Kailasam
-
'ఉనకోటి': నేలకు దిగివచ్చిన కైలాసం..!
నేలకు దిగివచ్చిన కైలాసం. ఉనకోటి అంటే కోటికి ఒకటి తక్కువ. త్రిపురలోని అందమైన పర్యాటక ప్రదేశం. ప్రకృతి ఒడిలో కొలువైన భారీ శిల్పాలు. హెరిటేజ్ సైట్ హోదా సొంతమైన చరిత్ర.ఈశాన్య రాష్ట్రాల టూర్లో ప్రకృతి పచ్చదనానిదే పైచేయి. జనారణ్యానికి దూరంగా వెళ్లే కొద్దీ అచ్చమైన స్వచ్ఛత ఒడిలోకి చేరుకుంటాం. చెట్లు చేమలు నిండిన పచ్చటి కొండలు బారులుతీరి ఉంటాయి. రఘునాథ హిల్స్‌లో పచ్చదనం లోపించిన కొండవాలు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పరికించి చూస్తే అందమైన రూపాలు కనువిందు చేస్తాయి. విఘ్నేశ్వరుడు, ఈశ్వరుడు, దుర్గాదేవి, గంగ, ఇతర కైలాసగణమంతా కొలువుదీరినట్లు ఉంటుంది. ఇంతటి భారీ శిల్పాలను ఎవరు చెక్కి ఉంటారు? ఎప్పుడు జరిగిందీ వింత? ఉనకోటి శిల్పాల సముదాయాన్ని ఏడు నుంచి తొమ్మిది శతాబ్దాల మధ్యలో చెక్కి ఉండవచ్చనేది ఆర్కియాలజిస్టుల అంచనా. ‘కల్లు కుమ్హార్’ అనే గిరిజన శిల్పకారుడు ఈ శిల్పాలను చెక్కినట్లు స్థానికులు చెబుతారు. కైలాస పర్వతంలోని శివపార్వతులను దర్శించుకోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు కాబట్టి, ఆ రూపాలను, కైలాసాన్ని కళ్లకు కట్టడానికే ఈ శిల్పాలను చెక్కాడని చెబుతారు.క్రీ.శ 16వ శతాబ్దంలో కాలాపహాడ్ అనే మొఘలు గవర్నర్ భువనేశ్వర్‌లోని శివుడిని, ఉనకోటికి సమీపంలో ఉన్న తుంగేశ్వర శివుడిని ధ్వంసం చేశాడని, ఈ ప్రదేశం మీద దాడిచేయడానికి అతడు చేసిన ప్రయత్నం కుదరక వదిలేసినట్లు చెబుతారు. ఇక్కడ ఏటా ఏప్రిల్ మాసంలో జరిగే ‘అశోకాష్టమి మేళా’లో ఈశాన్యరాష్ట్రాలన్నింటి నుంచి వేలాదిగా భక్తులు పాల్గొంటారు. జనపద కథనం...శివుడితోపాటు కోటిమంది కైలాసగణం కాశీయాత్రకు బయలుదేరింది. ఈ ప్రదేశానికి వచ్చేసరికి చీకటి పడింది. ఆ రాత్రికి ఈ అడవిలోనే విశ్రమించారంతా. తెల్లవారక ముందే నిద్రలేచి ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టాలని, ఆలస్యమైతే రాళ్లలా మారిపోతారని, నిద్రకుపక్రమించే ముందు శివుడు అందరినీ హెచ్చరిస్తాడు. చెప్పిన సమయానికి శివుడు తప్ప మరెవరూ నిద్రలేవలేకపోవడంతో మిగిలిన వారంతా శిలలుగా మారిపోయారు. కోటి మంది బృందంలో శివుడు మినహా మిగిలిన వారంతా శిలలు కావడంతో ఈ ప్రదేశానికి ‘ఉనకోటి’ అనే పేరు వాడుకలోకి వచ్చిందని స్థానికులు ఆసక్తికరమైన కథనం చెబుతారు. ఆ కథనం ప్రకారమైతే ఈ శిల్పాల సముదాయంలో శివుడి శిల్పం ఉండకూడదు, కానీ శివుడి శిల్పం కూడా ఉంది. దేశంలో అత్యంత పెద్ద శివుడి శిల్పం ఇదే. వాస్తవాల అన్వేషణకు పోకుండా ఆ శిల్పాల నైపుణ్యాన్ని ఆస్వాదిస్తే ఈ టూర్ మధురానుభూతిగా మిగులుతుంది. పెద్ద శివుడు ఈ భారీ శివుడి పేరు ఉనకోటేశ్వర కాలభైరవుడు. విగ్రహం 30 అడుగుల ఎత్తు ఉంటుంది. తలమీద ఎంబ్రాయిడరీ చేసిన తలపాగా ధరించినట్లు చెక్కారు. ఆ తలపాగా ఎత్తు పది అడుగులుంది. తలకు రెండు వైపులా సింహవాహనం మీద దుర్గాదేవి, గంగామాత శిల్పాలుంటాయి. నంది విగ్రహం సగానికి నేలలో కూరుకుపోయి ఉంటుంది. గణేశుడు ప్రశాంతంగా మౌనముద్రలో ఉంటాడు. ఈ శిల్పాలు కొన్ని ఎకరాల విస్తీర్ణంలో పరుచుకుని ఉన్నాయి. ప్రధానమైన వాటిని చూడడంతోనే మనకు శక్తి తగ్గిపోతుంది. కొన్ని శిల్పాలను సమీప గ్రామాల వాళ్లు ఇళ్లకు పట్టుకుపోగా మిగిలిన వాటి కోసం ఇండియన్ ఆర్కియాలజీ సర్వే నోటిస్ బోర్డులుంటాయి. ఏఎస్ఐ అడవినంతా గాలించి, పరిశోధించింది. ఏఎస్ఐ ప్రమాణాల ప్రకారం ఈ ప్రదేశం హెరిటేజ్ సైట్ల జాబితాలో చేరింది. యునెస్కో గుర్తించి సర్టిఫికేట్ జారీ చేసే లోపు చూసివద్దాం.ఉనకోటి ఎక్కడ ఉంది!త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తల నగరానికి 178 కి.మీ.ల దూరంలో ‘కైలాస్‌హర’ పట్టణానికి దగ్గరగా ఉంది. ఎలా వెళ్లాలంటే... సమీప విమానాశ్రయం అగర్తలలో ఉంది. సమీప రైల్వేస్టేషన్ కుమార్‌ఘాట్‌లో ఉంది. ఇది ఉనకోటికి 20 కి.మీ.ల దూరంలో ఉంది.ఎప్పుడు వెళ్లవచ్చు!ఇది పర్వతశ్రేణుల ప్రదేశం కాబట్టి వర్షాకాలం మంచిది కాదు. అక్టోబర్ నుంచి మే నెల మధ్యవాతావరణం అనువుగా ఉంటుంది. – వాకామంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: భావోద్వేగాల 'కిజిక్ తివాచీ'..!) -
నిత్యానంద కైలాసతో ఒప్పందాలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
బ్యూనస్ ఎయిర్: నిత్యానంద ప్రకటించుకున్న 'యునైటెట్ స్టేట్స్ ఆఫ్ కైలాస' ప్రత్యేక దేశంతో ఒప్పందం చేసుకున్నందుకు పరాగ్వే దేశ అధికారి తన పదవిని కోల్పోయాడు. దక్షిణ అమెరికన్ ఐస్‌ల్యాండ్‌గా పేర్కొని నిత్యానంద కైలాస దేశం నుంచి కొంత మంది అధికారులు తనను మోసం చేసినట్లు ఆ పరాగ్వే అధికారి చెప్పారు. ఆర్నాల్డ్ చమోర్రో వ్యవసాయ మంత్రిత్వ శాఖలో ప్రధాన అధికారిగా పనిచేస్తున్నారు. దక్షిణ అమెరికన్ ఐస్‌ల్యాండ్‌గా పేర్కొని నిత్యానంద కైలాస దేశం నుంచి కొంత మంది అధికారులు తన వద్దకు వచ్చారు. కైలాసతో దౌత్య సంబంధాలు, పరస్పర సహకారానికి సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేయించుకున్నారు. అంతేకాకుండా కైలాసకు ఐక్యారాజ్య సమితి గుర్తింపు తెప్పించడానికి సంబంధించిన పత్రాలపై కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. పరాగ్వే వ్యవసాయ మంత్రి కార్లోస్ గిమెనేజ్ను కూడా కలిశారు. నిత్యానంద దేశంతో ఒప్పందం వ్వవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పరాగ్వేలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో వివిధ కేసుల్లో నిందితునిగా ఉన్న నిత్యానందతో ఒప్పందం చేసుకోవడాన్ని ప్రజలు ప్రశ్నించారు. ఇక చేసేదేమి లేక ఒప్పందాలపై సంతకాలు చేసిన వ్యవసాయ శాఖ అధికారి రాజీనామా చేశారు. ఇదీ చదవండి: యూపీ అబ్బాయి.. డచ్ అమ్మాయి.. ఖండాంతరాలు దాటిన ప్రేమ -
