వైఎస్ జగన్ కు యనమల ఫోన్!
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, శాసనసభలో ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవహారాల శాఖామంత్రి యనమల రామకృష్ణుడు ఫోన్ చేశారు. డిప్యూటీ స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని వైఎస్ జగన్ కు యనమల విజ్ఞప్తి చేశారు.
డిప్యూటీ స్పీకర్ పదవికి మండలి బుద్ధప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటి స్పీకర్ పదవికి నామినేషన్ల గడువు ఈ సాయంత్రం ముగియనుంది. డిప్యూటి స్పీకర్ పదవికి మండలి బుద్ద ప్రసాద్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో అతని ఎంపిక ఏకగ్రీవం కానుంది.