
'ఆయన లేరంటే నమ్మలేకపోతున్నా'
హైదరాబాద్: దర్శక దిగ్గజం కె. బాలచందర్ లేరంటే నమ్మలేక పోతున్నానని సీనియర్ నటి జయప్రద అన్నారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు గొప్పలోటు అన్నారు. తనను మంచి కళాకారిణిగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. ఆయనతో కలిసి పలు సినిమాలు చేశానని, తమకు మార్గదర్శకుడిగా వ్యవహరించారని పేర్కొన్నారు.
తాము ఈ స్థానంలో ఉన్నామంటే ఆయనే కారణమన్నారు. సమాజంలో ఉన్నటువంటి మహిళల యొక్క ఆవేదనను తెరపై చూపించేందుకు బాలచందర్ తపించేవారని చెప్పారు. ఆయన మరణం తమకు దురదృష్టమని జయప్రద అన్నారు.