ఐక్యరాజ్య సమితి చర్చల్లో నిత్యానంద ‘యూఎస్‌కే’ ప్రతినిధి
ఐక్యరాజ్యసమితి: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్థాపించిన దేశం ‘కైలాస’ ఐక్యరాజ్యసమితి చర్చల్లో పాలుపంచుకుంది. జెనీవాలో సుస్థిర అభివృద్ధి అంశంపై ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ ఈ నెల 24న చర్చా కార్యక్రమం ఏర్పాటు చేసింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధినంటూ విజయప్రియ నిత్యానంద అనే మహిళ ఈ చర్చలో పాల్గొని, ప్రసంగించారు. హిందూ మతాన్ని, ఆచార సంప్రదాయాలను ప్రచారం చేస్తున్న నిత్యానందను భారతదేశం ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. ఆయనకు రక్షణ కల్పించాలని కోరారు. యూఎస్‌కే తరఫున ఇయాన్ కుమార్ అనే వ్యక్తి కూడా చర్చల్లో పాల్గొన్నారు. అత్యాచారం, అపహరణ కేసుల్లో అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో 2019లో నిత్యానంద దేశ విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. అజ్ఞాతంలో ఉంటూనే ఈక్వెడార్‌కు సమీపంలోని ఓ దీవిని తన సొంత కైలాస దేశమని, 200 కోట్ల మంది హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తుందని ప్రకటించారు. ఐరాస గుర్తింపు పొందాలంటే భద్రతా మండలి, సర్వప్రతినిధి సభ ఆమోదం ముందుగా అవసరం. 193 దేశాల జాబితాలో యూఎస్‌కే లేదు. అయితే, జెనీవా చర్చలో పాల్గొన ద్వారా ఐరాస గుర్తింపు లభించిందనే తప్పుడు అభిప్రాయం కల్పించేందుకు యూఎస్‌కే ప్రయత్నించిందని పరిశీలకులు అంటున్నారు. -
నిత్యానంద కైలాసానికి వెళ్లాలనుకుంటున్నా!
సాక్షి, చెన్నై: నిత్యానంద కైలాసానికి వెళ్లాలనుకుంటున్నానని నటి మీరామిథున్ పేర్కొన్నారు. నటి మీరామిథున్ దృష్టి తాజాగా మరో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకునే నిత్యానందపై పడింది. నిత్యానంద ఇప్పుడు తనే సొంతంగా కైలాస అనే దేశాన్ని ఏర్పాటు చేసుకుని ఏలుతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు నటి మీరామిథున్ ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తుతోంది. నిత్యానంద గురించి ఆమె తన ట్విట్టర్లో పేర్కొంటూ అందరూ ఆయన్ని తప్పుగా ప్రచారం చేశారు. త్వరలో తాను నిత్యానంద ఏర్పాటుచేసిన కైలాస దేశానికి వెళ్లాలని కోరుకుంటున్నాను. లాట్స్ ఆఫ్ లవ్ అని మీరా మిథున్ పేర్కొంది. (చదవండి: సొంత బ్యాంకు, ప్రత్యేక కరెన్సీ!) -
నిత్యానంద: సొంతంగా రిజర్వ్ బ్యాంక్!
