ప్రముఖ దక్షణాది సినీ దర్శకుడు కె.బాలచందర్ తనయుడు కైలాసం శుక్రవారం కన్నుమూశారు.
చెన్నై: ప్రముఖ దక్షిణ భారతదేశ సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాతైన కె. బాలచందర్ (కైలాసం బాలచందర్) తనయుడు కైలాసం శుక్రవారం చెన్నైలో కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన ఆయన పరిస్థితి విషమించడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ నేడు ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కైలాసం అనారోగ్యంతో బాధపడుతున్నటు సినీవర్గాలు తెలిపాయి.