commitee
-
కోవిడ్ నిబంధనలతో G-20 వర్కింగ్ గ్రూప్ మీటింగ్
-
తెలుగు నిర్మాతల మండలి సర్వసభ్య సమావేశం రసాభాస
-
కాంగ్రెస్ లో మార్పు వస్తుందని ఆశిస్తున్నా: కోమటిరెడ్డి వెంకట రెడ్డి
-
మానవాళికి ఉగ్ర ముప్పు పెరుగుతోంది : జైశంకర్
-
‘ఎంఎస్పీ’ కమిటీపై రగడ.. కేంద్రం ఏమందంటే?
న్యూఢిల్లీ: కనీస మద్దతు ధరపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీపై రైతు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. కమిటీని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్టు రైతు సంఘాల కూటములైన భారతీయ కిసాయన్ యూనియన్ (బీకేయూ), సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రకటించాయి. రద్దు చేసిన వివాదాస్పద సాగు చట్టాలను సమర్థించిన కుహానా రైతు నేతలకు, కార్పొరేట్ శక్తుల ప్రతినిధులకు కమిటీలో స్థానం కల్పించడం ద్వారా కేంద్రం తన చిత్తశుద్ధి లేమిని బయట పెట్టుకుందంటూ ధ్వజమెత్తాయి. ఆ చట్టాలను దొడ్డిదారిన తిరిగి తెచ్చేందుకే కమిటీ వేశారని ఆరోపించాయి. ఇదో బోగస్ కమిటీ అని ఎస్కేఎం సభ్యుడు దర్శన్ పాల్ ఆరోపించారు. మద్దతు ధరకే పరిమితం కావాల్సిన కమిటీ పరిధిని సహజ సాగుకు ప్రోత్సాహం, పంట వైవిధ్యం వంటి పలు అంశాలకు విస్తరించడం వెనక ఉద్దేశం ఇదేనని రైతు నేతలు అంటున్నారు. పలు అంశాలను చేర్చడం ద్వారా మద్దతు ధర అంశం ప్రాధాన్యతను తగ్గించారని హర్యానా బీకేయూ చీఫ్ గుర్నామ్‌సింగ్ దుయ్యబట్టారు. రైతులు, నేతల అభ్యంతరాలన్నింటినీ ప్యానల్లో చర్చిస్తామని కమిటీ సభ్యుడైన హరియాణాకు చెందిన రైతు నేత గునీ ప్రకాశ్ చెప్పారు. మరోవైపు, చట్టపరమైన హామీ కల్పించేందుకు కమిటీ వేస్తామని సంయుక్త కిసాన్ మోర్చాకు ప్రభుత్వం హామీ ఇవ్వలేదని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. మంగళవారం లోక్‌సభకు ఆయన ఈ మేరకు లిఖితపూర్వకంగా బదులిచ్చారు. ఎంఎస్పీని మరింత పారదర్శకంగా ప్రభావశీలంగా మార్చడం, సహజ సాగును ప్రోత్సహించడం తదితరాల కోసం కమిటీ వేస్తామని మాత్రమే కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. ఆ మేరకే రైతు ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, వ్యవసాయ ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలతో కమిటీ వేశామన్నారు. ఇదీ చదవండి: PM Kisan: అలర్ట్: ఇలా చేయకపోతే మీ రూ. 2000 పోయినట్లే..! -
సినిమా టికెట్ల అంశంపై స్పందించిన దిల్‌రాజు
Producer Dil Raju Comments On Ap Ticket Issue: ‘‘ప్రేక్షకులను, సినిమా ఇండస్ట్రీని బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది. ఇలాంటి అంశాలపై చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామం’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ–‘‘మా ఇబ్బందులు ఏంటి? అనేది ప్రభుత్వానికి ఇప్పటికీ కచ్చితంగా తెలియడం లేదు. టిక్కెట్ల ధర పెంపు, 5వ ఆటకు అనుమతి వంటి అంశాలపై చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీలో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఇండస్ట్రీ నుంచి ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ ఉంటారు. తెలుగు ఫిల్మ్ చాంబర్ నుంచి ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి కొన్ని పేర్లు కూడా పంపించారు. త్వరలోనే కమిటీని నియమిస్తారు. కమిటీ వల్ల ఇరువైపులా చర్చించేందుకు ఎక్కువ సమయం దొరుకుతుంది. ఈ కమిటీలోని వాళ్లు ఇండస్ట్రీ సాధక బాధకాలు ప్రభుత్వానికి వినిపించి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు. అప్పటి వరకు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరూ సోషల్ మీడియా పోస్టులు చేయకపోవడం, మాట్లాడకపోవడం మంచిది. ప్రభుత్వం నుంచే స్పందన వచ్చి సమస్యల పరిష్కారానికి ఓ కమిటీ వేశారు కాబట్టి త్వరలోనే పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాం. మాకు అపాయింట్మెంట్ ఇస్తే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారిని, మంత్రి పేర్ని నానిగారిని కలవాలనుకుంటున్నాం. ఇటు ఇండస్ట్రీకి అటు సొసైటీకి, ప్రభుత్వాలకు మధ్య మీడియాది చాలా కీలక పాత్ర. మాలో భాగమైన మీడియా కూడా ఇండస్ట్రీ వార్తలను సున్నితమైనవిగా చూడాలి కానీ సెన్సేషన్ చేయొద్దని కోరుకుంటున్నాం. ఇప్పటి పరిస్థితులను పాజిటివ్‌గానే తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా త్వరలోనే టిక్కెట్ల విషయంలో కొత్త జీవో వస్తుందని ఆశిస్తున్నాం. నిర్మాతల, ఎగ్జిబిటర్ల సమస్యలు వేర్వేరు. అన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళితే పరిష్కారం అవుతాయనే నమ్మకం ఉంది. కమిటీ ఏర్పాటైన తర్వాత కూడా ప్రస్తుత అంశాలు పరిష్కారం కాకుంటే అన్ని క్రాఫ్ట్స్ వారు కూర్చుని ఎలా చేస్తే బాగుంటుందని అప్పుడు ఆలోచించుకుని మాట్లాడదాం.. దయచేసి అప్పటి వరకూ ఎవరూ స్పందించ వద్దు. కష్టమో, నష్టమో సినిమాల విడుదలను ఆపుకోలేం.. పెద్ద సినిమాలను అస్సలు ఆపుకోలేం. రిలీజ్‌కి రెడీగా ఉన్న వాటిని విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. తెలంగాణలో కొత్త టిక్కెట్ ధరలను నిర్ణయించి జీవో ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌గారికి, మంత్రి తలసానిగారికి నిర్మాతల తరఫున థ్యాంక్స్’’ అన్నారు. ఈ సమావేశంలో నిర్మాతలు ‘స్రవంతి’ రవికిశోర్, వంశీ పాల్గొన్నారు. -
పెగాసస్ విచారణకు నిపుణుల కమిటీ ఏర్పాటు: సుప్రీం కోర్టు
-
అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ సమావేశం వాయిదా
విజయవాడ: ఈనెల 18న జరగాల్సిన అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ సభ్యుల సమావేశం వాయిదా పడింది. అగ్రి గోల్డ్ కేసు అదేరోజున కోర్టులో విచారణకు రానున్నందున సమావేశాన్ని 20వ తేదీ(శనివారం)కి వాయిదా వేసినట్లు వైఎస్సార్సీపీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి తెలిపారు. కోర్టు ఉత్తర్వులననుసరించి 20న జరిగే సమావేశంలో బాధితుల సమస్యలపై కార్యాచరణ ఖరారు చేస్తామన్నారు. బాధితులు పూర్తి సమాచారంతో ఉదయం 10.30 గంటలకు విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో హాజరు కావాలని ఆయన కోరారు. -
