nityananda
-
రాముడి ఆహ్వానం అందింది.. అయోధ్యకు వస్తున్నా: నిత్యానంద
అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం సర్వాంగసుందరంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్తజనానికి దర్శనం ఇవ్వనున్నాడు. రేపు సోమవారం బాలరామచంద్రుడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జరగనుంది. ప్రపంచం నలు మూలల నుంచి తరలివస్తున్న భక్త జనం సాక్షిగా ఆగమ శాస్త్ర పద్ధతుల్లో ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యక్రమానికి తాను వస్తున్నాని తాను దైవంగా చెప్పుకునే నిత్యానంద స్పష్టం చేశాడు. వివరాల ప్రకారం.. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరంలో ఈ నెల 22న జరుగనున్న రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందినట్లు నిత్యానంద తెలిపాడు. ఈ కార్యక్రమానికి తాను హాజరవుతున్నట్లు నిత్యానంద ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు. ఈ క్రమంలో ట్విట్టర్లో ‘ఈ చారిత్రాత్మకమైన, అసాధారణమైన సంఘటనను మిస్ అవ్వకండి. సాంప్రదాయ ప్రాణ ప్రతిష్ట సమయంలో రాముడు లాంఛనంగా ఆలయంలోని ప్రధాన విగ్రహంలోకి ఆవాహనం అవుతాడు. యావత్ ప్రపంచాన్ని కరుణించేందుకు భూమిపైకి వస్తాడు’ అని కామెంట్స్ చేశారు. అలాగే, రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి లాంఛనంగా ఆహ్వానం అందడంతో హిందూ మతం అత్యున్నత పీఠాధిపతి భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం ఈ గొప్ప కార్యక్రమానికి హాజరుకానున్నారు అంటూ చెప్పుకొచ్చారు. 2 More Days Until the Inauguration of Ayodhya Ram Mandir! Don't miss this historic and extraordinary event! Lord Rama will be formally invoked in the temple's main deity during the traditional Prana Pratishtha and will be landing to grace the entire world! Having been formally… pic.twitter.com/m4ZhdcgLcm — KAILASA's SPH NITHYANANDA (@SriNithyananda) January 20, 2024 ఇదిలా ఉండగా.. నిత్యానంద 2020లో భారత్ నుంచి పారిపోయాడు. ఒక దీవిని ‘కైలాస’ దేశంగా ప్రకటించిన ఆయన హిందూ మతానికి సుప్రీం పీఠాధిపతిగా చెప్పుకుంటున్నాడు. అయితే, అంతకుముందు కర్ణాటకలో ఒక మఠానికి అధిపతి అయిన నిత్యానందపై 2010లో అత్యాచారం కేసు నమోదైంది. కారు డ్రైవర్ ఫిర్యాదుతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన నిత్యానంద దేశం నుంచి పారిపోయాడు. ఈ క్రమంలో పలు మార్లు సోషల్ మీడియా వేదికగా పలు కామెంట్స్ చేస్తున్నారు. -
కైలాస దేశ ప్రధానిగా నిత్యానంద ప్రియ శిష్యురాలు, నటి!
భారత్‌లోని ప్రజలకు నమ్మకాలు ఎక్కువ. ఈ నమ్మకాలనే పెట్టుబడి పెట్టుకుని కొందరు స్వామిజీలు అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తూ భారీగా సంపాదించారు. మరికొందరు భక్తి ముసుగులో అక్రమాలకు, దారుణాలకు ఒడిగట్టారు. అందులో ఒకరే స్వామి నిత్యానంద. ఈ వివాదాస్పద ఆధ్యాత్మిక గురువురుకు సంబంధించిన రాసలీలల వీడియో 2010లో వెలుగులోకి రావడంతో దేశంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఒకప్పటి హీరోయిన్ రంజితతో ఆయన ఏకాంతంగా కలిసున్న దృశ్యాలు టీవీ, సోషల్ మీడియాల్లో మార్మోగిపోయాయి. 2019లో దేశం విడిచి పరార్ అడ్డంగా దొరికిపోయినప్పటికీ అదంతా అబద్ధమని బుకాయించారు. అప్పటి నుంచి నిత్యానందను వివాదాలు చుట్టుముడుతూనే వచ్చాయి. ఆ తర్వాత అత్యాచారం, కిడ్నాప్ లాంటి కేసులు ఎదుర్కొంటూ 2019లో దేశం విడిచి పారిపోయాడు. ఆపై కొన్నాళ్లకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించాడు. కానీ ఇంతవరకు ఈ కైలాస దేశం ఎక్కడుందనే స్పష్టత లేదు. తాజాగా ఈ దేశానికి తన ప్రియ శిష్యురాలు, మాజీ నటి రంజితను ప్రధానిని చేసినట్లు కోలీవుడ్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ప్రియ శిష్యురాలు ప్రధానిగా ఈ విషయాన్ని నిత్యానంద వెబ్సైట్లో పేర్కొన్నారని ఓ తమిళ పత్రిక రాసుకొచ్చింది. కానీ సదరు వెబ్సైట్లో మాత్రం అటువంటి వివరాలేమీ కనిపించలేదు. ఇటీవల ఐక్యరాజ్యసమితి సమావేశంలో కైలాస దేశం తరపున మహిళా రాయబారులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రంజిత కూడా కైలాస దేశ ప్రధానిగా త్వరలోనే ఐక్యరాజ్యసమితి సమావేశానికి హాజరైనా ఆశ్చర్యపోనక్కర్లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎవరీ రంజిత? కన్నడ సినిమాల్లో నటించిన రంజిత అప్పటితరానికి సుపరిచితమే! తమిళనాడుకు చెందిన ఆమె 1975, జూన్ 4న జన్మించింది. సీనియర్ నటుడు అశోక్ కుమార్ కూతురే రంజిత. ఆమె అసలు పేరు శ్రీవల్లి. ప్రముఖ దర్శకుడు పి. భారతిరాజా ఆమెను చిత్రసీమకు పరిచయం చేస్తూ పేరు మార్చారు. 1992లో ‘నాదోడి థెండ్రల్’ తమిళ సినిమాతో రంగప్రవేశం చేసింది. కొంతకాలానికే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తమిళం పాటు తెలుగు, మలయాళం, కన్నడ సినిమాల్లో అగ్ర హీరోలతో కలిసి నటించింది. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘మావిచిగురు’ సినిమాకు ఉత్తమ సహాయనటిగా నంది అవార్డు అందుకుంది. అక్కాచెల్లెళ్లు విడాకులిచ్చి నిత్యానంద చెంతకు సినిమాల్లో నటిస్తుండగానే 2000 సంవత్సరంలో ఆర్మీ మేజర్ రాకేశ్ మీనన్‌తో ఆమె వివాహమైంది. మొదట్లో వీరిద్దరూ బాగానే ఉన్నారు. కానీ తర్వాత నిత్యానంద మాయలో పడటంతో 2017లో భర్తకు విడాకులిచ్చింది. నిత్యానంద ఆశ్రమానికి తన నివాసాన్ని షిఫ్ట్ చేసిన ఆమె 2013 చివర్లో ఆనందమయిగా పేరు మార్చుకుంది. రంజితతో పాటు ఆమె సోదరి కూడా భర్తకు విడాకులిచ్చి నిత్యానందతోపాటు దేశం వదిలి వెళ్లిపోయింది. చదవండి: లవ్ టుడే హీరోయిన్ ఇంత తీవ్ర విషాదం.. -
అమెరికానే బురిడీ కొట్టించిన నిత్యానంద.. అసలు కైలాస దేశమే లేదు..
