పేద ప్రజల బతుకుల్లో మార్పుకోసం అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న ఇందిరాగాంధీ దేశంకోసం ప్రాణ త్యాగం చేశారని తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య అన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ శతజయంతి ఉత్సవాలను శనివారం గాంధీభవన్‌లో ప్రారంభించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్పీనేత కె.జానారెడ్డి, పార్టీనేతలు పొన్నాల లక్ష్మయ్య, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.