న్యూఢిల్లీ: అత్యాచారం, కిడ్నాప్ కేసులు ఎదుర్కొంటున్న వివాదాస్పద గురువు నిత్యానంద మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అత్యాచార ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన నిత్యానందా తనకంటూ ప్రత్యేకంగా ఒక దేశాన్నే ఏర్పారుచుకున్నారు. దానికి కైలాసదేశం అని కూడా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. అయితే వినాయక చవితి రోజు కైలాసం దేశానికి కొత్త రిజర్వు బ్యాంకు, కొత్త కరెన్సీ, కొత్త చట్టాలు ప్రారంభిస్తున్నట్లు మరోసారి నిత్యానంద సంచలన ప్రకటనలు చేశారు. దేశం విడిచి పారిపోయిన నిత్యానందకు కొత్త రిజర్వ్ బ్యాంక్, కొత్త కరెన్సీ సృష్టించడం ఎలా సాధ్యమయ్యిందో తెలియడం లేదు. అంతే కాకుండా ఆ కరెన్సీ వేరే దేశాలలో కూడా చలామణి అవుతుందని నిత్యానంద ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఆ దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా తెలిపారు. అయితే ఆ దేశాలు ఏంటి అని మాత్రం ఆయన ప్రకటించలేదు. 300 పేజీలతో కూడా ఆర్థిక విధానాలను ఆయన తయారు చేశారు. వాటికన్ బ్యాంకు తరహాలోనే కైలాసా రిజర్వు బ్యాంకు కార్యకలాపాలు ఉంటాయని, అందులో ఎలాంటి తేడాలు ఉండవని చెప్పారు. భారతదేశానికి చాలా దూరంలో ఉన్న ఈక్విడార్ సమీపంలోని ఒక చిన్నదీపంలో నిత్యానంద ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ దేశం ఎక్కడ ఉందో ఇప్పటి వరకు ఆయనకు, ఆయన అనుచరులకు తప్ప ఎవరికీ తెలియదు. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలోని ఈక్విడార్ సమీపంలోని ఓ చిన్న ద్వీపంలో మకాం వేసిన నిత్యానందస్వామి వినాయక చవితి రోజు ప్రపంచానికి షాక్ ఇచ్చారు. నిత్యానందస్వామితో పాటు ఆయన అనుచరులు శనివారం వినాయక చవితి సందర్బంగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ కైలాసాని నిత్యానందస్వామి స్థాపించారు. అందులో కైలాసదేశం ప్రధాన మంత్రి పదవి గురించి ప్రస్తావించిన నిత్యానంద అందర్నీ ఆచ్చర్యానికి గురిచేస్తున్నారు.ఇక ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో నిత్యానంద తాను తాను హిందూ సంస్కర్తను కానని, పునర్జీవిని అంటూ చెప్పారు. హిందూ మతాన్ని పాటించే వారు హక్కులు కోల్పోవడం వలనే కైలాసదేశం స్థాపించానని, అక్కడ మానవత్వం ఉన్న ఎవరికైనా చోటు ఉంటుందని, ఆ దేశంలో ప్రతిఒక్కరికి జ్ఞానోదయం అవుతోందని నిత్యానంద చెప్పారు. చదవండి: ఇంతకూ నిత్యానంద కథేంటి? -
కైలాసనాథుడ్ని ఎలా సంప్రదిస్తారు?
సాక్షి, చెన్నై : అర్జున్ సంపత్ దాఖలు చేసిన పరువునష్టం కేసును రద్దు చేయాలని కోరుతూ నిత్యానంద దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు తోసిపుచ్చుతూ ఉత్తర్వులిచ్చింది. ఆ వివరాలు ఆదివారం వెల్లడయ్యాయి. హిందూ మక్కల్ కట్చి అధ్యక్షుడు అర్జున్ సంపత్. ఇతని గురించి టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిన స్వామి నిత్యానంద కొన్ని పరువునష్టం వ్యాఖ్యలు చేశారు. నిత్యానందపై కోయంబత్తూరు ఒకటో సెషన్స్ కోర్టులో అర్జున్ సంపత్ పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసు రద్దు చేయాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో నిత్యానంద కేసు దాఖలు చేశారు. అందులో 2011లో ఇచ్చిన ఇంటర్వ్యూకు మూడేళ్ల తర్వాత తనపై పరువునష్టం కేసును అర్జున్ సంపత్ దాఖలు చేశారని తెలిపారు. ఈ కేసు రద్దు చేయాలని కోరారు. దీనిపై అనేకసార్లు న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఇలావుండగా ఈ కేసు న్యాయమూర్తి ఎం దండపాణి సమక్షంలో గత వారం విచారణకు వచ్చింది. ఆ సమయంలో నిత్యానంద తరఫున హాజరైన న్యాయవాది బాలా డైసీ తన వకాల్తాను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. మరో న్యాయవాది నిత్యానంద తరఫున హాజరుకానున్నట్లు తెలిపారు. న్యాయమూర్తి నిత్యానంద కైలాసం పేరిట ప్రత్యేక దేశాన్ని రూపొందించినట్లు, అక్కడ అతను బసచేసినట్లు చెబుతున్నారని, అతని కోసం కోర్టు అన్వేషిస్తున్నట్లు తెలిపారు. ఒక దేశపు సృష్తికర్తను ఎలా సంప్రదిస్తారని వ్యంగ్యంగా ప్రశ్నించారు. తర్వాత ఈ కేసును ఫిబ్రవరి 28కి వాయిదా వేశారు. ఈ కేసుపై మళ్లీ విచారణ జరగగా నిత్యానంద తరఫున న్యాయవాదులు ఎవరూ హాజరుకాలేదు. నిత్యానంద పిటిషన్‌ను తోసిపుచ్చుతూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. -
కైలాసం పూర్తయింది!
