేఖ అందజేశారు.