తాంత్రిక పూజలపై నిజనిర్థారణ కమిటీ ఏర్పాటు
విజయవాడ : దుర్గగుడిలో అర్ధరాత్రి తాంత్రిక పూజలు నిర్వహించారని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం నిజనిర్దారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు కమిటీ ఏర్పాటు చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో దేవాదాయ శాఖ ఇంఛార్జి అదనపు కమిషనర్ రఘునాధ్, ఆగమ శాస్త్ర సలహా బోర్డు సభ్యుడు చిర్రావుల శ్రీరామ శర్మ సభ్యులుగా ఉన్నారు. నేడు, రేపు కమిటీ విచారణ చేయనున్నారు. దుర్గగుడి ఈఓ కార్యాలయానికి విచారణ కమిటీ సభ్యులు చేరుకున్నారు. -
ఫీజులు పెంచితే మహాధర్నానే
హైదరాబాద్ : స్కూల్ ఫీజులను ఏటా పది శాతం పెంచుకోవడానికి అనుమతించిన తిరుపతి రావు కమిటీ ప్రతిపాదనలను అమలు చేయరాదని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని పేరెంట్స్ కమిటి సభ్యులు కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం ఈ విషయంలో తన నిర్ణయాన్ని ప్రకటించకుంటే మహాధర్నా చేపడతామని వారు హెచ్చరించారు. సంక్రాంతి ముందు శుభవార్త వినిపిస్తామన్న ప్రభుత్వం మాట నిలుపుకోవాలని గుర్తు చేశారు. స్కూళ్ల యజమాన్యాలు ప్రభుత్వాన్ని, పోలీసు వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాయని చెప్పారు. ప్రతిపక్షాలు ఈ విషయంలో ముందుకు రాకుంటే ప్రజా విశ్వాసాన్ని కోల్పొతాయని చెప్పారు. గుజరాత్లో ఫీజులకు సంబంధించిన కేసులను అక్కడి ప్రభుత్వం ఆరునెలల్లో పరిష్కరిస్తె ఇక్కడ ఏడేళ్లయినా పరిష్కరించలేదని ఎద్దేవా చేశారు. ఈ నెల 6న ఉదయం11 గంటలకు నెక్లేస్ రోడ్డులో ధర్నా చేపడుతున్నట్లు సభ్యులు తెలిపారు. -
9 పట్టణాల్లో ట్రాఫిక్ పార్కులు
ఏలూరు సిటీ : జిల్లాలోని 9 పట్టణాల్లో మే 15 నాటికి 9 ట్రాఫిక్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ డాక్టర్ కె.భాస్కర్ చెప్పారు. మంగళవారం జిల్లాస్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో జిల్లా దేశంలోనే ప్రథమస్థానంలో ఉందని, ఈ పరిస్థితిని నివారించేందుకు రోడ్డు భద్రతపై అనేక కఠిన నిర్ణయాలు అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏలూరు నగరపాలక సంస్థతో పాటు 9 పురపాలక సంఘాల్లో ట్రాఫిక్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఈ పార్కులను మే 15 నాటికి పట్టణాల్లో ఏర్పాటు చేస్తే కమిషనర్లకు అదనపు ఇంక్రిమెంట్లు మంజూరు చేసేలా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తానని చెప్పారు. జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని ప్రతిరోజూ రెండు, మూడు ప్రమాదాలు జరిగుతుంటే ఐదారుగురు చనిపోతున్నారని, ఈ పరిస్థితిని నివారించాలి్సన బా«ధ్యత అందరిపై ఉందన్నారు. ఏప్రిల్ 1 నుంచి ప్రధాన రహదారుల్లో మద్యం షాపులు తొలగింపు జిల్లాలోని జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై ఏప్రిల్ 1 నుంచి ఒక్క మద్యం దుకాణాలు కనిపించేందుకు వీలులేదని కలెక్టర్ భాస్కర్ అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారుల్లో మద్యం షాపులు లేకుండా చర్యలు తీసుకోవాలని, మద్యం తాగాలనే కోరిక కలిగించే ప్రచార బోర్డులు కూడా కనిపించేందుకు వీలులేదన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర ప్రధాన రహదారుల్లోనూ మద్యంషాపులు ఇకపై కనిపించబోవని స్పష్టం చేశారు. జాతీయ రహదారిపై ఏ చిన్న గొయ్యి కనిపించినా సహించబోమని, టోల్‌ప్లాజాలు ఏర్పాటు చేసుకుని ప్రజల నుంచి ఎలా పన్నులు వసూలు చేస్తున్నారో అదేస్థాయిలో జాతీయ రహదారులపై నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ చెప్పారు. జాతీయ రహదారులపై 27 చోట్ల గుంటలు ఉన్నట్లు పరిశీలనలో తేలిందని, వాటిని మూడురోజుల్లోగా మరామ్మత్తులు చేయాలని ఎన్‌హెచ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇకపై గొయ్యి కన్పించిందని ఎవరైనా ఫిర్యాదు చేస్తే 24 గంటల్లో గోతులు సంబంధిత అధికారులు పూడ్చివేయకుంటే కలెక్టర్‌గా కాకుండా జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో బా«ధ్యులను జైలుకు పంపించేందుకు వెనుకాడబోనని స్పష్టం చేశారు. జిల్లాలో 45 ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయని గుర్తించామని తెలిపారు. సమావేశంలో డీటీసీ సత్యనారాయణమూర్తి, ఆర్అండ్బీ ఎస్ఈ ఎంవీ నిర్మల, పంచాయితీరాజ్ ఎస్ఈ ఇ.మాణిక్యం, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.కోటేశ్వరి, డీఈవో ఆర్ఎస్ గంగాభవాని, నగరపాలక సంస్థ కమిషనర్ యర్రా సాయి శ్రీకాంత్, నేషనల్ హైవే అథారిటీ అధికారి వెంకటరత్నం, నేషనల్ హైవే విజయవాడ పీడీ టి.సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ కమిటీ ఎంపిక
1 నుంచి విద్యార్థులకు అవగాహన సదస్సులు విజయవాడ(గాంధీనగర్): ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ అమరావతి శాఖ నూతన కమిటీ ఎంపికైంది. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో నూతన కమిటీని రాష్ట్ర అధ్యక్షుడు ప్రత్యూష సుబ్బారావు ప్రకటించారు. అమరావతి శాఖ నూతన అధ్యక్షుడుగా బీ రాంబాబు, ప్రధాన కార్యదర్శిగా జేæ కాశీవిశ్వేశ్వరరావు ఎంపికైనట్లు తెలిపారు, వీరితోపాటు ఉపాధ్యక్షులుగా కే విద్యాసాగర్, డీ అవంతి, కే సుభాష్, సహాయ కార్యదర్శులుగా ఎల్ వెంకటేశ్వర్లు, ఎన్ సతీష్, జీ సురేష్, కోశాధికారిగా ఎస్కే బాబీ, తొమ్మిది మంది కార్యవర్గ సభ్యులను ఎంపికచేసినట్లు చెప్పారు. ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు ఒకటి నుంచి స్ఫూర్తి పేరుతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. -
విద్యార్థుల పుస్తకాల బరువు తగ్గించేందుకు కమిటీ
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ప్రైమరీ విద్యార్థులు మోస్తున్న పుస్తకాల బరువు 10 నుంచి 12 కిలోలు. అదే హైస్కూల్ విద్యార్థులైతే 15 నుంచి 18 కేజీల బరువైన పుస్తకాలను మోస్తున్నారు. వాస్తవానికి స్కూల్ బ్యాగుల బరువు 4 నుంచి 6 కిలోల మధ్యే ఉండాలన్నది నిపుణుల అభిప్రాయం. దీంతో విద్యార్థులు అదనంగా మోస్తున్న ఆ 10 కేజీల బరువును తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు విద్యార్ధులకు అతి భారంగా మారిన పుస్తకాల బరువును తగ్గించేలా అవసరమైన చర్యలకోసం సిఫార్సులు చేసేందుకు సలహా కమిటీని నియమించినట్లు రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ కమిటీలో ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, ఎం.వి.వి.ఎస్.మూర్తి, రాము సూర్యారావుతో పాటు డాక్టర్ ఎస్.ఆర్.పరిమి (వికాస విద్యావనం, విజయవాడ), శ్రీరామ పద్మనాభం (రిషి వ్యాలీ, మదనపల్లె), డాక్టర్ ఎన్.మంగాదేవి (శ్రీవెంకటేశ్వర బాలకుటీర్, గుంటూరు), డాక్టర్ డి.సరస్వతి (లెబన్ స్కెల్ఫ్, విశాఖపట్నం), డాక్టర్ పి.డి.కామేశ్వరరావు (శోధన, చీపురుపల్లి), సి.వి.కృష్ణయ్య (జనవిఙానవేదిక), డాక్టర్ యూ.సుబ్బరాజు (టింబక్తు), టీవీఎస్ రమేష్ (ఎస్సీఈఆర్టీ) తదితరులు సభ్యులుగా ఉంటారని వివరించారు. సోమవారం తన చాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కమిటీ చేసే సూచనలను కూలంకషంగా పరిశీలించాక విద్యార్ధులపై పుస్తకాల బరువు తగ్గేలా చర్యలు చేపడతామన్నారు. టెన్త్ పరీక్షల్లో పేపర్‌లీక్ అవాస్తవం పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో పేపర్ లీకైనట్లు వచ్చిన వార్తల్ల వాస్తవం లేదని మంత్రి గంటా వివరించారు. పేపర్‌లీక్ ఎక్కడా కాలేదని, ఈమేరకు అన్ని జిల్లాలనుంచి తమకు నివేదికలు అందాయని చెప్పారు. మీడియా ఇలాంటి విషయాల్లో నిజనిర్ధారణ చేసుకొని ప్రసారాలు చేస్తే మంచిదని లేనిపక్షంలో వదంతులు వ్యాపించి విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆందోళనలో పడతారని పేర్కొన్నారు. ఏ ఒక్క విద్యార్థి నేలపై కూర్చొని పరీక్షలు రాసే పరిస్థితి లేకుండా అన్ని చోట్లా సరిపడా ఫర్నీచర్‌ను సమకూర్చామని మంత్రి చెప్పారు. ఇద్దరు హెడ్మాస్టర్ల సస్పెన్షన్ పరీక్షలకు ఒకరోజు ముందు స్కూల్‌ను ఓ ఫంక్షన్‌కు ఇచ్చిన నెల్లూరులోని పొదలకూరు రోడ్డులోని జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ను, అదే రోడ్డులోని బాలికల హైస్కూల్ హెడ్మాస్టర్ను సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి గంటా ప్రకటించారు. అధికారులు, టీచర్లు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని స్పష్టంచేశారు. ఉన్నత విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు మంగళవారం అన్ని యూనివర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్లతో సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. -
18న మండలి కమిటీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: గత నెల 22న ఏపీ శాసనసభ జీరో అవర్‌లో సభ్యులు ప్రస్తావించిన అంశాలపై విచారణ చేసి నివేదిక ఇచ్చేందుకు ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఈ నెల 18న సమావేశం కానుంది. కమిటీ 11న సమావేశం కావాల్సి ఉండగా జన్మభూమి, సంక్రాంతి సెలవుల నేపథ్యంలో సమావేశాన్ని 18వ తేదీకి వాయిదా వేశారు. కమిటీలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి (వైఎస్సార్సీపీ), తెనాలి శ్రావణ్‌కుమార్ (టీడీపీ), పి. విష్ణుకుమార్ రాజు(బీజేపీ) సభ్యులుగా ఉన్నారు. -