వాషింగ్టన్: వివాదాస్పద గురువు నిత్యానంద ఏకంగా అమెరికానే బురిడీ కొట్టించాడు. అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ కొద్దికాలం క్రితం భారత్ నుంచి పారిపోయిన ఈయన.. ఓ ఐలాండ్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దానికే 'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస' అని పేరుపెట్టుకున్నాడు. ఇదే తన దేశమని ప్రకటించుకున్నాడు. ఇటీవల ఐక్యరాజ్య సమితిలో కైలాస ప్రతినిధులు పాల్గొని భారత్‌కు వ్యతిరేకంగా ప్రసంగించారు. వీరి ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే 'సిస్టర్ సిటీ' పేరుతో కైలాస దేశం అమెరికాలోని నెవార్క్ నగరంతో ఒప్పందం కుదుర్చుంది. జనవరి 12న ఇందుకు సంబంధించిన ఒప్పంద ప్రతులపై ఇరువురు సంతకాలు కూడా చేశారు. దీంతో పాటు వర్జీనియా, ఓహియో, ఫ్లోరిడా సహా అమెరికాలోని 30 నగరాలు కైలసతో సాంస్కృతిక ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు ఆ దేశం తెలిపింది. కానీ అసలు కైలాస అనే దేశమే లేదని తెలుసుకున్నాక అమెరికా నగరాలు నివ్వెరపోయాయి. దీంతో నెవార్క్ నగరం కైలాసతో ఒప్పందాలు రద్దు చేసుకుంది. కనీసం ఒక దేశం ఉందో లేదో కూడా తెలుసుకోకుండా ఇలా గుడ్డిగా ఒప్పందాలు కుదుర్చుకోవడం ఏంటని నెవార్క్ అధికారులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: పుతిన్‌పై ఐసీసీ అరెస్టు వారెంట్ -
మళ్లీ తెరపైకి నిత్యానంద: వివాదంలో మదురై మఠం
సాక్షి, చెన్నై: మదురైలో ప్రసిద్ధి చెందిన శైవ మఠానికి 293వ ఆధీనంగా బాధ్యతలు స్వీకరించినట్లు వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద బుధవారం ప్రకటించారు. కైలాస దేశం నుంచే ఆన్లైన్ ద్వారా భక్తులకు ఆశీస్సులు అందించనున్నట్టు పేర్కొన్నారు. అలాగే తన పేరు ‘జగద్గురు మహాసన్నిధానం శ్రీలశ్రీ భగవాన్ నిత్యానంద పరమశివజ్ఞాన సంబంధ దేశిక పరమాచార్య స్వామి’గా మార్చుకున్నట్టు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించడం చర్చకు దారితీసింది. మళ్లీ తెరపైకి.. మదురై శైవ మఠానికి కొన్ని దశాబ్దాల పాటు 292వ మఠాధిపతిగా సేవలందించిన అరుణ గిరినాధర్ గత వారం శివైక్యం పొందిన విషయం తెలిసిందే. ఆయన పార్థివదేహాన్ని మహాసమాధి చేసినానంతరం మఠంలో 500 కేజీలతో కూడిన అరుణ గిరినాధర్ పాలరాతి శిల్పాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. అలాగే 293వ ఆధీనంగా హరిహర జ్ఞాన సంబంధం దేశీయ పరమాచార్య బాధ్యతలు చేపట్టారు. మఠంలోని రహస్య గదిలోని ఆభరణాలు, విలువైన వజ్రాలు , రాష్ట్రవ్యాప్తంగా మదురై మఠానికి ఉన్న ఆస్తులకు సంబంధించిన దస్తావేజులను ధర్మపురం ఆధీనం సమక్షంలో 293వ ఆధీనానికి అప్పగించారు. అయితే మఠాన్ని కైవశం చేసుకునేందుకు వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మళ్లీ తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. చదవండి: ఆయిల్ పామ్ గెలలకు ధర హామీ -
నిత్యానంద మరో సంచలన నిర్ణయం..!
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరో సంచలన ప్రకటన చేశారు. కరోనా విజృంభించడంతో పలు దేశాలు భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై తాత్కాలికంగా నిషేధ్ఙాలు విధించిన విషయం తెలిసిందే. మేము ఏమైనా తక్కువ తిన్నామా! అంటూ ఆధ్యాత్మిక గురువు నిత్యానంద తమ దేశానికి(కైలాస) వచ్చే భారతీయులపై నిషేద్ఙాలు విధించారు. అంతేకాకుండా బ్రెజిల్, యూరప్ దేశాలు, మలేషియా దేశాలపై నిషేధాలు విధించారు. నిత్యానంద తాజా ప్రకటనలో, "కైలాసియన్లు, ఎకైలాసియన్లు, ఈ దేశ రాయబార కార్యాలయాలతో సంబంధం ఉన్న వాలంటీర్లు క్వారంటైన్లో ఉండాలని తెలిపారు. ఈ ఆదేశాలను చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు నవ్వుకుంటున్నారు. కాగా, నిత్యానంద ఈక్వెడార్‌లోని ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి, అందులో ‘కైలాస’ అనే దేశాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ దేశంలో ప్రత్యేక కరెన్సీను కూడా రిలీజ్ చేశాడు. పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద భారత్ నుంచి పారిపోయినా విషయం తెలిసిందే. KAILASA's #PresidentialMandate Executive order directly from the #SPH for all the embassies of #KAILASA across the globe. #COVID19 #COVIDSecondWaveInIndia #CoronaSecondWave #Nithyananda #Kailaasa #ExecutiveOrder pic.twitter.com/I2D0ZvffnO — KAILASA'S SPH JGM HDH Nithyananda Paramashivam (@SriNithyananda) April 20, 2021 Ffs. 🤣🤣🤣 https://t.co/ummBVXo3qH — Mal-Lee (@MallikarjunaNH) April 22, 2021 చదవండి: నిత్యానంద కైలాసానికి వెళ్లాలనుకుంటున్నా! -
నిత్యానంద కైలాస: వీసా, ప్రత్యేక విమానం
న్యూఢిల్లీ: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరో సారి వార్తల్లో నిలిచాడు. ఇప్పటికే ప్రత్యేక దేశం, రిజర్వు బ్యాంక్, కరెన్సీ, జెండా ఏర్పాటు చేసుకున్న నిత్యానంద తాజాగా ఓ ప్రకటన చేశాడు. ‘కైలాస’ని సందర్శించాలని భావిస్తున్న వారికి వీసాలు మంజూరు చేయనున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలో ఇప్పటికే ‘కైలాస’ ద్వీపం పేరు మీదుగా ఓ ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేశాడు. ఇక ‘కైలాస’ను దర్శించాలనుకునేవారు దీని ద్వారా వీసాకు అప్లై చేసుకోవచ్చని తెలిపాడు. ఈ నేపథ్యంలో కైలాసను సందర్శించాలనుకునే వారి కోసం ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేకంగా ‘గరుడ’ పేరుతో చార్టెడ్ ఫ్లైట్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని తెలిపాడు. అయితే ఇప్పటి వరకు కూడా నిత్యానంద ‘కైలాస’ ఎక్కడ ఉందనే దాని గురించి ఖచ్చితమైన సమాచారం తెలియరాలేదు. దీన్ని బట్టి ‘కైలాస’ ఆస్ట్రేలియా పరిసర ప్రాంతాల్లో ఉంటుందని భావిస్తున్నారు. Kailasa trip is open now. You can apply for visa. And have a Darshan of Lord Shiva physically. 