హైదరాబాద్ : స్కూల్ ఫీజులను ఏటా పది శాతం పెంచుకోవడానికి అనుమతించిన తిరుపతి రావు కమిటీ ప్రతిపాదనలను అమలు చేయరాదని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని పేరెంట్స్ కమిటి సభ్యులు కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం ఈ విషయంలో తన నిర్ణయాన్ని ప్రకటించకుంటే మహాధర్నా చేపడతామని వారు హెచ్చరించారు. సంక్రాంతి ముందు శుభవార్త వినిపిస్తామన్న ప్రభుత్వం మాట నిలుపుకోవాలని గుర్తు చేశారు.
స్కూళ్ల యజమాన్యాలు ప్రభుత్వాన్ని, పోలీసు వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాయని చెప్పారు. ప్రతిపక్షాలు ఈ విషయంలో ముందుకు రాకుంటే ప్రజా విశ్వాసాన్ని కోల్పొతాయని చెప్పారు. గుజరాత్‌లో ఫీజులకు సంబంధించిన కేసులను అక్కడి ప్రభుత్వం ఆరునెలల్లో పరిష్కరిస్తె ఇక్కడ ఏడేళ్లయినా పరిష్కరించలేదని ఎద్దేవా చేశారు. ఈ నెల 6న ఉదయం11 గంటలకు నెక్లేస్ రోడ్డులో ధర్నా చేపడుతున్నట్లు సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment