సాక్షి, తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. విఐపి దర్శనంలో గవర్నర్ నరసింహన్, మండలి బుద్ద ప్రసాద్,మాజీ మంత్రి ముద్దుకృష్ణమ నాయుడు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందచేసారు. స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు.
కాగా శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరుమల చేరుకుని శనివారం స్వామివారిని దర్శించుకుంటారని గవర్నర్ తెలిపారు. తెలుగు భాషా మృత భాషాగా మారుతుందని, భాషాను అమృత భాషాగా మార్చాలని బుద్ధప్రసాద్ అన్నారు.