Mandali Budda Prasad
-
వెంకన్నను దర్శించుకున్న పలువురు ప్రముఖులు
-
వెంకన్నను దర్శించుకున్న పలువురు ప్రముఖులు
సాక్షి, తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. విఐపి దర్శనంలో గవర్నర్ నరసింహన్, మండలి బుద్ద ప్రసాద్,మాజీ మంత్రి ముద్దుకృష్ణమ నాయుడు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందచేసారు. స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. కాగా శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరుమల చేరుకుని శనివారం స్వామివారిని దర్శించుకుంటారని గవర్నర్ తెలిపారు. తెలుగు భాషా మృత భాషాగా మారుతుందని, భాషాను అమృత భాషాగా మార్చాలని బుద్ధప్రసాద్ అన్నారు. -
14న మళ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ
♦ హాజరవ్వాలంటూ రోజా, కొడాలి, జ్యోతుల, కోటంరెడ్డి, చెవిరెడ్డిలకు నోటీసులు ♦ టీడీపీ ఎమ్మెల్యే అనితకు కూడా.. సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ ఈ నెల 14వ తేదీన మళ్లీ సమావేశం కానుంది. ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ అందజేసిన నివేదికలో ప్రస్తావించిన ఎమ్మెల్యేల వాదనలను ఆ రోజున విననుంది. ఆ మేరకు తమ వాదనలు వినిపించాల్సిందిగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రోజా, కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిలతోపాటు ప్రివిలేజ్ కమిటీలో సభ్యునిగా ఉన్న జ్యోతుల నెహ్రూకు కూడా మంగళవారం నోటీసులు జారీ చేసింది. అలాగే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై ఫిర్యాదు చేసిన టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనితను కూడా అదేరోజున కమిటీ ముందు హాజరై వాదనలు వినిపించాలంటూ నోటీసులిచ్చింది. ప్రివిలేజ్ కమిటీ సమావేశం మంగళవారం అసెంబ్లీ కమిటీ హాలులో చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగింది. ఇందులో సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జ్యోతుల నెహ్రూ(వైఎస్సార్సీపీ), కె.రామకృష్ణ(టీడీపీ) పాల్గొన్నారు. కమిటీ ముందు రోజా మంగళవారం హాజరై వాదనలు వినిపించాల్సి ఉంది. తాను నగరంలో ఉండట్లేదు కాబట్టి హాజరు కాలేనని, మరో రోజు హాజరవుతానని ఆమె లేఖ రాశారు. లేఖను కమిటీ ఆమోదించి.. 14న కమిటీ తిరిగి సమావేశమవుతుంది కాబట్టి ఆరోజున హాజరు కావాలని ఆమెను కోరింది. గత డిసెంబర్లో శాసనసభ శీతాకాల సమావేశాల్లో జరిగిన పరిణామాలపై విచారించిన బుద్ధప్రసాద్ నేతృత్వంలోని కమిటీ.. కొడాలి నానితోపాటు రోజాపై కఠిన చర్యలు తీసుకోవాలని, జ్యోతుల నెహ్రూ, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలను ెహ చ్చరించాలని సూచించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారందర్నీ 14న ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరవ్వాలని నోటీసులిచ్చింది. అందరి వాదనలు విన్న తరువాత కమిటీ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా తన నివేదికను అసెంబ్లీకి సమర్పించనుంది. -
రోజా, కొడాలి నానీలపై చర్యలు తీసుకోవాలి