'బాధ్యులు ఎవరైనా వదిలేది లేదు'
విజయవాడ: నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు బాధ్యులు ఎంతటి వారైనా వదలబోమని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం విజయవాడలోని ఓ హోటల్లో బస చేసిన మంత్రిని రిషితేశ్వరి తల్లిదండ్రులు మురళీకృష్ణ, దుర్గాబాయ్ కలిశారు. తమ కుమార్తె మరణానికి కారణమై, తమకు తీవ్ర వేదన మిగిల్చిన వారిని కఠినంగా శిక్షించాలని మంత్రిని కోరారు. ' మా బిడ్డకు వచ్చిన కష్టం ఏ బిడ్డకు రాకూడదు' అంటూ రిషితేశ్వరి తల్లిదండ్రులు మంత్రి వద్ద బోరున విలిపించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ రిషితేశ్వరి ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. నివేధిక ఆధారంగా బాధితులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. -
వైఎస్సార్సీపీ తెలంగాణ కొత్త టీం
8 మంది ప్రధాన కార్యదర్శులు 11 మంది కార్యదర్శులు 11 మంది సంయుక్త కార్యదర్శుల నియామకం సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయి కమిటీ ఏర్పడింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షుడిగా ఏర్పాటు చేసిన కమిటీకి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ కమిటీలో 8 మంది ప్రధాన కార్యదర్శులు, 11 మంది కార్యదర్శులు, 11 మంది సంయుక్త కార్యదర్శులు, ఇద్దరు కార్యవర్గ సభ్యులు ఉన్నారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర అనుబంధ సంఘాలు పదింటికి అధ్యక్షులను, ముగ్గురు రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులను నియమించారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర కమిటీ జాబితాను విడుదల చేశారు. ప్రధానకార్యదర్శులు: ఎమ్మెల్యే పి.వెంకటేశ్వర్లు (ఖమ్మం), కె.శివకుమార్ (హైదరాబాద్), గట్టు శ్రీకాంత్‌రెడ్డి (నల్లగొండ), యెర్నేని వెంకటరత్నంబాబు(నల్లగొండ), ఎన్.సూర్యప్రకాష్ (మెదక్), హెచ్ఏ రెహ్మాన్ (హైదరాబాద్), ఎం.దయానంద్ విజయ్‌కుమార్ (ఖమ్మం), జి.నాగిరెడ్డి (నల్లగొండ-రాష్ట్రపార్టీ కార్యాలయ సమన్వయకర్త) నియమితులయ్యారు. కార్యదర్శులు: వండ్లోజుల వెంకటేశ్ (నల్లగొండ), ఏనుగు మహిపాల్‌రెడ్డి, జి.సూర్యనారాయణరెడ్డి, కె.అమృతసాగర్ (రంగారెడ్డి), జి. రాంభూపాల్‌రెడ్డి (మహబూబ్‌నగర్), క్రిసోలైట్ (హైదరాబాద్), కొమ్మర వెంకటరెడ్డి (మెదక్), బోయినపల్లి శ్రీనివాసరావు (కరీంనగర్), మాశారం శంకర్ (ఆదిలాబాద్),అల్లూరి వెంకటేశ్వరరెడ్డి (ఖమ్మం), విలియం ముని గాల (వరంగల్) నియమితులయ్యారు. సంయుక్త కార్యదర్శులు: టి.భూమయ్యగౌడ్,బంగి లక్ష్మణ్ (మహబూబ్‌నగర్‌జిల్లా), పి.శ్రీనివాసరెడ్డి (మెదక్), ఎస్.బి.మోహన్‌కుమార్, కసిరెడ్డి ఉపేంద్ర రెడ్డి, ఎస్.హరినాథ్‌రెడ్డి (హైదరాబాద్), గుడూరు జైపాల్‌రెడ్డి, ఏరుగు సునీల్ కుమార్ (నల్లగొండ), షర్మిల సంపత్ (ఖమ్మం), తోడసం నాగోరావు (ఆదిలాబాద్), సుజాతా మంగీలాల్ (వరంగల్) ఉన్నారు.రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా జూపల్లి రమేశ్ (ఖమ్మం), గిడిగంటి శివ (వరంగల్) ఉన్నారు. పార్టీ కార్యక్రమాల సమన్వయకర్తగా పెద్దపట్లోళ్ల సిద్దార్ధరెడ్డి నియమితులయ్యారు. అనుబంధ సంఘాల అధ్యక్షులు పార్టీ రాష్ట్ర రైతువిభాగం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి (మహబూబ్‌నగర్), యువజన విభాగం అధ్యక్షుడిగా బేష్వా రవీందర్ (మహబూబ్‌నగర్), ఎస్సీసెల్ అధ్యక్షుడిగా మెండం జయరాజ్ (ఖమ్మం), మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా ముజ్తిబాఅహ్మాద్-ముస్తాఫా (రంగారెడ్డి), సేవాదళ్ / వాలంటీర్ల అధ్యక్షుడిగా వెల్లాల రామ్మోహన్ (హైదరాబాద్), సాంస్కృతి విభాగం అధ్యక్షుడిగా సదమల్లా నరేష్ (కరీంనగర్), కార్మిక విభాగం అధ్యక్షుడిగా నర్రా భిక్షపతి (మెదక్ ), డాక్టర్స్ వింగ్ అధ్యక్షురాలిగా పి.ప్రఫుల్ల (హైదరాబాద్), క్రమశిక్షణా కమిటీ అధ్యక్షుడిగా విఎల్‌ఎన్ రెడ్డి (ఖమ్మం), క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా కె. జార్జి హర్బట్ (రంగారెడ్డి) నియమితులయ్యారు. రాష్ర్ట పార్టీ అధికారప్రతినిధులుగా కొండా రాఘవరెడ్డి, సత్యం శ్రీరంగం (రంగారెడ్డి), ఆకుల మూర్తి (ఖమ్మం) నియమితులయ్యారు. 4 జిల్లాల కమిటీల కొత్త అధ్యక్షులు.. మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, రంగారెడ్డిజిల్లా పార్టీ అధ్యక్షుడిగా జి. సురేష్‌రెడ్డి, వరంగల్జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జిన్నారెడ్డి మహేందర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నాయుడు ప్రకాష్‌లను నియమించారు. తెలంగాణ రాష్ట్ర కమిటీని మరింత విస్తరిస్తాం: పొంగులేటి రాబోయే రోజుల్లో రాష్ట్ర కమిటీని మరింత విస్తరించి తెలంగాణలో వైఎస్సార్సీపీ బలోపేతానికి చర్యలు తీసుకుంటామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక దివంగత వైఎస్సార్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమకార్యక్రమాలు అమలు కావాలని కోరుకుంటున్న ప్రజల పక్షాన నిలబడి అందుకు తమ పార్టీ కృషి చే స్తుందన్నారు. రాజన్న కన్న కలలను తెలంగాణలో సాకారం చేసుకునే ందుకు కృషి చేస్తామన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణలో అనేక కష్ట,నష్టాలు ఓర్చి పనిచేశారని, రానున్న కొద్దిరోజుల్లోనే పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో సముచితమైన రీతిలో గౌరవించేలా చూస్తామన్నారు. పార్టీకి అండగా ప్రజలున్నారని ఆయన చెప్పారు. పార్టీ కోసం పాటుపడిన వారికి తగిన గుర్తింపును ఇస్తామని చెప్పారు. పార్టీ నేతలు కె.శివకుమార్, నల్లా సూర్యప్రకాష్, గున్నం నాగిరెడ్డి, సత్యం శ్రీరంగం, జార్జి హర్బర్ట్, ఏనుగు మహీపాల్‌రెడ్డి తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. -
‘గెటౌట్’ సోర్సింగే..
