రెంటపాళ్ల కేసు.. వైఎస్‌ జగన్‌పై విచారణకు హైకోర్టు స్టే | YS Jagan Quash Petition Hearing In AP High Court In Singayya Incident On July 1st Updates Top Headlines | Sakshi
Sakshi News home page

రెంటపాళ్ల కేసు.. వైఎస్‌ జగన్‌పై విచారణకు హైకోర్టు స్టే

Jul 1 2025 9:30 AM | Updated on Jul 1 2025 2:11 PM

Singaiah Incident: YS Jagan quash petition Hearing AP High Court July 1st Updates

రెంటళ్లపాళ్ల కేసులో పోలీసులకు, కూటమి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్‌ జగన్‌ విచారణకు ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో తదుపరి చర్యలన్నింటిని నిలిపివేస్తూ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ ప్రతీకారంతోనే తనపై కేసు పెట్టారంటూ వైఎస్‌ జగన్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

సాక్షి, అమరావతి: సింగయ్య రోడ్డు ప్రమాదం కేసులో ఏపీ పోలీసులకు, కూటమి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది.  వైఎస్‌ జగన్‌ను పోలీసులు విచారించకుండా హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో తదుపరి చర్యలన్నింటిని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్‌ దాఖలుకు ఏజీ రెండు వారాల గడువు కోరగా.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. రాజకీయ ప్రతీకారంతోనే తనపై కేసు పెట్టారంటూ వైఎస్‌ జగన్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది.

  • క్వాష్‌ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడానికి ఎఫ్‌ఐఆర్‌ ఇన్ఫర్మేషన్‌ సరిపోతుంది కదా?.. ఏజీతో హైకోర్టు బెంచ్‌

  • వాదనలు వినిపించడానికి అవకాశం ఇవ్వాలి: జడ్జితో జగన్‌ లాయర్‌ 

  • వాదనలు వినాల్సిన అవసరం లేదు: జడ్జితో అడ్వొకేట్‌ జనరల్‌ 

  • సంఘటన తర్వాత నాలుగు రోజుల తర్వాత వీడియో విడుదల చేశారు: : జగన్‌ లాయర్‌ 

  • సోషల్‌ మీడియాలో డౌన్‌లోడ్‌ చేశామని ఎస్‌ఐ చెప్పారు: జగన్‌ లాయర్‌ 

  • ఏఐతో ఏదైనా సృష్టించగలిగే అవకాశం ఉంది కదా: జగన్‌ లాయర్‌ 

  • కౌంటర్‌ దాఖలుకు రెండు వారాల సమయం ఇవ్వండి: జడ్జితో అడ్వొకేట్‌ జనరల్‌

  • ఆధారాలు ఉన్నా ఇంకా సమయం దేనికి?: జగన్‌ లాయర్‌

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామ పర్యటనకు వెళ్తుండగా.. వైఎస్సార్‌సీపీ కార్యకర్త సింగయ్య ప్రమాదవశాత్తూ మరణించాడు. అయితే జగన్‌ కాన్వాయ్‌ కారణంగానే సింగయ్య మరణించాడంటూ నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ వైఎస్‌ జగన్‌తో పాటు పలువురు ఆయన వ్యక్తిగత కార్యదర్శి, వైఎస్సార్‌సీపీ నేతలూ క్వాష్‌ పిటిషన్లు వేయగా.. వాటంన్నింటిని కలిపే హైకోర్టు విచారణ జరుపుతోంది. 

గత విచారణ సందర్భంగా.. సింగయ్య మృతికి వైఎస్‌ జగన్‌ కారకులు ఎలా అవుతారంటూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్నవాళ్లపై ఎలా కేసు పెడతారు?. ప్రమాదానికి ప్రయాణికులను ఎలా బాధ్యుల్ని చేస్తారు?. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కుంభమేళాలో తొక్కిసలాట ఘటన జరిగింది కదా’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. నేటి విచారణలో జగన్‌ విచారణపై ఏకంగా స్టే విధించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement