'మరో రూపంలో మళ్లీ జన్మించి వెలుగునివ్వాలి' | Tamilnadu governor rosaiah tributes paid to bapu | Sakshi
Sakshi News home page

'మరో రూపంలో మళ్లీ జన్మించి వెలుగునివ్వాలి'

Published Tue, Sep 2 2014 9:27 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 PM

Tamilnadu governor rosaiah tributes paid to bapu

చెన్నై : బాపూ భౌతికకాయానికి తమిళనాడు గవర్నర్ రోశయ్య మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ తెలుగువారి సత్తా ప్రపంచానికి చాటిన ఘనత బాపూదన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకున్నట్లు తెలిపారు. తెలుగు సినిమా రంగంలో బాపూ చెరగని ముద్ర వేశారని, ఆయన మరో రూపంలో మళ్లీ జన్మించి తెలుగు జాతికి వెలుగునివ్వాలన్నారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్....బాపూకు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాపూతో గల అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తెలుగువారి గుండెల్లో బాపూ గూడు కట్టుకున్నారని, బుడుగు చదవిని వారు ఉండరని ఆయన అన్నారు. బాపూ మృతితో తెలుగువారిలో ఓ అంగం పోయినట్లు ఉందని మండలి బుద్దప్రసాద్ అన్నారు. నటుడు మోహన్ బాబు, గాయకుడు మనో కూడా బాపూకు నివాళులు అర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement