న్యూఢిల్లీ: అత్యాచారం, కిడ్నాప్ కేసులు ఎదుర్కొంటున్న వివాదాస్పద గురువు నిత్యానంద మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అత్యాచార ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన నిత్యానందా తనకంటూ ప్రత్యేకంగా ఒక దేశాన్నే ఏర్పారుచుకున్నారు. దానికి కైలాసదేశం అని కూడా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. అయితే వినాయక చవితి రోజు కైలాసం దేశానికి కొత్త రిజర్వు బ్యాంకు, కొత్త కరెన్సీ, కొత్త చట్టాలు ప్రారంభిస్తున్నట్లు మరోసారి నిత్యానంద సంచలన ప్రకటనలు చేశారు. దేశం విడిచి పారిపోయిన నిత్యానందకు కొత్త రిజర్వ్ బ్యాంక్, కొత్త కరెన్సీ సృష్టించడం ఎలా సాధ్యమయ్యిందో తెలియడం లేదు.
అంతే కాకుండా ఆ కరెన్సీ వేరే దేశాలలో కూడా చలామణి అవుతుందని నిత్యానంద ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఆ దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా తెలిపారు. అయితే ఆ దేశాలు ఏంటి అని మాత్రం ఆయన ప్రకటించలేదు. 300 పేజీలతో కూడా ఆర్థిక విధానాలను ఆయన తయారు చేశారు. వాటికన్ బ్యాంకు తరహాలోనే కైలాసా రిజర్వు బ్యాంకు కార్యకలాపాలు ఉంటాయని, అందులో ఎలాంటి తేడాలు ఉండవని చెప్పారు. భారతదేశానికి చాలా దూరంలో ఉన్న ఈక్విడార్ సమీపంలోని ఒక చిన్నదీపంలో నిత్యానంద ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ దేశం ఎక్కడ ఉందో ఇప్పటి వరకు ఆయనకు, ఆయన అనుచరులకు తప్ప ఎవరికీ తెలియదు.
భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలోని ఈక్విడార్ సమీపంలోని ఓ చిన్న ద్వీపంలో మకాం వేసిన నిత్యానందస్వామి వినాయక చవితి రోజు ప్రపంచానికి షాక్ ఇచ్చారు. నిత్యానందస్వామితో పాటు ఆయన అనుచరులు శనివారం వినాయక చవితి సందర్బంగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ కైలాసాని నిత్యానందస్వామి స్థాపించారు. అందులో కైలాసదేశం ప్రధాన మంత్రి పదవి గురించి ప్రస్తావించిన నిత్యానంద అందర్నీ ఆచ్చర్యానికి గురిచేస్తున్నారు.ఇక ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో నిత్యానంద తాను తాను హిందూ సంస్కర్తను కానని, పునర్జీవిని అంటూ చెప్పారు. హిందూ మతాన్ని పాటించే వారు హక్కులు కోల్పోవడం వలనే కైలాసదేశం స్థాపించానని, అక్కడ మానవత్వం ఉన్న ఎవరికైనా చోటు ఉంటుందని, ఆ దేశంలో ప్రతిఒక్కరికి జ్ఞానోదయం అవుతోందని నిత్యానంద చెప్పారు.
చదవండి: ఇంతకూ నిత్యానంద కథేంటి?
Comments
Please login to add a commentAdd a comment