👺 pic.twitter.com/ywGH2qpypi — Vishweshwar Bhat (@VishweshwarBhat) December 17, 2020 ఇక సందర్శకులకు కేవలం మూడు రోజుల పాటే ‘కైలాస’లో ఉండటానికి అనుమతి ఉంది. అంతకు మించి ఎక్కువ రోజులు ‘కైలాస’లో బస చేయడానికి లేదు. అయితే ఈ మూడు రోజుల్లోనే ‘కైలాస’లో వారికి పరమ శివుడి సాక్షాత్కారం లభిస్తుందని నిత్యానంద హామీ ఇస్తున్నాడు. ఇక ‘కైలాస ’వెబ్సైట్ కైలాస. ఓఆర్జీ ప్రకారం తమ దేశాల్లో హిందుత్వాన్ని ఆచరించే హక్కు కోల్పోయి బహిష్కరింపబడిన వారంతా కలిసి ఈ ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేశారని పేర్కొంది. ఇక ఈ ఏడాది ఆగస్టు 22 వినాయక చవితి సందర్భంగా నిత్యానంద తాను ప్రత్యేకంగా కైలాస అనే దేశాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తన దేశానికి ఒక పాస్‌పోర్ట్, జెండా, జాతీయ చిహ్నాన్ని డిజైన్ చేసినట్లు పేర్కొన్నాడు. అంతేకాక తన దేశం కైలాస కోసం ప్రత్యేక రిజర్వ్ బ్యాంక్, కరెన్సీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించాడు. తన ప్రత్యేక కరెన్సీ వివిధ దేశాల్లో చెల్లుబాటు అయ్యేలా ఆయా దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా వెల్లడించారు. (చదవండి: సొంత బ్యాంకు, ప్రత్యేక కరెన్సీ!) ఇక నిత్యానంద ఈక్వెడార్ నుంచి ఓ ద్వీపాన్ని కొనుగోలు చేసి.. కైలాసను ఏర్పాటు చేశాడనే వార్తల్ని ఆ దేశం కొట్టి పారేసింది. ఇక ప్రస్తుతానికిక కైలాస, నిత్యానంద ఎక్కడ ఉన్నారనే దాని గురించి సరైన సమాచారం లేదు. ఇదిలా ఉండగా నిత్యానందపై ఇప్పటికే అనేక ఫిర్యాదలు నమోదయ్యాయి. కర్ణాటక, గుజరాత్‌లలో ఆశ్రమాలు స్థాపించి ఆధ్మాత్మిక ముసుగులో మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన నిత్యానంద దేశాన్ని విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. -
నిత్యానంద: సొంతంగా రిజర్వ్ బ్యాంక్!
న్యూఢిల్లీ: అత్యాచారం, కిడ్నాప్ కేసులు ఎదుర్కొంటున్న వివాదాస్పద గురువు నిత్యానంద మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అత్యాచార ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన నిత్యానందా తనకంటూ ప్రత్యేకంగా ఒక దేశాన్నే ఏర్పారుచుకున్నారు. దానికి కైలాసదేశం అని కూడా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. అయితే వినాయక చవితి రోజు కైలాసం దేశానికి కొత్త రిజర్వు బ్యాంకు, కొత్త కరెన్సీ, కొత్త చట్టాలు ప్రారంభిస్తున్నట్లు మరోసారి నిత్యానంద సంచలన ప్రకటనలు చేశారు. దేశం విడిచి పారిపోయిన నిత్యానందకు కొత్త రిజర్వ్ బ్యాంక్, కొత్త కరెన్సీ సృష్టించడం ఎలా సాధ్యమయ్యిందో తెలియడం లేదు. అంతే కాకుండా ఆ కరెన్సీ వేరే దేశాలలో కూడా చలామణి అవుతుందని నిత్యానంద ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఆ దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా తెలిపారు. అయితే ఆ దేశాలు ఏంటి అని మాత్రం ఆయన ప్రకటించలేదు. 300 పేజీలతో కూడా ఆర్థిక విధానాలను ఆయన తయారు చేశారు. వాటికన్ బ్యాంకు తరహాలోనే కైలాసా రిజర్వు బ్యాంకు కార్యకలాపాలు ఉంటాయని, అందులో ఎలాంటి తేడాలు ఉండవని చెప్పారు. భారతదేశానికి చాలా దూరంలో ఉన్న ఈక్విడార్ సమీపంలోని ఒక చిన్నదీపంలో నిత్యానంద ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ దేశం ఎక్కడ ఉందో ఇప్పటి వరకు ఆయనకు, ఆయన అనుచరులకు తప్ప ఎవరికీ తెలియదు. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలోని ఈక్విడార్ సమీపంలోని ఓ చిన్న ద్వీపంలో మకాం వేసిన నిత్యానందస్వామి వినాయక చవితి రోజు ప్రపంచానికి షాక్ ఇచ్చారు. నిత్యానందస్వామితో పాటు ఆయన అనుచరులు శనివారం వినాయక చవితి సందర్బంగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ కైలాసాని నిత్యానందస్వామి స్థాపించారు. అందులో కైలాసదేశం ప్రధాన మంత్రి పదవి గురించి ప్రస్తావించిన నిత్యానంద అందర్నీ ఆచ్చర్యానికి గురిచేస్తున్నారు.ఇక ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో నిత్యానంద తాను తాను హిందూ సంస్కర్తను కానని, పునర్జీవిని అంటూ చెప్పారు. హిందూ మతాన్ని పాటించే వారు హక్కులు కోల్పోవడం వలనే కైలాసదేశం స్థాపించానని, అక్కడ మానవత్వం ఉన్న ఎవరికైనా చోటు ఉంటుందని, ఆ దేశంలో ప్రతిఒక్కరికి జ్ఞానోదయం అవుతోందని నిత్యానంద చెప్పారు. చదవండి: ఇంతకూ నిత్యానంద కథేంటి? -
'నిత్యానందను ఒకసారి కలవాలనుంది'
పెరంబూరు : 'ఒకే ఒక్క చాన్స్ ఇవ్వండి.. నేనేంటో నిరూపిస్తా..' అని ఖడ్గం చిత్రంలో హీరోయిన్ సంగీత చాలా దీనంగా అడుగుతుంది. అయితే అది రీల్‌లైప్‌లో.. కానీ ఇక్కడ నటి మీరామిథున్ మాత్రం ఒకే ఒక్కసారి అంటూ రియల్‌గా ఒక వ్యక్తిని కలవాలని కోరుకుంటోంది. ఇంతకీ ఈమె ఎవరిని కలవాలనుకుంటుందో తెలుసా.. నిత్యానందను. అవును మీరు విన్నది నిజమే.. మహిళలను లైంగింకంగా వేధించాడని పలు ఆరోపణలను ఎదుర్కొంటున్న నిత్యానందపై పలు కేసులు ఉన్న విషయం తెలిసిందే. కొన్నినెలల క్రితం నిత్యానంద విదేశాలకు పారిపోయిన నేపథ్యంలో ఆయన్ని పట్టుకోవడానికి పోలీసులు ఇప్పటికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. (కమెడియన్ కునాల్‌పై ప్రయాణ నిషేధం) ఇకపోతే నటి మీరామిథున్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మోడలింగ్ రంగం నుంచి సినిమాకు పరిచయమైన ఈ బామ ఇటీవలే బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలోనూ పాల్గొని ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది. అయితే మీరామిథున్‌పై కూడా పలు కేసులు ఉన్నాయి. అయినా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటున్న మీరామిథున్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. గతంలో చెన్నై పోలీసులు అక్రమార్కులు, లంచగొండులు అంటూ విమర్శించిన మీరా తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేసింది. అందులో నిత్యానందను ఒక్కసారి అయినా కలిసి ఆయనతో మాట్లాడాలన్నది తన కోరిక అని పేర్కొంది. అంతే కాకుండా నిత్యానంద రాసిన 'లివింగ్ ఎన్‌లైట్‌మెంట్' అనే పుస్తకంపై ఆమె ప్రశంసల వర్షం కురిపించింది. మీరామిథున్ విడుదల చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. View this post on Instagram At the end of the day, I'M AT PEACE, because my intentions are good and my heart is pure 💫✨👼 A post shared by Meera Mitun (@meeramitun) on Mar 12, 2020 at 12:49pm PDT -
రాసలీలల వీడియోలో ఉన్నది నిత్యానందే....
సాక్షి, న్యూఢిల్లీ : వివాదస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానందకు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. తన అనుంగు శిష్యురాలు రంజితతో కలిసి సన్నిహితంగా... వీడియో టేపులలో ఉన్నది స్వామి నిత్యానందేనని ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్ స్పష్టం చేసింది. దీంతో ఈ సాములోరు మరోసారి వార్తల్లో నిలిచారు. కాగా నటి రంజితతో కలిసి ఉన్న రాసలీలల వీడియోల్లో ఉన్నది తాను కాదని, మార్ఫింగ్ జరిగిందంటూ ఇప్పటివరకూ నిత్యానంద వాదిస్తూ వచ్చారు. అయితే సీడీల్లో ఉన్నది నిత్యానందేనని ధ్రువీకరిస్తూ... ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన ఓ నివేదిక బుధవారం వెలుగులోకి వచ్చింది. 2010లో స్వామి నిత్యానంద రాసలీలల సీడీని ఆయన కారు డ్రైవర్ లీక్ చేయడంతో... ఆ దృశ్యాలు మీడియాతో పాటు, సోషల్ మీడియాలోనూ హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే తనను అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రపన్నారని ఆయన ఆరోపణలు కూడా చేశారు. కాగా ఇప్పటికే నిత్యానందపై పలు కేసులు నమోదు అయిన విషయం విదితమే. అంతేకాకుండా నిత్యానంద తనపై అత్యాచారం చేశారంటూ ఆరతీరావ్ అనే శిష్యురాలు కోర్టును ఆశ్రయించారు. దీంతో 2010 సంవత్సరంలో ఆయనపై రేప్ కేసు నమోదు అయింది. తాను థార్మిక గురువునని, తనకు ఐహిక సుఖాలపై వాంఛలు ఉండవని, అందువల్ల తనకు పురుషత్వ పరీక్షలు నిర్వహించకూడదన్న నిత్యానందకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. అంతేకాకుండా లింగ సామర్ధ్య నిర్దారణ పరీక్షలకు ఆయన అంగీకరించకపోవడంపై ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా మందలించింది కూడా. -
నిత్యానంద శిష్యులకు పోలీస్ హెచ్చరిక
-
నిత్యానందకు నాన్‌బెయిల్‌బుల్ వారెంట్
చెన్నై: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు రామనాడు కోర్టు నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ జారీచేసింది. నిత్యానందపై పలు కేసులు ఉన్న విషయం తెలిసిందే. ఒక కేసుకు సంబంధించి అతనికి కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. ఇదిలా ఉండగా, వచ్చే నెల 6న పురుషత్వ పరీక్షల కోసం బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి హాజరు కావాలని సిఐడి అధికారులు ఆదివారం నిత్యానందకు నోటీసులు జారీ చేశారు. పరీక్షలకు హాజరుకాకపోతే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఒక కేసుకు సంబంధించి అతనికి పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని బెంగళూరులోని రామనగర జిల్లా కోర్టు ఆదేశించింది. జిల్లా కోర్టు ఆదేశాలపై నిత్యానంద హైకోర్టును ఆశ్రయించారు. పురుషత్వ పరీక్షల నుంచి తనను మినహాయించాలని హైకోర్టును కోరారు. తాను థార్మిక గురువునని, తనకు ఐహిక సుఖాలపై వాంఛలు ఉండవని, అందువల్ల తనకు పురషత్వ పరీక్షలు నిర్వహించకూడదని పేర్కొన్నాడు. ఈ కేసును విచారించిన హై కోర్టు నిత్యానంద దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేసింది. కేసుకు సంబంధించిన సాధారణ ప్రజల మాదిరిగానే నిత్యానందను విచారించాలని అవసరమైన పరీక్షలు నిర్వహించవచ్చునని కోర్టు తీర్పు చెప్పింది. కింది కోర్టు ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. జులై 28 నుంచి నిత్యానందను పోలీసులు కష్టడీలోకి తీసుకుని పురుషత్వ, రక్త తదితర పరీక్షలతో పాటు విచారణ కూడా చేయవచ్చునని హైకోర్టు తెలిపింది. -
శ్రీవారి ఆలయంలో నిత్యానంద దర్శనం
-
తిరుమలలో నిత్యానంద, రంజిత ప్రత్యక్షం
తిరుమల : గత కొద్ది కాలంగా అజ్ఞాతంలో ఉంటున్న వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు స్వామి నిత్యానంద, ఆయన సహాయకరాలు రంజిత బుధవారం తిరుమలలో ప్రత్యక్షం అయ్యారు. ఈరోజు ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో నిత్యానంద తన శిష్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. కాషాయ వేషధారణలో ఉన్న రంజిత...నిత్యానందతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడేందుకు నిత్యానంద నిరాకరించారు. కాగా రంజిత ఇటీవలే బెంగళూరులోని బిడిది ధ్యానపీఠంలో సన్యాసం స్వీకరించిన విషయం తెలిసిందే. ఆమె తన పేరును మా ఆనందమయి గా మార్చుకుంది.