ameerpet land case
-
రోశయ్యను వదలని ‘అమీర్‌పేట భూవివాదం’
సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్యను అమీర్‌పేట భూ కేటాయింపుల వివాదం వదిలేలా లేదు. కాంగ్రెస్ సీనియర్ నేతగా గవర్నర్‌గా ఎన్నో హోదాల్లో పని చేసిన ఆయనను ఈ కేసు నీడలా వెంటాడుతూనే ఉంది. తాజాగా ఈ భూ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ కేసుకు సంబంధించి రోశయ్యపై వచ్చిన ఆరోపణలను ఆరు నెలల్లోగా తేల్చాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా రోశయ్య సీఎంగా ఉన్న సమయంలో అమీర్‌పేటలో ఉన్న హెచ్ఎండీఏ భూమిని డీనోటిఫై చేసి 9.14 ఎకరాలను కొందరికి కేటాయించారు. దీనిపై అప్పట్లోనే వివాదం తలెత్తింది. 2009-10 మధ్యలో రోశయ్యమీద భూవివాదం కేసు నమోదు అయ్యింది. ఏసీబీ కోర్టు సమన్లు కూడా ఇచ్చింది. అనంతరం ఆయనకు ఏసీబీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ తర్వాతి కాలంలో రోశయ్య గవర్నర్ కావడం, సమన్లను హైకోర్టులో సవాలు చేయడంతో న్యాయస్థానం వాటిపై స్టే ఇచ్చింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఏసీబీ నమోదు చేసిన అభియోగాలను కొట్టివేస్తూ రోశయ్యకు ఊరట కలిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో మార్చి 2016లో మోహన్‌లాల్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పలు వాయిదాల తర్వాత విచారణకు వచ్చిన ఈ కేసులో సుప్రీంకోర్టు పిటిషన్‌ను స్వీకరిస్తున్నట్టు తెలిపింది. ఆరు నెలల్లోగా ఈ కేసును విచారణ జరుపుతామని జస్టిస్ రంజన్ గగోయ్ ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది. ఎంతో విలువైన భూముల విషయంలో తీసుకున్న నిర్ణయాలను ప్రాథమికంగా పరిశీలించిన కోర్టు.. ఈ కేసు తీవ్రమైందని వ్యాఖ్యానించింది. మరింత లోతుగా విచారించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆరు నెలల్లో కేసు ముగించాలని కూడా తెలిపింది. -
అమీర్ పేట భూములపై సుప్రీంలో వ్యాజ్యం
భూములు పొందిన వారికి నోటీసులు జారీ తమిళనాడు గవర్నర్‌కు నోటీసులు అవసరం లేదని స్పష్టీకరణ సాక్షి, న్యూఢిల్లీ: అమీర్‌పేట భూముల కేసులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ రోశయ్యకు ఏసీబీ ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లను హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కె.మోహన్‌లాల్ అనే వ్యక్తి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ప్రఫుల్ల సి పంత్‌తో కూడిన ధర్మాసనం దీన్ని మంగళవారం విచారించింది. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే, న్యాయవాది శ్రీహర్ష వాదనలు వినిపిస్తూ.. ఏసీబీ ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లను హైకోర్టు కొట్టివేయడం సరికాదని, దానిపై స్టే ఇవ్వాలని కోరారు. ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్‌కు సమన్లు జారీచేయడం సాధ్యం కాదన్న హైకోర్టు తీర్పు సబబేనని రోశయ్య తరపు సీనియర్ న్యాయవాది పీపీ రావు కోర్టుకు విన్నవించారు. కాగా, హైకోర్టు తీర్పులో ఎక్కడా ఆర్టికల్ 361 ప్రస్తావన లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. రోశయ్య తరపున న్యాయవాది కేవియట్ పిటిషన్ వేసి హాజరైనందున రోశయ్యకు నోటీసులు అవసరం లేదని పేర్కొంటూ, భూములు పొందిన వారికి నోటీసులు జారీ చేస్తూ విచారణను ధర్మాసనం ఆరు వారాల పాటు వాయిదా వేసింది. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉండగా అమీర్‌పేట్‌లోని 9.14 ఎకరాల ప్రభుత్వ భూమిని డీనోటిఫై చేస్తూ ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. -
హైకోర్టులో రోశయ్య స్క్వాష్ పిటిషన్
-
హైకోర్టులో రోశయ్య క్వాష్ పిటిషన్
హైదరాబాద్: అమీర్‌పేట భూ వివాదం కేసు నుంచి తనకు విముక్తి కల్పించాలని తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. అమీర్‌పేట భూ వివాదంలో ఏసీబీ పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ రోశయ్య వేసిన క్వాష్ పిటిషన్‌ను మంగళవారం ఉమ్మడి హైకోర్టు స్వీకరించింది. ఈ కేసు నుంచి తప్పించాలని గవర్నర్ రోశయ్యతో పాటు మరో 15 మంది హైకోర్టును అభ్యర్థించారు. 9 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని రోశయ్యపై అభియోగాలు మోపిన విషయం తెలిసిందే.