సాక్షి, చెన్నై: పరారీలో ఉన్న స్వామి నిత్యానంద తాజా వీడియో మరోసారి సంచలనం సృష్టిస్తోంది. కైలాసం నిర్మాణం పూర్తయిందని, ఇకపై తాను తమిళనాడుకు రానని అతడు చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. కాగా స్వామి నిత్యానందపై బెంగళూరుకు చెందిన జనార్దన్ శర్మ గుజరాత్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అందులో శర్మ తన ఇద్దరు కుమార్తెలను కిడ్నాప్ చేసి అహ్మదాబాద్ ఆశ్రమంలో నిర్బంధించారంటూ చేసిన ఫిర్యాదుతో నిత్యానందపై కిడ్నాప్ కేసు నమోదైంది. వరుస కేసుల క్రమంలో నిత్యానంద విదేశాలకు పరారయ్యాడు. కిడ్నాప్ కేసులో గుజరాత్ పోలీసులు అంతర్జాతీయ పోలీసుల (ఇంటర్‌పోల్) సాయం కోరారు. అయినప్పటికీ అతను ఉన్న ప్రాంతాన్ని గుర్తించలేకపోయారు. ఇలావుండగా నిత్యానంద వెల్లడించినట్లుగా ఒక కొత్త వీడియో విడుదలై సంచలనం సృష్టిస్తోంది. అందులో నిత్యానంద కైలాసం నిర్మాణం పూర్తయిందని, ఇకపై తాను తమిళనాడుకు రానని వెల్లడించాడు. తాను మృతి చెందితే తన భౌతికకాయాన్ని బిడది శ్రమంలో ఖననం చేయాలని, అదే తన చివరి ఆశ అని అందులో తెలిపాడు. కాగా నిత్యానంద ఈక్వెడార్ సమీపం కైలాసం పేరుతో కొత్త దీవిని ఏర్పాటుచేసి స్వత్రంత్ర దేశంగా రూపొందించే ప్రయత్నంలో ఉన్నట్లు వార్తలు వెలువడ్డ విషయం విదితమే. -
స్పోర్ట్స్ కోటా కేసులో మరొకరి అరెస్టు
సాక్షి, హైదరాబాద్/వరంగల్ క్రైం/ఖిలావరంగల్: స్పోర్ట్స్ కోటాలో మెడికల్ సీట్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై ఏసీబీ మరో కేసు నమోదుచేసింది. జూడో అసోసియేషన్ సెక్రటరీ కైలాసం యాదవ్‌ను అరెస్టు చేసింది. కైలాసం యాదవ్ ద్వారా స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణ డబ్బులు వసూలు చేసినట్టు ఏసీబీ నిర్ధారించింది. స్పోర్ట్స్ కోటాలో 12 సీట్లు కేటాయించగా.. అందులో నాలుగు సింగిల్ జూడో విభాగంలో ఉన్నట్టు ఏసీబీ తెలిపింది. ఈ నాలుగు సీట్లు వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థులకే ఇచ్చారని గుర్తించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎల్బీ స్టేడియంలోని స్పోర్ట్స్ అథారిటీ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. ఈ మొత్తం వ్యవహారంలో కీలక సూత్రధారి డిప్యూటీ డైరెక్టర్ వెంకట రమణే అని ఏసీబీ అధికారులు వెల్లడించారు. రూ.4 లక్షల డీల్ సింగిల్ జూడో స్పోర్ట్స్ కోటా కింద నాలుగు సీట్లు అలాట్ అయ్యాయి. ఈ విభాగంలో ఉన్న వరంగల్‌కు చెందిన విద్యార్థి తోటా రుద్రేశ్వర్ నుంచి రూ.4 లక్షలను జూడో అసోసియేషన్ సెక్రటరీ కైలాసం యాదవ్ డిమాండ్ చేశాడు. దీంతో రుద్రేశ్వర్ తండ్రి సునీల్ కుమార్ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. రూ.2 లక్షలు కైలాసం యాదవ్‌కు ఇచ్చామని, మరో రూ.2 లక్షల కోసం ఒత్తిడి చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసిన ఏసీబీ.. వరంగల్‌లోని కైలాసం యాదవ్ నివాసంతో పాటు స్పోర్ట్స్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. ఈనేపథ్యంలో జూడో అసోసియేషన్ కార్యదర్శి కైలాసం యాదవ్‌ను ఏసీబీ అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దైర్యంగా ఫిర్యాదు చేయండి: ఏసీబీ క్రీడా కోటాలో మెడికల్ సీట్లకు సంబంధించి బాధితులు దైర్యంగా ఫిర్యాదు చేయాలని ఏసీబీ డైరెక్టర్ జనరల్ శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. టోల్‌ఫ్రీ నంబర్ 1064కు కాల్చేసి ఫిర్యాదు చేయాలని, ఈ వ్యవహారానికి సంబంధించి నెలరోజులపాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న 7382629283 నంబర్‌కు వాట్సాప్ చేయాలని కోరారు. -
ప్రతీకార దాడులు చేస్తాం: కైలాసం
మల్కన్ గిరి ఎన్ కౌంటర్ పై మావోయిస్టు ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కైలాసం శుక్రవారం స్పందించారు. విద్రోహశక్తుల కారణంగానే ఎన్ కౌంటర్ జరిగిందని చెప్పారు. ఈ దాడిలో మావోయిస్టు పార్టీ సభ్యులు, నేతలు మరణించినట్లు వెల్లడించారు. దాడిని పచ్చి బూటకపు ఎన్ కౌంటర్ గా పేర్కొన్న కైలాసం.. తమ అగ్రనేత ఆర్కే పోలీసుల అదుపులో ఉన్నట్లు అనుమానాలున్నాయని చెప్పారు. ఎంత పెద్ద ఎన్ కౌంటర్ అయినా ఇంతమంది ఎప్పుడూ చనిపోరని అన్నారు. ఘటన వెనుక ఒడిశా పోలీసుల నిఘా వర్గాల ప్రమేయం ఉందని చెప్పారు. కచ్చితంగా ప్రతీకారదాడులు చేస్తామని తెలిపారు. ఎన్ కౌంటర్ లో సాధారణ పౌరులు కూడా మరణించారని చెప్పారు. మరికొంత సమాచారన్ని త్వరలో చెబుతానని అన్నారు. -
కైలాస వాహనంపై శ్రీశైలేశుడు
– కూష్మాండదుర్గగా భ్రామరి శ్రీశైలం: జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి శ్రీశైల మల్లికార్జునుడు దేవేరీ భ్రామరితో కలిసి కైలాస వాహనంపై భక్తులను ఆశీర్వదించారు. శ్రీశైల భ్రమరాంబాదేవి కూష్మాండదుర్గ రూపంలో దర్శనమిచ్చారు. వేద మంత్రోచ్చారణ.. మంగళవాయిద్యాల నడుమ అర్చకులు, వేదపండితులు వాహన, అలంకార ప్రత్యేక పూజలను చేశారు. అనంతరం కైలాస వాహనంపై అధిష్టింపజేసి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను.. అమ్మవారి అలంకారరూపాన్ని ఆలయ ప్రాంగణం నుంచి మాడ వీధుల గుండా రథశాల వద్దకు చేర్చారు. అక్కడ గ్రామోత్సవ పూజలను నిర్వహించిన అనంతరం అంకాలమ్మ ఆలయం, నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయం వరకు ఉత్సవం కొనసాగి రాత్రి 9.30గంటలకు తిరిగి ఆలయం చేరుకుంది. -
కె.బాలచందర్ తనయుడు కైలాసం కన్నుమూత
చెన్నై: ప్రముఖ దక్షిణ భారతదేశ సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాతైన కె. బాలచందర్ (కైలాసం బాలచందర్) తనయుడు కైలాసం శుక్రవారం చెన్నైలో కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన ఆయన పరిస్థితి విషమించడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ నేడు ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కైలాసం అనారోగ్యంతో బాధపడుతున్నటు సినీవర్గాలు తెలిపాయి.