అమరావతి, సాక్షి: కూటమి ప్రభుత్వం ఒకటి అనుకుంటే.. మరొకటి జరుగుతోంది. ఏపీవ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వానికి పెద్దషాకే ఇస్తున్నారు. ఆర్భాటంగా జరుగుతుందని భావించిన పేరెంట్స్ టీచర్స్ డే మీటింగ్‌లో అడుగడుగునా నిలదీతలు ఎదురవుతున్నాయి. తల్లిదండ్రులు తమ ప్రశ్నలతో.. నిరసనలతో కూటమి నేతలను ఉక్కిరి బిక్కిరి చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా శనివారం తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల మెగా సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు , విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. కడప మున్సిపల్ హైస్కూల్‌లో జరిగిన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. అంతా సవ్యంగానే నడుస్తోందంటూ మంత్రులు, కూటమి నేతలు ప్రకటించుకున్నారు. కానీ..
కర్నూల్‌లో..
విద్యార్థుల సమస్యలపై అడుగడుగునా తల్లిదండ్రులను కూటమి నేతలను నిలదీస్తున్నారు. కర్నూల్‌లో మంత్రి టిజి భరత్‌ను ఓ విద్యార్థి తల్లి నిలదీశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని మండిపడ్డారు. ఆ భోజనం కారణంగానే తన బిడ్డ అస్వస్థతకు గురైందని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారామె. కర్నూలు నగరంలోని హైస్కూలో మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్‌లో మంత్రి భరత్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో..
ఏజెన్సీ కూనవరం ఏపీ టీ డబ్ల్యూ ఆశ్రమ పాఠశాలలో జరిగిన పేరెంట్స్ మీటింగ్లో రచ్చ రేగింది. అన్ని సబ్జెక్టులకు సరిపడా అధ్యాపకులు లేకపోవడాన్ని నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. సిలబస్ పూర్తికాకుండా తమ పిల్లలు పరీక్షలు ఎలా రాస్తారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. స్కూల్ ముందు రోడ్డుపై తమ పిల్లలతో బైఠాయించారు.
Comments
Please login to add a commentAdd a comment