
నిర్భయ తల్లిదండ్రుల అరెస్ట్
ఢిల్లీ: బాల నేరస్తుడిని విడుదల చేయరాదంటూ ఇండియా గేట్ వద్ద నిరసన తెలుపుతున్న నిర్భయ తల్లిదండ్రులతో పాటు ఇతర నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాల నేరస్తుడు సమాజంలోకి వస్తే నిర్భయకు న్యాయం జరగనట్లే అని ఆరోపిస్తూ చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అక్కడి నుండి తరలించారు.
మరోవైపు బాలనేరస్తుడి శిక్ష నేటితో పూర్తవడంతో అధికారులు అతన్ని విడుదల చేశారు. ఓ స్వచ్ఛంద సంస్థ పర్యవేక్షణలో అతను ఉండనున్నాడు. దేశ వ్యాప్త నిరసనలతో బాలనేరస్తుడిని జువైనల్ హోం నుండి ముందుగానే రహస్య ప్రాంతానికి తరలించిన అధికారులు అతడిని విడుదల చేసినట్టు ఆదివారం సాయంత్రం ప్రకటించారు.