18న మండలి కమిటీ సమావేశం
Published Tue, Jan 12 2016 10:50 AM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM
సాక్షి, హైదరాబాద్: గత నెల 22న ఏపీ శాసనసభ జీరో అవర్‌లో సభ్యులు ప్రస్తావించిన అంశాలపై విచారణ చేసి నివేదిక ఇచ్చేందుకు ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఈ నెల 18న సమావేశం కానుంది. కమిటీ 11న సమావేశం కావాల్సి ఉండగా జన్మభూమి, సంక్రాంతి సెలవుల నేపథ్యంలో సమావేశాన్ని 18వ తేదీకి వాయిదా వేశారు. కమిటీలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ), తెనాలి శ్రావణ్‌కుమార్ (టీడీపీ), పి. విష్ణుకుమార్ రాజు(బీజేపీ) సభ్యులుగా ఉన్నారు.
Advertisement
Advertisement