అధికారపక్ష సభ్యులను మందలించాలి ♦ భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి ♦ స్పీకర్‌కు మండలి బుద్ధ ప్రసాద్ కమిటీ నివేదిక సాక్షి, హైదరాబాద్: సభ సజావుగా జరగకుండా ఆటంకం కలిగిస్తూ శాసనసభలో ప్రతిపక్షంపై పదేపదే వ్యాఖ్యలు చేస్తున్న అధికారపక్ష సభ్యులను తీవ్రంగా మందలించాల్సిందిగా మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలోని కమిటీ స్పీకర్‌కు సూచించింది. సభా మర్యాదకు భంగం కలిగేలా వ్యవహరించిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. భవిష్యత్‌లో సభలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కె.శ్రీధర్‌రెడ్డిలను హెచ్చరించాలని నివేదికలో పొందుపరిచారు. గతేడాది డిసెంబర్ 22న శాసనసభ జీరో అవర్‌లో జరిగిన చర్చ, వీడియో ఫుటేజీ లీకేజ్ తదితర అంశాలపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు.. ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ఛైర్మన్‌గా, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, తెనాలి శ్రావణ్‌కుమార్, పి.విష్ణుకుమార్ రాజు సభ్యులుగా కమిటీని నియమించారు. ఈ కమిటీ తన నివేదికను స్పీకర్‌కు అందజేసింది. ఆయన ఈ నివేదికను ప్రివిలేజ్ కమిటీకి పంపారు. మంగళవారం జరిగిన ప్రివిలేజ్ కమిటీలో అప్పటికప్పుడు నివేదికను అందజేసి, చర్చ చేపట్టాలని ఇన్చార్జి కార్యదర్శి కె.సత్యానారయణ ప్రయత్నించారు. దీన్ని వైఎస్సార్సీపీ సభ్యులు అడ్డుకున్నారు. నివేదికను తాము అధ్యయనం చేసిన తరువాతనే చర్చించాలని సూచించారు. దీంతో సభ్యులకు నివేదికను అందచేశారు. మండలి బుద్ధప్రసాద్ కమిటీ నివేదికలోని అంశాలు ఇలా ఉన్నాయి. ప్రతిపక్షం తప్పులను ఎత్తి చూపేందుకే వీడియో క్లిప్పింగ్‌లు ఉపయోగపడేలా ఉన్నాయని, అధికారపక్షం సభ్యులు చేసిన వ్యాఖ్యలను కూడా కమిటీ పరిశీలించాలని గడికోట శ్రీకాంత్‌రెడ్డి కోరారు. వీడియో క్లిప్పింగ్‌ల లీకేజీకి సంబంధించి సైబర్ క్రైం పోలీసులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సభ జరిగే సమయంలో వీడియో రికార్డింగ్, ప్రత్యక్ష ప్రసారాలు బహిర్గతం కాకుండా ఉండేందుకు సమగ్ర వ్యవస్థను రూపొందించాలని కమిటీ సూచించింది. కమిటీ చేసిన కొన్ని సిఫార్సులను గడికోట శ్రీకాంత్‌రెడ్డి వ్యతిరేకించారు. రోజాపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరారు. ప్రతిపక్ష నేతపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను ఖండించిన కొడాలి నానీపై చర్యకు సిఫార్సు చేశారని, ఆ వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడుపై కూడా చర్యకు సిఫార్సు చేసి ఉంటే బాగుండేదని ఆయన పేర్కొన్నారు. -
కమిటీ నివేదిక ప్రకారం చర్యలు: స్పీకర్
సాక్షి, హైదరాబాద్: గత శాసనసభ శీతాకాల సమావేశాల్లో జరిగిన పరిణామాలను పరిశీలించేందుకు నియమించిన ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలోని కమిటీ నివేదిక అందిందని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. ఈ నివేదికలోని అంశాల ఆధారంగా నిబంధనల మేరకు చర్యలుంటాయని పేర్కొన్నారు. అసెంబ్లీ ఆవరణలోని తన ఛాంబర్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధనకు ఒప్పందం స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ను తయారు చేసే అంశంలో పరస్పర సహకారానికి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్(డబ్ల్యుటీవో) మధ్య ఒప్పందం కుదిరింది. ఈ పత్రాలపై స్వచ్ఛాం ధ్రప్రదేశ్ కన్వీనర్, స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు సమక్షంలో పంచాయతీరాజ్ కమిషనర్ రామాంజనేయులు, డబ్ల్యుటీవో వ్యవస్థాపకుడు జాక్సిమ్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కోడెల మాట్లాడుతూ వందశాతం మరుగుదొడ్ల నిర్మాణమే లక్ష్యంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు. -
18న మండలి కమిటీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: గత నెల 22న ఏపీ శాసనసభ జీరో అవర్‌లో సభ్యులు ప్రస్తావించిన అంశాలపై విచారణ చేసి నివేదిక ఇచ్చేందుకు ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఈ నెల 18న సమావేశం కానుంది. కమిటీ 11న సమావేశం కావాల్సి ఉండగా జన్మభూమి, సంక్రాంతి సెలవుల నేపథ్యంలో సమావేశాన్ని 18వ తేదీకి వాయిదా వేశారు. కమిటీలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి (వైఎస్సార్సీపీ), తెనాలి శ్రావణ్‌కుమార్ (టీడీపీ), పి. విష్ణుకుమార్ రాజు(బీజేపీ) సభ్యులుగా ఉన్నారు. -
ప్రజలను కలిపే శక్తి భాషకే ఉంది : బుద్ధప్రసాద్
భవానీపురం : తెలుగు రాష్ర్టం రెండుగా విడిపోవడం బాధాకరమైనప్పటికీ తెలుగు ప్రజలను కలిపే శక్తి ఒక్క తెలుగు భాషకే ఉందని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. భాషా పండితుడు, బాలవ్యాకరణ రూపకర్త పరవస్తు చిన్నయసూరి 208వ జయంతి సందర్భంగా గవర్నర్‌పేటలోని డాక్టర్ కేఎల్ రావు భవన్లో చిన్నయసూరి సాహితీ పీఠం ఆధ్వర్యాన ‘తెలుగు భాషా వికాసం’ అంశంపై శనివారం జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విజయవాడ కేంద్రంగా సాహితీ వికాస కేంద్రం, సాహిత్య అకాడమీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం తెలుగు శాఖాధిపతి ఆచార్య వెలమల సిమ్మన్నను సత్కరించారు. సాహితీ పీఠం అధ్యక్షుడు టి.శోభనాద్రి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఆకాశవాణి కేంద్రం సంచాలకులు ఎం.కృష్ణకుమారి, తానా అధ్యక్షుడు నన్నపనేని మోహన్, తెలుగు వర్సిటీ మాజీ వీసీ ఆవుల మంజులత, జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జి.సుబ్బారావు, గుమ్మా సాంబశివరావు పాల్గొన్నారు. -
'మరో రూపంలో మళ్లీ జన్మించి వెలుగునివ్వాలి'
-
'మరో రూపంలో మళ్లీ జన్మించి వెలుగునివ్వాలి'
చెన్నై : బాపూ భౌతికకాయానికి తమిళనాడు గవర్నర్ రోశయ్య మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ తెలుగువారి సత్తా ప్రపంచానికి చాటిన ఘనత బాపూదన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకున్నట్లు తెలిపారు. తెలుగు సినిమా రంగంలో బాపూ చెరగని ముద్ర వేశారని, ఆయన మరో రూపంలో మళ్లీ జన్మించి తెలుగు జాతికి వెలుగునివ్వాలన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్....బాపూకు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాపూతో గల అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తెలుగువారి గుండెల్లో బాపూ గూడు కట్టుకున్నారని, బుడుగు చదవిని వారు ఉండరని ఆయన అన్నారు. బాపూ మృతితో తెలుగువారిలో ఓ అంగం పోయినట్లు ఉందని మండలి బుద్దప్రసాద్ అన్నారు. నటుడు మోహన్ బాబు, గాయకుడు మనో కూడా బాపూకు నివాళులు అర్పించారు. -
వైఎస్ జగన్ కు యనమల ఫోన్!
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, శాసనసభలో ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవహారాల శాఖామంత్రి యనమల రామకృష్ణుడు ఫోన్ చేశారు. డిప్యూటీ స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని వైఎస్ జగన్ కు యనమల విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవికి మండలి బుద్ధప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటి స్పీకర్ పదవికి నామినేషన్ల గడువు ఈ సాయంత్రం ముగియనుంది. డిప్యూటి స్పీకర్ పదవికి మండలి బుద్ద ప్రసాద్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో అతని ఎంపిక ఏకగ్రీవం కానుంది.