
హైకోర్టులో రోశయ్య క్వాష్ పిటిషన్
హైదరాబాద్: అమీర్పేట భూ వివాదం కేసు నుంచి తనకు విముక్తి కల్పించాలని తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. అమీర్పేట భూ వివాదంలో ఏసీబీ పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ రోశయ్య వేసిన క్వాష్ పిటిషన్ను మంగళవారం ఉమ్మడి హైకోర్టు స్వీకరించింది.
ఈ కేసు నుంచి తప్పించాలని గవర్నర్ రోశయ్యతో పాటు మరో 15 మంది హైకోర్టును అభ్యర్థించారు. 9 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని రోశయ్యపై అభియోగాలు మోపిన విషయం తెలిసిందే.