‘ఏరు దాటే వరకూ ఊరింపు.. దాటాక వెక్కిరింపు’ అన్నట్టుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరు. ‘ఇంటికో ఉద్యోగం ఇస్తా’.. ఇది ఆయన ఎన్నికల్లో చేసిన వాగ్దానం. ‘ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ ఉద్వాసన’ ఇదీ ఇప్పుడాయన సర్కారు అమలు చేస్తున్న విధానం. అధికారంలోకి రాగానే రైతు, డ్వాక్రా రుణాల్ని మాఫీ చేస్తానన్న ఆయన వాటిపై పూటకో మాట మారుస్తున్నా.. ‘ఉపాధి మాఫీ’ అమలులో మాత్రం చురుకుగా వ్యవహరిస్తున్నారు. సాక్షి, రాజమండ్రి : వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇళ్లకు సాగనంపేందుకు చంద్రబాబు సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. ఒక పక్క ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై కమిటీ వేశామంటూనే వారిని తొలగించనుంది. ఈ పొట్టకొట్టే నిర్ణయాన్ని ముందుగా గృహ నిర్మాణ శాఖ నుంచి అమలు చేయనున్నారు. ఆ శాఖలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఈనెల 31 నుంచి ఇంటికి పంపేందుకు అధికారులు శ్రీముఖాలు సిద్ధం చేశారు. హతాశులైన చిరుద్యోగులు జలయజ్ఞం పథకం భూసేకరణ విభాగంలోని వివిధ యూనిట్లలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుతో ఈ ‘ఉపాధి మాఫీ’ ప్రారంభమైంది. అనంతరం గృహనిర్మాణ శాఖలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను జూన్ 30 నుంచి తొలగించాలని గత నెల రెండో వారంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులు ఆందోళన చే యడంతో తొలగింపు గడువును జూలై 31 వరకూ పెంచారు. జిల్లాలో గృహ నిర్మాణ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 220 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇప్పుడు తొలగించనున్నారు. ఈ నెలాఖరున ‘నో డ్యూటీ’ సర్టిఫికెట్లు తీసుకుని ఉద్వాసన పలకాలని సర్క్యులర్లు జారీ అయ్యాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై ప్రభుత్వం కమిటీ వేసిందన్న వార్తతో తమ కొలువులు మరి కొంత కాలం కొనసాగుతాయని ఆశించిన చిరుద్యోగులు హతాశులయ్యారు. గృహ నిర్మాణశాఖ అనంతరం ఇదే విధానాన్ని మిగిలిన శాఖల్లోనూ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో జిల్లాలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న 4500 మందికి పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. జీతాల సొమ్ముకు కేటాయింపులు కరువు.. గృహ నిర్మాణ శాఖలో ఔట్ సోర్సింగ్ పద్ధతిన రాష్ట్రంలో 1200 మంది వరకూ పని చేస్తున్నారు. వీరికి ఏటా జీతాలు చెల్లిం చేందుకు రూ.39 కోట్లు అవసరమని ఆ శాఖ అధికారులంటున్నారు. ఆర్థికశాఖ నుంచి ఇప్పటి వరకూ కొత్తగా ఎలాంటి కేటాయింపులు లేనందున ఉద్యోగులను కొనసాగించి, జీతాలను చెల్లించడం కష్టతరమంటున్నారు. ప్రభుత్వం వారిని కనికరిస్తే తప్ప ఉద్యోగులను కొనసాగించలేమని తెగేసి చెబుతున్నారు.