కమిటీ నివేదిక ప్రకారం చర్యలు: స్పీకర్
సాక్షి, హైదరాబాద్: గత శాసనసభ శీతాకాల సమావేశాల్లో జరిగిన పరిణామాలను పరిశీలించేందుకు నియమించిన ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలోని కమిటీ నివేదిక అందిందని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. ఈ నివేదికలోని అంశాల ఆధారంగా నిబంధనల మేరకు చర్యలుంటాయని పేర్కొన్నారు. అసెంబ్లీ ఆవరణలోని తన ఛాంబర్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధనకు ఒప్పందం
స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ను తయారు చేసే అంశంలో పరస్పర సహకారానికి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్(డబ్ల్యుటీవో) మధ్య ఒప్పందం కుదిరింది. ఈ పత్రాలపై స్వచ్ఛాం ధ్రప్రదేశ్ కన్వీనర్, స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు సమక్షంలో పంచాయతీరాజ్ కమిషనర్ రామాంజనేయులు, డబ్ల్యుటీవో వ్యవస్థాపకుడు జాక్‌సిమ్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కోడెల మాట్లాడుతూ వందశాతం మరుగుదొడ్ల నిర్మాణమే లక్ష్యంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు.